శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; నిజ ఆశ్వయుజ మాసం;శుక్లపక్షం ద్వాదశి: మ.1-17 తదుపరి త్రయోదశి పూర్వాభాద్ర: ఉ.10-39 తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం: రా.9-06 నుంచి 10-51 వరకు అమృత ఘడియలు: లేవు దుర్ముహూర్తం: ఉ.11-21 నుంచి 12-06 వరకు రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ.6-00 సూర్యాస్తమయం: సా.5-28
మేషం
చేపట్టే పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. హుషారుగా పనిచేయాలి. గతకొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. సూర్యాష్టకం చదివితే శుభప్రదం.
వృషభం
ఇష్టకార్యసిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శివ ఆరాధన చేస్తే మంచిది.
మిథునం
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.
కర్కాటకం
ఉద్యోగంలో ఉన్నతస్థితికి చేరుతారు. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. శివారాధన శక్తినిస్తుంది.
సింహం
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్ట దైవారాధన మంచిది.
కన్య
హుషారుగా పనిచేయండి. మంచి ఫలితాలను సాధిస్తారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.
తుల
చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలున్నాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
వృశ్చికం
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనల వల్ల నిరుత్సాహం, విచారం కలుగుతాయి. శత్రువుల జోలికి పోరాదు. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.
ధనుస్సు
శ్రమ ఫలిస్తుంది. అనవసర విషయాలను సాగదీయకండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. గోవింద నామాలు జపిస్తే మంచిది.
మకరం
అదృష్టం పడుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం.
కుంభం
మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్నది సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. దైవబలం కాపాడుతోంది. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.
మీనం
చేపట్టే పనుల్లో లాభాలున్నాయి. ఆర్థిక విషయాల్లో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఇష్ట దైవారాధన శుభప్రదం.