శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; నిజ ఆశ్వయుజ మాసం;బహుళ పక్షం చవితి: రా.1-45 తదుపరి పంచమి మృగశిర: రా.2-36 తదుపరి ఆర్ద్ర వర్జ్యం: ఉ.6-54 నుంచి 8-37 వరకు అమృత ఘడియలు: సా.5-11 నుంచి 6-54 వరకు దుర్ముహూర్తం: ఉ.11-22 నుంచి 12-07 వరకు రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ.6-04 సూర్యాస్తమయం: సా.5-26
సంకటహర చతుర్ధి
మేషం
మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. శివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
వృషభం
శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప ఆలోచనా విధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివ అష్టోత్తరం పఠించాలి.
మిథునం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమతో కూడిన సత్ఫలితాలను సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో లాభం పొందుతారు. లక్ష్మీస్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
కర్కాటకం
శుభకాలం. విశేషమైన ప్రగతిని సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభాన్నిస్తుంది.
సింహం
చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొంటారు. సూర్యాష్టకం పఠించడం మంచిది.
కన్య
చేపట్టిన పనులను మనోబలంతో పూర్తిచేస్తారు. ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. గోసేవ చేయడం మంచిది.
తుల
కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.
వృశ్చికం
శుభఫలితాలు సొంతమవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారాలలో లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
ధనుస్సు
ఏకాగ్రతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉన్నత పదవి యోగం ఉంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధనా శుభప్రదం.
మకరం
మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధుజన ప్రీతి ఉంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
కుంభం
మీ ఆలోచనా ధోరణికి, ముందుచూపుకి ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.
మీనం
మనస్సౌఖ్యం కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచినిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.