శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం;బహుళ పక్షం విదియ: సా.4-47 తదుపరి తదియ మృగశిర: ఉ.10-07 తదుపరి ఆర్ద్ర వర్జ్యం: సా.6-58 నుంచి 8-40 వరకు అమృత ఘడియలు: రా.12-52 నుంచి 2-34 వరకు దుర్ముహూర్తం: ఉ.11-26 నుంచి 12-10 వరకు రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ.6-17 సూర్యాస్తమయం: సా.5-20
మేషం
చేపట్టే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విబేదాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే మంచిది.
వృషభం
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం పఠించాలి.
మిథునం
తలపెట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు తగిన ధనం చేకూరుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ చేస్తే మంచిది.
కర్కాటకం
అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠిస్తే శుభప్రదం.
సింహం
శివారాధన ఉత్తమం. శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను పొందుతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవితే శ్రేయోదాయకం.
కన్య
మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
తుల
అవసరానికి తగిన ఆర్థిక సాయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. వ్యాపారంలో లాభాలున్నాయి. సమయ పాలనతో పనులను పూర్తిచేస్తారు. లక్ష్మీదేవి ఆలయ సందర్శనం ఉత్తమం.
వృశ్చికం
చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం మంచిది. మనః సౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభదాయకం.
ధనుస్సు
మనః సౌఖ్యం ఉంది. ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలున్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. వేంకటేశ్వర స్వామి దర్శనం శుభఫలితాలనిస్తుంది.
మకరం
శుభకాలం ఉంది. మొదలు పెట్టిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.
కుంభం
శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఇష్ట దైవాన్ని స్మరించండి.
మీనం
మంచి ఫలితాలున్నాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలుపెట్టిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. గోవిందా నామాలు పఠిస్తే శుభప్రదం.