శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం, శరదృతువు; నిజ ఆశ్వయుజ మాసం;బహుళ పక్షం ద్వాదశి: సా.6-24 తదుపరి త్రయోదశి; హస్త: రా.12-04 తదుపరి చిత్త; వర్జ్యం: ఉ.9-25 నుంచి 10-56 వరకు; అమృత ఘడియలు: సా.6-26 నుంచి 7-56 వరకు; దుర్ముహూర్తం: ఉ.9-51 నుంచి 10-36 వరకు, తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు; రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.6-06 సూర్యాస్తమయం: సా.5-21
మేషం
అవసరానికి తగిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యుల మాటకు ఎదురు మాట్లాడవద్దు. అందరినీ కలుపుకొనిపోతే త్వరగా విజయాన్ని అందుకుంటారు. మంచి భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టదైవ నామస్మరణ శక్తినిస్తుంది.
వృషభం
శుభ ఫలితాలు ఉంటాయి. ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొంటారు. ఆదిత్య హృదయం చదవాలి.
మిథునం
అనుకూల ఫలితాలున్నాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. శని శ్లోకం చదివితే బాగుంటుంది.
కర్కాటకం
తలపెట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఈశ్వర ధ్యాన శ్లోకం చదివితే బాగుంటుంది.
సింహం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం ఉత్తమం.
కన్య
మంచి కాలం. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక కీలక విషయంలో మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభ కాలం. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.
తుల
మిశ్రమ కాలం. అప్పగించిన పనుల్లో చురుగ్గా పాల్గొనటం ద్వారా పనులు త్వరగా పూర్తవుతాయి. వృథా ప్రసంగాలతో లేనిపోని తలనొప్పులు వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.
వృశ్చికం
మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్నిస్తాయి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. ఉమా మహేశ్వర స్తోత్రం చదివితే మంచిది.
ధనుస్సు
శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబం సహకారం ఉంటుంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.
మకరం
శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీదేవి దర్శనం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కుంభం
శుభ ఫలితాలు ఉన్నాయి. కాలం సహకరిస్తుంది. మీ మీ రంగాలలో విజయం సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.
మీనం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. కొందరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.