scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

దేవికా.. నీ పాటతో మా మనసులు గెలుచుకున్నావు!

Kerala Girl Singhs Himachali Folk Song. Wins PM Modi Praise

Photo: Screengrab

శ్రావ్యమైన సంగీతం మనసుకు ఎంతో హాయినిస్తుంది. ఈ ఉరుకులు పరుగుల జీవితం నుంచి కాస్త ఉపశమనం కలిగించి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఈ క్రమంలో స్వరంలో అమృతాన్ని నింపుకొన్నట్లు ఓ బాలిక పాడిన పాట సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్‌ సైతం ఆ అమ్మాయి పాట విని ముగ్ధులయ్యారు. మరి పీఎం, సీఎంలను మెప్పించిన ఆ బాలిక గురించి, ఆ మనోహరమైన పాట గురించి మనమూ తెలుసుకుందాం రండి...
‘చంబా కిత్నీ కి దూర్’... హిమాచలీ జానపదానికి చెందిన ఈ పాట సోషల్‌ మీడియాలో ఎంతో పాపులర్‌. హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే ఈ పాట ఒరిజినల్‌ వెర్షన్‌ను ప్రముఖ గాయకుడు మోహిత్‌ చౌహాన్‌ ఆలపించారు. నేహా కక్కర్‌ లాంటి సెలబ్రిటీ సింగర్లతో పాటు పలువురు నెటిజన్లు ఈ పాటను ‘హమ్‌’ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. తాజాగా ఇదే పాటను తన తీయటి గొంతుతో ఆలపించి అందరి మన్ననలు అందుకుంటోంది దేవిక అనే విద్యార్థిని. కేరళలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటోన్న ఈ 14 ఏళ్ల బాలిక పాడిన పాట ప్రస్తుతం సోషల్‌ మీడియలో ట్రెండింగ్‌లో నిలిచింది.

నీ పాటతో మా మనసులు గెలుచుకున్నావు!
భిన్న రకాల సంస్కృతి, సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు. ఈ క్రమంలో రాష్ట్రాల సంస్కృతి, సమగ్రతలను పరస్పరం ప్రోత్సహించుకునేలా, సాంస్కృతిక ఐక్యతను ప్రతిబించించేలా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల దేవిక ‘చంబా కిత్నీ కి దూర్‌’ అనే హిమాచలీ జానపద పాటను పాడింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను కేంద్రీయ విద్యాలయం అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో షేర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సింగర్‌ థాకూర్‌ దాస్ ఈ పాటను తన సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్ చేయడంతో దేవిక పాట వైరల్‌గా మారిపోయింది.

హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్‌ కూడా ఈ మనోహరమైన పాట విని ముగ్ధులయ్యారు. ‘దేవభూమి’ లాంటి హిమాచల్‌ ప్రదేశ్‌ సంస్కృతిని ప్రతిబింబిస్తూ దేవిక పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది. ఆ అమ్మాయి తన మధురమైన గాత్రంతో మా రాష్ర్ట ప్రజలందరి మనసులు గెలుచుకుంది. నువ్వు కచ్చితంగా మా రాష్ట్రాన్ని సందర్శించాలి. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి. నీ భవిష్యత్‌ బాగుండాలని మేమందరం కోరుకుంటున్నాం’ అని సోషల్‌ మీడియా వేదికగా ఆ బాలికపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘దేవికను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఆమె తన శ్రావ్యమైన సంగీతంతో ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.


వాట్‌ ఏ స్వీట్‌ వాయిస్!
దేవిక పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ‘చాలా అద్భుతంగా పాడింది’, ‘ వాట్‌ ఏ స్వీట్‌ వాయిస్’ అంటూ నెటిజన్లందరూ దేవికను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.


డాక్టర్‌ కావాలనుంది!
దేవిక ప్రస్తుతం తన తల్లి సంగీత, అమ్మమ్మ శశికుమార్‌, సోదరుడు భరత్‌ కృష్ణన్‌లతో కలిసి ఉంటోంది. ప్రభుత్వ కార్యాలయంలో సర్వెంట్‌గా పని చేస్తున్న తల్లి సంగీత ఉద్యోగమే వీరికి జీవనాధారం. ఈ సందర్భంగా సంగీతంతో పాటు డాక్టర్‌ కావాలన్నదే తన లక్ష్యమంటోందీ స్వీట్‌ గర్ల్.
‘నా పాట ఇంత పాపులర్‌ అవుతుందని నేను అసలు వూహించలేదు. గతంలో సంగీతానికి సంబంధించి నేను ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. కానీ ప్రస్తుతం నా పాటకు వస్తున్న స్పందనను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రధాని మోదీ నోటి వెంట నా పేరు, పాట రావడం నా జీవితంలో మర్చిపోలేను. డాక్టర్‌ కావాలన్నది నా ప్రధాన లక్ష్యం. దీంతో పాటు ప్లే బ్యాక్‌ సింగర్‌గా రాణించాలనేది నా అభిమతం. ఈ విషయంలో నా స్నేహితులు, సన్నిహితులు నాకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారు’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది దేవిక.





women icon@teamvasundhara
meet-banjeet-kaur-21-year-old-female-auto-driver-breaking-stereo-types-in-jammu-and-kashmir

కుటుంబం కోసం ఆటో నడుపుతున్నా.. చదువు మాత్రం మానను!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా ఇప్పట్లో మనల్ని విడిచి వెళ్లేలా లేదు. ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి బతికున్న వాళ్లను కూడా ఏదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బతిస్తూ ఎన్నో కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. ఈ క్రమంలో కరోనా కారణంగా కుదేలైన తన కుటుంబానికి తోడుగా నిలిచేందుకు ఆటో తోలుతోంది జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ యువతి. తన తండ్రి ఉద్యోగం పోవడంతో విధి లేని పరిస్థితుల్లో ఆటో డ్రైవర్‌గా మారిన ఆమె ఈ ఆపత్కాలం నుంచి తన కుటుంబాన్ని బయటపడేసేందుకు శతవిధాలా శ్రమిస్తోంది. మరి కుటుంబం కోసం పురుషులతో పోటీ పడుతూ ఆటో స్టీరింగ్‌ తిప్పుతోన్న ఆ యువతి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
life-lessons-to-learn-from-sankranti-in-telugu

సంబరాల సంక్రాంతి నేర్పే పాఠాలెన్నో..!

సాధారణంగా పండగొచ్చిందంటే ఆ ఆనందాలు నట్టింట వెల్లివిరుస్తాయి. మరి, ఆ వచ్చింది.. పెద్ద పండగ సంక్రాంతి అయితే ఆ సరదాలు మరింతగా రెట్టింపవుతాయనడంలో అతిశయోక్తి లేదు. పంటలు ఇంటికి రావడం.. చేతి నిండా పుష్కలంగా డబ్బులుండడం.. ఎవరికైనా ఆనందమే కదా..! అందుకే సంక్రాంతిని సంబరాల పండగ అంటారు.. అయితే సంబరాల సంగతి కాసేపు పక్కన పెడితే సంక్రాంతి పండగ సందర్భంగా పాటించే కొన్ని పద్ధతులకు, ఆచారాలకు నిగూఢ అర్థాలుంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మనకు ఎన్నో జీవన రహస్యాలు అవగతమవుతాయి. మరి, సంక్రాంతి మనకు నేర్పే ఆ విషయాలేంటో తెలుసుకుందామా...

Know More

women icon@teamvasundhara
swami-vivekananda-views-about-women-in-india-in-telugu

భర్త మరణిస్తే మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అది తన ఇష్టం!

'నేను శక్తిమంతుణ్ని అని భావిస్తే.. శక్తిమంతులుగానే కొనసాగుతారు.. నేను శక్తిహీనుణ్ని అనుకొంటే అలాగే శక్తిహీనులుగానే ఉంటారు..' ప్రతి ఒక్కరూ తమలో ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనే స్ఫూర్తినిస్తూ వివేకానందుడు పలికిన మాటలివి. మిగిలిన వారి విషయం పక్కన పెడితే.. మహిళలు తప్పకుండా ఆచరించాల్సిన సూత్రం ఇది. ఇదే కాదు.. వివేకానందుని నోటి నుంచి వెలువడిన ప్రతి మాటా అమృత వాక్కే. వాటిని ఆచరిస్తే విజయం మన సొంతం. 'బలమే జీవితం.. బలహీనతే మరణం' అంటూ మనలో ధైర్యాన్ని నూరిపోసిన మహానుభావుడు వివేకానందుడు. ఆయన మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని చూస్తే.. ఆయన హృదయ ఔన్నత్యం ఎంతటిదో అర్థమవుతుంది. సంప్రదాయాల పేరుతో మహిళలను ఆంక్షల చట్రంలో బంధించడాన్ని ఆనాడే ఆయన నిరసించారు. వారికి కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తే ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వివిధ సందర్భాల్లో మహిళల గురించి, వారి ఔన్నత్యం గురించి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలే మహిళల పట్ల ఆయన దృక్కోణానికి నిదర్శనం. అలాంటి కొన్ని ఆసక్తికర అంశాల గురించి స్వామి వివేకానంద జయంతి(జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా మీకోసం...

Know More

women icon@teamvasundhara
17-year-old-from-zimbabwe-teaches-girls-taekwondo-to-join-hands-against-child-marriaage

తైక్వాండోతో బాల్య వివాహాలపై పోరాటం చేస్తోంది!

సాంకేతికంగా ప్రపంచం ముందంజలో దూసుకెళుతోన్నా...ఆకాశంలోకి రాకెట్లను పంపిస్తున్నా.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు ఇంకా వెనకబడే ఉన్నాయని చెప్పాలి. అలాంటివాటిలో ఆఫ్రికా దేశమైన జింబాబ్వే కూడా ఒకటి. కేవలం అభివృద్ధిలోనే కాకుండా అక్కడి ప్రజల ఆలోచనల్లోనూ వెనకబాటుతనం స్పష్టంగా కనిపిస్తుంది. సమాజం ఎప్పుడో వదిలేసిన కొన్ని అమానుష ఆచారాలు అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో బాల్య వివాహాలు కూడా ఒకటి. ఎన్ని చట్టాలు వచ్చినా...ఎంత ప్రచారం కల్పించినా...వారి ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆ దేశంలో ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో తన కళ్లముందు జరుగుతోన్న ఆ అమానుషాన్ని చూస్తూ ఊరుకోలేదో బాలిక. వయసులో చిన్నదే అయినా తనదైన శైలిలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి..? తనేం చేసిందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
loksabha-speaker-om-birla-daughter-clears-upsc-in-first-attempt

వారి స్ఫూర్తితోనే సివిల్స్‌లో చేరాలనుకున్నా!

ఆమె తండ్రి ఓ రాజకీయనేతగా నిత్యం ప్రజా సేవలో తరిస్తున్నారు. తల్లి వైద్యురాలిగా రోగుల ప్రాణాలు కాపాడుతోంది. అక్కేమో ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా ప్రజలకు సేవ చేస్తోంది. ఇలా వీరందరినీ దగ్గర్నుంచి చూసిన ఆమె కూడా సమాజం కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. తన కుటుంబ సభ్యుల స్ఫూర్తితో ప్రతిష్ఠాత్మక సివిల్‌ సర్వీసెస్‌లో చేరి ప్రజాసేవలో తరించాలనుకుంది. అందుకు తగ్గట్టే చక్కటి ప్రతిభ కనబరిచి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది. తద్వారా తన కలను సాకారం చేసుకుంది. ఆమె ఎవరో కాదు.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె అంజలీ బిర్లా. యూపీఎస్‌సీ తాజాగా విడుదల చేసిన 89 మంది అభ్యర్థుల రిజర్వ్‌ జాబితాలో అంజలి కూడా చోటు దక్కించుకుంది.

Know More

women icon@teamvasundhara
failures-are-the-stepping-stones-for-success

నమ్మకం చేసే మ్యాజిక్ అదే మరి!

మనిషిలో ఆశను.. ఆశయాన్ని బతికించేది నమ్మకం... నమ్మకమే మనిషి లక్ష్యానికి ప్రాణవాయువు.. నమ్మకమే మనిషి విజయానికి శ్రీరామరక్ష.. అయితే ఇదే నమ్మకం లోపించినా లేదా మితిమీరినా కష్టమే సుమా..! నమ్మకం ఆత్మవిశ్వాసానికి పునాదులు వేసే మార్గం చూపించాలి.. కానీ అహంకారాన్ని ప్రేరేపించే తత్వానికి బీజాలు వేయకూడదు. అందుకే.. మనిషి తన మీద తనకు ఎంత నమ్మకం ఉన్నా.. దానిని సన్మార్గం వైపు నడిపించే స్నేహితుడిగానే మలచుకోవాలి తప్ప.. లక్ష్యమనే సౌధానికి బీటలు వేసే శత్రువుగా మార్చుకోకూడదు. మరి ౨౦౨౦ కి గుడ్ బై చెప్పేసి, కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే వేళ - ఏ విషయంలో నైనా సరే మనం గట్టిగా నమ్మితే జరిగే మ్యాజిక్ ఏంటో ఓసారి చూద్దాం రండి!

Know More

women icon@teamvasundhara
rajasthan-milkman-daughter-set-to-become-a-judge-in-telugu

పశువుల పాకలోనే చదువుకుని జడ్జిగా ఎదిగింది!

కలలు కనడం ఎవరైనా చేస్తారు. వాటిని సాకారం చేసుకునే దిశగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి అంతిమ లక్ష్యం చేరుకున్న వారే అసలైన విజేత అవుతారు. తమ కృషి, పట్టుదలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల సోనాల్‌ శర్మ. పేదరికం వెక్కిరించినా, ఆర్థికంగా ఆటంకాలు ఎదురైనా తన ఆశయాన్ని వీడలేదామె. సవాళ్లను సానుకూలంగా స్వీకరిస్తూనే తన కలను సాకారం చేసుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. అందుకే తన విజయంతో పలువురి ప్రశంసలందుకుంటోంది. మరి, ఇంతకీ ఎవరీ సోనాల్‌? ఏంటి ఆమె లక్ష్యం? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
21-year-old-bsc-student-arya-rajendran-to-become-youngest-mayor-in-telugu

దేశమంతా ఈ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుకుంటోందో తెలుసా?

‘రాజకీయాలంటేనే రొంపి... అందులోకి దిగితే దేనినైనా దిగమింగుకోవాలి... అవమానాలు భరిస్తూ ముందుకెళ్లాలి. ఇక మహిళలు అయితే ఇందులోకి అడుగుపెట్టకపోవడమే మంచిది’... ప్రస్తుత రాజకీయాలపై నేటి తరం అభిప్రాయాలివి. ఈ కారణాలతోనే దేశానికి వెన్నెముక అని చెప్పుకునే యువత పాలిటిక్స్‌ అంటేనే విముఖత చూపిస్తున్నారు. సామర్థ్యం ఉన్నా మనకెందుకీ తలనొప్పి వ్యవహారాలంటూ మౌనంగా ఉంటున్నారు. అయితే సమర్ధులందరూ ఇలాగే ఇంట్లో కూర్చుంటే సమాజానికి మంచిది కాదంటూ కేరళకు చెందిన ఓ యువతి రాజకీయాల్లో చురుగ్గా రాణిస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా... ఎలాంటి రాజకీయ చరిత్ర లేకున్నా... ప్రజా సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే అతి పిన్న వయసులోనే ఓ ప్రధాన నగర మేయర్‌ పీఠాన్ని అధిష్టించే అవకాశం దక్కించుకుందీ టీనేజర్. తద్ద్వారా యావద్దేశం దృష్టినీ ఆకర్షించింది. ఆ యువ కెరటమే కేరళకు చెందిన ఆర్యా రాజేంద్రన్.

Know More

women icon@teamvasundhara
hygiene-tips-every-woman-should-know-in-telugu
women icon@teamvasundhara
ways-to-make-yourself-happy-in-telugu

ప్రశాంతత లోపించిందా? అయితే మీరిది చదవాల్సిందే!

సమాజంలో ఉన్నత స్థానం, హోదా, కళ్లు తిప్పనివ్వని అందం, అద్భుతమైన తెలివితేటలు, ఆస్తిపాస్తులు, విశాలమైన బంగ్లా, ఖరీదైన కార్లు ఇవన్నీ ఉంటేనే జీవితం బిందాస్ అనుకుంటాం. కానీ ఇది కొంత వరకే నిజం కావచ్చు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత లేకపోతే అసలేవీ లేనట్టే. కావాలంటే మీరే చూడండి... కొంతమందికి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేనప్పటికీ ఏ లోటూ లేకుండా హాయిగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవితాంతం ఆనందంగా గడిపేస్తారు. ఎందుకంటే... ఏమున్నా లేకపోయినా మానసిక ప్రశాంతత మాత్రం వీరి సొంతం. అదే వారి సంతోషకర జీవనానికి కారణం. ఇంతకీ ఈ మానసిక ప్రశాంతతను ఎలా సొంతం చేసుకోవాలి? అంటే అది మన చేతుల్లోనే ఉంది.

Know More

women icon@teamvasundhara
meet-gitanjali-rao-teen-inventor-and-time-magazine-
women icon@teamvasundhara
plus-sized-kerala-woman-braves-body-shaming-to-become-a-model

ఇంత లావున్నా నా శరీరంతో నేను ఫుల్‌ హ్యాపీస్‌!

కాస్త లావుగా ఉన్న వారు... అందులోనూ అమ్మాయిలు కనిపిస్తే చాలు వారిని చూసి నవ్వుకోవడం, హేళన చేయడం కొందరికి అలవాటు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో సరదాకి ఒక ఫొటో షేర్‌ చేసినా రకరకాల కామెంట్లు పెడుతూ వేధిస్తుంటారు కొంతమంది నెటిజన్లు. దాని వల్ల ఎదుటివారి ఆత్మాభిమానం దెబ్బతింటుందని తెలిసినా ఇలాగే చేస్తూ ఉంటారు. కేరళకు చెందిన ఓ 27 ఏళ్ల అమ్మాయి కూడా తన శరీరాకృతి విషయంలో ఇలాంటి ఎబ్బందులనే ఎదుర్కొంది. అయితే ఆత్మస్థైర్యంతో వాటన్నింటికీ ఎదురొడ్డి నిలిచి ప్లస్‌ సైజ్‌ మోడలింగ్‌లో మెరుపులు మెరిపిస్తోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆమె లక్ష్యం ఏమిటి? మొదలైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Know More

women icon@teamvasundhara
woman-performs-backflips-in-a-saree-with-ease-and-grace-netizens-are-impressed

వావ్‌.. చీరకట్టులో బ్యాక్‌ఫ్లిప్స్‌.. ఎలా చేసేస్తోందో చూడండి!

చీర...భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. అయితే ఏవైనా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తప్ప సాధారణ రోజుల్లో చీర కట్టుకునే వారు చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే చీరకట్టులో సౌకర్యవంతంగా ఉండలేమని.. చుడీదార్లు, జీన్సుల్లోనే కంఫర్టబుల్‌గా ఉండచ్చని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇలా చీర కట్టుకోవడానికే ఇబ్బంది పడిపోయే నేటి రోజుల్లో కొందరు మహిళలు ఈ వస్త్రధారణతోనే వ్యాయామాలు చేయడం, మారథాన్‌లలో పాల్గొనడం, సాహసకృత్యాల్లో భాగమవడం...వంటివి చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరిపోయింది మిలీ సర్కార్‌ అనే యువతి. ఇంటర్నేషనల్‌ యోగా గోల్డ్‌ మెడలిస్ట్‌, జిమ్నాస్ట్‌ అయిన ఆమె.. చీరకట్టులో అవలీలగా బ్యాక్‌ఫ్లిప్స్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తద్వారా మహిళలు చీరకట్టులోనూ ఎంతటి కఠినమైన పనులైనా అలవోకగా చేయగల సమర్థులు అని నిరూపిస్తోంది.

Know More

women icon@teamvasundhara
this-nurse-before-and-after-picures-show-the-impact-of-treating-covid-19-for-months

నా కెరీర్‌ అలా మొదలై.. ఇలా సాగుతుందనుకోలేదు!

సరిగ్గా ఏడాది క్రితం చైనాలోని వుహాన్‌ వేదికగా పురుడు పోసుకుంది కరోనా వైరస్‌. అప్పటి నుంచి ప్రపంచమంతా తిరుగుతూ ప్రతి ఒక్కరినీ వణికిస్తోందీ మహమ్మారి. ఇక ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్‌ అంటూ పలు ప్రపంచ దేశాల్లో గుబులు రేపుతోంది. అదే సమయంలో కరోనా వైరస్‌తో సుమారు ఏడాది కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు వైద్య సిబ్బంది. ప్రఖ్యాత డాక్టర్ల నుంచి సాధారణ నర్సుల వరకూ కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు ఆస్పత్రుల్లోనే ఉంటూ రోగులకు సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో కొందరు డాక్టర్లు అదే మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు రోగులకు సేవ చేస్తూ మానసిక ఒత్తిడితో పాటు తీవ్ర శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. అందుకు తాజా ఉదాహరణే ఈ అమెరికన్‌ నర్సు.

Know More

women icon@teamvasundhara
who-is-charli-d-amelio?-a-16-year-old-who-just-became-the-most-followed-tiktoker-in-the-world

అలా తన ప్రతిభతో ‘పది కోట్ల’ మంది అభిమానం చూరగొంది!

‘టిక్‌టాక్‌’....కొద్ది నెలల క్రితం భారత్‌లో నిషేధించిన ఈ చైనా మొబైల్‌ యాప్‌కి ఇతర దేశాల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రధానంగా అమెరికాలో ఈ వీడియో షేరింగ్‌ యాప్‌కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇక ఈ యాప్‌ కారణంగా ఇప్పటికే ఎంతో మంది సామాన్యులు ఓవర్‌నైట్‌ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. తమ సృజనాత్మక వీడియోలతో లక్షల నుంచి కోట్ల వరకు ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ టిక్‌టాక్‌ స్టార్లుగా ఎంతో క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఈక్రమంలో అమెరికాకు చెందిన ఓ 16 ఏళ్ల యువతి టిక్‌టాక్‌లో తొలిసారిగా 100మిలియన్(10కోట్లు) ఫాలోవర్స్‌ మార్క్‌ను చేరుకుంది. తద్వారా ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఫాలో అవుతున్న టిక్‌టాకర్‌గా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఎవరీ అమ్మాయి? వంద మిలియన్ల మంది అభిమానం ఎలా సంపాదించిందో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
dont-do-these-things-to-lead-satisfactory-life

ఈ ఆలోచనలు మానండి.. ఆనందంగా ఉండండి..!

జీవితం ఎప్పుడూ సంతోషంగా.. ఆనందంగా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు. దానికోసం వడివడిగా సాగిపోతోన్న కాలంతో కలిసి పరిగెత్తుతుంటారు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడం సహజం. అయితే వాటికి కూడా కుంగిపోయి.. తమ జీవితం అంతా కష్టాలమయమైపోయిందని బాధపడేవారు కూడా ఉంటారు. ఈ క్రమంలో తమకంటే కాస్త మిన్నగా ఉన్నవారితో పోల్చుకొని తమను తాము తక్కువ చేసి చూసుకొంటారు. ఈ రకమైన ఆలోచనా విధానం కారణంగా.. ఉన్నదాంతో సంతృప్తిగా బతకాలనే విషయాన్ని కూడా మరిచిపోతుంటారు. ఇలా చేయడం సరికాదు. అయితే మన మెదడులో మెదిలే కొన్ని ఆలోచనలకు దూరంగా ఉండటం ద్వారా జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు.

Know More

women icon@teamvasundhara
american-teenager-makes-largest-hand-drawn-maze-bags-guinness-world-records

ఈ పొడవైన దారిని కనుక్కునే టైం మీకుందా?

రోజూ పత్రికలు చదివేవారిలో చాలామందికి సుడోకు, పజిల్స్‌ పూర్తి చేయడమంటే చాలా సరదా. ప్రత్యేకించి మేజ్‌ పజిల్‌ను పరిష్కరించేందుకు చిన్నారులతో పాటు పెద్దవాళ్లు కూడా ఆసక్తి చూపుతుంటారు. వీటిని సాధన చేయడం ద్వారా మన మెదడు మరింత చురుకుగా పని చేస్తుందని, జ్ఞాపకశక్తి సామర్థ్యం పెరుగుతుందని, ఒత్తిడి దూరమవుతుందని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ అమ్మాయి 104.64 చదరపు మీటర్ల పొడవైన మేజ్‌ పజిల్‌ని రూపొందించింది. తద్వారా ప్రపంచంలో అతి పొడవైన పజిల్‌ను తయారుచేసిన యువతిగా గిన్నిస్‌ రికార్డుల కెక్కింది.

Know More

women icon@teamvasundhara
kerala-girl-sets-record-for-fastest-completion-of-online-courses-in-telugu

ఆన్‌లైన్ కోర్సులతో రికార్డు సృష్టించింది!

కరోనా ప్రభావంతో ఇప్పటికీ చాలాచోట్ల విద్యా సంస్థలు తెరుచుకోలేదు. పలు సంస్థలు, కార్యాలయాలు నేటికీ ‘వర్క్‌ ఫ్రం హోం’కే ప్రాధాన్యమిస్తున్నాయి. దీంతో యువత తమకు తెలిసిన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా చాలామంది యువత ఆన్‌లైన్‌ కోర్సులపై దృష్టి సారిస్తున్నారు. లాక్‌డౌన్‌ రూపంలో దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ సృజనాత్మకత, అభిరుచులకు మరింత పదును పెడుతున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఓ విద్యార్థిని 35 రోజుల్లోనే 628 ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తి చేసింది. తద్వారా ప్రఖ్యాత ‘అమెరికన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించింది.

Know More

women icon@teamvasundhara
rapunzel-from-gujarat-breaks-her-own-guinness-world-record-with-2-metre-long-hair

ఈ అమ్మాయిది ఎంత పొడవైన జుట్టో చూశారా?

పొడవాటి కురులు ఆడవారికి ఎంత అందాన్నిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సహజ కిరీటం లాగా తలమీద నిగనిగలాడుతూ ఒత్తయిన, పొడవైన కేశాలు అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అందుకే చాలామంది కురులు రాలిపోకుండా మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్‌ ఆయిల్స్‌, కండిషనర్లు, మందులు ఇంకా చాలా చిట్కాలు వినియోగిస్తుంటారు. కానీ ఇవేవీ అవసరం లేకుండానే పొడవాటి జుట్టుతో ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది గుజరాత్‌కు చెందిన నీలాన్షి పటేల్. గతేడాది 190 సెంటీమీటర్ల పొడవైన కురులతో ప్రపంచంలో అత్యంత పొడవైన జుట్టు ఉన్న యువతిగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించిన ఆమె తాజాగా తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఈ క్రమంలో 200 సెంటీమీటర్ల (6 అడుగుల 6.7 అంగుళాలు) పొడవాటి కేశాలతో ప్రపంచంలో పొడవాటి జుట్టు ఉన్న టీనేజర్‌గా మరోసారి గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులకెక్కిందీ యంగ్‌ సెన్సేషన్.

Know More

women icon@teamvasundhara
psychologist-advice-for-depressed-girl-in-telugu

ఏ పనైనా పూర్తిగా చేయలేకపోతున్నా.. ఇది నా లోపమా?

నమస్తే మేడమ్‌.. నా వయసు 23 సంవత్సరాలు. నాకు ఈ మధ్య చాలా దిగులుగా ఉంటుంది. ఒకప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ బాగా చదివేదాన్ని.. కానీ కొన్ని రోజుల నుంచి మనసు నిలకడగా ఉండటం లేదు. ఏ పని చేసినా సగంలోనే ఆపేస్తున్నా. నేను పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలనుకుంటున్నా.. కానీ తీరా చదివే సమయంలో ‘ఇప్పుడు ఇది కాదేమో.. వేరే సబ్జెక్ట్‌ చదివితే బాగుండు!’ అనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ ఇలాగే అనిపిస్తుంది. దీంతో ఏ పనిని సంపూర్ణంగా చేయలేకపోతున్నా.. దీనివల్ల ఏదో ఆరాటం, బాధ, దిగులు నాలో కనిపిస్తుంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. రేపు ఎలాగైనా ఈ పని చేయాలని పడుకుంటాను. కానీ మరుసటి రోజు మళ్లీ అదే అసంపూర్ణత! నేనేందుకు హుషారుగా ఉండలేకపోతున్నాను?దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
this-pune-woman-repurposes-scrapped-tyres-to-create-pretty-foot-wear

కార్పొరేట్‌ కొలువు కాదని.. పాత టైర్లతో చెప్పులు తయారుచేస్తోంది!

ఆమె ఇంజినీరింగ్‌ చదివింది. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికై కార్పొరేట్‌ కంపెనీలో కొలువు తెచ్చుకుంది. నెలకు ఆరంకెల జీతం అందుకుంది. కానీ ఇంకా ఏదో వెలితి.. ఇంకా ఏదో చేయాలన్న తపన.. అందుకే వీటన్నింటినీ వదిలేసి పాడైపోయిన టైర్లతో ఫ్యాషనబుల్‌ పాదరక్షలు తయారుచేస్తోంది. అందులోనే తనకు కావాల్సిన జీతం, జీవితాన్ని వెతుక్కుంది. సొంత స్టార్టప్‌ను ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌ యువ వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంది. మరి, ఇంతకీ ఎవరీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌? ఆమె సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
tanya-gupta-shares-her-baking-story-which-is-her-childhood-dream

కరోనా ఈ అమ్మాయి కలను ఆపలేకపోయింది!

పెద్దయ్యాక నేను డాక్టరవ్వాలి, ఆర్కిటెక్ట్‌ అవ్వాలి అని ఒక్కొక్కరికీ ఒక్కో కల ఉంటుంది. అయితే పెరిగి పెద్దయ్యే కొద్దీ కొంతమంది తమ కలల్ని మార్చుకుంటే.. మరికొందరు చిన్ననాటి కలను నెరవేర్చుకునేదాకా నిద్రపోరు. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన తన్యా గుప్తా కూడా అంతే! చిన్నతనం నుంచే బేకింగ్‌పై మక్కువ పెంచుకున్న ఆమె.. దానికోసం మంచి జీతమొచ్చే ఉద్యోగం కూడా వదులుకుంది. అంతలోనే కరోనా మహమ్మారి విజృంభించడంతో అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతోన్న తన వ్యాపారం ఒక్కసారిగా కుదేలైనా వెనక్కి తగ్గలేదామె. కొత్తగా ఆలోచించి, తన ఉత్పత్తుల్ని సరికొత్తగా ప్రమోట్‌ చేయడం ప్రారంభించి.. ఈ కరోనా సమయంలోనూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే గట్టి పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులెదురైనా మన పయనాన్ని ఆపలేవంటోన్న తన్యా అంతరంగమిది!

Know More

women icon@teamvasundhara
aishwarya-sridhar-first-indian-to-win-wild-life-photographer-of-the-year-award

ప్రకృతితో పాలపుంతను సృష్టించింది.. అవార్డు పట్టేసింది!

ఫొటోగ్రఫీ.. అమ్మాయిలు చాలా అరుదుగా కనిపించే రంగం. సరదాగానో లేదంటే హాబీ అనో కొందరు కెమెరాలు క్లిక్‌మనిపించినా.. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీనే పూర్తిస్థాయి కెరీర్‌గా మలచుకున్న అమ్మాయిలు మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. అలాంటి అరుదైన అమ్మాయిల జాబితాలోకి వస్తుంది 23 ఏళ్ల ఐశ్వర్యా శ్రీధర్‌. చిన్నప్పుడు తండ్రితో కలిసి అడవికి వెళ్లి సరదాగా ఫొటోలు తీసిన ఆమె.. తన ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడించింది. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీనే కెరీర్‌గా మలచుకుని 12 ఏళ్ల నుంచే ప్రకృతి అందాలను ఫొటో ఫ్రేముల్లో బంధించడం మొదలుపెట్టింది. తన ఫొటోగ్రఫీ ప్రతిభకు తార్కాణంగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్న ఈ టీనేజ్‌ సెన్సేషన్‌ తాజాగా ప్రతిష్ఠాత్మక ‘వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

Know More

women icon@teamvasundhara
bangladeshi-woman-cricketer-wedding-photoshoot-goes-viral

క్రికెటర్ల వెడ్డింగ్‌ ఫొటోషూట్స్‌ ఇలాగే ఉంటాయి!

పెళ్లిలో ఫొటోలకున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కొత్తగా వివాహ బంధంలోకి అడుగిడబోతున్న దంపతులు తమ పెళ్లి జ్ఞాపకాలు పదికాలాల పాటు పదిలంగా ఉండాలని ప్రి వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ తీయించుకోవడం పరిపాటిగా మారిపోయింది. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడాల్లేకుండా అందరూ ఈ నయా ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. కొన్ని పెళ్లి జంటలు వినూత్న ఫోటోషూట్‌లతో వార్తల్లో నిలిస్తే, మరికొందరు సాహసోపేతంగా ఫొటోలు తీయించుకుని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. ఈక్రమంలో ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా తనకు ఇష్టమైన క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకుని వెడ్డింగ్‌ ఫొటోషూట్‌లో పాల్గొంది బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌ సంజిదా ఇస్లామ్‌. పెళ్లి దుస్తులు, ఒంటి నిండా ఆభరణాలు ధరించి క్రికెట్‌ గ్రౌండ్‌లోనే బ్యాటింగ్‌ చేసింది. ఆటమీద ఆమెకున్న అభిమానానికి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) కూడా ఫిదా అయ్యింది. అందుకే తమ అధికారిక ట్విట్టర్‌లో సంజిదా ఫొటోలను షేర్ చేస్తూ అభినందనలు తెలిపింది.

Know More

women icon@teamvasundhara
indian-american-girl-anika-chebrolu-wins-25000-usd-for-work-on-potential-covid-19-cure

కరోనాకు చెక్ పెట్టే ప్రాజెక్ట్‌తో ఆ పోటీలో గెలిచింది!

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారిని అంతమొందించే టీకా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఓవైపు కరోనా బాధితులకు ఉపశమనం కలిగించే మందుల్ని పలు ఫార్మసీ కంపెనీలు విడుదల చేస్తుండగా.. మరోవైపు ప్రయోగ దశలో ఉన్న కొన్ని టీకాలు ఒక్కో దశనూ విజయవంతంగా దాటుకుంటూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే తాను రూపొందించిన ఓ ప్రాజెక్ట్‌ కరోనా వైరస్‌కు రక్షణగా ఉండే ప్రొటీన్‌ పొరకు ముకుతాడు వేస్తుందని చెబుతోంది ఇండో-అమెరికన్‌ టీన్‌ అనికా చేబ్రోలు. అంతేకాదు.. ఈ ఆవిష్కరణ తనను ఈ ఏడాదికి గాను ‘3M యంగ్‌ సైంటిస్ట్‌ ఛాలెంజ్‌’లో గెలిచేలా చేసింది. ఇందుకు గాను సుమారు రూ. 18 లక్షలకు పైగానే నగదు బహుమతి అందుకున్న అనికా తన గురించి, తన ప్రయోగం గురించి ఇలా చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
neet-2020-akansha-singh-tops-the-medical-entrance-exam

అలా ‘నీట్‌’గా ర్యాంకులు సాధించారు!

మన దేశంలో మెడిసిన్‌ కోర్సులకు ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి మెడికల్‌ కళాశాలలో సీటు సంపాదిస్తే..విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు మార్గం సుగమమైనట్లే. అందుకే మెడిసిన్‌ ఎంట్రన్స్‌ పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం ఎంతోమంది విద్యార్థులు కష్టపడుతుంటారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 720 మార్కులతో ఒడిషాకు చెందిన షోయబ్ అఫ్తాబ్‌ టాపర్‌గా నిలిచాడు. బాలికల విషయానికొస్తే దిల్లీకి చెందిన ఆకాంక్షా సింగ్‌ కూడా 720 మార్కులు సాధించినప్పటికీ రెండు ర్యాంకులో నిలిచింది. వయసులో ఆమె షోయబ్‌ కన్నా చిన్నది కావడంతో రెండో ర్యాంకుతోనే సరిపెట్టుకుంది. మరి ఆమెతో పాటు టాప్‌-10 ర్యాంకుల్లో నిలిచి సత్తా చాటిన కొందరి విద్యార్థినుల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
10-year-old-girl-makes-record-by-cooking-33-dishes-in-an-hour

గంటలో 33 వంటకాలు.. ఈ చిన్నారికే సాధ్యం..!

సాధారణంగా పదేళ్ల వయసంటే చదువు, ఆటపాటలతో ఆనందంగా గడుపుతుంటారు పిల్లలు. ఇప్పుడంటే స్కూళ్లు లేవు కాబట్టి చిన్నారులు అమ్మ వండిపెట్టింది తింటూ.. ఫోన్‌, టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొంతమందేమో ఆన్‌లైన్‌ క్లాసుల బిజీలో ఉన్నారు. అయితే కేరళకు చెందిన ఓ పదేళ్ల చిన్నారి మాత్రం చకచకా వంటకాలు వండేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేంత రుచిగా, మెరుపు వేగంతో రుచికరమైన వంటకాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి పదేళ్ల వయసులో గరిటె తిప్పుతూ ప్రపంచ రికార్డులు సృష్టిస్తోన్న ఈ కుకింగ్‌ గర్ల్‌ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
onen-nenty-this-nagaland’s-woman-biker-giving-riding-classes-to-women-as-path-to-jobs

బైక్‌ ఎందుకు.. వంట నేర్చుకో అన్నారు!

పెద్ద పెద్ద బరువైన బైక్స్‌ నడపడం అబ్బాయిలకే సాధ్యమనుకుంటారు.. ఒకవేళ అమ్మాయిలు ధైర్యం చేసి నడిపినా వారిని ‘ఇదంతా నీకు అవసరమా?’ అన్నట్లుగా ఎగాదిగా చూస్తారు. ఇలాంటి వాళ్ల మాటలు పట్టించుకోకుండా బైక్‌ రైడింగ్‌ని ఎంజాయ్‌ చేయడంతో పాటు ‘ఎలాంటి బైక్‌ అయినా నడిపే సత్తా అమ్మాయిలకూ ఉంద’న్న బలమైన సందేశాన్ని చాటుతుంటారు కొంతమంది అతివలు. నాగాలాండ్‌కు చెందిన ఓనెన్‌ ఎంటీ కూడా ఇదే కోవకు చెందుతుంది. బైక్స్‌ అబ్బాయిలే నడపాలన్న నియమం ఎక్కడా లేదని, అలా అనుకునే వాళ్ల ఆలోచనల్ని పూర్తిగా మార్చేయాలన్న ఉద్దేశంతోనే తాను బైక్‌ రైడింగ్‌ నేర్చుకున్నానంటోందీ 28 ఏళ్ల బైకింగ్‌ సంచలనం. కేవలం తాను నడపడమే కాదు.. బైక్‌ రైడింగ్‌ వైపు అమ్మాయిల్ని, మహిళల్ని చైతన్యవంతుల్ని చేయడం కోసం గతేడాది బైక్‌పై ఒంటరిగానే రాష్ట్రమంతా చుట్టేసింది ఓనెన్‌. ఇక ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఈ బైక్‌ రైడింగే అతివలకు ఉపాధి మార్గంగా ఉపయోగపడుతుందంటూ ఔత్సాహిక మహిళలకు బైక్‌ రైడింగ్‌ పాఠాలు నేర్పుతోంది. మహిళలు తాము కన్న కలల్ని నిజం చేసుకున్నప్పుడే సంపూర్ణ సాధికారత సాధ్యమవుతుందంటోన్న ఈ నాగాలాండ్‌ బైకర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
texas-teen-breaks-guinness-world-record-for-longest-legs-in-telugu

గిన్నిసుకెక్కిన ఈ పొడుగు కాళ్ళ సుందరిని చూశారా?

'సామజ వరగమనా...' అంటూ అల వైకుంఠపురములో పూజా హెగ్డే వెంట పడ్డ ఒక్క అల్లు అర్జునే కాదు.. కాస్త పొడవుగా ఉన్న అమ్మాయి రోడ్డు మీద కనిపిస్తే చాలు... అందరి కళ్ళూ సాధారణంగా అటు వైపే తిరుగుతాయి. ఎందుకంటే పొడవైన కాళ్లు అమ్మాయిలకు అదనపు అందాన్నిస్తాయి. అందుకే మోడలింగ్‌, ఫ్యాషన్‌, సినిమా రంగాల్లో కూడా సాధారణంగా పొడుగు కాళ్ల అమ్మాయిలకే ఎక్కువ అవకాశాలు లభిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఓ యువతి తన పొడవైన కాళ్లతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఏకంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. మరి ప్రస్తుతం సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిపోయిన ఈ పొడుగు కాళ్ల సుందరి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
psychologist-advice-on-a-jobless-girl-who-is-in-depression

ఆ బాధను తట్టుకోలేకపోతున్నా.. చనిపోవాలనిపిస్తోంది...

హాయ్‌ మేడమ్‌.. నేను 2019లో పీజీ పూర్తి చేశాను. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాను. ఉద్యోగం చేద్దామనుకునే సమయానికి మా అక్కకి డెలివరీ టైం వచ్చింది. అమ్మకి ఆరోగ్యం బాలేకపోవడంతో అక్కకు సహాయం చేయడం కోసం ఇంట్లోనే ఉండిపోయా. ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే వర్కౌట్‌ కావడం లేదు. మా ఇంట్లో వాళ్లు, అక్కలు నాకు జాబ్‌ లేదని జాలి పడుతున్నారు. నాకు కావాల్సినవి కొనిస్తున్నారు. కానీ, అది నాకు నచ్చడం లేదు. ఇలా ఖాళీగా ఉండడం వల్ల డిప్రెషన్‌కి లోనవుతున్నా.. ఏమాత్రం సంతోషంగా ఉండలేకపోతున్నాను. దీనికి తోడు మీ అక్కలిద్దరూ గవర్నమెంట్‌ జాబ్‌ చేస్తున్నారు.. నువ్వు ఏమీ చేయడం లేదని బంధువులు హేళన చేస్తున్నారు. ఆ బాధను అసలు తట్టుకోలేకపోతున్నా. ఒక్కోసారి చనిపోవాలనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
the-loss-of-her-brother-made-this-woman-a-campaigner-for-a-national-suicide-prevention-helpline

నా తమ్ముడిలా మరెవ్వరూ బలవ్వకూడదనే అలా చేశా..!

మనసుకు బాధ కలిగితే మన అనుకున్న వాళ్లతో పంచుకుంటాం.. వాళ్లు దగ్గర లేకపోతే స్నేహితులతో, సన్నిహితులతో మనం ఎదుర్కొంటోన్న మానసిక సంఘర్షణ గురించి చెప్పుకుంటాం. కానీ అలా చెప్పుకోకుండా కొంతమంది తమ బాధను తమలోనే దాచుకొని కుంగి కుమిలిపోతున్నారు.. ఒత్తిడి, ఆందోళనల్లో కూరుకుపోతున్నారు. జీవితం మీద ఆశ సన్నగిల్లి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇలా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోన్న మానసిక సంఘర్షణే ప్రాణంగా ప్రేమించే తన తమ్ముడిని తనకు దూరం చేసిందంటోంది ఓ సోదరి.. ఇలా తన తోబుట్టువు మరణంతో కొన్నాళ్లు నాలుగ్గోడల మధ్యే కుమిలిపోయిన ఆమె.. అలాగే చీకట్లోనే కూర్చోవాలనుకోలేదు. ఆత్మహత్యలను పూర్తిగా నిర్మూలించాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే దాదాపు ఏడాది పాటు పోరాడి దేశంలోనే తొలిసారి ‘24×7 జాతీయ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్‌’ ప్రారంభమయ్యేందుకు కారకురాలైంది. ఆమే బెంగళూరుకు చెందిన రాశీ థక్రాన్‌. ‘దయచేసి మనసులోని బాధను మీలోనే దాచుకొని మిమ్మల్ని ఇష్టపడే వారికి దూరం కాకండి.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన దాన్ని..!’ అంటూ తన కథను ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
canada-horse-girl-can-run-jump-on-all-fours-in-telugu

అచ్చం గుర్రంలా ఎలా జంప్‌ చేస్తోందో చూడండి!

సాధారణంగా మనం వెళ్లే దారిలో అడ్డుగా ఓ తాడు కట్టారనుకోండి.. అది మరీ ఎత్తుగా ఉంటే కింది నుంచి వంగి వెళ్లడమో లేదంటే దాన్నే పైకి లేపి వెళ్లడమో చేస్తాం. కానీ కెనడాలోని అల్బర్టాకు చెందిన 17 ఏళ్ల ఓ అమ్మాయి మాత్రం అలాంటి బారికేడ్స్‌ కానీ, కంచెలు కానీ కనిపిస్తే వాటిపై నుంచి గుర్రంలా దూకేస్తూ, చెంగుచెంగున గెంతుతూ వెళ్లిపోతుంది. ఎందుకంటారా? తనకు అది వెన్నతో పెట్టిన విద్య. గుర్రాల్లా దూకడం, ఎంత ఎత్తు నుంచైనా వాటిలా జంప్‌ చేయడం నేర్చుకున్న ఆమె.. కాళ్లతో పాటు చేతుల్నీ నేలకు ఆనిస్తూ గెంతుతూ వచ్చి ఆ బారికేడ్లపై నుంచి జంప్‌ చేస్తుంటుంది. ఇలా ఆమెకు మాత్రమే సొంతమైన ఈ కళను అందరికీ పరిచయం చేయడానికి ఏకంగా ఓ సోషల్‌ మీడియా పేజీనే క్రియేట్‌ చేసుకుందీ టీనేజర్‌. అంతేనా.. తన నైపుణ్యంతో ఎంతోమంది మనసులు దోచుకుంటోందీ యువతి. మరి, ఇంతకీ ఎవరా అమ్మాయి? ఎంత ఎత్తు నుంచైనా గుర్రంలా అలా ఎలా దూకగలుగుతోంది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
malala-yousafzai-recalls-her-journey-in-tweek-india-summit-in-telugu

రెస్టరంట్‌కు వెడతాను.. సినిమాలు చూస్తాను.. క్రికెట్ అంటే ఇష్టం!

మలాలా యూసఫ్‌జాయ్... బాలికల విద్య, హక్కుల కోసం తనదైన శైలిలో పోరాడుతున్న ఈ ధీరవనిత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 13 ఏళ్ల ప్రాయంలోనే తాలిబన్ల తూటాలకు గురై, మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చిన ఆమె...తన పరిస్థితి మరే అమ్మాయికి తతెత్తకూడదని అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే ఉగ్రవాద దేశాల్లో ఉన్న శరణార్థుల పిల్లలకు విద్యనందించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రపంచ వేదికలపై తన గళాన్ని వినిపించే ఈ టీనేజ్‌ సెన్సేషన్‌... ఇటీవల లండన్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పట్టా అందుకుంది. ఈ నేపథ్యంలో వర్చువల్‌గా ఏర్పాటుచేసిన ‘ట్వీక్‌ ఇండియా సమిట్’లో ట్వింకిల్‌ ఖన్నాతో కలిసి పాల్గొన్న ఆమె... తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
woman-completes-350-courses-in-3-months-makes-world-record-in-telugu

అలా ఆన్‌లైన్‌లో 350 కోర్సులు పూర్తి చేసింది!

కరోనా సంక్షోభం కారణంగా కొన్ని నెలల పాటు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌లో విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, కార్యాలయాలన్నీ మూతపడడంతో అందరూ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొందరు తమకు అభిరుచి ఉన్న రంగాలపై దృష్టి పెడితే.. మరికొందరు తమకు తెలిసిన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే పనిలో పడ్డారు. అయితే కేరళకు చెందిన ఓ యువతి మాత్రం ఆన్‌లైన్‌ కోర్సులపై దృష్టి సారించింది. తన సృజనాత్మకత, అభిరుచులకు మరింత పదును పెడుతూ మూడు నెలల్లో ఏకంగా 350 ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేసింది. తద్వారా యూనివర్సల్‌ రికార్డ్స్‌ ఫోరంలో స్థానం సంపాదించి ప్రపంచ రికార్డు సృష్టించింది.

Know More

women icon@teamvasundhara
kerala-law-student-graduates-with-record-18-gold-medals-in-telugu
women icon@teamvasundhara
amritsar-teen-tops-international-space-olympiad-earns-nasa-invite-in-telugu

అందుకే నాసా నుంచి పిలుపు అందుకుంది!

ఎన్నో నిగూఢ రహస్యాలను తనలో నింపుకున్న విశ్వం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ క్రమంలోనే కొంతమంది చిన్నతనం నుంచే అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కంటారు. వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేస్తుంటారు. అందుకు తాజా ఉదాహరణే పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన 16 ఏళ్ల హిస్సా. అంతరిక్ష శాస్త్రం, టెక్నాలజీ రంగాల్లో విద్యార్థుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏటా నిర్వహించే ఇంటర్నేషనల్‌ స్పేస్‌ ఒలింపియాడ్‌ (ఐఎస్‌ఓ) క్విజ్‌ పోటీల్లో భాగంగా ఈ ఏడాదిగానూ సీనియర్‌ కేటగిరీలో టాపర్‌గా నిలిచిందీ అమ్మాయి. దీంతో అమెరికాలోని జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ను ఉచితంగా సందర్శించే అద్భుత అవకాశాన్ని సైతం చేజిక్కించుకుందీ బ్రిలియంట్‌ గర్ల్‌. నాసా పిలుపు మేరకు త్వరలోనే అమెరికా పయనమవనున్న హిస్సా.. ఈ పిలుపు కోసమే ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్నానని.. మొత్తానికి తన కల నిజమవబోతోందని సంబరపడిపోతోంది.

Know More