scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'అత్తారింటి వేధింపులను ఎదిరించా... జీవితంలో గెలిచా..!'

'విజయవాడకి చెందిన ఒక అమ్మాయికి పద్దెనిమిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఆ తర్వాత కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన ఆమెకి అక్కడ గృహహింస, అదనపు వరకట్న వేధింపులు ఆహ్వానం పలికాయి.. క్రమంగా అత్తింటి వారి ఆగడాలు పెచ్చుమీరడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. బతుకుతెరువు కోసం తనకి వచ్చిన కుట్లు, అల్లికలతో చిన్న షాపు మొదలుపెట్టింది. ప్రస్తుతం తానే సొంతంగా ఒక వ్యాపారాన్ని నిర్వహించే స్థాయికి చేరింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఏం జరిగింది.. ఈ స్థాయికి ఎలా చేరింది.. మొదలైన వివరాలన్నీ తెలియాలంటే ఇది చదవాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

నోటి పూతతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి..!

Natural Remedies to Cure Mouth Ulcers in Telugu

మనం తీసుకునే ఆహారంలో పోషకాలు తగ్గిపోతే రకరకాల ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తుతాయి. అందులో నోటిపూత కూడా ఒకటి. శరీరంలో వేడి ఎక్కువవడం, అధిక ఒత్తిడికి గురవడం, డీహైడ్రేషన్.. ఇలా పలు కారణాల వల్ల నోటి లోపల చిగుళ్లపై, బుగ్గలకు లోపలి వైపు గాయం మాదిరిగా ఏర్పడతాయి. ఇవి చూడడానికి గుండ్రంగా, చుట్టూ ఎర్రగా ఉండి దాని మధ్యలో తెల్లగా లేదా బూడిద రంగులో ఉంటాయి. వీటివల్ల వచ్చే నొప్పి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. బ్రష్ చేసుకునేటప్పుడు, ఏదైనా తిన్నప్పుడు.. ఆఖరికి తియ్యటి పదార్థం తిన్నా సరే.. ఈ గాయానికి తగిలితే చాలు.. చాలా నొప్పి వస్తుంది. ఫలితంగా అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ క్రమంలో సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని సహజసిద్ధమైన మార్గాలున్నాయి. అవేంటో చూద్దామా??

mouthulcersghg650-1.jpg
లక్షణాలు ఇవీ!
నోటిపూత సమస్యతో బాధపడే వారిని విపరీతమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది. నోటిలోపల, గొంతులో, బుగ్గలకు లోపలి భాగంలో ఇలా.. ఎక్కడ నోటిపూత ఏర్పడితే అక్కడ కాస్త వాపుగా కూడా ఉంటుంది. దీంతో కొన్ని సార్లు జ్వరం కూడా రావచ్చు.. మరికొన్ని సార్లు బద్ధకంగా అనిపించి ఏ పనీ చేయాలనిపించదు.
అసలెందుకీ సమస్య..
* ఒత్తిడి వల్ల
* అప్పుడప్పుడూ మనం తీసుకునే ఆహారం శరీరానికి పడకపోవడం వల్ల..
* నిమ్మ, నారింజ, యాపిల్, టమాటా, స్ట్రాబెర్రీ.. లాంటి నిమ్మజాతి, ఆమ్ల గుణాలు కలిగిన పండ్లు, కూరగాయలు తినడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
* హార్మోన్ల అసమతౌల్యం వల్ల కూడా నోటిపూత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
* జింక్, ఫోలికామ్లం, బి12, సి విటమిన్లు, ఐరన్.. మొదలైనవి లోపించడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది.
* పదే పదే నొప్పి నివారణులు వాడడం వల్ల అప్పుడప్పుడు అవి శరీరంపై నెగెటివ్ ప్రభావాన్ని చూపుతాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా నోటిపూత రావచ్చు.
* నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా సమస్య ఎదురుకావచ్చు.

honeybenefitsgh650.jpg
తేనెతో ఉపశమనం..
అప్పుడప్పుడూ నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ తిరిగి కణజాలం ఏర్పడడంలో తేనె సహాయపడుతుంది. అలాగే తేనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ గుణాల వల్ల నోటిపూత నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. దీనికోసం తేనెలో కాస్త పసుపు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను సమస్య ఉన్న భాగంలో రాయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనె, పసుపు మిశ్రమానికి బదులుగా కేవలం తేనెను కూడా ఉపయోగించవచ్చు.

coconutwaterbenefitsgh650-1.jpg
కొబ్బరి వల్ల..
కొబ్బరినీళ్లు, ఎండు లేదా పచ్చి కొబ్బరి, కొబ్బరి నూనె.. ఇలా అన్ని రకాల కొబ్బరి ఉత్పత్తుల వల్ల కూడా నోటిపూత దూరమవుతుంది. దీనివల్ల శరీరంలోని వేడి తగ్గి ఫలితంగా సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి నూనెను ప్రభావిత ప్రాంతంలో రాయడం, ఎండు లేదా పచ్చి కొబ్బరి నమలడం.. వంటి వాటి వల్ల కూడా సమస్య త్వరగా తగ్గే అవకాశం ఉంది.
పాల పదార్థాలు..
పాల పదార్థాలతో కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. సమస్య ఉన్న చోట నెయ్యి రాయడం, ప్రతిరోజూ రెండుమూడు సార్లు ఒక గ్లాస్ చొప్పున మజ్జిగ తాగడం.. లాంటివి చేస్తే సమస్య నుంచి సత్వర ఉపశమనం పొందే అవకాశం ఉంది.

pcosavoidfoodsgh650-2.jpg
తులసి ఆకులు
తులసి ఆకుల్లో చాలా ఔషధ గుణాలున్నాయి. వీటి వల్ల ఒత్తిడి దూరమవుతుంది. నోటిలో కొన్ని నీళ్లు పోసుకుని తర్వాత కొన్ని తులసి ఆకుల్ని వేసుకుని.. నీటితో పాటే నమలాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేయాలి. దీనివల్ల నోటిపూత త్వరగా తగ్గుతుంది. అలాగే ఈ సమస్య తిరిగి రాకుండా కూడా ఉంటుంది.
నొప్పి తగ్గాలంటే..
ఈ సమస్య వల్ల తీవ్రమైన నొప్పి వస్తుందని మనం తెలుసుకున్నాం కదా! మరి ఈ నొప్పి నుంచి ఉపశమనం కలగాలంటే.. చిన్న ఐస్ ముక్కను తీసుకుని దాంతో గాయం ఉన్న ప్రదేశంలో నెమ్మదిగా రుద్దడం, బాగా చల్లటి నీటితో నోరు శుభ్రపరచుకోవడం.. లాంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే లవంగం నమలడం, లవంగం నూనె సమస్య ఉన్న ప్రాంతంలో పూయడం.. మొదలైన వాటి వల్ల కూడా నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
నోటిపూత రావడం అనేది చాలామందిలో సాధారణంగా జరుగుతుంది. పై చిట్కాలన్నీ పాటించినా ఈ సమస్య తగ్గకపోతే మాత్రం డాక్టర్ వద్దకు వెళ్లడం తప్పనిసరి.





women icon@teamvasundhara
do-you-know-the-reason-behind-these-common-pregnancy-food-cravings

కాబోయే అమ్మలూ.. మీకూ ఇవి తినాలనిపిస్తోందా..!

పుల్లపుల్లగా తినాలనిపించడం, బయట దొరికే జంక్‌ఫుడ్స్‌ చూస్తే నోరూరిపోవడం, ఈ పూట కారంగా ఏదైనా తింటే బాగుండేది అనిపించడం.. ఇలా గర్భిణుల్లో కొన్ని రకాల ఆహారపు కోరికలు కలగడం సహజం. మరికొందరైతే ఈ సమయంలో చేదును కూడా కోరుకుంటుంటారు. మరి, ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. అసలు గర్భిణుల్లో ఇలాంటి కోరికలు ఎందుకు కలుగుతాయని మీరెప్పుడైనా ఆలోచించారా? అయితే ఇందుకూ ఓ కారణముందని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. సాధారణంగా మన శరీరంలో ఏదైనా పోషకం ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉంటే ఆ పోషకం ఎక్కువగా ఉండే ఆహారం తినాలని శరీరం మెదడును ప్రేరేపిస్తుందట! అలా ఆ పదార్థం తినేదాకా మనకు నిద్ర పట్టదన్నమాట! మరి, ఇలా గర్భిణుల్లో సాధారణంగా కలిగే ఫుడ్‌ క్రేవింగ్స్‌ ఏంటో తెలుసుకుందామా?!

Know More

women icon@teamvasundhara
ways-to-remove-toxins-from-your-body
women icon@teamvasundhara
celebrity-nutritionist-rujuta-diwekar-quarantine-diet-plan-may-sort-out-your-weekly-diet-woes

కరోనా వేళ.. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచే డైట్ ప్లాన్!

కరోనా వచ్చి ఏడాది దాటినా మాస్క్‌, భౌతిక దూరం మన జీవితాల నుంచి దూరం కాలేదు. పైగా ఈ రెండో దశలో రెండు మాస్కులు ధరించాలని, ఒకరికొకరు మరింత దూరంగా ఉండాలన్న ఆంక్షలు పెరిగాయే తప్ప తరగలేదు. ఈ క్రమంలోనే ఈ మహమ్మారికి చిక్కకుండా ఉండేందుకు ఇమ్యూనిటీని పెంచుకునే పనిలో పడ్డారంతా! బయటికి వెళ్లినా, ఇంట్లో నుంచే పనిచేసినా అందరూ ఆరోగ్య మంత్రాన్నే పఠిస్తున్నారు. అలాంటి వారిని మరింత హెల్దీగా మార్చేందుకు ప్రత్యేకంగా ఓ డైట్‌ప్లాన్‌ను సిద్ధం చేశారు ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌. ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కచ్చితమైన సమయాల్లో పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారామె. ఈ క్రమంలోనే ఏ రోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏయే వ్యాయామాలు చేయాలి? తదితర విషయాలతో కూడిన ఈ వీక్లీ డైట్‌ ప్లాన్‌లో ఏముందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
world-hand-hygiene-day-hand-wash-who-precautions

చేతులు కడుక్కోండి.. ఆరోగ్యంగా ఉండండి!

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా భూతం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకమన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గంటగంటకూ హ్యాండ్‌వాష్‌, శానిటైజర్ లేదా ఏదైనా సబ్బుతో చేతుల్ని పరిశుభ్రంగా రుద్ది మరీ కడుక్కోమంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. అంతేకాదు.. చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని కూడా వారు సూచిస్తున్నారు. నేడు (మే 5) ‘వరల్డ్‌ హ్యాండ్‌ హైజీన్‌ డే’. ఈ సందర్భంగా ‘SAVE LIVES: Clean your hands’ అనే థీమ్‌తో మనముందుకొచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ క్రమంలో చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే కొవిడ్‌తో పాటు ఎన్నో ఇన్ఫెక్షన్లు మన దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండచ్చన్న సందేశాన్ని అందరికీ అందించింది డబ్ల్యూహెచ్‌వో. ఈ నేపథ్యంలో సబ్బుతో చేతులను ఎంతసేపు కడగాలి? ఎలా శుభ్రం చేసుకోవాలి..? ఎప్పుడెప్పుడు చేతులు కడుక్కోవాలి..? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
corona-virus-what-happens-when-you-dont-wash-your-hands

వామ్మో.. చేతులు శుభ్రం చేసుకోకపోతే ఇన్ని అనర్థాలా?

‘మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని ఒక అలవాటుగా మార్చుకోవాలి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. అంతేకాదు.. ఏటా మే 5న ‘హ్యాండ్‌ హైజీన్‌ డే’ (చేతుల పరిశుభ్రతా దినోత్సవం) పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చేతులు శుభ్రం చేసుకోవాలన్న విషయాన్ని చాలామంది పెడచెవిన పెడుతున్నారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం ప్రతిఒక్కరూ చేతుల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యులు, ప్రముఖ ఆరోగ్య సంస్థలు సైతం పదే పదే ఇదే మాటను నొక్కివక్కాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఈ ప్రత్యేకమైన రోజుకు బోలెడంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Know More

women icon@teamvasundhara
foods-to-avoid-in-summer

women icon@teamvasundhara
rujuta-diwekar-shares-some-tips-to-help-people-recovering-from-covid-19

కరోనా తగ్గిన తర్వాత త్వరగా కోలుకోవాలంటే..!

కరోనా మహమ్మారి మన శరీరంపై దాడి చేసి.. ఆయా అవయవాల పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా లేనిపోని అనారోగ్యాల బారిన పడుతున్నాం. ఇక తీరా నెగెటివ్‌ వచ్చాకనైనా ఆరోగ్యం కుదుటపడుతుందా అంటే.. దానికీ చాన్నాళ్లే సమయం పడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలోనే కరోనా నుంచి బయటపడినా చాలామందిలో దగ్గు, జలుబు, నీరసం, అలసట.. వంటి లక్షణాలు కనిపించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల కొవిడ్‌ లక్షణాలను దూరం చేసుకొని త్వరగా కోలుకోవచ్చంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఈ క్రమంలోనే అవేంటో సూచిస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారామె.

Know More

women icon@teamvasundhara
these-vitamins-plays-a-vital-role-to-strengthen-the-immunity-system

ఇమ్యూనిటీని పెంచే విటమిన్లివి!

రోగనిరోధక శక్తి... మనల్ని జబ్బుల బారి నుండి కాపాడే ఔషధం వంటిది. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే దాని ధాటికి మన ఒంట్లోకి ప్రవేశించే వైరస్‌, బ్యాక్టీరియాలు కూడా నిలవలేవు. మరి, ఇందుకోసం మనం తీసుకునే ఆహారం చాలా కీలకం. ఈ క్రమంలో విటమిన్లు నిండి ఉన్న ఆహారాన్ని కూడా మన రోజువారీ మెనూలో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. తద్వారా వ్యాధి సోకిన తర్వాత దాన్ని నయం చేసుకోవడం కంటే ముందే జాగ్రత్తపడచ్చంటున్నారు. కరోనా విజృంభణ కొనసాగుతోన్న ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లేంటి? అవి పుష్కలంగా లభించే పదార్థాలేంటో తెలుసుకొని మన రోజువారీ మెనూలో భాగం చేసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
women-should-aware-of-these-myths-and-facts-about-covid-vaccine-in-telugu
women icon@teamvasundhara
health-ministry-issues-guidelines-for-people-with-mild-covid-19-symptoms-are-advised-to-be-in-home-isolation

హోమ్ ఐసొలేషన్... ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

జలుబైనా, దగ్గొచ్చినా, కాస్త ఒళ్లు వేడిగా అనిపించినా.. అది కరోనా వల్లేనేమో అని కంగారు పడిపోతున్నాం. ఆలస్యం చేయకుండా, ముందూ వెనకా ఆలోచించకుండా కొవిడ్‌ పరీక్షా కేంద్రానికి పరుగులు పెడుతున్నాం. ఈ క్రమంలో నిజానికి మనలో వైరస్‌ లేకపోయినా అక్కడి నుంచి అంటించుకొని వచ్చే వారు ఎందరో! అంతేనా.. ఏమవుతుందో ఏమోనన్న ఆందోళనే చాలామందిని ఆస్పత్రి మెట్లు ఎక్కిస్తోంది. ఇదిగో ఇలాంటి భయమే కంటికి కనిపించని కరోనా ముందు మనల్ని బలహీనుల్ని చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా స్వల్ప లక్షణాలుంటే ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకోమని పదే పదే చెబుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా మరోసారి ఇదే విషయాన్ని గుర్తు చేసింది. ఈ క్రమంలో కరోనా సోకి స్వల్ప లక్షణాలుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

Know More

women icon@teamvasundhara
precautions-while-using-sanitizers-in-the-time-of-corona-crisis
women icon@teamvasundhara
home-made-drinks-to-strengthen-immune-system-in-telugu

ఇమ్యూనిటీని పెంచే పవర్‌ఫుల్‌ పానీయాలివే!

కరోనా సెకండ్‌ వేవ్‌ యావత్ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎంత అప్రమత్తంగా ఉంటున్నా లక్షలాది మంది ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. రోజుకు వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అందుకే ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఆరోగ్యం విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా కొవిడ్‌ లాంటి వైరస్‌ల నుంచి రక్షణ పొందాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిందేనంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, వంటింట్లో లభించే కొన్ని పదార్థాలతోనే ఇమ్యూనిటీని మెరుగుపరచుకోవచ్చని వారు సూచిస్తున్నారు. పైగా వేసవి కాలం కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చట. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
all-you-need-to-know-about-oxygen-levels-and-proning-technique

ఇలా హోమ్ ఐసొలేషన్‌లో ఉంటూనే ఆక్సిజన్‌ స్థాయులు పెంచుకోవచ్చట!

ఆక్సిజన్‌.. ఆక్సిజన్‌.. ఆక్సిజన్‌.. ప్రస్తుతం ఎక్కడ విన్నా, ఎవరు మాట్లాడుకున్నా దీని గురించే! మాయదారి కరోనా మహమ్మారి నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేసి శరీరంలో ఆక్సిజన్‌ స్థాయులు పతనమయ్యేలా చేస్తోంది. దీంతో ఊపిరి అందక బాధితులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు హాస్పిటల్స్‌లో బెడ్లు దొరక్క, అక్కడా ప్రాణవాయువు కొరతతో ప్రాణాలరచేత పట్టుకొని ఆక్సిజన్‌ కోసం ఆస్పత్రి బయటే నిరీక్షిస్తున్నారు. ఇంకొంతమందైతే హోమ్ ఐసొలేషన్‌లో ఉండి, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్నా.. వైరస్‌ భయంతో సిలిండర్‌తో సహా ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మరి, ఆక్సిజన్‌ తగ్గిన ప్రతి ఒక్కరికీ ఆస్పత్రిలోనే చికిత్స అందించాలా? అంటే.. ఆ అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పరిస్థితి అదుపులో ఉండి, ఆక్సిజన్‌ సిలిండర్‌ అందుబాటులో ఉంటే ఇంట్లోనే హోమ్ ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి పడకలు దొరికే అవకాశాలున్నాయంటున్నారు. ఒకవేళ సిలిండర్‌ లేకపోయినా.. ప్రోనింగ్‌ పద్ధతి ద్వారా సహజసిద్ధంగా శరీరంలో ఆక్సిజన్‌ స్థాయుల్ని పెంచుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తోంది.

Know More

women icon@teamvasundhara
tips-for-a-faster-recovery-after-cesarean-delivery-in-telugu

ఇలా చేస్తే సిజేరియన్‌ నుంచి త్వరగా కోలుకోవచ్చట!

ఈ రోజుల్లో గర్భం ధరించిన మహిళల్లో చాలామందికి సిజేరియన్‌ డెలివరీలే అవుతున్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే జరిపిన ‘జాతీయ కుటుంబ సర్వే’ కూడా ఇదే విషయం స్పష్టం చేస్తోంది. నార్మల్ డెలివరీలో నొప్పుల్ని భరించలేక, ఇతర అనారోగ్యాల రీత్యా.. ఇలా కారణమేదైనా సి-సెక్షన్‌ డెలివరీల వైపే మొగ్గు చూపుతున్నారు కాబోయే అమ్మలు. అయితే ఇలా ఆపరేషన్‌ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన మహిళలు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఆ తర్వాత కూడా వారికి దీర్ఘకాలంలో పలు అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ మన ఇళ్లలో ఉండే పెద్దలు చెబుతుంటారు. కానీ డెలివరీ తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సిజేరియన్‌ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఏప్రిల్‌ను ‘సిజేరియన్‌ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆ జాగ్రత్తలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
unknown-health-benefits-of-chapati-in-telugu

అందుకే ఒక్క పూటైనా చపాతీ తినాలట!

బరువు తగ్గాలనుకునే వారు ప్రతి విషయంలోనూ ప్రత్యామ్నాయాల్ని వెతుక్కుంటుంటారు. రాత్రుళ్లు అన్నం మానేసి చపాతీ (గోధుమ పిండితో తయారు చేసింది) తీసుకోవడం కూడా ఇలాంటిదే! మరి, నిజానికి దీనివల్ల ఏదైనా ఫలితం ఉంటుందంటారా? అని సందేహించే వాళ్లూ లేకపోలేదు. అయితే ఆ సందేహం అక్కర్లేదని, రాత్రి భోజనంలో చపాతీని భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు నిపుణులు. ఒక్క రాత్రి పూట అనే కాదు.. రోజులో ఒకసారి చపాతీ తిన్నా కూడా సమాన ఫలితం ఉంటుందట! మరి, ఆలస్యం చేయకుండా చపాతీలో దాగున్న ఆ ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
why-you-must-include-watermelon-seeds-in-your-diet-in-telugu

పుచ్చకాయతో పాటు గింజలూ తినాలట.. ఎందుకో తెలుసా?

వేసవిలో మండుటెండల నుంచి ఉపశమనం పొందాలంటే పుచ్చకాయకు మించిన పండు మరొకటి లేదు. దాదాపు 95 శాతం నీటిని నింపుకొన్న ఈ సీజనల్‌ ఫ్రూట్‌లో శరీరానికి చలువనిచ్చే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలామంది ఈ పండును తినేటప్పుడు గింజలను పక్కన పడేస్తుంటారు. మరికొంతమంది తినేందుకు సులభంగా ఉంటుందని గింజలు లేని పుచ్చకాయ ముక్కలను కొని తెచ్చుకుంటారు. అయితే ఇలా పుచ్చకాయ గింజలను పక్కన పెట్టేయడమంటే చేతికందిన పోషకాలను దూరం చేసుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్లు, విటమిన్లు లాంటి పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయని వారు సూచిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
mask-wearing-guidelines-by-who-and-cdc-in-telugu

కరోనా అలర్ట్‌ : ఎవరికి ఏ మాస్క్‌ మంచిది?!

కరోనా వెలుగు చూసిన దగ్గర్నుంచి మాస్కులు మన జీవితంలో ఓ భాగమయ్యాయి. ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండడానికి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఎంత ముఖ్యమో.. మాస్కులు ధరించడం అంతకంటే ముఖ్యమని నిపుణులు పదే పదే నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది క్లాత్‌ మాస్కుల్ని ఎంచుకుంటే.. మరికొంతమంది బయట దొరికే మెడికల్‌ మాస్కుల్ని కొని ధరిస్తున్నారు. ఏదేమైనా, మాస్కులు ధరించడానికి మనం అలవాటు పడిపోయినా.. అసలు ఎవరు ఎలాంటి మాస్కులు ధరించాలి? ఎప్పుడెప్పుడు పెట్టుకోవడం మంచిది? అన్న పలు సందేహాలు కొంతమందిలో ఉన్నాయని చెప్పచ్చు. అయితే వాటన్నింటినీ ఒక్క వీడియో ద్వారా నివృత్తి చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). ఎవరెవరు ఎలాంటి మాస్కులు ధరించాలి, ఎప్పుడు ధరించాలో సూచిస్తూ తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
ayurveda-tips-for-acidity-in-telugu

ఎసిడిటీతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!

ఎసిడిటీ... గతంలో కేవలం పెద్ద వయసు వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య నేడు అందరినీ వేధిస్తోంది. అందుకు మన ఆహారపు అలవాట్లు, జీనవశైలే కారణమని వేరే చెప్పక్కర్లేదు. ప్రత్యేకించి యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయి నిరంతరం బిజీబిజీగా గడిపే నగరవాసులే ఈ సమస్య బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘చికిత్స కన్నా నివారణే మేలు’ అన్న మాటను అనుసరించి సమస్య తీవ్రతరం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా హెల్దీ డైట్‌ తీసుకోవడం, వ్యాయామాలు చేయడం లాంటి కొన్ని అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకుంటే ఎసిడిటీ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-irregular-periods-in-telugu
women icon@teamvasundhara
essential-changes-in-diet-and-life-style-to-beat-the-heat

ఈ హెల్దీ డైట్‌తో వేసవి సమస్యలను అధిగమించండి!

ఇతర సీజన్లతో పోల్చితే వేసవిలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలోని విపరీతమైన వేడి శరీరంలోని నీటినంతటినీ చెమట రూపంలో పీల్చేస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక చెమట అధికంగా పట్టడం వల్ల శరీరంలోని ఎలక్ర్టోలైట్స్‌ స్థాయుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. అదేవిధంగా కొన్ని రకాల సీజనల్‌ వ్యాధులు, చర్మం జిడ్డుగా మారిపోవడం, కంది పోవడం, స్కిన్‌ అలర్జీలు, ట్యానింగ్‌ సమస్యలు అధికంగా ఎదురవుతుంటాయి. వీటికి తోడు కరోనా ఇంకా మనల్ని వెంటాడి వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందంటున్నారు పోషకాహార నిపుణులు.

Know More

women icon@teamvasundhara
healthy-foods-can-eat-before-and-after-you-get-covid-vaccine

కరోనా వ్యాక్సిన్ ముందు, తర్వాత.. ఏవి తినాలి? ఏవి తినకూడదు?!

ఓవైపు కరోనా తన పని తాను చేసుకుపోతుంటే.. మరోవైపు దీని బారిన పడకుండా ఉండేందుకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా అరవై పైబడిన వారితో పాటు, 45 ఏళ్లు దాటిన వారికి కూడా టీకా ఇస్తోన్న సంగతి తెలిసిందే! అయితే ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయోనన్న భయం కొంతమందిలో ఉంటే.. అసలు వ్యాక్సిన్‌కి ముందు, తర్వాత ఏవైనా ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుందేమోనన్న సందేహం మరికొంతమందిలో ఉంది. ‘మీ సందేహం నిజమేనంటున్నారు’ నిపుణులు. ఎందుకంటే టీకా వేసుకోవడానికి ముందు, వేసుకున్న తర్వాత కొన్ని రకాల పదార్థాల్ని తీసుకోవడం వల్ల వ్యాక్సిన్‌ వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను చాలా వరకు తగ్గించచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా ఆహార నియమాలు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-thyroid-problem-in-telugu
women icon@teamvasundhara
know-the-immunity-boosting-properties-of-ugadi-pachadi-in-this-pandemic-time

ఇమ్యూనిటీని పెంచే ‘ఉగాది పచ్చడి’!

ప్రతి పండక్కీ ఏదో ఒక ప్రత్యేకమైన వంటకం ఉండనే ఉంటుంది. పాత కాలపు సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూ తయారు చేసుకునే ఈ విభిన్న వంటకాల్లో మన ఆరోగ్యాన్ని పెంచే సుగుణాలు బోలెడుంటాయి. తెలుగు సంవత్సరాది ఉగాదికి చేసుకునే ఉగాది పచ్చడీ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆరు రుచులు మేళవించి తయారుచేసుకునే ఈ ప్రత్యేకమైన పదార్థం రుచిలోనే కాదు.. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలోనూ మిన్నే! ముఖ్యంగా ఇందులో భాగంగా మనం వాడే ఆరు రకాల పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఉగాది పచ్చడి కూడా ఎంతగానో సహకరిస్తుందంటున్నారు. మరి, ‘శ్రీ ప్లవ’ నామ సంవత్సరంలోకి అడుగిడుతోన్న వేళ.. ఉగాది పచ్చడి మన రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడానికి, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
ripe-or-unripe-bananas-which-should-you-eat-and-when
women icon@teamvasundhara
rujuta-diwekar-shares-tips-for-a-healthy-life-through-her-audio-book-secrets-of-good-health

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి!

మనలో చాలామందికి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కాస్త ఎక్కువే అని చెప్పాలి. కరోనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పట్నుంచి అది మరింత పెరిగింది. ఎవరిని చూసినా ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి? సంపూర్ణ ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎంత సేపు వ్యాయామం చేయాలి? వైరస్‌, ఇతర అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?.. ఇలా ప్రస్తుతం అందరి కళ్లూ నెట్‌లో ఆరోగ్య చిట్కాలను వెతికే పనిలో పడ్డాయి. అయితే ఇలాంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఏ ఒక్క ఆహారంతోనో అది సాధ్యం కాదని, రోజంతా మనం తీసుకునే పోషకాహారం-చేసే వ్యాయామాలే ఈ క్రమంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఇందులో భాగంగానే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటే పాటించాల్సిన నియమాల గురించి ‘సీక్రెట్స్‌ ఆఫ్‌ గుడ్‌ హెల్త్‌’ పేరుతో తాను రాసిన ఆడియో బుక్‌లో పొందుపరిచారామె. ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ (ఏప్రిల్‌ 7) సందర్భంగా అందులోని కొన్ని హెల్త్‌ సీక్రెట్స్‌ గురించి మనతో ఇలా పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
health-benefits-of-cucumber-in-telugu
women icon@teamvasundhara
gynecologist-advice-on-skin-allergy-in-telugu
women icon@teamvasundhara
gynecologist-advice-on-pregnancy-problems-in-telugu

ప్రెగ్నెన్సీ పాజిటివ్‌ అని వచ్చినా డిశ్చార్జ్‌ అవుతోంది.. ఎందుకని?

నమస్తే డాక్టర్‌. నాకు పిరియడ్స్‌ రెగ్యులర్‌గా వస్తాయి. అయితే ఈమధ్యే నాకు పిరియడ్‌ మిస్‌ అయితే ఇంట్లో హోమ్‌ ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకుంటే పాజిటివ్‌ అని వచ్చింది. అయితే హాస్పిటల్‌లో చేసుకుంటే వీక్‌ పాజిటివ్‌ అని డాక్టర్‌ చెప్పారు. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసి Dydroboon ట్యాబ్లెట్స్‌ ఇచ్చారు. అవి వాడితే లేత గోధుమ రంగు, ఎరుపు రంగు డిశ్చార్జ్‌ లైట్‌గా అవుతుంది. అసలు నేను గర్భిణినా, కాదా తెలియట్లేదు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్‌ని కాకపోతే అంతకుముందులాగా నాకు పిరియడ్స్‌ వచ్చి, నార్మల్‌ బ్లీడింగ్‌ కావాలంటే నేనేం చేయాలో చెప్పగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
what-is-coronasomnia-and-everything-you-need-to-know
women icon@teamvasundhara
gynecologist-advice-on-post-cesarean-wound-infection-in-telugu
women icon@teamvasundhara
precautions-for-couples-undergoing-fertility-ivf-treatment-during-covid-pandemic

ఈ కరోనా సమయంలో గర్భం ధరించడం మంచిదా? కాదా?

కరోనా వైరస్‌ మన జీవనశైలి, రోజువారీ పనులపై ఎంతలా ప్రభావం చూపుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో కొంతమంది కొన్ని అతి ముఖ్యమైన పనుల్ని సైతం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి కారణంగా పిల్లల్ని కనడానికి సైతం భయపడుతున్నారు. ఇప్పటికే సంతానలేమి సమస్యలున్న వారు ఐవీఎఫ్‌/ఐయూఐ.. వంటి సంతాన సాఫల్య మార్గాలను ఆశ్రయించడానికీ వెనకడుగు వేస్తున్నారు. అయితే వైరస్‌ మూలంగా పిల్లల్ని కనే పనిని వాయిదా వేసుకోవడం సరికాదని, తద్వారా వయసు పెరుగుతున్న కొద్దీ గర్భం ధరించడం మరింత క్లిష్టమవుతుందని అంటున్నారు నిపుణులు. అందుకే వైరస్‌ మన మధ్యే ఉన్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోమంటున్నారు.

Know More

women icon@teamvasundhara
count-on-these-ayurvedic-gut-healing-herbs-to-relieve-abdominal-aches-and-bloating

ఈ వంటింటి చిట్కాలతో జీర్ణ సంబంధ సమస్యలకు చెక్‌ పెట్టండి!

ఇతర సీజన్లతో పోల్చితే వేసవిలో అరుగుదల సమస్యలు కాస్త అధికంగా ఎదురవుతాయి. ఎండ వేడిమికి తోడు బయట దొరికే కలుషితమైన ఆహారం, కార్బొనేటెడ్ కూల్‌ డ్రింక్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. ప్రత్యేకించి నిత్యం హడావుడిలో తిరిగే నగరవాసులకు కడుపునొప్పి, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, కడుపుబ్బరం లాంటి జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దీంతో అప్పటికప్పుడు ఏవో మెడిసిన్స్ తీసుకుని ఉపశమనం పొందుతుంటారు. అయితే వీటి బదులు వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతో జీర్ణ సమస్యలని దూరం చేసుకోవడం మేలంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

Know More

women icon@teamvasundhara
safety-precautions-to-take-when-you-travel-during-pregnancy

గర్భిణిగా ఉన్నప్పుడు ప్రయాణాలా?.. ఇవి గుర్తుపెట్టుకోండి!

గర్భం ధరించామని తెలియగానే అతి సుకుమారంగా మారిపోతుంటారు మహిళలు. బరువులెత్తడం అటుంచితే.. తమ పనులు తాము చేసుకోవడానికి కూడా వెనకా ముందూ అవుతుంటారు. ఇంకొంతమందైతే అత్యవసర పరిస్థితుల్లో తప్ప డెలివరీ అయ్యేదాకా ప్రయాణాలు కూడా మానుకుంటారు. ఎందుకంటే ఇలా తమ పనుల వల్ల కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమో అని జాగ్రత్తపడుతుంటారు కాబోయే అమ్మలు. అయితే ప్రెగ్నెన్సీ అనేది అనారోగ్యం కాదని, ఈ క్రమంలో శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఎవరికి వారు అన్ని పనులు చేసుకోవచ్చని, తద్వారా మరింత చురుగ్గా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. గర్భంతో ఉన్నప్పుడు ప్రయాణాలు కూడా చేయచ్చని, అయితే అందుకు ముందుగా డాక్టర్‌ సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక దీంతో పాటు ప్రయాణం చేయాలనుకునే గర్భిణులు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరమంటున్నారు. మరి, ఇంతకీ అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-bleeding-after-intercourse-in-telugu
women icon@teamvasundhara
world-tuberculosis-day-experts-debunks-these-common-myths

టీబీ ప్రభావం ఆ మహిళల్లోనే ఎక్కువ.. అసలు వాస్తవాలేమిటి?

కరోనా వచ్చాక ప్రస్తుతం అదే మనకు బద్ధ శత్రువనిపిస్తోంది. కానీ మన ఆరోగ్యానికి అంతకంటే పెద్ద పెద్ద శత్రువులు చాలానే ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. టీబీ (ట్యూబర్‌క్యులోసిస్‌/క్షయ) కూడా అలాంటిదే! మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియం కారణంగా వచ్చే ఈ ఇన్ఫెక్షన్‌ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అక్కడితో ఆగకుండా మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు.. వంటి అవయవాలకూ ఇది విస్తరిస్తుందట! టీబీ అంటే సాధారణంగా వచ్చే దగ్గే కదా అని దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఏటా సుమారు 4.8 లక్షల మంది భారతీయులు దీనికి బలవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక పునరుత్పత్తి వయసులో (20-45 ఏళ్ల మధ్య) ఉన్న మహిళలపై దీని ప్రభావం అధికంగా ఉందట! అలాగని భయపడాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే దీన్ని నయం చేసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే అంతకంటే ముందుగా ఈ భయాన్ని పోగొట్టాలంటే ఈ సమస్యపై నెలకొన్న కొన్ని అపోహల్ని జయించాలంటున్నారు. నేడు ‘ప్రపంచ ట్యూబర్‌క్యులోసిస్ డే’ సందర్భంగా టీబీపై పలువురిలో ఉండే కొన్ని అపోహలు, వాటి వెనకున్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
juices-which-increase-immunity-power-in-telugu

ఈ జ్యూస్‌లతో ఇమ్యూనిటీ పెంచుకుందాం!

నిత్యం మన శరీరంపై ఎన్నో రకాల వైరస్‌లు దాడి చేస్తుంటాయి. ఇది సర్వసాధారణమైన విషయమే అయినప్పటికీ.. అందులో చాలా వాటిని మన రోగ నిరోధక శక్తే అంతం చేస్తుంటుంది. మనిషిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడే వ్యాధులు ప్రబలడం ఎక్కువవుతుంది. అందుకే చక్కటి పోషకాహారం తీసుకోవడం వల్ల సహజంగానే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ మళ్లీ ఉధృతమవుతోన్న వేళ తీసుకునే ఆహారం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని జ్యూస్‌లు క్రమం తప్పకుండా తీసుకోమంటున్నారు.

Know More

women icon@teamvasundhara
things-to-know-about-postmenopausal-bleeding-in-telugu

మెనోపాజ్‌ తర్వాత బ్లీడింగా? అయితే ఇవి కారణం కావచ్చు!

మెనోపాజ్‌ అంటేనే మహిళల్లో నెలసరి ఆగిపోయే దశ. సాధారణ పరిస్థితుల్లో వరుసగా ఏడాది పాటు నెలసరి రాకపోతే.. వారు మెనోపాజ్‌ దశలోకి అడుగుపెట్టారని అర్థం. అయితే ఈ సమయంలోనూ కొంతమందికి అప్పుడప్పుడూ రక్తస్రావం కనిపిస్తుంటుంది. మరి, నెలసరి ఆగిపోయినా బ్లీడింగ్ అవుతోందంటే అది కచ్చితంగా ఏదో ఒక ప్రమాదకరమైన వ్యాధి/సమస్యకు సూచిక అంటున్నారు నిపుణులు. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే అసలు సమస్యేంటో తెలుసుకొని ఆదిలోనే దానికి చెక్‌ పెట్టేయచ్చని చెబుతున్నారు.. లేదంటే దాని వల్ల ఇతర అనారోగ్యాలకూ దారితీసే ప్రమాదముందంటున్నారు. మరి, ఇంతకీ మెనోపాజ్‌ తర్వాత వెజైనల్‌ బ్లీడింగ్‌ ఎందుకవుతుంది? ఈ క్రమంలో ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇంతకీ దీనికి చికిత్స ఉందా?, లేదా? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
expert-suggestion-on-infertility-in-telugu

women icon@teamvasundhara
benefits-of-cucumber-water-stay-hydrated-and-healthy

ఈ ‘కీరా నీళ్లు' తాగితే ఎంత మంచిదో తెలుసా?

‘తగినన్ని నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది’ ఈ విషయం తెలిసినా నీళ్లు తాగే విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. నీళ్లు రుచికరంగా ఉండకపోవడమే ఇందుకు కారణమంటారు. అయితే ఈ నీళ్లను రుచికరంగా మార్చుకోవడానికి వివిధ రకాల సహజసిద్ధమైన పదార్థాలను ఆ నీటిలో కలుపుకొని తీసుకుంటున్నారు చాలామంది. కీరా దోస నీళ్లు కూడా ఆ కోవకే చెందుతాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా దోసను నీటితో కలిపినప్పుడు అందులోని పోషకాలు రెట్టింపై సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందంటున్నారు నిపుణులు. పైగా ఈ వేసవిలో ఎదురయ్యే డీహైడ్రేషన్‌, శారీరక శక్తి క్షీణించడం, చర్మ సమస్యలు.. మొదలైన వాటన్నిటికీ ఈ నీళ్లు చెక్‌ పెడతాయట! మరి, ‘ప్రపంచ నీటి దినోత్సవం’ సందర్భంగా అమృతంతో సమానమైన ఈ నీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
changes-you-need-to-make-in-your-diet-to-help-fight-anxiety-in-telugu

ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్నారా? ఈ డైట్ ట్రై చేయండి!

ఉరుకు పరుగుల యాంత్రిక జీవనానికి తోడు... జీవన విధానంలో చోటు చేసుకునే పలు మార్పుల వల్ల ఈ రోజుల్లో చాలామంది ఎన్నో రకాల మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఒత్తిడి, ఆందోళనలకు గురవుతూ తమలో తామే కుమిలిపోతున్నారు. వీటికి తోడు కరోనా లాంటి వ్యాధులు అందరి జీవితాలను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ఈ క్రమంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా యాంగ్జైటీ, డిప్రెషన్‌ లాంటి మానసిక అనారోగ్యాల బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమస్యపై దృష్టి సారించకపోతే దీర్ఘకాలంలో ఇతర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
world-oral-health-day-–-common-oral-health-myths-busted-in-telugu

రోజుకి ఎన్నిసార్లు బ్రష్‌ చేసుకోవాలి? ఎంతసేపు చేసుకోవాలి?

మనం రోజూ ఉదయం నిద్ర లేవగానే చేసే పని పళ్లు తోముకోవడం. దీని ద్వారా రోజంతా దంతాల్ని, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు.. బ్రషింగ్‌ వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యం కూడా సొంతమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం పళ్లు-చిగుళ్ల సమస్యలతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్‌, డయాబెటిస్‌.. వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడక తప్పదంటున్నారు. అందుకే నోటి ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే బ్రష్‌ చేసుకునే విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. దంతాలు మెరిసిపోవాలంటే ఎక్కువ సేపు బ్రష్‌ చేసుకోవాలని, బ్రషింగ్‌కి బదులుగా