శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం;శుక్ల పక్షం షష్ఠి: రా.1-54 తదుపరి సప్తమి ఉత్తరాషాఢ: మ.2-22 తదుపరి శ్రవణం వర్జ్యం: సా.6-23 నుంచి 8-00 వరకు అమృత ఘడియలు: ఉ.8-03 నుంచి 9 -37 వరకు తిరిగి తె.4-03 నుంచి 5-40 వరకు దుర్ముహూర్తం: ఉ.8-24 నుంచి 9-09 వరకు తిరిగి మ.12-07 నుంచి 12-52 వరకు రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ.6-11 సూర్యాస్తమయం: సా.5-20 తుంగభద్ర నదీ పుష్కర ప్రారంభం
మేషం
చేపట్టే పనిలో పట్టుదల చాలా అవసరం. కష్టం పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
వృషభం
గొప్ప శుభసమయం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేహసౌఖ్యం, సౌభాగ్యసిద్ధి ఉన్నాయి. చేపట్టిన పనులలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణం చేస్తే బాగుంటుంది.
మిథునం
ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికి ప్రశంసలు లభిస్తాయి. కొన్ని విషయాలలో మీరు అనుకున్నదానికంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. మనోవిచారం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. సూర్యుడిని ఆరాధిస్తే మంచిది.
కర్కాటకం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. శివారాధన శుభప్రదం.
సింహం
ఒక శుభవార్త వింటారు. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలున్నాయి. బుద్ధిబలం బాగుండటం వల్ల కీలక సమయాలలో సమయోచితంగా స్పందించి అధికారుల మెప్పును పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి. అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
కన్య
కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. శని ధ్యాన శ్లోకం చదువుకోవాలి.
తుల
మధ్యమ ఫలితాలున్నాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.
వృశ్చికం
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనక ధార స్తోత్రం పఠించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
ధనుస్సు
కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానద్దు. శని శ్లోకం చదవండి.
మకరం
బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
కుంభం
చేపట్టే పనిలో పట్టుదల చాలా అవసరం. కష్టం పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
మీనం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానద్దు.