శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; నిజ ఆశ్వయుజ మాసం;శుక్లపక్షం చతుర్దశి: సా.4-54 తదుపరి పూర్ణిమ రేవతి: మ.3-15 తదుపరి అశ్విని వర్జ్యం: లేదు అమృత ఘడియలు: మ.12-36 నుంచి 2-22 వరకు దుర్ముహూర్తం: ఉ.8-18 నుంచి 9-03 వరకు తిరిగి మ.12-06 నుంచి 12-52 వరకు రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ.6-01 సూర్యాస్తమయం: సా.5-27
మేషం
మధ్యమ ఫలితాలున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులవైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. శ్రీ లక్ష్మీ గణపతి ధ్యానం శుభప్రదం.
వృషభం
శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే ఉత్తమం.
మిథునం
ధర్మసిద్ధి ఉంది. దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శుభకాలం. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే శుభ ఫలితాలు సొంతమవుతాయి.
కర్కాటకం
పనులకు ఆటంకాలు కలగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుంది.
సింహం
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవిష్ణు ఆరాధన చేయడం మంచిది.
కన్య
మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం అందుతుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
తుల
ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. నారాయణ మంత్రాన్ని జపించాలి.
వృశ్చికం
చేపట్టే పనులకు ఆటంకాలు కలగకుండా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శరీర సౌఖ్యం కలదు. సూర్యాష్టకం పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు
మంచి కాలం. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. సూర్యాష్టకం చదివితే శ్రేయోదాయకం.
మకరం
ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. నవగ్రహ స్తోత్రం చదివితే శుభదాయకం.
కుంభం
అవసరానికి తగిన సహాయం చేసేవారున్నారు. శ్రమ అధికమవుతుంది. తోటివారి సహకారంతో ఆపదలు తొలగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శివారాధన మంచిది.
మీనం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. శివనామాన్ని జపిస్తే మంచిది.