శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; నిజ ఆశ్వయుజ మాసం;బహుళ పక్షం ఏకాదశి: రా.8-33 తదుపరి ద్వాదశి ఉత్తర: రా.1-33 తదుపరి హస్త వర్జ్యం: ఉ.9-39 నుంచి 11-10 వరకు అమృత ఘడియలు: సా.6-44 నుంచి 8-15 వరకు దుర్ముహూర్తం: ఉ.11-21 నుంచి 12-06 వరకు రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ.6-06 సూర్యాస్తమయం: సా.5-22
మేషం
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలున్నాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
వృషభం
మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో చంచలబుద్ధితో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.
మిథునం
చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా వాటిని పట్టుదలతో అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వల్ల ఇంట గెలుస్తారు. శివారాధన శుభప్రదం.
కర్కాటకం
ఆశించిన ఫలితాలు సొంతం అవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. చేపట్టిన పనులలో విజయదుందుభి మోగిస్తారు. శని శ్లోకాన్ని చదివితే అన్నివిధాలా మంచిది.
సింహం
బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
కన్య
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానద్దు.
తుల
మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
వృశ్చికం
చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది.
ధనుస్సు
ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పనులను పూర్తి చేయగలుగుతారు. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. సాయి నామాన్ని జపించాలి.
మకరం
కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
కుంభం
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేపట్టే పనులు త్వరగా పూర్తయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం మంచిది.
మీనం
మిశ్రమకాలం. చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.