శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; నిజ ఆశ్వయుజ మాసం;బహుళ పక్షం తదియ: రా.12-36 తదుపరి చవితి రోహిణి: రా.12-55 తదుపరి మృగశిర వర్జ్యం: సా.4-13 నుంచి 5-57 వరకు అమృత ఘడియలు: రా.9-26 నుంచి 11-10 వరకు దుర్ముహూర్తం: ఉ.8-19 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-28 నుంచి 11-19 వరకు రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.6-03 సూర్యాస్తమయం: సా.5-26 అట్లతద్దె
మేషం
తలపెట్టిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దైవబలం రక్షిస్తుంది. బంధుమిత్రుల సహకారం మేలు చేస్తుంది. నవగ్రహ స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.
వృషభం
గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో సమర్థవంతంగా ముందుకుసాగి విజయాన్ని సాధిస్తారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం.
మిథునం
కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య ఈవారం పరిష్కారమవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. గణపతిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం
ఒక మంచివార్తను వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. దైవారాధన మానద్దు.
సింహం
అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. దుర్గాధ్యానం శుభప్రదం.
కన్య
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరి వారిని దూరం చేసుకోకండి. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
తుల
మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మీధ్యానం మంచినిస్తుంది.
వృశ్చికం
ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది.
ధనుస్సు
స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితికి చేరుకుంటారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. సకాలంలో ఆదుకునేవారున్నారు. శివారాధన చేయడం మంచిది.
మకరం
చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా వాటిని పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో చంచలబుద్ధితో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.
కుంభం
చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. విష్ణు సందర్శనం శుభప్రదం.
మీనం
విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలుంటాయి. మనఃస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్యహృదయం పఠించడం మంచిది.