శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం;శుక్ల పక్షం ద్వాదశి: పూర్తి రేవతి: రా.10-29 తదుపరి అశ్విని వర్జ్యం: ఉ.9-17 నుంచి 11-03 వరకు అమృత ఘడియలు: రా.7-51 నుంచి 9-36 వరకు; దుర్ముహూర్తం: ఉ.9-56 నుంచి 10-40 వరకు తిరిగి మ. 2-22 నుంచి 3-06 వరకు రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.6-14 సూర్యాస్తమయం: సా.5-20 వైష్ణవ మాధ్వ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి
మేషం
మొదలు పెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. దుర్గరాధన శుభప్రదం.
వృషభం
విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేస్తారు. సొంతింటి పనుల్లో ముందంజ వేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గా ధ్యానం శుభప్రదం.
మిథునం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.
కర్కాటకం
తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివస్తోత్రం పఠించడం మంచిది.
సింహం
చేపట్టేపనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధిస్తారు. ఆపదలు తొలగడం కోసం వెంకటేశ్వరున్ని ఆరాధించాలి.
కన్య
శుభకాలం. మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.
తుల
చేపట్టే పనిలో అనుకూల ఫలితాలున్నాయి.బంధువుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
వృశ్చికం
శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. విందు, వినోద, కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. దైవారాధన మానవద్దు.
ధనుస్సు
మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
మకరం
మీమీ రంగాల్లో ఓర్పు, పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరానికి మించిన ఖర్చులుంటాయి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.
కుంభం
పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఆపదలు తొలగడానికోసం గోవిందా నామాలు చదివితే బాగుంటుంది.
మీనం
ఆశించిన ఫలితాలున్నాయి. ఒక వ్యవహారములో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసమును పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.