scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నిబంధనలు పాటిస్తూనే అలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాం !'

'పెళ్లంటే.. వధూవరులు, ఇరు కుటుంబ సభ్యులు, అతిథులు, అక్షతలు.. ఇలా జీవితంలో ఒకేసారి చేసుకునే ఈ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరూ. అయితే ఈ కరోనా కాలంలో పెళ్లి చేసుకునే వారికి అంత అదృష్టం కరువైందని చెప్పుకోవాలి. లాక్‌డౌన్‌, సామాజిక దూరం పేరుతో చాలా పెళ్లిళ్లు తూతూ మంత్రంగానే జరిగిపోతున్నాయి. వధువు ఒక చోట, వరుడు మరో చోట ఉంటే ఫోన్‌కే తాళికట్టి పెళ్లైందనిపించే రోజులొచ్చాయి. అంతేనా.. వధూవరులిద్దరూ ఒకే చోట ఉండి, కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాల్లో ఉంటే వీడియో కాలింగ్‌ యాప్స్‌ ద్వారా అందరినీ ఒక్కచోట చేర్చి మరీ అక్షతలు వేయించుకుంటున్నాయి కొత్త జంటలు. ఇదిగో.. తమ పెళ్లీ ఇలాగే జరిగిందంటోంది ఓ నవ వధువు. ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉన్న తమకు ముందుగానే పెళ్లి ముహూర్తం నిశ్చయమైనప్పటికీ.. కరోనా కారణంగా స్వస్థలాలకు వెళ్లలేక ఉన్నచోటే పెళ్లి చేసుకున్నామంటూ తమ పెళ్లి ముచ్చట్లను మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చేసింది.'

Know More

Movie Masala

 
category logo

కరోనా పోరులో సెలబ్రిటీల దాతృత్వం!

Celebrities who give donations to fight corona virus

కరోనా వైరస్‌ విలయ తాండవం నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచమంతా లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ ఇచ్చాయి. ఇక ఇంటి నుంచి పని చేయించుకునే సదుపాయం లేని వారికి సెలవులిచ్చి.. పూర్తి వేతనం అందించేందుకు నిర్ణయించాయి. అయితే మన సంగతి సరే.. కానీ రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు, రోజువారీ కూలీల మాటేమిటి? ఈ కష్ట కాలంలో వారిని ఎవరు ఆదుకుంటారు? ఇదిగో తీసుకోండి అంటూ వారికి ఎవరు డబ్బులిస్తారు? ఇదిగో సరిగ్గా ఇదే ఆలోచన చేసింది భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. రోజువారీ కూలీలు ఆకలితో అలమటించకూడదనే సదుద్దేశంతో నిధుల సమీకరణ కోసం సఫా ఆర్గనైజేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపింది. రోజువారీ కూలీలకు ఆహారం, నిత్యావసరాలు అందించే క్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలంటూ ట్విట్టర్‌ వేదికగా కోరుతోందీ టెన్నిస్‌ బ్యూటీ. ఇదిలా ఉంటే మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు, తారలు కరోనా బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అలాంటి మనసున్న మారాజులు, మారాణుల గురించి తెలుసుకుందాం రండి..

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar) on

కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ఈ తరుణంలో ప్రపంచమంతా షట్‌డౌన్‌ అయింది. ఈ నేపథ్యంలో కొంతమంది పనిచేసినా, చేయకపోయినా వారి చేతికి నెలనెలా జీతాలు అందుతాయి. మరి, రోజూ కూలీ చేస్తే గానీ నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లని కూలీల సంగతేంటి? ఈ పరిస్థితుల్లో అలాంటి వారికి ఎవరు డబ్బులిస్తారు. అందుకే ఇలాంటి వారికి తన వంతుగా సహాయం చేయడానికి ముందుకొచ్చింది భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. ఈ క్రమంలోనే నగరానికి చెందిన సఫా ఆర్గనైజేషన్‌తో చేతులు కలిపి నిధుల సమీకరణకు నడుం బిగించిందీ రాకెట్‌ మామ్‌.

మీరూ ఓ చెయ్యేయండి!

రోజువారీ కూలీల కోసం నిధుల సమీకరణకు సఫాతో చేతులు కలిపిన సానియా.. ఈ మంచి పనిలో ఎవరికి తోచిన సహాయం వారు చేయాలంటూ  కోరుతోంది. ఈ క్రమంలో తాను స్పందిస్తూ.. ‘ప్రపంచమంతా అలుముకున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మనం ఇంట్లో కూర్చున్నా పెద్దగా  నష్టమేమీ ఉండకపోవచ్చు. కానీ బయట ఎన్నో వేల మందికి ఈ మాత్రం సుఖం, అదృష్టం కూడా కరువైంది. అలాంటి వారిని ఆదుకోవాల్సిన  బాధ్యత మనదే. ఈ క్రమంలో మనకు తోచిన సహాయం చేద్దాం.. మనమంతా సఫాతో కలిసి అలాంటి ఎన్నో కుటుంబాలకు అండగా నిలుద్దాం.. మరి నేను విరాళమందించాను.. మీరు కూడా ఇందులో పాలుపంచుకోవాలంటే ఈ లింక్‌ క్లిక్‌ చేసి మీకు తోచిన మొత్తాన్ని జమ చేయండి..’ అంటూ ట్విట్టర్‌ పోస్ట్‌ ద్వారా తెలియజేసిందీ టెన్నిస్‌ మామ్‌. ఇలా పోగైన డబ్బుతో రోజువారీ కూలీలకు ఆహారంతో పాటు  ప్రాథమిక అవసరాలను సమకూర్చనున్నారు.

కరోనాపై పోరులో మా వంతుగా..!

కరోనా మహమ్మారిపై పోరాటం చేయడంలో భాగంగా ప్రముఖులు, తారలు భూరి విరాళాలిస్తున్నారు.

* మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల భార్య అనుపమా వేణుగోపాల్‌ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్ల భారీ విరాళం అందించారు. ఈ డబ్బు లాక్‌డౌన్‌ పీరియడ్‌లో నిరుపేదల సహాయానికి ఉపయోగపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

* భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి అందించింది. ఇదే విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలిపింది సింధు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సహాయనిధికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాను..’ అంటూ ట్వీట్‌ చేసిందీ తెలుగు తేజం.

* ప్రముఖ కథానాయకుడు చిరంజీవి సినీ కార్మికుల సంక్షేమం కోసం రూ.కోటి ఇవ్వనున్నట్లు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ‘కరోనా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్ని అధిగమించాలంటే లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గం. ఇది దినసరి కూలీలు, అల్ప ఆదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫిల్మ్‌ వర్కర్స్‌ సంక్షేమ నిధికి రూ. కోటి విరాళం  ఇస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు చిరు.

View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

* కరోనాపై పోరులో భాగంగా సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తెలుగు  రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ. 50 లక్షల చొప్పున విరాళం అందించనున్నట్లు ప్రకటించి తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. 50 లక్షల చొప్పున విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఈ పోరాటంలో నేనూ భాగస్వామిని కావాలనుకుంటున్నా. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. కోటి విరాళం ఇస్తున్నా. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా. ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. నిబంధనలు పాటించి లాక్‌డౌన్‌కు సహకరించండి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒకరికొకరు అండగా నిలబడుతూ మనల్ని మనం సంరక్షించుకోవాలి. మానవత్వంతో ఈ యుద్ధంలో గెలుద్దాం. అప్పటివరకూ ఇళ్లలో భద్రంగా ఉండండి..’ అంటూ చెప్పుకొచ్చాడీ సూపర్‌ స్టార్‌.

* జనసేన అధినేత, టాలీవుడ్‌ హీరో పవన్‌ కల్యాణ్‌ రెండు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షల చొప్పున, ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. కోటి విరాళంగా అందజేయనున్నట్లు ట్విట్టర్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. కరోనా నివారణకు ప్రధాని మోదీ తీసుకుంటోన్న చర్యలు భేష్‌ అంటూ కొనియాడారు.

* బాబాయి ట్వీట్‌ చూసి స్ఫూర్తి పొందిన మగధీరుడు రామ్‌చరణ్‌ కూడా తనవంతుగా భారీ విరాళం అందజేశాడు. ‘పవన్‌ బాబాయి ట్వీట్‌ చూసి చాలా స్ఫూర్తి పొందా. కరోనాను పారదోలడానికి కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహాయనిధికి నా వంతుగా రూ. 70 లక్షల విరాళం అందిస్తున్నా. అందరూ ఇంట్లోనే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి..’ అంటూ ట్వీట్‌ చేశాడు చెర్రీ.

* హ్యాండ్‌సమ్‌ హీరో ప్రభాస్‌ కూడా కరోనాపై పోరాటంలో తన వంతుగా రూ. కోటి విరాళం అందించాడు. అలాగే మరికొందరు సినీ ప్రముఖులు నితిన్‌- రూ. 20 లక్షలు, త్రివిక్రమ్‌ - 20 లక్షలు, అనిల్‌ రావిపూడి - రూ. 10 లక్షలు, కొరటాల శివ - రూ. 10 లక్షలు, సాయి ధరమ్‌ తేజ్‌ - రూ. 10 లక్షలు ప్రకటించారు.. ఇక అల్లరి నరేశ్‌ తన సినిమా కోసం పనిచేస్తున్న 50 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున అందించాడు.

* డ్యాషింగ్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా ప్రధాని సహాయనిధికి భారీ విరాళం అందించాడు. అంతేకాదు.. అందరూ ఎవరికి తోచినంత సాయం వారు చేయాలంటూ పిలుపునిచ్చాడు. ‘ఇంట్లోనే ఉంటూ అటు మిమ్మల్ని మీరు, ఇటు మీ కుటుంబాన్ని సంరక్షించుకోండి. కరోనాపై యుద్ధం చేయడంలో భాగంగా నా వంతుగా ప్రధాని సహాయనిధికి విరాళం అందించాను. మీరూ మీకు తోచిన మొత్తాన్ని అందిస్తారని ఆశిస్తున్నా..’ అంటూ ట్వీట్‌ చేశాడు గబ్బర్‌.

* ప్రముఖ కమెడియన్‌, టీవీ హోస్ట్‌ కపిల్‌ శర్మ రూ. 50 లక్షల భారీ విరాళాన్ని అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ‘మనమంతా ఒక్కటిగా నిలబడి అవసరార్థులను ఆదుకోవాల్సిన సమయమిది. ఈ క్రమంలోనే నా వంతుగా ప్రధాని సహాయ నిధికి రూ. 50 లక్షలు అందిస్తున్నా.. మీరంతా ఇంట్లో ఉంటూ, ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారని ఆశిస్తున్నా..’ అంటూ ట్వీట్‌ చేశాడు కపిల్‌.

వీరు కూడా..!

View this post on Instagram

A post shared by badgalriri (@badgalriri) on

* ప్రముఖ పాప్‌ గాయని రాబిన్‌ రిహాన్నా ఎనిమిదేళ్ల క్రితం తన అమ్మమ్మ, తాతయ్యల జ్ఞాపకార్థం ‘ది క్లారా లయోనెల్‌ ఫౌండేషన్‌’ను స్థాపించి నిరుపేదలకు సేవలందిస్తోంది. ప్రస్తుతం కరోనా బాధితులకు, వారికి వైద్య సేవలందిస్తోన్న సిబ్బందికి రూ. 38 కోట్ల భారీ విరాళాన్ని అందించి తన మంచి మనసును చాటుకుంది. ఫుడ్‌బ్యాంకులు, వ్యాధి నిర్ధారణ కిట్‌ల తయారీకి, ఆరోగ్యశాఖ కార్యకర్తల శిక్షణకు రిహాన్నా సాయం ఉపయోగపడనుంది.

View this post on Instagram

A post shared by Bethenny Frankel (@bethennyfrankel) on

* అమెరికన్‌ టీవీ తార బెతెన్నీ ఫ్రాంకెల్‌ మాస్కుల కొరత ఎక్కువగా ఉన్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు ఎక్కువగా రావడం గమనించింది. అందుకే ఈ కొరతను తీర్చడానికి ఒక మిలియన్‌ ఫేస్‌ మాస్కులను అందించనున్నట్లు ప్రకటించిందామె.

View this post on Instagram

A post shared by Chiara Ferragni ✨ (@chiaraferragni) on

* ఇటాలియన్‌ ఇన్ఫ్లుయెన్సర్‌ చియారా ఫెరాగ్నీ రూ. 82.29 లక్షల విరాళాన్ని గోఫండ్‌మి క్యాంపెయిన్‌కు అందించారు. ఈ మొత్తాన్ని మిలాన్‌లోని శాన్‌ రఫాలే ఆసుపత్రి ఐసీయూలో అదనపు పడకలు ఏర్పాటుచేయడానికి ఉపయోగిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Lady Gaga (@ladygaga) on

* అమెరికన్‌ సింగర్‌ లేడీ గాగా యూఎస్‌, న్యూయార్క్ లలోని ఫుడ్‌ బ్యాంకులకు తన వంతు విరాళాన్ని అందించింది. తన బ్యూటీ బ్రాండ్‌ Haus Laboratories తరఫున ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపిందీ బ్యూటీ. ‘కొవిడ్‌-19 విజృంభిస్తోన్న ఈ తరుణంలోమన చుట్టూ ఉన్న వాళ్ల గురించి కూడా ఆలోచించాలి. నేను చేస్తోన్న ఈ సహాయం షట్‌డౌన్‌ అయిన పాఠశాల విద్యార్థులకు, ఇతర అన్నార్థులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా..’ అంటూ ట్వీట్‌ చేసిందీ సింగర్‌.

View this post on Instagram

A post shared by Donatella Versace (@donatella_versace) on

* ప్రముఖ ఇటాలియన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ డొనాటెల్లా వెర్సేస్‌, తన కూతురు-ఇటాలియన్‌ సామాజిక కార్యర్త అలెగ్రా వెర్సేస్‌తో కలిసి మిలాన్‌లోని శాన్‌ రఫేల్‌ ఆసుపత్రి ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగానికి రెండు లక్షల యూరోలు (రూ. 1.62 కోట్లకు పైమాటే)ను విరాళంగా అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.





women icon@teamvasundhara
dutee-chand-shares-about-her-relationship-and-sister-behavior

నా వరకు అది ప్రేమే.. ఆ అమ్మాయితోనే ఉంటా!

స్వలింగ వివాహాలు.. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఆయా ప్రభుత్వాలు ఈ వివాహ వ్యవస్థను చట్టబద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా దేశాల్లోని కొందరు సెలబ్రిటీలు సేమ్ సెక్స్ మ్యారేజెస్ చేసుకోవడం కూడా మనం వార్తల్లో చదివాం. అయితే మన దేశంలో మాత్రం స్వలింగ వివాహాలు ఇంకా చట్టబద్ధం కానప్పటికీ.. స్వలింగ సంపర్కం నేరం కాదని 2018లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గతేడాది భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ తాను ఓ అమ్మాయితో ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నానని, తననే పెళ్లి చేసుకోబోతున్నానని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ద్యుతి తన బంధం గురించి ధైర్యంగా వెల్లడించడంతో ఆమె తల్లిదండ్రులతో పాటు పలువురు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఈ విషయంలో తన సోదరి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన ఆమె తాజాగా ‘ఈటీవీ భారత్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-01-06-2020
women icon@teamvasundhara
anchor-anasuya-dares-to-share-her-period-story

నా తొలి నెలసరి సమయంలో ఏం జరిగిందంటే!

నెలసరి... మహిళలకు సంబంధించిన ఈ సహజ ప్రక్రియ సమయంలో ఒక్కొక్కరికీ ఒక్కో అనుభవం ఎదురవుతుంది. అయితే వీటి గురించి మాట్లాడుకోవాలంటే చాలామంది ఇప్పటికీ రహస్యంగా సైగలు చేసుకుంటారు తప్ప నోరు విప్పరు. ఇలా బహిరంగంగా చెప్పడం వల్ల ఎదుటి వారు ఏమనుకుంటారోనన్న సందేహానికి తోడు సమాజం దీన్ని ఏ రకంగా తీసుకుంటుందోనన్న భయం నెలసరి గురించి నలుగురిలో మాట్లాడడానికి వెనకంజ వేసేలా చేస్తుంది. అయితే మహిళల్లో ఇది కామన్‌గా జరిగే ప్రక్రియ. అలాంటప్పుడు దీని గురించి రహస్యంగా మాట్లాడుకోవడమెందుకు అని ప్రశ్నిస్తోంది టాలీవుడ్‌ యాంకర్‌ అనసూయ. తాజాగా ‘మెన్‌స్ర్టువల్‌ ఎడ్యుకేషన్‌’పై ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన క్యాంపెయిన్‌లో పాల్గొన్న ఆమె తన తొలి నెలసరి అనుభవం గురించి ధైర్యంగా షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
indian-company-paree-announces-period-leave-on-world-menstrual-hygiene-day

అందుకే ‘పిరియడ్‌ లీవ్‌’ కూడా ఇస్తున్నాయి !

కడుపునొప్పి, నడుం నొప్పి, నీరసం, చిరాకు, మూడ్‌ స్వింగ్స్‌, అధిక రక్తస్రావం.. నెలసరి రోజుల్లో మహిళల పరిస్థితి ఇది. సాధారణంగా ఇలాంటి సమస్యలున్నప్పుడు ఏ పనీ చేయాలనిపించదు. హాయిగా విశ్రాంతి తీసుకుంటే బాగుండనిపిస్తుంది. కానీ వృత్తి ఉద్యోగాల్లో కొనసాగే మహిళలకు ఈ రోజుల్లో కూడా విధులకు హాజరవక తప్పదు. దాంతో తప్పని పరిస్థితుల్లో నొప్పుల్ని భరిస్తూ మరీ ఉద్యోగానికి వెళ్తుంటారు మహిళలు. అయితే తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులకు మాత్రం ఇకపై ఇలాంటి అసౌకర్యం కలిగించొద్దని నిర్ణయించుకుంది ఓ ఇండియన్‌ కంపెనీ. ఈ క్రమంలోనే నెలసరి ప్రారంభమైన మొదటిరోజున వేతనంతో కూడిన సెలవు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. మే 28న ‘అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
psychiatrist-advice-on-how-to-identify-and-avoid-fraud-people

మాటల మాయలో.. వలపు వలలో.. చిక్కుకోకుండా !

‘పెళ్లి చేసుకుంటాను... నీ కూతుర్ని నా కూతురిలా చూసుకుంటా’నంటే అమాయకంగా నమ్మింది. కానీ ఆ మోసకారి తన కూతురుపైనే కన్నేసాడని తెలిసినా ఏం చేయలేక ప్రాణాలు కోల్పోయింది. - గొర్రెకుంటబావి సంఘటన ఆమె సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. అతనో ఎన్నారై అని నమ్మింది. ఇండియా వచ్చి పెళ్లి చేసుకుంటానంటే అతని ఖాతాలో లక్షలు కుమ్మరించింది.. - ఓ బాధితురాలు ఇలాంటి వాళ్లు వీధి చివరన ఒకడుంటాడు.. ఆఫీస్‌లో ఇంకొకడు కన్నేస్తాడు. ఆన్‌లైన్‌లో మరొకడు తగులుతాడు. ఈ మాయగాళ్లను కనిపెట్టడం తేలికే! వారి నుంచి తప్పించుకోవడం ఇంకా తేలిక! అంతా మీ చేతుల్లోనే, చేతల్లోనే ఉంది.. అదెలాగంటే...

Know More

women icon@teamvasundhara
first-period-traditions-in-different-states-on-this-menstrual-hygiene-day

అక్కడ అమ్మాయి పెద్దమనిషైతే అరటిచెట్టుతో పెళ్లి చేస్తారట!

ఓవైపు బిడియం, మరోవైపు సిగ్గు, ఇంకోవైపు ఆనందం.. ఇలా ఆడపిల్లలు బాల్యాన్ని వదిలి యవ్వనంలోకి అడుగుపెట్టే ఆ క్షణంలో వారి మనసులో కలిగే భావాలెన్నో! మరి ఈ దశలో వారి మనసులో కలిగే భయాల్ని, అపోహల్ని పోగొట్టి, వారికి ఎన్నో మధురానుభూతుల్ని అందించడానికి తొలి నెలసరి వేడుకను పెద్ద పండగలా జరుపుకోవడం మన దగ్గర ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.. వివిధ పిండి పదార్థాలు, పండ్లు-ఫలహారాలతో వారి ఒడి నింపి వారిలో ఆరోగ్య స్పృహ పెంచుతారు కూడా! కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అమ్మాయిలకు నెలసరి ప్రారంభమైన ఆ ఘట్టాన్ని విభిన్న సంప్రదాయాలు-ఆచారాలతో పెద్ద వేడుకలా నిర్వహిస్తుంటారు. అయితే ఈ విషయంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వివిధ మూఢనమ్మకాలు సంప్రదాయాలు రాజ్యమేలుతుండడం విచారకరం. 'అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినం' సందర్భంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 'ఫస్ట్ పిరియడ్ ట్రెడిషన్స్' ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
about-menstrual-hygiene-day-facts

నెలసరి సమయంలో పరిశుభ్రతే ధ్యేయంగా..!

ప్రతినెలా వచ్చి పలకరించే రుతుక్రమం కారణంగా ఇండియాలో 20 శాతం మంది అమ్మాయిలు స్కూలుకు గైర్హాజరవుతున్నారట! అంతేకాదు.. బాలికలు స్కూలు మానేయడానికి ఇది రెండో అతిపెద్ద కారణమట. అలాగే ఈ సమయంలో పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అమ్మాయిలు కూడా చాలామందే ఉంటారు. అయితే ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని, ఆడపిల్లలు నెలసరి సమయంలో పరిశుభ్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలని.. తెలియజేసే ఉద్దేశంతోనే ‘నెలసరి పరిశుభ్రతా దినోత్సవం' (మెన్‌స్ట్రువల్ హైజీన్ డే) ప్రారంభమైంది. ఏటా మే 28న జరుపుకొనే ఈ రోజు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకొంటున్నారా? అయితే రండి..

Know More

women icon@teamvasundhara
corona-virus-a-child-tries-to-wake-up-dead-mother-at-railway-station

చనిపోయిందని తెలియక ‘అమ్మా.. లే అమ్మా’ అంటూ..!

రెక్కాడితే కానీ డొక్కాడని వలస కార్మికుల జీవితాలను మరింత దుర్భరంగా మార్చింది కరోనా. లాక్‌డౌన్‌ కారణంగా పొట్ట కూటి కోసం పట్నం వచ్చిన ఈ బడుగు జీవుల బతుకు ప్రశ్నార్థకమైంది. చేతిలో చిల్లిగవ్వ లేక, ఉన్న చోట ఉపాధి దొరక్క, ఆదరించే దిక్కులేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. చివరకు కనీసం సొంతూరులోనైనా కడుపు నింపుకొందామన్న కొండంత ఆశతో వేలాది కిలోమీటర్ల మేర కాలినడకన, సైకిళ్ల పైన బయల్దేరి వెళ్తున్నారు. ఇంకొందరైతే మార్గమధ్యంలో దొరికిన ట్రక్కు, లారీ, ఆటోలనో పట్టుకొని సొంతగూటి బాట పడుతున్నారు. అయితే దురదృష్టవశాత్తూ చాలామంది ఇంటికి చేరేలోపే వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈక్రమంలో వలస కార్మికుల దీన పరిస్థితికి అద్దం పట్టే మరో విషాదకర ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.

Know More

women icon@teamvasundhara
assamese-bride-adorns-silk-handloom-mask-for-her-wedding-is-viral-on-social-media

మ్యాచింగ్‌ మాస్కుతో ఈ పెళ్లికూతురు అదుర్స్‌ !

పెళ్లంటే జీవితంలో ఒకేసారి అంగరంగ వైభవంగా చేసుకునే వేడుక. నిశ్చితార్థం మొదలు రిసెప్షన్‌ పూర్తయ్యే వరకూ ఫొటోషూట్స్‌, వీడియోలు అంటూ వధూవరులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇలా మనువాడబోయే ప్రతి జంటా తమ పెళ్లిని పది కాలాల పాటు నిలిచిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలని కలలు కంటుంది. అయితే ప్రస్తుతం కరోనా ఎందరో జంటల పెళ్లి కలలను ఛిద్రం చేస్తోంది. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి కాస్తా ఏదో తూతూ మంత్రంగా జరిపించేస్తున్నారు పెద్దలు. దీనికి తోడు పెళ్లి ముస్తాబులో నూతన వధూవరులు ఒకరినొకరు కళ్లారా చూసుకోకుండా మాస్కులు అడ్డుపడుతున్నాయి. అయితే మాస్కులు ధరించామన్న భావనే కలగకుండా దాన్నీ ఓ పెళ్లి కాస్ట్యూమ్‌గా చేసుకుంటే బాగుంటుందనుకున్నట్లుంది ఈ అస్సామీ నవ వధువు. పెళ్లి దుస్తులకు మ్యాచయ్యే విధంగా మాస్క్‌ను డిజైన్‌ చేయించుకొని కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. ఇక సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ వధువు ఫొటోలు చూసి నెటిజన్లు సైతం వావ్‌ అంటూ ఈ కొత్త పెళ్లి కూతురి ఐడియాకు ఫిదా అయిపోతున్నారు.

Know More

women icon@teamvasundhara
up-girl-walks-80km-to-reach-groom-house-ties-nuptial-knot

పెళ్లి కోసం ఏకంగా 80 కిలోమీటర్లు నడిచింది!

పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఆనందంగా ఏడడుగులు నడవాలనుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించిన ప్రణాళికలన్నీ మారిపోయాయి. కొందరేమో తమ శుభకార్యాలను వాయిదా వేసుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదని ఎలాగోలా లాక్‌డౌన్‌ కష్టాలను అధిగమించి పెళ్లిపీటలెక్కుతున్నారు. ఈక్రమంలో మరోసారి తమ పెళ్లి వాయిదా పడకూడదని ఓ వధువు పెద్ద సాహసమే చేసింది. సుమారు 80 కిలోమీటర్ల దూరంలోనున్న వరుడి ఇంటికి నడిచి వెళ్లి మరీ మూడుముళ్లు వేయించుకుంది.

Know More

women icon@teamvasundhara
manchu-lakshmi-live-with-rana

అంతా ఆరు నిమిషాల్లో అయిపోయిందమ్మా..!

రానా-మిహీకా బజాజ్‌ ...త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఈ ప్రేమ జంట గురించే ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలో కొద్ది రోజుల క్రితమే తమ ప్రేమ విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారీ లవ్‌ బర్డ్స్‌. తాజాగా పెళ్లికి ముందు సంప్రదాయంగా నిర్వహించే రోకా ఫంక్షన్‌ను కూడా ఘనంగా జరుపుకొన్న ఈ ప్రేమ పక్షులకు ఇక పెళ్లే తరువాయి అని చెప్పవచ్చు. ఈనేపథ్యంలో మంచు లక్ష్మి నిర్వహిస్తోన్న ‘లాక్డ్‌ అప్‌ విత్‌ లక్ష్మి’ లైవ్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాడు రానా. వర్చువల్‌గా సాగే ఈ కార్యక్రమంలో తన ప్రేమకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నాడీ భళ్లాల దేవుడు. అంతేకాదు మంచు లక్ష్మి అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానమిచ్చాడు. మరి ఎంతో ఆసక్తికరంగా సాగిన వీరి సంభాషణపై మీరూ ఓ లుక్కేయండి!

Know More

women icon@teamvasundhara
corona-virus-woman-dresses-up-in-hippopotamus-costume-to-hug-elderly-mother-in-us-old-age-home

అమ్మను ఆప్యాయంగా హత్తుకునేందుకు ఈ మహిళ ఏం చేసిందంటే!

కరోనా... అటు శారీరకంగా, ఇటు మానసికంగా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోన్న వైరస్‌. మనుషుల మధ్య సామాజిక దూరాన్ని తీసుకొచ్చిన ఈ మహమ్మారి కారణంగా కనీసం కుటుంబ సభ్యులతో కూడా దగ్గరగా ఉండలేని దీన పరిస్థితి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తుందో తెలియని ఈ వైరస్‌ భయంతో సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు దూరంగా ఉంటున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో దూరంగా ఉన్న తన తల్లిని కలుసుకునేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేసింది అమెరికాకు చెందిన ఓ మహిళ. ఇందులో భాగంగా హిప్పోపొటామస్‌ (నీటి గుర్రం) కాస్ట్యూమ్‌ ధరించిన ఆమె సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ తన తల్లిని ఆప్యాయంగా హత్తుకుంది.

Know More

women icon@teamvasundhara
karthik-dial-seytha-yenn-brings-back-ye-maya-chesave-memories

‘ఏ మాయ చేసావే’ మళ్లీ వచ్చింది!

‘ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుండగా...నేను జెస్సీనే ఎందుకు ప్రేమించాను?’...ఈ డైలాగ్‌ వినగానే మనకు వెంటనే గుర్తొచ్చే సినిమా ‘ఏమాయ చేసావే’. సమంత, నాగచైతన్య హీరో హీరోయిన్లుగా పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిజంగానే ‘మాయ’ చేసింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలోని కార్తీక్, జెస్సీల క్యారక్టర్లు ఎంత మ్యాజిక్‌ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంలో ‘విన్నైతండి వరువాయ’ పేరుతో విడుదలైన ఈ చిత్రంలో సమంత, నాగచైతన్య నటించిన పాత్రలను త్రిష, శింబు పోషించిన సంగతి తెలిసిందే. సినీ ప్రేక్షకులను, ప్రత్యేకించి యువతను ఎంతగానో ఆకట్టుకున్న ఈ అపురూప దృశ్య కావ్యం షార్ట్‌ ఫిల్మ్‌ రూపంలో మళ్లీ మన ముందుకు వచ్చింది. అప్పటి ‘ఏ మాయ చేసావే’ సినిమాతో పూర్తిస్థాయి ప్రేమకథను అందించిన బృందమే ఈ మధురమైన చిన్న ప్రేమకథను రూపొందించడం విశేషం.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-21-05-2020
women icon@teamvasundhara
heartbroken-woman-sends-cheating-ex-boyfriend-a-tonne-of-onions

ఉల్లిపాయలతో మాజీ ప్రేమికుడికి అలా బుద్ధి చెప్పింది!

‘ఏం చేస్తాం? అమ్మాయిలం! జెన్యూన్‌గా లవ్‌ చేయడం తప్ప మాకేం తెలుసు’ ...‘నేను శైలజ’ సినిమాలో లవర్‌ బ్రేకప్‌ చెప్పాడని ధన్యా బాలక్రిష్ణన్‌ అమాయకంగా కన్నీరుమున్నీరవుతూ చెప్పే ఈ డైలాగ్‌ చాలా ఫేమస్‌ అయింది. రియల్‌ లైఫ్‌లో కూడా ప్రియుడు ఉన్నట్లుండి బ్రేకప్‌ చెబితే ఏ అమ్మాయి అయినా ఇలాగే కన్నీరుమున్నీరవుతుంది. తనలో తాను మధనపడుతూ కుమిలిపోతుంది. ఇంకొందరు ధైర్యం చేసి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడమో, కోర్టు మెట్లెక్కడమో చేస్తుంటారు. అయితే చైనాకు చెందిన ఓ యువతి మాత్రం తనకు బ్రేకప్‌ చెప్పిన ప్రియుడికి విభిన్నంగా బుద్ధి చెప్పింది. ఇందులో భాగంగా అతడికి 1000కిలోల ఉల్లిపాయలు హోం డెలివరీ చేసింది. వినడానికే ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ఉల్లిపాయల బ్రేకప్‌ స్టోరీ వెనకున్న అసలు కథేంటో తెలుసుకుందాం రండి.!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-19-05-2020
women icon@teamvasundhara
today-horoscope-details-15-05-2020
women icon@teamvasundhara
corona-virus-elderly-couple-from-newyork-re-unites-for-35-minutes-after-56-days-of-separation

women icon@teamvasundhara
corona-virus-sweden-couple-to-open-world-of-restaurant

women icon@teamvasundhara
celebrate-this-mothers-day-by-giving-these-home-made-surprises
women icon@teamvasundhara
how-to-report-content-in-social-media-platforms

అభ్యంతరకర మెసేజ్‌లా..? అయితే ‘రిపోర్ట్‌’ చేయండిలా..!

ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా లేని వ్యక్తిని వెతికి పట్టుకోవడం సులభమేమో కానీ.. సోషల్‌ మీడియాలో ఖాతా లేని వారిని కనిపెట్టడం కాస్త కష్టమే అని చెప్పాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు దాదాపు ప్రతి ఒక్కరికీ సోషల్‌ మీడియాలో ప్రత్యేక ఖాతాలుండడం గమనార్హం. తమ వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, వీడియోలు, అభిప్రాయాలు, సందేహాలు, సలహాలు, సూచనలు.. ఇలా ఒక్కటేమిటి ఇతరులకు ఇబ్బంది కలిగించని ఏ విషయమైనా ఇందులో షేర్‌ చేసుకోవచ్చు. అయితే ఏ సోషల్‌ మీడియా వేదికలోనైనా ఒక కంటెంట్‌ (మెసేజ్‌, ఇమేజ్‌, వీడియో) మీకు అభ్యంతరకరంగా అనిపిస్తే వెంటనే ఆ పోస్ట్‌ని లేదా ఆ ప్రొఫైల్‌పై ఆ సంస్థకు ఫిర్యాదు చేయచ్చు. దీనినే ‘Report' అంటారు. ఇలా ఏదైనా పోస్ట్‌/ప్రొఫైల్‌పై రిపోర్ట్‌ వస్తే ఆయా యాజమాన్యాలు దానిపై వెంటనే చర్యలు తీసుకుంటాయి.

Know More

women icon@teamvasundhara
corona-virus-kalki-koechlin-richa-chadda-and-amala-campaign-against-rising-domestic-violence-cases-during-lock-down

ఇంకా కొన్ని రోజులే.. పంచుకోండి.. ఒత్తిడి తగ్గించుకోండి!

కరోనా కల్లోలం నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ అమలుచేస్తోంది. ఫలితంగా కరోనా కట్టడి మాటేమో కానీ... చాలామంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అయితే దురదృష్టవశాత్తూ లాక్‌డౌన్‌ కాలంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లే ‘గృహహింస’ బారిన పడుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. అదేవిధంగా చాలామంది మానసిక వేదనకు గురవుతున్నారు. వృద్ధులూ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారందరికీ కొందరు సెలబ్రిటీలు భరోసానిస్తున్నారు. ఈ సామాజిక సమస్యలపై సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తూ, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో ధైర్యం నూరిపోస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
masaba-gupta-gifted-designed-masks-to-police-officers

ఈ అనుభూతిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను..!

ప్రపంచ దేశాలకు.. కంటికి కనిపించని సూక్ష్మక్రిమికి మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కరోనా భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతుంటే.. అత్యవసర విభాగాలకు చెందిన వైద్యులు, పోలీసు అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు మాత్రం నిర్విరామంగా తమ విధుల్లో కొనసాగుతున్నారు. ప్రజలను కరోనా నుంచి రక్షించేందుకు వాళ్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసం వాళ్లు పడుతోన్న శ్రమను గుర్తించి ఎంతోమంది వివిధ వేదికల ద్వారా వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా కూడా పోలీసు అధికారులకు తనదైన స్టైల్‌లో కృతజ్ఞతలు తెలిపింది.

Know More

women icon@teamvasundhara
funny-and-interesting-things-around-marriages-in-lock-down-time

కరోనా కాలం.. ఈ వింత పెళ్లిళ్ల గురించి విన్నారా?

ఒకప్పుడు ఏదైనా ఊహకందని విషయం జరిగితే అంతా వింతగా భావించేవారు.. కలి కాలమనే వారు.. కానీ ఇప్పుడు ‘కరోనా కాలమని’ అంటున్నారు. సమాజంలో జరుగుతోన్న వివిధ సంఘటనలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పవచ్చు. కరోనా కరాళ నృత్యం చేస్తోన్న వేళ ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల కార్యక్రమాలు రద్దయ్యాయి.. పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు. అయితే నిశ్చయించిన ముహూర్తానికే ఒక్కటవ్వాలనుకున్న జంటలు మాత్రం ఎలాగోలా పెళ్లితంతును ముగించేస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్నాలజీని వాడుకుంటూ ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న జంటల్ని కూడా మనం చూశాం. అలాంటి విభిన్న పెళ్లిళ్లే ఇవి కూడా!

Know More

women icon@teamvasundhara
corona-virus-tollywood-singer-usha-dances-with-her-daughter-for-bareilly-wale-song

పాటల పూదోట.. కాలు కదిపితే ఇలా ఉంటుంది!

సంగీతానికి రాళ్లు కరుగుతాయేమో తెలియదు కానీ.. ఆమె మైక్‌ అందుకుంటే ఎలాంటి హృదయమైనా పరవశించి పోవాల్సిందే. ఇక తన మధురమైన గొంతు నుంచి మెలోడీ పాట వస్తే మరింత మైమరచిపోవాల్సిందే. తన పాటల ప్రవాహంతో అభిమానులను ఓలలాడించడంలో ఆమెది అందెవేసిన చెయ్యి. ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాంతో తనను తాను పరిచయం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది. ఆమే నేపథ్య గాయని ఉష. తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చిత్రాలకు తన గొంతును అరువిచ్చిన ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ సోషల్‌ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అయితే లాక్‌డౌన్‌ పుణ్యమా అని ఆమె మరోసారి తన అభిమానులను పలకరించింది. ఈక్రమంలో ఎప్పుడూ తన తీయటి గొంతుతో అలరించే ఉష.. తాజాగా తన కూతురితో కలిసి ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేస్తూ అందరినీ ఆకట్టుకుంది.

Know More

women icon@teamvasundhara
kanika-kapoor-breaks-her-silence-and-responds-to-the-allegations

మౌనంగా ఉంటే తప్పు చేసినట్లు కాదు..!

‘నిజం చెప్పులు తొడుక్కునేలోగా.. అబద్ధం ఆరుసార్లు ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటారు’.. ఈ సామెత సింగర్‌ కనికా కపూర్‌ విషయంలో అతికినట్లు సరిపోతుంది. మార్చి నెలలో విదేశాల నుండి వచ్చిన ఈ బాలీవుడ్‌ సింగర్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదంతా తన నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ ఆ సమయంలో ఎన్నో విమర్శలను సైతం ఎదుర్కొంది కనిక. ఇటీవలే ఈ మహమ్మారిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరిన కనిక ఇక మౌనంగా ఉండి లాభం లేదంటోంది. తనపై వస్తున్న విమర్శలకు మౌనం వహించానంటే దానర్థం తప్పు చేసినట్టు కాదని.. అసలేం జరిగిందో అందరికీ తెలియాలంటూ సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. మరి తన ఆవేదనేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
harmanpreet-stuns-fans-with-mirror-magic

ఈ మిర్రర్‌ మ్యాజిక్‌ గుట్టు విప్పండి చూద్దాం!

కరోనా ప్రభావంతో ప్రపంచం వణికిపోతోంది. ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్‌ ధాటికి ఒలింపిక్స్‌ లాంటి అంతర్జాతీయ క్రీడా టోర్నీలు సైతం వాయిదా పడ్డాయి. ఇక భారత మహిళల క్రికెట్‌కు సంబంధించి అన్ని షెడ్యూల్స్‌ రద్దు కావడంతో క్రికెటర్లందరూ ఇంట్లోనే ‘ఆట’విడుపును ఆస్వాదిస్తున్నారు. కొందరు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమానులతో ముచ్చటిస్తుండగా, మరికొందరు తమ ట్యాలెంట్‌కు పదును పెడుతూ రకరకాల ఛాలెంజ్‌లను విసురుతున్నారు. ఈక్రమంలో భారత మహిళల క్రికెట్‌ టీ20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కూడా ఓ మ్యాజిక్‌ పజిల్‌ను విసిరి అందరి బుర్రలకు పని పెట్టింది.

Know More