రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేసుకోవాలి? ఎంతసేపు చేసుకోవాలి?
మనం రోజూ ఉదయం నిద్ర లేవగానే చేసే పని పళ్లు తోముకోవడం. దీని ద్వారా రోజంతా దంతాల్ని, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు.. బ్రషింగ్ వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యం కూడా సొంతమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం పళ్లు-చిగుళ్ల సమస్యలతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్.. వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడక తప్పదంటున్నారు. అందుకే నోటి ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే బ్రష్ చేసుకునే విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. దంతాలు మెరిసిపోవాలంటే ఎక్కువ సేపు బ్రష్ చేసుకోవాలని, బ్రషింగ్కి బదులుగా మౌత్వాష్ వాడచ్చని, పళ్లు తోముకోవడానికి హార్డ్ బ్రష్ అయితేనే మంచిదని.. నోటి ఆరోగ్యం విషయంలో ఇలా ఎవరి ఆలోచనలు వారివి. మరి, ఇవన్నీ నిజమేనా? నేడు (మార్చి 20) ‘ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా నోటి ఆరోగ్యంపై పలువురిలో ఉండే కొన్ని అపోహలు, వాటి వెనకున్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం..!