శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం;బహుళ పక్షం తదియ: సా.5-27 తదుపరి చవితి ఆర్ద్ర: ఉ.11-27 తదుపరి పునర్వసు వర్జ్యం: రా.11-50 నుంచి 1-29 వరకు అమృత ఘడియలు: లేవు దుర్ముహూర్తం: ఉ.9-58 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-23 నుంచి 3-07 వరకు రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.6-18 సూర్యాస్తమయం: సా.5-20
సంకటహర చతుర్ధి
మేషం
మధ్యమ ఫలితాలున్నాయి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మంచి జరుగుతుంది.
వృషభం
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.
మిథునం
సకాలంలో పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుపుకుపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. ప్రయాణాలు సుఖవంతమవుతాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.
కర్కాటకం
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివాష్టకం పఠిస్తే శుభదాయకం.
సింహం
ఒక ముఖ్య వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టిన పనులలో ఆశించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
కన్య
వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.
తుల
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.
వృశ్చికం
ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే అవకాశముంది. నవగ్రహలను పూజిస్తే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలు చేయడంతో విభేదాలు వచ్చే సూచనలున్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తే మంచిది.
మకరం
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.
కుంభం
మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. గిట్టని వారికి దూరంగా ఉండాలి. అన్నదానం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు.
మీనం
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి పనిని కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ప్రారంభించాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.