scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఈ సెలబ్రిటీలందరూ కరోనాను జయించిన వారే!

Celebrities Who Diagnosed And Recovered From Covid in Telugu

కనికరం లేకుండా విరుచుకుపడుతోన్న కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా... ఈ తేడాలేవీ చూడకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే... సామాన్యులే కాదు... పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. అయితే ఇంకా మందు లేని ఈ మహమ్మారిని చాలామంది మనోధైర్యంతో జయిస్తున్నారు. సరైన సమయంలో వైద్యం తీసుకుని వైరస్‌పై విజయం సాధిస్తున్నారు. తాజాగా కరోనా బారిన పడ్డ తమన్నా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయింది. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకుని ఆ అనుభవాలను అందరితో షేర్ చేసుకున్న కొందరి ప్రముఖుల గురించి తెలుసుకుందాం రండి...

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on


టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజుల క్రితం ఆమె తల్లిదండ్రులకు వైరస్‌ సోకింది. ఈ నేపథ్యంలో ఓ వెబ్‌సిరీస్‌ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌కి వచ్చిన ఆమె అస్వస్థతకి గురైంది. వైద్య పరీక్షల్లో ఆమెకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంది. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.

‘సినిమా సెట్‌లో నిబద్ధతతో ఉంటూ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నాం. అయినప్పటికీ గత వారం నాకు స్వల్పంగా జ్వరం వచ్చింది. పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి, వైద్యుల సలహాతో చికిత్స తీసుకున్నా. ఇప్పుడు నేను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాను. ప్రపంచంలోని చాలామందిని కరోనా ఇబ్బంది పెడుతోంది. ఈ సమయంలో పూర్తిగా కోలుకోవడం నా అదృష్టం. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో ఉంటాను. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారికి, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని ఆ ప్రకటనలో రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
గతంలో వీళ్ళు కూడా..


శ్వేతా తివారీ

View this post on Instagram

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

‘కసౌటీ జిందగీ కే’ సీరియల్‌తో ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్న శ్వేతా తివారీ గత నెలలో కరోనా బారిన పడింది. వైద్యుల సలహాతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయిన ఆమె... రోజూ వేడి నీళ్లు తాగుతూ, మందులు తీసుకుంటూ కరోనాపై పోరాటం చేసింది. ఇటీవల కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న ఈ బుల్లితెర బ్యూటీ తన ముద్దుల కూతురు పలక్‌ తివారీతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంది.

View this post on Instagram

A post shared by Palak Tiwari (@palaktiwarii) on


మలైకా అరోరా

View this post on Instagram

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

తన ఆరోగ్య, ఫిట్‌నెస్‌ రహస్యాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ అందరిలో ఆరోగ్య స్పృహ పెంచే మలైకా అరోరా గత నెల మొదటివారంలో కరోనా బాధితుల జాబితాలో చేరిపోయింది. దీంతో మొత్తం 14 రోజుల పాటు స్వీయ ఐసోలేషన్లో ఉండి సాధారణ చికిత్స తీసుకున్న ఆమె సెప్టెంబర్‌ మూడో వారంలో కరోనా నుంచి కోలుకుంది. ఈ సందర్భంగా చికిత్స సమయంలో తాను పాటించిన డైట్ వివరాలను అందరితో షేర్‌ చేసుకుని తన లాంటి కరోనా బాధితుల్లో స్ఫూర్తి నింపిందీ అందాల తార.

View this post on Instagram

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


కిరణ్‌ మజుందార్‌షా

బయోకాన్ ఛైర్ పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌షా ఆగస్టు రెండో వారంలో కరోనా బారిన పడ్డారు. వైద్యుల పర్యవేక్షణలో మొత్తం రెండు వారాల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. సెప్టెంబర్‌ మొదటివారంలో ఈ మహమ్మారి నుంచి బయటపడిన ఆమె...కరోనాకు సంబంధించి తన అనుభవాలన్నింటినీ తన సోషల్‌ మీడియా బ్లాగ్‌లో షేర్‌ చేసుకున్నారు.


నిక్కీ గల్రానీ

View this post on Instagram

A post shared by Nikki Galrani ✨ (@nikkigalrani) on

‘కృష్ణాష్టమి’, ‘మలుపు’, ‘మరకతమణి’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న నిక్కీ గల్రానీకి ఆగస్టు రెండో వారంలో కరోనా సోకింది. వైద్యుల సలహాలతో మొత్తం 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌ ట్రీట్‌మెంట్‌లో గడిపిన ఆమె అదే నెల చివరినాటికి కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. ఈ సందర్భంగా కరోనా వైరస్ గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దంటూ తన కొవిడ్‌ అనుభవాలను అందరితో షేర్‌ చేసుకుందీ అందాల తార.

View this post on Instagram

A post shared by Nikki Galrani ✨ (@nikkigalrani) on


జెనీలియా

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad) on

హ..హ..హాసిని..అంటూ ‘బొమ్మరిల్లు’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న జెనీలియా కూడా కరోనా యోధురాలే. ఆగస్టు మొదటి వారంలో కొవిడ్‌ బాధితుల జాబితాలో చేరిపోయిన ఆమె 21 రోజుల పాటు ఐసోలేషన్‌లోనే గడిపింది. మూడువారాల పాటు ఒంటరిగా గడిపిన ఆమె కొవిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌ అని తేలాకే కుటుంబ సభ్యులతో చేరింది. ఈ సందర్భంగా ‘ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోండి. పోషకాహారం తీసుకోండి. ఫిట్‌గా ఉండండి. కరోనాతో పోరాడేందుకు ఇవే అసలైన ఆయుధాలు’ అంటూ తన లాంటి బాధితుల్లో కొండంత ధైర్యం నింపిందీ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad) on


సునీత

ఆర్థిక పునరుజ్జీవనం అంటూ ప్రభుత్వం ఆగస్టులో లాక్‌డౌన్ సడలింపులివ్వడంతో సినిమా రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అందులో ప్రముఖ గాయని సునీత కూడా ఉన్నారు. షూటింగ్‌లో తలనొప్పిగా ఉంటే టెస్ట్‌ చేయించుకున్న ఆమెకు కొవిడ్‌ సోకిందని నిర్ధారితమైంది. అయితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండడంతో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. డాక్ట్లర్ల సలహాలు, జాగ్రత్తలు పాటిస్తూ వ్యాధి నుంచి బయటపడిన ఆమె ‘స్వల్ప లక్షణాలు ఉండడం వల్లే నేను త్వరగా కోలుకున్నాను. మహమ్మారితో పోరాటం అంత సులువైనది కాదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ తన అభిమానులకు ఓ సందేశం పంపారు.


నటాషా సూరి

View this post on Instagram

A post shared by Natasha Suri (@natashasuri) on

ఆగస్టులో ‘డేంజరస్‌’ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ నటాషా సూరి అదే నెలలో కొవిడ్‌ బారిన పడింది. అంతకుముందు ఓ పని నిమిత్తం పుణెకు వెళ్లిన ఆమెకు తిరిగి రాగానే కరోనా సోకింది. తనతో పాటు సోదరి రూపాలీ సూరి, అమ్మమ్మకు కూడా ఈ వైరస్‌ సోకింది. దీంతో నెల రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో గడిపిన ఆమె సెప్టెంబర్‌ మొదటివారంలో పూర్తిగా కోలుకుంది. ఈ సందర్భంగా కరోనాను ఎవరూ తేలికగా తీసుకోవద్దంటూ తన అభిమానులను అప్రమత్తం చేసిందీ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by Natasha Suri (@natashasuri) on


నవనీత్‌ కౌర్

View this post on Instagram

A post shared by Navneet Kaur Rana (@navneetravirana) on

ఇక సినీనటి, పార్లమెంట్ సభ్యురాలు నవనీత్‌ కౌర్‌ ఆగస్టు నెలలో కరోనాకు గురయ్యారు. ఆమెతో పాటు భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆమె ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమించినా మనోధైర్యంతో కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక కొద్ది రోజులు హోం క్వారంటైన్‌లో గడిపిన ఆమె మళ్లీ యధావిధిగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు.

View this post on Instagram

A post shared by Navneet Kaur Rana (@navneetravirana) on


స్మిత

View this post on Instagram

A post shared by Smita (@smitapop) on

తెలుగులో పాప్‌ సింగర్‌గా ఎంతో గుర్తింపు సొంతం చేసుకున్న స్మిత ఆగస్టులో కరోనా బారిన పడింది. ఆమెతో పాటు భర్త శశాంక్‌ కూడా కొవిడ్‌కు గురయ్యారు. డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకున్న ఆమె 20 రోజుల తర్వాత కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. చికిత్స సమయంలో తన అనుభవాలను సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుని తన లాంటి బాధితుల్లో స్ఫూర్తి నింపిందీ స్టార్‌ సింగర్.


ఐశ్వర్యారాయ్

View this post on Instagram

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

జులైలో బాలీవుడ్‌ అందాల తార ఐశ్వర్యారాయ్‌, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా సోకింది. అంతకుముందు బిగ్‌బీ అమితాబ్‌, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ ఈ వైరస్‌ బారిన పడ్డారు. ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు లేని ఐశ్వర్య, ఆరాధ్య ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత స్వల్ప లక్షణాలు బయటపడడంతో ఇద్దరూ ఓ ఆస్పత్రిలో చేరారు. మొత్తం పది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఈ తల్లీ కూతుళ్లు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.


జోయా మొరానీ

View this post on Instagram

A post shared by Zoa☀️ (@zoamorani) on

‘ఓం శాంతి ఓం’ సినిమాతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జోయా మొరానీ ఏప్రిల్‌లో కరోనా బారిన పడింది. కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆమె కొవిడ్‌ నుంచి కోలుకున్న వెంటనే తన ప్లాస్మాను దానం చేసింది. మొత్తం రెండు సార్లు ప్లాస్మాను దానం చేసిన ఈ మనసున్న తార... పలువురి ప్రశంసలు అందుకుంది.

View this post on Instagram

A post shared by Zoa☀️ (@zoamorani) on



వీరితో పాటు బాలీవుడ్‌ బుల్లితెర ముద్దుగుమ్మలు అదితీ గుప్తా, మోహెనా కుమారి సింగ్‌, సెలబ్రిటీ సింగర్‌ కనికా కపూర్‌, కన్నడ బ్యూటీ నవ్య స్వామి, అలనాటి అందాల తార సుమలత తదితరులు కూడా కరోనాను జయించారు. అనంతరం చికిత్స సమయంలో తమ అనుభవాలను అందరితో షేర్‌ చేసుకుని తమ ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు.

View this post on Instagram

A post shared by Navya Swamy (@navya_swamy) on


View this post on Instagram

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on





women icon@teamvasundhara
today-horoscope-details-24-11-2020
women icon@teamvasundhara
lord-siva-temples-in-telugu-states

ఈ శైవక్షేత్రాల దర్శనం.. పరమ పవిత్రం!

కార్తీకమాసంతో సమానమైన మాసం, విష్ణువుతో సమానమైన దేవుడు, సత్యయుగంతో సమానమైన యుగం, గంగతో సమానమైన నది లేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో సూర్యోదయానికి ముందే.. అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసే నదీ స్నానం అనంతకోటి పుణ్య ఫలాన్నిస్తుందట. అలాగే కార్తీక సోమవారం రోజు ఉసిరి చెట్టుకింద దీపం పెడితే హరిహరాదుల అనుగ్రహం కలుగుతుందని కూడా భక్తుల విశ్వాసం. అంతేకాదు ఈ మాసంలో 'హరహర మహాదేవ.. శంభో శంకర' అని వేడుకుంటే చాలు.. భోళాశంకరుడు భక్తుల కోరికలను తీర్చేందుకు సిద్ధంగా ఉంటాడని వారి భావన. కార్తీకమాసంలో శివుణ్ని దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందితే సకల దరిద్రాలు తొలగిపోయి, భోగభాగ్యాలతో జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉన్న కొన్ని సుప్రసిద్ధ శైవక్షేత్రాలపై ప్రత్యేక కథనం మీకోసం.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-19-11-2020
women icon@teamvasundhara
51-year-old-woman-gives-birth-to-her-granddaughter

కూతురి కోసం మనవరాలికి జన్మనిచ్చింది!

పెళ్లైన ప్రతి మహిళా అమ్మతనం కోసం ఆరాటపడుతుంది.. తల్లిప్రేమను పొందాలని తపిస్తుంది. అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన బ్రెయన్నా లాక్‌వుడ్‌ కూడా ‘అమ్మా’ అన్న పిలుపు కోసం ఆరాటపడింది. అయితే ఆదిలోనే సంతాన సమస్యలు ఆమె కలను కల్లలు చేశాయి. ఎలాగైనా అమ్మ కావాలని పరితపించిన ఆమె.. ఎందరో డాక్టర్లను కలిసింది.. ఎన్నో చికిత్సలు చేయించుకుంది.. ఆఖరికి ఐవీఎఫ్‌ దాకా కూడా వెళ్లింది. ఇలా ఆమె చేసిన ప్రతి ప్రయత్నం విఫలయత్నమే అయింది. అయినా తన తల్లి సహాయంతో ఇటీవలే ఓ పండంటి పాపాయికి జన్మనిచ్చి అమ్మతనాన్ని పొందిందామె. అంతేనా.. ఈ క్రమంలో తన ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయింది బ్రెయన్నా. మరి, ఎన్ని నోములు నోచినా తనకు కలగని సంతానం తన తల్లి ద్వారా ఎలా సాధ్యమైంది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
the-auspicious-month-of-karthika-masam
women icon@teamvasundhara
do-you-know-the-secret-of-happiness?-in-telugu

ఈ ‘హ్యాపీ హార్మోన్లు’ మీలో విడుదలవుతున్నాయా?

నలభై దాటినా సరే - ఫిట్‌నెస్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి. యోగ సాధనలో ఆరితేరిన ఈ అందాల తారతో ఫిట్‌నెస్, ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎవరూ పోటీ పడలేరేమో. అంతే కాదు.. ఎప్పటికప్పుడు వివిధ ఆరోగ్యకరమైన వంటకాలు తయారుచేస్తూ తన యూట్యూబ్ ఛానల్‌లో, సోషల్ మీడియా పేజీల్లో అందరితో షేర్ చేస్తుంటుంది. వాటిలోని పోషక విలువల్ని వివరిస్తూ తన ఫ్యాన్స్‌లో ఆరోగ్యం పట్ల అవగాహనను మరింతగా పెంచుతుంటుందీ అందాల అమ్మ. ఇప్పుడు 'మీకు సంతోషం సీక్రెట్ తెలుసా' అంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చిందీ బ్యూటీ. మరి ఆ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-16-11-2020
women icon@teamvasundhara
deepavali-celebrations-around-the-world

women icon@teamvasundhara
precautions-to-take-buy-gold-jewellery-in-telugu
women icon@teamvasundhara
after-her-pet-dog-went-missing-6-years-ago-a-texas-woman-drives-2200km-for-their-reunion

తప్పిపోయిన 'కింగ్' మళ్లీ ఆరేళ్ల తర్వాత అలా దొరికాడు!

శునకాలను విశ్వాసానికి మారుపేరంటారు. ద్వేషమంటే తెలియని ఈ మూగజీవాలను తిట్టినా... కొట్టినా అవి చూపించే ప్రేమలో ఏ మాత్రం తేడా ఉండదు. అందుకే చాలామంది తమ పెట్స్‌గా కుక్కల్ని పెంచుకోవడానికే ఆసక్తి చూపుతుంటారు. వాటికి ముద్దు పేర్లు పెట్టుకుని మరీ ఇంట్లో సొంత మనిషిలా చూసుకుంటారు. ఒక్క క్షణం అవి కనిపించకపోయినా, వాటికేమైనా ప్రమాదం జరిగినా విలవిల్లాడిపోయే పెట్‌ లవర్స్‌ కూడా ఉంటారు. ఈ క్రమంలో ఆరేళ్ల క్రితం తప్పిపోయిన తన శునకాన్ని తెచ్చుకునేందుకు ఓ మహిళ పెద్ద సాహసమే చేసింది. ఇంతకీ ఎవరా మహిళ? తను చేసిన సాహసమేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-10-11-2020
women icon@teamvasundhara
today-horoscope-details-7-11-2020
women icon@teamvasundhara
twin-sisters-give-birth-to-daughters-on-their-birthday-in-the-same-hospital

ఈ కవలలిద్దరూ గంటన్నర వ్యవధిలో అమ్మలయ్యారు!

సాధారణంగా కవలలంటే చూడ్డానికి ఒకేలా ఉండచ్చు. కానీ కలిసి పుట్టినంత మాత్రాన అన్ని విషయాల్లో సారూప్యతలు ఉండాలనేం లేదు. పెరిగి పెద్దయ్యాక వాళ్ల అలవాట్లు, అభిరుచులు విభిన్నంగా ఉండచ్చు. వారి వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎన్నో మార్పులు సంభవించవచ్చు. అయితే రూపురేఖల దగ్గర్నుంచి చదువు దాకా... అనేక విషయాల్లో సారూప్యత ఉన్న కవలలు అరుదుగానే ఉంటారు. అలాంటి కోవకే చెందుతారు అమెరికాకు చెందిన ఆటమన్‌షా, అంబర్‌ ట్రామోంటానా అనే ఇద్దరు కవలలు. చిన్నప్పటి నుంచి ఎన్నో సారూప్యతలను పంచుకున్న ఈ ట్విన్‌ సిస్టర్స్‌ తాజాగా ఒకే రోజు ఒకే హాస్పిటల్‌లో పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చారు. ఆశ్చర్యకరంగా మొదటిసారి గర్భం దాల్చినప్పుడు కూడా ఇలాగే కొన్ని వారాల వ్యవధిలో మగ బిడ్డలను ప్రసవించారీ బ్యూటిఫుల్‌ సిస్టర్స్. ఈ సందర్భంగా అందరి నోళ్లలో నానుతున్న ఈ అమెరికన్ కవల సోదరీమణుల గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-5-11-2020
women icon@teamvasundhara
festival-significance-of-karva-chauth-in-telugu

కుటుంబ క్షేమాన్ని కాంక్షించే 'కర్వా చౌత్'!

పండగలంటే మన సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించడంతో పాటు బోలెడన్ని సరదాల్నీ మనకందిస్తాయి. అయితే వీటిలో అందరూ కలిసి జరుపుకొనే పండగలు కొన్నైతే.. కేవలం మహిళలు మాత్రమే మమేకమై జరుపుకొనేవి మరికొన్ని. అందులో 'కర్వా చౌత్' కూడా ఒకటి. శ్రావణం, కార్తీకం.. వంటి పలు మాసాల్లో ఆడవారు ప్రత్యేకంగా పూజలు, వ్రతాలు నిర్వహించి ఉపవాస దీక్ష చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇదేవిధంగా కర్వా చౌత్ రోజున కూడా ఆడవారు పార్వతీ దేవికి భక్తిశ్రద్ధలతో పూజించి, నిష్టతో ఉపవాసం ఉంటారు. ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత నాలుగో రోజు లేదా దీపావళికి పదకొండు రోజులు ముందుగా వచ్చే ఈ పండగను ఉత్తర భారతదేశం వారు ఎక్కువగా జరుపుకొంటారు. మరి, మహిళలంతా ఎంతో ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పండగ వైశిష్ట్యం, నేపథ్యం తదితర అంశాల గురించి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
things-you-should-know-while-attending-or-organizing-small-gatherings-amid-pandemic

కరోనా వేళ వేడుకలా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

ఓవైపు దీపావళి-క్రిస్మస్‌ పండగలు.. మరోవైపు పెళ్లిళ్ల హడావిడి.. ఇంకోవైపు చలికాలం మొదలు.. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎటు చూసినా సందడి వాతావరణం నెలకొంటుంది. పండగలు, శుభకార్యాల కోసం ఒకరింటికి మరొకరు వెళ్తుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు. కరోనా కారణంగా వేడుకల సందడి తీరు మారింది. అయినప్పటికీ పెళ్లి, ఇతర శుభకార్యాల్లో కొంతమందైనా అతిథుల్ని పిలవడం, లేదంటే మనమే మన దగ్గరి బంధువుల పార్టీలు, వేడుకలకు హాజరవడం.. వంటివి చేస్తున్నాం. అది కూడా కనీస జాగ్రత్తలు పాటిస్తూనే! కానీ ఇలాంటి చిన్న చిన్న గుంపులే కరోనా వైరస్‌ విస్తరణకు కారణమయ్యే అవకాశం ఉందంటోంది వ్యాధి నివారణ, నియంత్రణ మండలి (సీడీసీ). పైగా చలికాలం వైరస్‌కు అనువైన కాలం కాబట్టి ఈ వాతావరణ పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. తద్వారా అటు వేడుకలను ఎంజాయ్‌ చేస్తూనే, ఇటు కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరైతే ఆలస్యమెందుకు.. కరోనా వేళ వేడుకలకు/పార్టీలకు హాజరవ్వాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
what-is-halloween-and-why-do-we-celebrate-it

ఆత్మల కోసం ప్రారంభమై ఆటవిడుపైంది..!

హాలోవీన్.. ఈ పండగ పేరు చెప్పగానే భయంగొలిపే వివిధ దుస్తుల్లో సిద్ధమయ్యే వ్యక్తులు.. ఒకరినొకరు భయపెట్టుకోవడం.. భయం కలిగించే రీతిలో వివిధ రకాల ఆహారపదార్థాలు తయారుచేసుకొని ఆస్వాదించడం గుర్తొస్తాయి. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పండగ కొన్నేళ్ల క్రితమే మన దేశంలోనూ ప్రవేశించింది. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లోనూ యువత హాలోవీన్ థీమ్ పార్టీల్లో పాల్గొంటూ.. స్నేహితులతో ఆనందంగా ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. అయితే ఈసారి కరోనా ప్రతికూల పరిస్థితులున్న నేపథ్యంలో ఎవరింట్లో వారే హాలోవీన్‌ పండగ జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా చేయడమే మంచిది కూడా! మరి, ఈ పండగ ఒకప్పుడు ఆత్మలను భయపెట్టడానికి ప్రారంభించారంటే నమ్ముతారా?మనుషులేంటి? ఆత్మలను భయపెట్టడమేంటి అనుకుంటున్నారా? అసలు మనుషులకు ఆత్మలను భయపెట్టాల్సిన అవసరం ఏంటి? మన దేశంలో ఇప్పుడిప్పుడే పాపులర్‌గా మారుతున్న 'హాలోవీన్ డే' వెనుక ఉన్న నేపథ్యాన్ని తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-29-10-2020
women icon@teamvasundhara
three-girls-of-kerala-pancharatnam-tie-knot-on-same-day

ఆ పంచరత్నాల్లో ముగ్గురూ ఒకే రోజు పెళ్లి పీటలెక్కారు!

ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటేనే గుండెల మీద కుంపటిలా భావించే రోజులవి. అలాంటిది ఆమె ఒకే కాన్సులో నలుగురు ఆడపిల్లలను, ఒక అబ్బాయిని ప్రసవించింది. కడవరకు కష్టసుఖాలు పంచుకోవాల్సిన భర్త మధ్యలోనే కన్నుమూయడంతో ఇంటి యజమానురాలిగా తనే కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకుంది. కష్టపడి పిల్లలందరినీ గొప్ప చదువులు చదివించి ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. ఇలా తల్లిగా అన్ని బాధ్యతలు నెరవేరుస్తోన్న ఆమె తాజాగా తన ముగ్గురు అమ్మాయిలకు ఒకే రోజు ఒకే వేదికపై వివాహం జరిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొవిడ్‌ నిబంధనలను పాటించి వేడుకగా జరిగిన ఈ ముగ్గురు అమ్మాయిల పెళ్లి ముచ్చట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Know More

women icon@teamvasundhara
famous-indian-celebrities-who-have-adopted-children-in-telugu

కంటేనే అమ్మ కాదని నిరూపిస్తున్నారు!

ప్రతి స్త్రీ తన జీవితంలో మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. అయితే మారుతున్న జీవన శైలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం వంటి కారణాలతో కొంతమంది మహిళలు అమ్మతనానికి దూరమవుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారు అనాథ చిన్నారులను దత్తత తీసుకుని అమ్మగా ప్రమోషన్‌ పొందుతున్నారు. వీరితో పాటు అప్పటికే పిల్లలు ఉన్నా లేకపోయినా, వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా కొంతమంది మహిళలు సామాజిక దృక్పథంతో అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ వారికి బంగారు భవిష్యత్‌ అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటి మందిరా బేడీ ఓ చిన్నారిని దత్తత తీసుకుంది. ఈ నేపథ్యంలో దత్తత ద్వారా అమ్మతనాన్ని పొందిన కొందరు సెలబ్రిటీలెవరో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-26-10-2020
women icon@teamvasundhara
how-to-be-happy-in-this-society-as-a-women

జగన్మాత స్ఫూర్తితో ప్రగతి పథంలో సాగుదాం..!

దసరా నవరాత్రుల్లో భాగంగా వివిధ అవతారాల్లో దర్శనమిచ్చే ఆ దుర్గాదేవి మహిళలందరికీ ఎప్పటికీ ఆదర్శప్రాయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు..! అయితే సమాజంలోని మహిళలంతా ఆ అమ్మలాగే దృఢ నిశ్చయంతో, సమర్థతతో, కార్యదక్షతతో విజయపథంలో దూసుకెళ్లాలంటే మనలో ఉన్న కొన్ని అంశాలను మరింత బలపరుచుకోవాలి. అదే సమయంలో మన బలహీనతలను సైతం దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆ అమ్మవారిని ఆదర్శంగా తీసుకుని సమర్థమైన మహిళగా మనల్ని మనం తీర్చిదిద్దుకునే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి మహిళా బలపరుచుకోవాల్సిన కొన్ని అంశాలేంటో ఈ దసరా సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
indian-cities-named-after-goddess-durga-in-telugu

ఈ నగరాలన్నీ అమ్మవారి పేర్లతోనే వెలిశాయి!

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకొనే పండగల్లో 'దసరా' ఒకటి. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఆ దుర్గమ్మను మనసారా సేవించడం, ఆ అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతాలను సందర్శించడం పరిపాటే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. అయితే ఇలా విభిన్న పేర్లతో, వేర్వేరు రూపాల్లో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి పేరు మీద వెలసిన నగరాల గురించి మీరెప్పుడైనా విన్నారా? కనీసం ఈ మహానగరానికి ఈ పేరు ఎలా వచ్చిందని ఆలోచించారా? లేదా? అయితే అమ్మవారి పేర్ల మీద వెలసిన అలాంటి కొన్ని నగరాలు, వాటి ప్రాశస్త్యం గురించి ఈ 'దసరా' సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
bathukamma-songs-in-telugu

women icon@teamvasundhara
today-horoscope-details-22-10-2020
women icon@teamvasundhara
well-studied-girl-begging-in-the-streets-story-in-telugu

డబుల్ పీజీ చేసింది.. ఎన్నికల్లో నిలబడింది.. యాచకురాలిగా మారింది!

ఉన్నత చదువులు చదివిన ఆమె ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతుంది. గతంలో యూనివర్సిటీలో విద్యార్థి నాయకురాలిగా తోటి విద్యార్థులకు అండగా నిలబడింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. ఈ క్రమంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన ఈ చదువుల తల్లి ప్రస్తుతం వీధుల్లో భిక్షమెత్తుకుంటోంది. కుమారుడితో కలిసి పార్కులు, రైల్వేస్టేషన్‌, బస్టాండులలో తిరుగుతూ పొట్ట కూటి కోసం పడరాని పాట్లు పడుతోంది. ఇంతకీ ఎవరామె? ఎందుకిలా యాచకురాలిగా మారిపోయింది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

Know More

women icon@teamvasundhara
significance-and-importance-of-batukamma-for-9-day-in-telugu

అట్ల బతుకమ్మ.. అలిగిన బతుకమ్మ.. !

రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు, అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి పాడే ఉయ్యాల పాటలు, వివిధ రకాల పదార్థాలతో రుచికరంగా తయారు చేసే నైవేద్యాలు.. వెరసి తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేవే బతుకమ్మ పండుగ సంబరాలు. మహాలయ అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మహిళలెంతగానో ముచ్చటపడి ఆడే బతుకమ్మను వారు రోజుకో పేరుతో పిలుస్తూ, తీరొక్క నైవేద్యంతో కొలుస్తారు. మరి ఆ పేర్లేంటో, ఆయా రోజుల్లో అమ్మకు నైవేద్యంగా సమర్పించే పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-21-10-2020
women icon@teamvasundhara
with-family-separated-by-border-couple-exchange-wedding-vows-with-a-unique-twist

నదీ జలాల సాక్షిగా వంతెన పైనే ఒక్కటయ్యారు!

పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఆనందంగా ఏడడుగులు నడవాలనుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించిన ప్రణాళికలన్నీ మారిపోయాయి. వధువు ఒక చోట, వరుడు మరో చోట ఉంటే ఫోన్‌కే తాళి కట్టి పెళ్లైందనిపించే రోజులొచ్చాయి. అంతేనా వధూవరులిద్దరూ ఒకే చోట ఉండి, కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాల్లో ఉంటే వీడియో కాలింగ్‌ యాప్స్‌ ద్వారా అందరినీ ఒక్కచోట చేర్చి మరీ అక్షింతలు వేయించుకుంటున్నాయి కొన్ని జంటలు. ఈ క్రమంలో అమెరికా-కెనడాలకు చెందిన ఓ జోడీ కూడా ఇలాగే వినూత్న పద్ధతిలో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది.

Know More

women icon@teamvasundhara
significance-of-bathukamma-flowers-in-telugu