శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం;శుక్ల పక్షం ద్వాదశి: ఉ.7-51 తదుపరి త్రయోదశి అశ్విని: రా.1-03 తదుపరి భరణి వర్జ్యం: రా.8-37 నుంచి 10-27 వరకు అమృత ఘడియలు: సా.5-05 నుంచి 6-51 వరకు; దుర్ముహూర్తం: ఉ.8-28 నుంచి 9-12 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-54 వరకు రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ.6-15 సూర్యాస్తమయం: సా.5-20
మేషం
ప్రయత్నకార్య సిద్ధి ఉంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది.
వృషభం
సుఖప్రదమైన కాలాన్ని గడుపుతారు. కీలక విషయాల్లో సత్ఫలితాలను పొందుతారు. కుటుంబవాతావరణం అనుకూలంగా ఉంటుంది. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.
మిథునం
ఊహించిన ఫలితాలను రాబట్టడానికి అధిక శ్రమ చేయాలి. ఎవ్వరితోను వాగ్వాదం చేయకండి. కోపాన్నితగ్గించుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. గోసేవ చేస్తే మంచిది.
కర్కాటకం
శుభఫలితాలు పొందుతారు. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాదేవిని ఆరాధిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.
సింహం
సమాజంలో మీ మతవిలువ పెరుగుతుంది. కుటుంబసభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య అష్టకం చదవండి.
కన్య
మంచి ఫలితాలున్నాయి. బంధువుల సహకారం అందుతుంది. ఎవ్వరితోను గొడవలు పెరగకుండా చూసుకోవాలి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో సహనాన్ని కోల్పోకండి. ఇష్టదేవతారాధన శుభప్రదం.
తుల
అనుకూల ఫలితాలున్నాయి. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. కొన్ని పరిస్థితులు మీకు మానసిక ఇబ్బంది కలిగిస్తాయి. లింగాష్టకం పఠించడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు.
వృశ్చికం
అనుకున్న పని నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరిని ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.
ధనుస్సు
పట్టుదలతో పనిచేయండి. గొప్ప లాభాలున్నాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తిచేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. గణపతి ధ్యానం శుభప్రదం.
మకరం
పెద్దల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహాన్ని భంగం చేయాలని చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.
కుంభం
ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు.చేయని తప్పుకు నింద పడాల్సి వస్తుంది. కలహ సూచన. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. లక్ష్మీ ఆరాధనా మంచిది.
మీనం
ఆర్థికంగా విజయాలు సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. రాజదర్శన సల్లాపాలు, భోజన సౌఖ్యం లభిస్తాయి. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది.