scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

బ్రెస్ట్‌ఫీడింగ్ వల్లే అప్పుడు బరువు తగ్గా!

Lisa Haydon says breastfeeding is her post pregnancy weight loss secret in Telugu

Breast-Feeding.jpg

ప్రసవమయ్యాక కొందరు మహిళలు బరువు తగ్గి పూర్వస్థితికి రావడానికి డైటింగ్, కఠినమైన వ్యాయామాలు.. వంటి పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటివల్ల అటు బాలింతల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆహార నియమాల పేరుతో కడుపు మాడ్చుకోవడం వల్ల బిడ్డకు సరైన మొత్తంలో పాలు ఉత్పత్తి కాకపోవచ్చు. అందుకే పూర్తిగా ఈ నియమాలపైనే ఆధారపడకుండా బిడ్డకు నిరంతరాయంగా తల్లిపాలు అందించాలని అంటోంది బాలీవుడ్ హాట్ మమ్మీ లిసా హెడెన్.
ఇద్దరు బాబుల ముద్దుల అమ్మగా ప్రస్తుతం అమ్మతనంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తోన్న లీసా..  జాక్‌ పుట్టాక తాను కేవలం ఐదు నెలల వ్యవధిలోనే తిరిగి బరువు తగ్గానంటోంది. అంతేకాదు.. అందుకు బ్రెస్ట్‌ఫీడింగ్‌ ఎంతగానో దోహదం చేసిందని చెబుతోంది. ప్రెగ్నెన్సీ సమయంలో బికినీలో తన బేబీ బంప్‌ని ప్రదర్శిస్తూ నేటి తల్లులందరి మదిలో ప్రెగ్నెన్సీపై ఉండే అపోహల్ని, మూసధోరణుల్ని బద్దలు కొట్టిన ఈ యమ్మీ మమ్మీ.. ప్రసవానంతరం తన ఫిట్టెస్ట్ ఫిజిక్‌తో, వర్క్-లైఫ్ బ్యాలన్స్‌తో మహిళలకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. ఈ క్రమంలో ప్రసవానంతరం తిరిగి ఫిట్‌గా మారేందుకు లిసా పాటించిన డైట్, ఫిట్‌నెస్, ఇతర సీక్రెట్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..
'బోల్డ్ అండ్ బ్యూటిఫుల్'.. ఈ రెండు పదాలు బాలీవుడ్ అందం లిసా హెడెన్‌కు సరిగ్గా సరిపోతాయి. కేవలం మోడల్‌గానే కాకుండా.. 'క్వీన్', 'హౌస్‌ఫుల్ 3', 'యే దిల్ హై ముష్కిల్'.. వంటి సినిమాల్లో నటిగానూ సక్సెస్ సాధించిందీ ముద్దుగుమ్మ. 2016లో డినో లల్వానీ అనే బ్రిటిష్ వ్యాపారవేత్తను వివాహమాడిన లిసా.. ఆ తర్వాతి ఏడాది జాక్ లల్వానీ అనే ముద్దుల బాబుకు జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత ఎక్కువగా కుటుంబానికే పరిమితమైన ఈ అందాల తార.. గతంలో 'టాప్ మోడల్ ఇండియా' అనే రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహరించింది. ఓవైపు తన బాబు ఆలనా పాలనలో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మహా చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్ని ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటుందీ బ్యూటిఫుల్ మామ్. ఈ క్రమంలో తన బేబీ బంప్‌ని ప్రదర్శిస్తూ, తన ముద్దుల బాబుకు పాలిస్తూ క్లిక్‌మనిపించిన ఫొటోల్ని సైతం నిర్మొహమాటంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మహిళలకు మాత్రమే దక్కిన అలాంటి అందమైన ఫీలింగ్స్‌ని దాచుకోకుండా అందరితో పంచుకోవాలని చెబుతోందీ యమ్మీ మమ్మీ.

View this post on Instagram

A post shared by Lisa Lalvani (@lisahaydon) on


10 పెరగమంటే 20 పెరిగా!
హాయ్.. నేను మీ లిసాని. నా పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ గురించి మాట్లాడడం కరక్ట్ కాదేమో అనేది నా భావన! ఎందుకంటే ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. అందరికీ ఒకే రకమైన రొటీన్ సరిపడకపోవచ్చు. అయినా సరే.. మీకోసం కొన్ని విషయాలు చెప్పడానికే ఇలా మీ ముందుకొచ్చా. నేను గర్భం ధరించక ముందు 53-54 కిలోల బరువుండేదాన్ని. ప్రెగ్నెన్సీలో అదనంగా 20 కిలోలు పెరిగా. నేను ప్రెగ్నెన్సీలో కనీసం 10 కిలోలైనా పెరగాలని డాక్టర్లు సూచించారు.. కానీ నేను 20 కిలోలు పెరిగా. ఆ సమయంలో నా చుట్టూ ఉన్న వాళ్లంతా.. 'ఇది నీ బరువు కాదు.. నీ శరీరంలో ఉండే నీటి శాతం అని, పాపాయి ఎక్కువ బరువు ఉండి ఉండచ్చు అని..' ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా అనేవారు. ప్రసవానికి ముందు డాక్టర్ నా బరువు చెక్ చేశారు.. జాక్ పుట్టాక నా బరువు కొలుచుకుంటే వాడి వెయిట్ తప్ప నేనేమీ కోల్పోలేదనిపించింది. వాడు మూడున్నర కిలోలతో ఆరోగ్యంగా పుట్టాడు. ఆ సమయంలో పనుల్ని సమన్వయం చేసుకోవడం, బ్రెస్ట్‌ఫీడింగ్ విషయంలో నాకు ఎదురైన సందేహాల్ని తీర్చుకోవడానికి కాస్త ఇబ్బంది పడ్డా.. ఎందుకంటే నేను గర్భం దాల్చకముందే అమ్మ పోయింది.. దాంతో ఈ విషయాలన్నీ నాకు కొత్త కావడంతో మొదట్లో కాస్త ఒత్తిడిగా అనిపించేది. కానీ క్రమంగా ఆ ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడి నా చిన్నారికి సంతోషంగా పాలివ్వడం అలవాటు చేసుకున్నా. పాలిచ్చే తల్లులు ఎలాంటి మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు లేకుండా బిడ్డలకు పాలిస్తేనే అవి పిల్లల ఒంటికి పడతాయి. అప్పుడే తల్లీబిడ్డలిద్దరికీ మధ్య అనుబంధం మరింతగా దృఢమవుతుంది.

పాలు పడితే బరువు తగ్గుతాం!

View this post on Instagram

A post shared by Lisa Lalvani (@lisahaydon) on

అయితే బ్రెస్ట్‌ఫీడింగ్ గురించి నేను ఇంతలా నొక్కి చెప్పడానికి కారణం లేకపోలేదు. దానివల్ల తల్లీబిడ్డల మధ్య అనుబంధం పెరగడం ఒక్కటే కాదు.. నిరంతరం తల్లి బిడ్డకు పాలివ్వడం వల్ల అటు తల్లికి, ఇటు బిడ్డకు ఇద్దరూ ఎలాంటి అనారోగ్యాల పాలు కాకుండా తమని తాము కాపాడుకోవచ్చు. అలాగే ఈ ప్రక్రియ వల్ల ప్రసవానంతర బరువూ సులభంగా తగ్గచ్చు. ఈ విషయం నేను అనుభవ పూర్వకంగా చెబుతున్నది. బాబు పుట్టాక నేను పోస్ట్ చేసిన ఫొటోలు చూసి చాలామంది నా ఫిట్‌నెస్, ఆరోగ్యం గురించి పలు ప్రశ్నలు సంధించేవారు. బాబు పుట్టాక ఇంత త్వరగా తిరిగి ఫిట్‌నెస్‌ను ఎలా సొంతం చేసుకున్నారంటూ అడిగేవారు. వారందరికీ నేను చెప్పదలచుకున్న సమాధానం ఒక్కటే. అదే బ్రెస్ట్‌ఫీడింగ్. నేను తిరిగి మునుపటి శరీరాకృతికి చేరుకోవడంలో బిడ్డకు పాలివ్వడం ఎంతగానో సహకరించింది. ఈ బిజీ షెడ్యూల్‌లో పిల్లలకు పాలివ్వడం అనేది కాస్త సమయం తీసుకునే ప్రక్రియే. కానీ అన్నింటికంటే అదే ముఖ్యం. అదే మనల్ని, మన పిల్లలకు దగ్గర చేస్తుంది. అంతేకాదు.. పిల్లలకు పూర్తి పోషకాలను తల్లిపాలే అందించగలుగుతాయి. అందుకే నేను నా కొడుక్కి ఏడాది పాటు పాలిచ్చా. కాబట్టి మీరూ మీ చిన్నారులకు తల్లిపాలు అందిస్తూ అటు వారి ఆరోగ్యాన్ని కాపాడుతూనే ఇటు మీరు ప్రసవానంతర బరువూ తగ్గచ్చు.

వాడు పడుకున్నాకే యోగా!

View this post on Instagram

A post shared by Lisa Lalvani (@lisahaydon) on

ప్రసవానంతరం కొన్ని నెలలకే నేను బరువు తగ్గానంటే అందులో నేను చేసిన వ్యాయామాల పాత్ర కూడా కీలకమే! ఒక రకంగా చెప్పాలంటే వ్యాయామం అనేది నా రక్తంలోనే ఉంది. ఎందుకంటారా..? మా అమ్మకు వ్యాయామం అంటే చాలా ఇష్టం. మేం ఎనిమిది మంది పిల్లలం. మా అందరితో ఆమె వ్యాయామం చేయించేది. అలా చిన్నతనం నుంచే ఎక్సర్‌సైజ్‌పైకి నా మనసు మళ్లింది. ప్రెగ్నెన్సీలో, ప్రసవానంతరం కూడా ఎక్సర్‌సైజ్ రొటీన్‌ని మరవలేదు. అలాగే చిన్నతనం నుంచి కథక్ డ్యాన్స్ అన్నా నాకు చాలా ఇష్టం. కానీ పెద్దయ్యే క్రమంలో దాన్ని కొనసాగించలేకపోయా. నా బాబు పుట్టిన తర్వాత రోజూ వాడితో మారథాన్ చేస్తున్నా. వాడిని బేబీ క్యారియర్‌లో కూర్చోబెట్టుకొని మెట్లెక్కడం, దిగడం.. వీటితోనే నాకు చాలా వర్కవుట్ చేసినట్లవుతుంది. దీంతో వ్యాయామం చేయడానికి కూడా సరైన సమయం దొరక్కపోయేది. ఎప్పుడైనా వాడు చిన్న కునుకు తీస్తే.. ఆ సమయాన్ని యోగా సెషన్‌గా ఉపయోగించుకునేదాన్ని. అలాగే అప్పుడప్పుడూ కాస్త ఖాళీ దొరికితే మా ఇంటికి దగ్గర్లో ఉండే స్పిన్నింగ్ క్లాసులకు వెళ్తా.. సెలబ్రిటీ ఎక్స్‌పర్ట్ నమ్రతా పురోహిత్ ఆధ్వర్యంలో నేను చేసిన పిలాటిస్‌ కూడా ప్రసవానంతరం నేను బరువు తగ్గడానికి ఎంతో దోహదం చేశాయి. ఇక ఎక్కడికైనా దగ్గర ప్రదేశానికి వెళ్లాల్సి వస్తే నడుచుకుంటూ వెళ్లిపోతా.. వీటితో పాటు రోజూ రన్నింగ్, స్విమ్మింగ్.. వంటివి నా వర్కవుట్ రొటీన్‌లో ఉండాల్సిందే! ఇలా మనం ప్రసవానంతరం బరువు తగ్గడానికి కఠినమైన వ్యాయామాలంటూ పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.. ఇలాంటి సింపుల్ వర్కవుట్స్‌తోనే తక్కువ సమయంలోనే మల్లెతీగలా మారిపోవచ్చు.. అయితే ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది కాబట్టి మీరూ పోస్ట్ ప్రెగ్నెన్సీ వర్కవుట్స్ చేయాలంటే ఓసారి నిపుణుల్ని అడిగితే వారే మీ శరీరానికి నప్పే వ్యాయామాలు సూచిస్తారు. తద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

సప్లిమెంట్స్ మానేశా!

View this post on Instagram

A post shared by Lisa Lalvani (@lisahaydon) on

* ఇక నా డైట్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే కొబ్బరి నీళ్లు తాగడం నాకు అలవాటు. ఎందుకంటే అది నా శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేయడంతో పాటు శరీరంలోని విషపదార్థాలను బయటికి పంపించేస్తుంది.
* పండ్లు, ఉడికించిన కోడిగుడ్లు బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తీసుకుంటా. ఇక షూటింగ్స్‌లోనైతే ఇడ్లీ-సాంబార్, దోసె.. వంటివి తీసుకుంటా.
* లంచ్‌లోనైతే చికెన్ సలాడ్ తప్పనిసరిగా ఉండాల్సిందే!
* డిన్నర్‌లో చాలా లైట్ ఫుడ్ తీసుకోవడానికే మొగ్గుచూపుతా. ఈ క్రమంలో తాజా పండ్లు, కాయగూరల సలాడ్స్, పండ్ల రసాలు.. వంటివి తీసుకుంటా. అప్పుడప్పుడూ (చాలా రేర్‌గా) ఏదో ఒక డెజర్ట్ తీసుకోవడానికి ఇష్టపడతా. అందులోనూ ప్యాన్‌కేక్స్-ఛీజ్‌కే నా తొలి ప్రాధాన్యం.
* రోజంతా నీళ్లు ఎక్కువగా తాగడం, ఆకుపచ్చ కాయగూరలు, ఆకుకూరలతో చేసిన వంటకాలు తీసుకోవడానికే ఎక్కువ ఇష్టపడతా.
* చాలామంది డైటింగ్ పేరుతో ఆహారం మానేసి, పోషకాల కోసం విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు. నేనూ గతంలో అలానే చేసేదాన్ని. కానీ వీటి కంటే తాజా పండ్లు, కాయగూరల ద్వారా శరీరానికి అందే పోషకాలు మంచివని గ్రహించా. ఇక అప్పట్నుంచి సప్లిమెంట్స్ మానేసి తాజా ఆహారానికే ప్రాధాన్యమిస్తున్నా.

అమ్మ పాత్రలోని కమ్మదనం అదే!

View this post on Instagram

A post shared by Lisa Lalvani (@lisahaydon) on

ప్రతి తల్లికీ తన బిడ్డపై ఎనలేని మమకారం ఉంటుంది. ఆ విషయం నాకు నా పిల్లలు పుట్టినప్పుడే అనుభవపూర్వకంగా అర్థమైంది. వారిద్దరూ నాకు రెండు కళ్లు.. తల్లిగా ఉండడం కంటే ఇప్పటివరకు నాకేదీ అంత ఆనందంగా అనిపించలేదు. ఇప్పటివరకు అటు సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలోనూ కూతురిగా, భార్యగా ఎన్నో పాత్రలు పోషించా.. అయినా అమ్మ పాత్ర ఇచ్చినంత ఆనందం, సంతృప్తి అవేవీ ఇవ్వలేదు.. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు నా ఏకాగ్రత అంతా నా బుజ్జాయిలపైన, నా భర్తపైనే ఉంటుంది. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యాలు రెండు.. అవి అటు పనిని, ఇటు ఇంటిని సమన్వయం చేస్తూ ముందుకు సాగడం, నా చిన్నారుల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం. మీరూ ఇలా రెండింటినీ సమన్వయం చేసుకోగలిగితే ఒత్తిడి నుంచి బయటపడచ్చు.. అలాగే పిల్లలకూ సమయం కేటాయించచ్చు.. అప్పుడే అటు వారు, ఇటు మీరు ఒకరికొకరు మిస్సయిన భావన రాకుండా.. ఇద్దరి మధ్యా అనుబంధం మరింత బలపడుతుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ కొన్ని విషయాలు మీకు కొంతవరకైనా ఉపయోగపడతాయనుకుంటున్నా.. ఆల్ ది బెస్ట్ న్యూ మామ్స్.. టేక్ కేర్ ఆఫ్ యువర్ న్యూ బోర్న్ బేబీస్.. బై బై..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ లిసా హెడెన్ చెప్పిన అమ్మతనపు అనుభవాలు, పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ సీక్రెట్స్ గురించి తెలుసుకున్నారుగా! అయితే ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది.. కాబట్టి వీటిని పాటించే ముందు ముఖ్యంగా డైట్, వ్యాయామం.. విషయాల్లో మాత్రం ఓసారి ముందుగా నిపుణుల సలహా తీసుకొని ఆ తర్వాత ప్రారంభించడం మంచిది.

Photo: Instagram

women icon@teamvasundhara
samantha-akkineni-attempts-animal-flow-in-latest-video;-know-about-the-workout

కొత్త సంవత్సరంలో సమంత కొత్త హాబీ.. ఎందుకో తెలుసా?

కొత్త ఏడాదిలో నేను అది చేయాలి.. ఇది సాధించాలని కొత్త కొత్త తీర్మానాలు తీసుకోవడం సహజం. ఈ క్రమంలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, చెడు అలవాట్లను వదిలేయడం.. ఇలా ఎవరికి నచ్చిన లక్ష్యాలను వారు నిర్దేశించుకుంటారు.. వాటిని తమ రోజువారీ అలవాట్లుగా మార్చుకుంటుంటారు. ఇలాగే మన టాలీవుడ్‌ బ్యూటీ సమంత కూడా కొత్త ఏడాదిలో ఓ కొత్త అలవాటును అలవర్చుకున్నానని చెబుతోంది. సాధారణంగానే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాదంతా ఫిట్‌గా ఉండాలన్న ఉద్దేశంతో ఓ చక్కటి వర్కవుట్‌ను తన రొటీన్‌లో భాగం చేసుకున్నానంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. తన వర్కవుట్‌ వీడియోను అందరితో పంచుకుంటూ మరోసారి ఫిట్‌నెస్‌ విషయంలో అందరినీ అలర్ట్‌ చేసింది. మరి, ఇంతకీ సామ్‌ అలవాటు చేసుకున్న ఆ కొత్త ఫిట్‌నెస్‌ రొటీన్‌ ఏంటి? మనల్ని ఫిట్‌గా ఉంచేందుకు అది ఎంత వరకు ఉపయోగపడుతుంది? తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
diet-mistakes-and-how-to-avoid-them-in-telugu

డైటింగ్ చేస్తున్నా బరువు తగ్గట్లేదా?

అబ్బబ్బా.. విసుగొచ్చేసింది. ఎన్ని రోజులు డైటింగ్ చేసినా ఈ వెయింగ్ మెషీన్ ఎటూ కదలదే.. ఎప్పుడూ అదే బరువు చూపిస్తోంది. బరువు చూసుకోవాలంటేనే విసుగ్గా ఉంది.. అనుకుంటోంది ముప్ఫై సంవత్సరాల శ్రీనిధి.. ఇలాంటి సమస్య చాలామందికి ఎదురవుతూ ఉంటుంది. సాధారణంగా బరువు ఎక్కువగా ఉన్నవారిలో చాలామంది దాన్ని తగ్గించుకోవడానికి వివిధ రకాల డైట్లు పాటిస్తూ ఉంటారు. ఇందులో కొంతమంది బరువు తగ్గడంలో విజయం సాధిస్తే.. మరికొందరు మాత్రం వెనుకబడిపోతుంటారు. ఇలా వెనుకబడిపోవడం వెనుక కొన్ని తప్పులుంటాయి. అవేంటో విశ్లేషించుకొని, వాటిని సరిదిద్దుకుంటే సులువుగా బరువు తగ్గే వీలుంటుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
what-are-the-best-exercises-for-pregnant-women-their-benefits

ప్రెగ్నెన్సీలో ఏ వ్యాయామాలు మంచివి!

నెలలు నిండుతున్న కొద్దీ పొట్ట క్రమంగా పెరుగుతుంది.. తద్వారా ఏ పనీ చేయడానికి శరీరం సహకరించదు. దీనికి తోడు నడుము నొప్పి, పాదాల్లో వాపు.. వంటి అనారోగ్యాలు కూర్చున్న చోటు నుండి గర్భిణుల్ని కదలకుండా చేస్తాయి. నిజానికి గర్భంతో ఉన్న మహిళలు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి వ్యాయామం చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు సలహా ఇస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ అందాల తార అనుష్కా శర్మ కూడా అదే చేసింది. మరికొన్ని రోజుల్లో అమ్మగా ప్రమోషన్‌ పొందనున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ తన రోజువారీ వర్కవుట్‌ను కొనసాగిస్తోంది. తాను తాజాగా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసిన ఓ వర్కవుట్‌ వీడియోనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ! గర్భం ధరించిన మహిళలు ఇలా క్రమం తప్పకుండా తమ వర్కవుట్‌ని కొనసాగిస్తే ఎంతో చురుగ్గా, ఆరోగ్యంగా ఉండచ్చని మరోసారి నిరూపించిందీ టు-బి-మామ్‌. ఈ నేపథ్యంలో అసలు గర్భిణులకు వ్యాయామం ఎందుకు అవసరం? వారు ఏయే వ్యాయామాలు చేయచ్చు? వాటివల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? వంటి విషయాలన్నీ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
ways-to-track-your-weight-loss-progress-in-telugu

తగినంత తగ్గామని తెలుసుకోవడమెలా..?

అధిక బరువు.. చాలామందికి ఓ పెద్ద సమస్య ఇది.. ఈ నేపథ్యంలో తాము కోరుకున్న సంఖ్య వెయింగ్ స్కేల్‌పై కనిపించేవరకూ కష్టపడుతూనే ఉంటారు. ఇందుకోసం కొందరు విభిన్న రకాల డైట్లను ఫాలో అవుతుంటే, మరికొందరేమో చెమటోడ్చి వ్యాయామాలు చేస్తుంటారు. మంచి పోషకాహారం, చక్కటి వ్యాయామం ఈ రెండూ మన శరీరం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చాలామంది ఈ మార్గంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతారు. కానీ ఈ రెండూ ఎక్కడ ఆపాలన్న విషయం మాత్రం వారికి అర్థం కాదు.. ఇంతకీ బరువు తగ్గాల్సిన అవసరం లేదు అని మనకు ఎప్పుడు అనిపిస్తుంది? తగినంత బరువు తగ్గామని ఎలా తెలుసుకోవచ్చు? చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
reasons-why-people-gain-weight-in-winters-and-how-to-avoid-it
women icon@teamvasundhara
ways-to-gain-weight-in-telugu

బరువు పెరగాలనుకుంటున్నారా?

బరువు తగ్గడం ఎంత కష్టమో పెరగడమూ అంతే కష్టం. ఏంటీ?? బరువు పెరగడమా?? ఎవరైనా తగ్గాలని కోరుకుంటారు గానీ.. పెరగాలనుకుంటారా?? అని ఆశ్చర్యపోతున్నారా?? కొన్ని రకాల ఉద్యోగాలకు 'కచ్చితంగా ఇంత బరువుండాలి' అని ఉంటుంది. అలాగే వయసుకు తగ్గ బరువు లేకుండా బాగా సన్నగా ఉండే వారు కూడా బరువు పెరగాలనుకుంటారు. ఈ క్రమంలో 'కొవ్వు పదార్థాలున్న ఆహారం ఎక్కువగా తీసుకుంటే చాలు.. సులభంగా బరువు పెరగొచ్చు. అందులో కష్టమేముంది' అనుకుంటారు కొంతమంది. అలా తీసుకుంటే శరీరంలో అనవసర కొవ్వు పేరుకుపోయి.. కావలసిన దానికంటే ఎక్కువ బరువు పెరిగి.. రకరకాల ఆరోగ్య సమస్యలు దరిచేరతాయి. కాబట్టి లేనిపోని సమస్యలు తెచ్చుకోకుండా, అవసరమున్నంత మేరకే బరువు పెరగాలంటే ఏం చేయాలో చూద్దాం..

Know More

women icon@teamvasundhara
winter-exercise-tips-in-telugu

చలికి తట్టుకొని వర్కవుట్‌ చేయాలంటే..!

చలికాలం వచ్చిందంటే చాలు సహజంగానే మనలో బద్ధకం ఆవహిస్తుంది. మిగతా కాలాల్లో రోజూ ఉదయాన్నే నిద్రలేచి వర్కవుట్లకు ఉపక్రమించే వారు చలికాలంలో మాత్రం దుప్పటి కప్పుకొని ‘ఇంకాసేపటికి లేద్దాం లే..’ అంటూ బారెడు పొద్దెక్కేదాకా మంచానికే పరిమితమవుతుంటారు. మరి అన్ని రోజులూ వర్కవుట్లు చేసి ఒక్కసారిగా ఆపేస్తే శారీరక ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చలికాలంలో వ్యాయామాల మీదకు మనసు మళ్లాలంటే రొటీన్‌కి భిన్నంగా కొన్ని విభిన్న వర్కవుట్స్‌ చేయాలని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. తద్వారా శరీరానికి చక్కటి వ్యాయామం అంది.. ఫిట్‌గా మారే అవకాశం ఉంటుంది. అయితే చలికాలంలో చేసే వ్యాయామం ఏదైనా సరే.. ఈ క్రమంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకొని మనమూ ఈ వింటర్‌లో ఫిట్‌గా, ఆరోగ్యంగా మారిపోదాం రండి..

Know More

women icon@teamvasundhara
basic-principles-you-need-to-know-about-doing-aerobic-exercises
women icon@teamvasundhara
weight-loss-tips-for-after-marriage-in-telugu

పెళ్లి తర్వాత బరువు పెరగకుండా ఉండాలంటే..!

చాలామంది అమ్మాయిలు పెళ్లి తర్వాత బరువు పెరుగుతుంటారు. అయితే ఇందుకు చాలా రకాల కారణాలే ఉంటాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరూ లేదా కుటుంబ సభ్యులంతా కలిసి ఇతర పార్టీలకు హాజరవడం, బంధువుల ఇళ్లకు వెళ్లడం, వారాంతాల్లో బయట తినడం, వ్యాయామానికి తగిన సమయం కేటాయించకపోవడం.. ఇలా కారణాలేవైనా వారి లైఫ్‌స్త్టెల్‌లో మార్పులొచ్చి బరువు పెరగడం మనం గమనిస్తూనే ఉంటాం. దీంతో వారు అటు శారీరకంగా, ఇటు మానసికంగా దృఢత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. మరి ఇలా జరగకుండా ఉండాలంటే పెళ్లి తర్వాత ఫిట్‌నెస్‌పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
spices-which-can-help-you-lose-weight-in-the-winter-season-in-telugu

చలికాలంలో ఇవి తింటే సులభంగా బరువు తగ్గచ్చట!

‘బరువు తగ్గాలి.. నాజూగ్గా మారాలి..’ ప్రస్తుతం చాలామంది జపిస్తోన్న ఫిట్‌నెస్‌ మంత్ర ఇది. అందుకోసమే ఇటు చక్కటి ఆహారం తీసుకుంటూనే.. అటు కఠినమైన వ్యాయామాలు చేయడానికీ వెనకాడట్లేదు ఈ తరం అమ్మాయిలు. అయితే ఇలా ఎంత ప్రయత్నించినా ఈ చలికాలంలో మాత్రం బరువు తగ్గడం కాస్త కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది. తద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి చాలా సమయం పడుతుంది. అలాగని బరువు తగ్గలేమేమో అని నీరసపడిపోకుండా.. జీవక్రియల పనితీరును ప్రేరేపించే ఆహారం తీసుకోమంటున్నారు నిపుణులు. ఫలితంగా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుందంటున్నారు. ఇందుకు మన వంటింట్లో ఉండే మసాలాలను మించిన పరమౌషధం లేదంటున్నారు. మరి, ఈ శీతాకాలంలో శరీరంలోని జీవక్రియల పనితీరును మెరుగుపరిచి మనం బరువు తగ్గేందుకు సహకరించే ఆ మసాలాలేవి? వాటితో బరువు తగ్గడం ఎలా సాధ్యమవుతుంది? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
tips-to-do-exercise-in-winter
women icon@teamvasundhara
gul-panag-reveals-how-she-achieved-her-goal-of-100-push-ups-a-day-and-the-motivation-behind-it

పదితో మొదలుపెట్టి వందకు చేరుకున్నా!

వ్యాయామం ప్రారంభించిన మొదట్లో అలసట లేకుండా కాసేపు చేయగలుగుతాం. అదే రోజూ సాధన చేసిన కొద్దీ సమయాన్ని పెంచుకుంటూ పోవడమే కాదు.. అందులో పరిణతి కూడా సాధించగలుగుతాం. ఇదే విషయాన్ని నిరూపిస్తోంది బాలీవుడ్‌ అందాల తార గుల్‌ పనగ్. పుషప్స్‌ చేయడం ప్రారంభించిన మొదట్లో కాస్త కష్టంగానే అనిపించినా.. సాధన చేసిన కొద్దీ వాటిని సునాయాసంగా చేయడానికి అలవాటు పడ్డానని చెబుతోందీ బ్యూటిఫుల్‌ మామ్‌. అందుకు లాక్‌డౌన్‌ సమయం చక్కగా ఉపయోగపడిందంటోంది. మామూలుగానే ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టే గుల్ పనగ్.. ఈ క్రమంలో తాను చేసిన వ్యాయామాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తన ఫ్యాన్స్‌కి ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా తన పుషప్స్‌ వీడియోను పోస్ట్‌ చేసిన ఈ తార.. సాధన వల్లే ఈ వ్యాయామం సులభంగా చేయగలుగుతున్నానంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది.

Know More

women icon@teamvasundhara
winter-exercise-tips

చలికి తట్టుకొని వర్కవుట్‌ చేయాలంటే..!

చలికాలం వచ్చిందంటే చాలు సహజంగానే మనలో బద్ధకం ఆవహిస్తుంది. మిగతా కాలాల్లో రోజూ ఉదయాన్నే నిద్రలేచి వర్కవుట్లకు ఉపక్రమించే వారు చలికాలంలో మాత్రం దుప్పటి కప్పుకొని ‘ఇంకాసేపటికి లేద్దాం లే..’ అంటూ బారెడు పొద్దెక్కేదాకా మంచానికే పరిమితమవుతుంటారు. మరి అన్ని రోజులూ వర్కవుట్లు చేసి ఒక్కసారిగా ఆపేస్తే శారీరక ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చలికాలంలో వ్యాయామాల మీదకు మనసు మళ్లాలంటే రొటీన్‌కి భిన్నంగా కొన్ని విభిన్న వర్కవుట్స్‌ చేయాలని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. తద్వారా శరీరానికి చక్కటి వ్యాయామం అంది.. ఫిట్‌గా మారే అవకాశం ఉంటుంది. అయితే చలికాలంలో చేసే వ్యాయామం ఏదైనా సరే.. ఈ క్రమంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకొని మనమూ ఈ వింటర్‌లో ఫిట్‌గా, ఆరోగ్యంగా మారిపోదాం రండి..

Know More

women icon@teamvasundhara
pregnant-anushka-sharma-does-sirsasana-sets-major-fitness-goals
women icon@teamvasundhara
here-is-the-type-and-amount-of-exercise-you-need-who-advises

women icon@teamvasundhara
dia-mirza-learns-kalaripayattu-know-more-about-the-benefits-of-this-martial-art-form

దియా నేర్చుకుంటున్న ఈ మార్షల్‌ ఆర్ట్స్ తో ప్రయోజనాలెన్నో!

కొంతమంది వారి కెరీర్‌తో సంబంధం ఉన్నా, లేకపోయినా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఉత్సుకత చూపుతారు. అదే మరికొందరు తమ కెరీర్‌లో దూసుకుపోవడానికి ఎంత కష్టమైన నైపుణ్యమైనా ఇష్టంగా నేర్చేసుకుంటారు. అలాగే ఓ నటిగా తాను కూడా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతానంటోంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దియా మీర్జా. పర్యావరణమంటే ప్రాణం పెట్టే ఈ చక్కనమ్మ.. తన ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌కీ అంతే ప్రాధాన్యమిస్తుంటుంది. ఈ క్రమంలో తాను పాటించే ఆరోగ్య రహస్యాలు, ఫిట్‌నెస్‌ చిట్కాలను అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌ కోసం పంచుకుంటుంటుంది దియా. ఈ క్రమంలోనే తాను కలరిపయట్టు అనే యుద్ధ విద్య నేర్చుకుంటోన్న ఫొటోను ఇటీవలే ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ బాలీవుడ్‌ బ్యూటీ. మరి, ఇంతకీ ఉన్నట్లుండి ఇంత కష్టతరమైన యుద్ధ కళను ఈ ముద్దుగుమ్మ ఎందుకు నేర్చుకుంటోందో తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
taapsee-pannu-shares-recipe-for-drink-that-helps-burn-fat
women icon@teamvasundhara
night-time-weight-loss-tips

బరువు తగ్గాలంటే పడుకునే ముందు ఇలా!

నీలిమ, మధురిమ.. ఇద్దరూ చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. ప్రస్తుతం వీరిద్దరూ ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే వీరిలో నీలిమ కంటే మధురిమ కాస్త లావుగా ఉంటుంది. దీంతో తను కూడా నీలిమలా నాజూగ్గా తయారవ్వాలని రోజూ వ్యాయామాలు చేయడం, మంచి ఆహారం తీసుకోవడం.. వంటి చిట్కాలన్నీ పాటిస్తోంది. ఇలా చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇవన్నీ సరే గానీ.. వీటితో పాటు మీరు చేయాల్సిన పని మరొకటుంది. అదేంటి అనుకుంటున్నారా? రాత్రి పడుకునే ముందు కొన్ని చిన్న చిన్న చిట్కాల్ని పాటించడం! దీనివల్ల కొద్ది రోజులకే బరువు తగ్గి నాజూగ్గా తయారుకావచ్చంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. మరి అవేంటో తెలుసుకొని మనమూ పాటిద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
weight-loss-tricks-to-help-you-wake-up-slimmer

సాయంత్రపు అలవాట్లతో ‘స్లిమ్‌’గా మారిపోదాం..!

బరువు తగ్గడానికి రోజూ చేసే వ్యాయామాలతో పాటు ఇంట్లో చేసే కొన్ని చిన్న చిన్న పనులు కూడా తోడ్పడతాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీటికి సాయంత్రం చేసే కొన్ని సులభమైన పనులు కూడా తోడైతే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగని నామమాత్రంగా వీటిని ఫాలో అవుతూ తక్షణమే బరువు తగ్గాలనుకోవడం కూడా సరికాదు. కాబట్టి సాయంత్రం పూట చేసే ఆ పనుల్ని రోజువారీ అలవాట్లుగా మార్చుకోవాలి. తద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాల్ని అనతి కాలంలోనే చేరుకోవచ్చు. మరి బరువు తగ్గడానికి రోజూ సాయంత్రం పూట చేయాల్సిన ఆ పనులేంటో మనం కూడా తెలుసుకుందామా...

Know More

women icon@teamvasundhara
child-artiste-gangu-bai-loses-22-kgs-during-lockdown-opens-up-about-being-body-shamed
women icon@teamvasundhara
bhumi-pednekar-prepares-a-coffee-with-a-special-twist-what-is-the-story-behind-this?
women icon@teamvasundhara
balika-vadhu-actress-avika-gor-opens-up-on-massive-weight-loss-journey-through-her-instagram-post

ఆరోజు అద్దంలో నన్ను నేను చూసుకొని అసహ్యించుకున్నా!

రోజులో ఎన్నోసార్లు మన అందాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంటాం. అలాంటిది ఎప్పుడైనా మనకు మనం లావుగా కనిపించినా, రోజులాగా అందంగా కనిపించకపోయినా ‘ఏంటిది.. ఈ రోజు ఇలా ఉన్నానేంటి?’ అనుకుంటూ ఉంటాం.. ఇలా తమ శరీరంలో వచ్చిన మార్పుల్ని స్వీకరించకుండా అసహ్యించుకునే వారూ లేకపోలేదు. ఒకానొక దశలో తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది ‘చిన్నారి పెళ్లికూతురు’ అవికా గోర్‌. లావెక్కిన తన కాళ్లు, చేతులు చూసుకొని ఎంతో బాధపడ్డానని, అభద్రతా భావానికి లోనయ్యానని చెబుతోంది. ఇక ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాంటి ఫలితం ఉండదన్న విషయం ఆలస్యంగా గ్రహించినా.. అప్పట్నుంచి తన శరీరాన్ని ప్రేమించుకుంటూ తనకు నచ్చినట్లుగా మార్చుకున్నానంటోంది. ఈ క్రమంలోనే బొద్దుగుమ్మగా ఉన్న తాను ముద్దుగుమ్మగా ఎలా మారిందో, ఈ జర్నీలో తనకెదురైన అనుభవాలేంటో వివరిస్తూ సోషల్‌ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ బాలీవుడ్‌ బ్యూటీ. ఎలా ఉన్నా ఎవరికి వారు తమ శరీరాన్ని ప్రేమించాలని, అంగీకరించాలన్న చక్కటి సందేశాన్ని చాటుతోన్న ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
how-to-control-your-weight-in-menopause

మెనోపాజ్ దశలో బరువు తగ్గాలంటే..!

చాలామంది మహిళలు మెనోపాజ్ దశలో బరువు పెరగడం మనం గమనిస్తూనే ఉంటాం. శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయులు తగ్గిపోవడం, వయసు పెరిగే కొద్దీ కండరాల దారుఢ్యం తగ్గి.. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం.. మొదలైన కారణాలే ఈ సమస్యకు కారణమవుతున్నాయి. అలాగే వయసు పైబడే కొద్దీ శరీరంలో జీవక్రియల రేటు కూడా మందగించడం వల్ల క్యాలరీలు కరిగించే శక్తి కూడా రోజురోజుకీ క్షీణిస్తుంది. అయినప్పటికీ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహార నియమాలు పాటించడం.. వంటి వాటి వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ క్రమంలో మెనోపాజ్ దశలో బరువు తగ్గాలంటే ఎలాంటి విషయాలు దృష్టిలో ఉంచుకోవాలో చూద్దామా..

Know More

women icon@teamvasundhara
this-is-how-kangana-ranaut-gets-fit-losing-20-kgs-she-gained-for-thalaivi

ఆ 20 కిలోలు తగ్గడానికే ఈ శ్రమంతా!

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ వంటి విషయాల్లో మన అందాల నాయికలు తీసుకునేంత శ్రద్ధ మరెవరూ తీసుకోరేమో అనిపిస్తుంది వాళ్ల లైఫ్‌స్టైల్‌ని చూస్తే! అయితే వాళ్లకొచ్చే సినిమా అవకాశాలు, అందులోని పాత్రలకు తగ్గట్లుగా బరువు పెరగడం, తగ్గడం.. అంత సులభమైన విషయమేమీ కాదు. ఇందులోనూ తమ పాత్రల్లో ఒదిగిపోవడానికి కొందరు ప్రోస్థటిక్ మేకప్‌ను ఆశ్రయిస్తే.. మరికొందరు నిజంగానే తమ శరీరాన్ని పాత్రకు తగినట్లుగా మలచుకుంటుంటారు. బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్‌ కూడా ఇదే పని చేసింది. ‘తలైవి’గా తెరకెక్కనున్న జయలలిత బయోపిక్‌లో నటిస్తోన్న ఆమె.. ఆ పాత్ర కోసం ఏకంగా 20 కిలోలు పెరిగిందట! ఇక ఇప్పుడు తగ్గే పనిలో పడ్డానంటోందీ చక్కనమ్మ. అంతేకాదు.. బరువు పెరగడం ఎంత సులభమో.. తగ్గడం అంతకంటే కష్టమంటూ తన వర్కవుట్స్‌ గురించి సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు పెడుతోందీ మనాలీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
ways-to-kill-the-laziness-in-telugu
women icon@teamvasundhara
ways-to-lose-weight-during-menopause-in-telugu

మెనోపాజ్ దశలో బరువు తగ్గాలంటే..!

చాలామంది మహిళలు మెనోపాజ్ దశలో బరువు పెరగడం మనం గమనిస్తూనే ఉంటాం. శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయులు తగ్గిపోవడం, వయసు పెరిగే కొద్దీ కండరాల దారుఢ్యం తగ్గి.. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం.. మొదలైన కారణాలే ఈ సమస్యకు కారణమవుతున్నాయి. అలాగే వయసు పైబడే కొద్దీ శరీరంలో జీవక్రియల రేటు కూడా మందగించడం వల్ల క్యాలరీలు కరిగించే శక్తి కూడా రోజురోజుకీ క్షీణిస్తుంది. అయినప్పటికీ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహార నియమాలు పాటించడం.. వంటి వాటి వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ క్రమంలో ‘మెనోపాజ్‌ అవగాహనా మాసం’ సందర్భంగా మెనోపాజ్ దశలో బరువు తగ్గాలంటే ఎలాంటి విషయాలు దృష్టిలో ఉంచుకోవాలో చూద్దామా..

Know More

women icon@teamvasundhara
benefits-of-hitting-a-punching-bag-in-telugu

women icon@teamvasundhara
tamannah-gives-out-some-important-tips-through-her-21-day-stay-fit-challenge

21 రోజుల్లో అలా ఫిట్‌గా మారిపోయా!

ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పుతోంది. ప్రత్యేకించి ఈ వైరస్‌ కారణంగా అందరిలో ఆరోగ్య స్పృహ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటున్నారు. పోషకాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకుంటున్నారు. ఈక్రమంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ‘స్టే ఫిట్‌’ ఛాలెంజ్‌ పేరుతో కొన్ని ప్రత్యేక ఆరోగ్య నియమాలను పాటించిందట. దొరక్క దొరక్క దొరికిన ఈ ఆరు నెలల సమయాన్ని చక్కగా వినియోగించుకుంటూ మరింత కూల్‌గా, పాజిటివ్‌గా మారిపోయానంటోందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా తన అభిమానులు కూడా ఈ ‘స్టే ఫిట్‌’ ఛాలెంజ్‌ను స్వీకరించాలని కోరుతూ తాను పాటించిన ఆరోగ్య చిట్కాలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
home-remedies-to-heal-wounds-in-telugu

women icon@teamvasundhara
these-meditation-mistakes-you-should-avoid-in-telugu

ధ్యానం చేస్తున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి..!

జీవితంలోని ఒత్తిళ్ల నుంచి మనసును దూరం చేసి, మన ఇంద్రియాలను ప్రశాంత పరచుకోవాలన్నా.. ఆలోచనాశక్తిని పెంపొందించుకోవాలన్నా.. చేసే పనిపై ఏకాగ్రత, శ్రద్ధ పెంచుకోవాలన్నా.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలన్నా.. అన్నింటికీ ఒకే మందు.. అదే 'ధ్యానం'. అయితే ఈ ప్రక్రియను సరైన పద్ధతిలో అవలంబిస్తేనే పూర్తి ఫలితం దక్కుతుంది. కొంతమంది ధ్యానం చేసే క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఫలితంగా వారు చేరుకోవాల్సిన లక్ష్యాలను అనుకున్న సమయంలో చేరుకోలేకపోవచ్చు. తద్వారా వారు పడిన శ్రమ, సమయం.. రెండూ వృథానే అవుతాయి. కాబట్టి ఆ పొరపాట్లేంటో ముందుగానే తెలుసుకుని సరిదిద్దుకుంటే మంచి ఫలితాలు పొందచ్చు.

Know More

women icon@teamvasundhara
sonal-goel-this-ias-officer-posts-her-fitness-journey-on-shedding-15-kgs-post-pregnancy-is-very-inspiring-to-us

ఈ కలెక్టరమ్మ డెలివరీ తర్వాత అలా 15 కిలోలు తగ్గారట!

గర్భం ధరించిన సమయంలో బరువు పెరగడం సహజమే అనుకుంటాం.. ఇక పిల్లలు పుట్టాక వారి ఆలనా పాలనలో పడిపోయి మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం.. అటు ఉద్యోగం-ఇటు ఇంటి పనుల్ని బ్యాలన్స్‌ చేసుకోలేక ఫిట్‌నెస్‌ పైనా దృష్టి పెట్టలేం.. ఇలాంటి అనుభవాలు ప్రతి మహిళకూ పరిచయమే! అయితే మనం ఏ దశలో ఉన్నా.. ఎన్ని పనులతో బిజీగా ఉన్నా ఆరోగ్యమే మనకు తొలి ప్రాధాన్యం అంటున్నారు ఐఏఎస్‌ అధికారిణి సోనల్‌ గోయెల్‌. దాదాపు పదేళ్లకు పైగా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. ఇద్దరు పిల్లల బాధ్యతను, ఇంటిని సమర్థంగా బ్యాలన్స్‌ చేస్తున్నారు. మీకు ఇదెలా సాధ్యమవుతుందని అడిగితే.. తాను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడం వల్లేనంటూ సమాధానమిస్తున్నారామె. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వర్కవుట్‌ ఫొటోలను సైతం పోస్ట్‌ చేస్తుంటారీ కలెక్టరమ్మ. ఈ క్రమంలోనే తాను ప్రసవానంతరం బరువు తగ్గి తిరిగి ఫిట్‌గా ఎలా మారారో వివరిస్తూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారామె. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనుల్ని సమర్థంగా నిర్వర్తించుకోవచ్చనే సందేశాన్ని చాటుతోన్న ఈ పోస్ట్‌ సారాంశమేంటో ఆమె మాటల్లోనే మీకోసం..

Know More

women icon@teamvasundhara
punjabi-actress-shehnaz-kaur-gill-shares-her-weight-loss-journey-which-is-very-inspiring-to-us
women icon@teamvasundhara
vidyullekha-raman-shares-her-emotional-weight-loss-journey-through-new-instagram-post

నేను 20 కిలోలు తగ్గడానికి అదే కారణం!

తన చలాకీ మాటతీరుతో సినీ ప్రేక్షకుల్ని మాయ చేసిన ముద్దుగుమ్మ విద్యుల్లేఖా రామన్. అయితే లావుగా ఉన్న తన శరీరాకృతిని చూసి చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేసే వారని, అయితే వాళ్ల కోసం కాకుండా తన కోసం తాను ఆరోగ్యంగా, ఫిట్‌గా మారాలనుకున్నానని చాలాసార్లు చెప్పుకొచ్చిందీ చక్కనమ్మ. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌లో కసరత్తులు చేసి మరీ బరువు తగ్గానని పలు సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా ఫిట్‌నెస్‌ విషయంలో తనకున్న అంకితభావాన్ని బయటపెట్టిన విద్యుల్లేఖ.. తాజాగా తన ఫిట్‌నెస్‌ జర్నీకి సంబంధించిన మరో పోస్ట్‌ను ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.. ‘ఇతరుల కోసం మేమెందుకు మారాలంటూ’ అందరిలో ఓ ఆలోచనను రేకెత్తిస్తోంది.

Know More

women icon@teamvasundhara
healthy-diet-habits-to-learn-from-different-country-people-in-telugu