scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఇలాంటి 'వండర్ ఉమన్' ఉంటే ఫ్యామిలీ అంతా ఫిట్ గానే ఉంటుంది!

Meet Usha Soman, who makes us believe that age is just a number

Photos: Instagram

ఫిట్‌నెస్‌.. ఇది ఒక వయసుకే పరిమితమనుకుంటాం.. ఆ వయసులోనైతేనే విభిన్న వ్యాయామాలు చేయడానికి శరీరం సహకరిస్తుందనుకుంటాం. కానీ ఇదే ప్రశ్న ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ మిలింద్‌ సోమన్‌ తల్లి ఉషా సోమన్‌ని అడిగితే ‘ఫిట్‌నెస్‌కి వయసుతో సంబంధమేముంది? దానిపై మనసు పెడితే చాలు.. ఏ వయసులోనైనా దీన్ని మనం సొంతం చేసుకోవచ్చు..’ అని నిర్మొహమాటంగా చెబుతారామె. ‘వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే!’ అనే ఫిలాసఫీని నమ్మే ఈ ఫిట్‌నెస్‌ ఔత్సాహికురాలు 81 ఏళ్ల వయసులోనూ ఎలాంటి వ్యాయామమైనా అలవోకగా చేసేస్తుంటారు. అది కూడా సంప్రదాయ చీరకట్టులో చేస్తూ అందరినీ ఒకింత అబ్బురపరుస్తారు!
ఈ క్రమంలోనే తాజాగా చీరకట్టులో స్కిప్పింగ్‌, పుషప్స్‌ చేస్తూ.. ‘ప్రతి స్త్రీలోనూ ఓ వండర్‌ ఉమన్‌ ఉంటుంద’నే సందేశంతో మహిళలకు మరోసారి స్ఫూర్తిగా నిలిచారు. మరి, తరిగేది వయసే కానీ ఉత్సాహం కాదు అనేంత చలాకీగా వ్యాయామాలు చేసేస్తోన్న ఈ ఫిట్టెస్ట్‌ మామ్‌ ఫిట్‌నెస్‌ మంత్ర ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..


ఫిట్‌నెస్‌ కోసమే పుట్టారేమో అనిపిస్తుంది సోమన్‌ ఫ్యామిలీని చూస్తుంటే! ఇటు సోషల్‌ మీడియాలో, అటు మారథాన్‌లలో, మరోవైపు ఫిట్నెస్‌ ఈవెంట్లలో.. ఇలా ఎక్కడ చూసినా మిలింద్‌ సోమన్‌, ఆయన భార్య అంకితా కొన్వర్‌, తల్లి ఉషా సోమన్‌ లేనిదే ఆ ఈవెంట్‌ పూర్తి కాదంటే అది అతిశయోక్తి కాదు. బయటే కాదు.. ఇంట్లోనూ ఒకరితో ఒకరు పోటీ పడి మరీ వ్యాయామాలు చేస్తుంటారీ ఫిట్‌నెస్‌ త్రయం. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేసే తమ ఫొటోలు, వీడియోలే! ఇక మిలింద్‌ తల్లి ఉషా సోమన్‌కు సంబంధించిన ఫిట్‌నెస్‌ అప్‌డేట్స్‌ను కొడుకు, కోడలు తమ ఇన్‌స్టా ఖాతాల్లో పంచుకుంటుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.


వండర్‌ ఉమన్‌ మనలోనూ ఉంది!
అత్తా కోడలంటే వీరిలాగే ఉండాలేమో అనిపిస్తుంది అంకితా కొన్వర్‌ - ఉషా సోమన్‌ని చూస్తే! అంతటి అనురాగ బంధం వీరి మధ్య ఉంది. ఇంటా, బయటా అత్తగారితో కలిసి వ్యాయామాలు చేసే మిసెస్‌ సోమన్‌.. ఆ వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌తో షేర్‌ చేస్తుంటుంది. అంతేకాదు.. ఈ వయసులోనూ ఫిట్‌నెస్‌పై ఎంతో మక్కువ చూపే తన అత్తయ్యను ప్రతి విషయంలోనూ స్ఫూర్తిగా తీసుకుంటుందామె. ఈ క్రమంలోనే చీరకట్టులో స్కిప్పింగ్, పుషప్స్‌ ప్రాక్టీస్‌ చేస్తోన్న తన అత్తయ్య వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది అంకిత.

‘నేను పరిచయమున్న వారికి నాకు వండర్‌ ఉమన్‌ (డీసీ కామిక్స్‌లోని సూపర్‌ హీరో పాత్ర) అంటే ఎంతిష్టమో తెలిసే ఉంటుంది. అయితే నేను ఈ వండర్‌ ఉమన్‌ గురించి మా అత్తగారితో చెప్పినప్పుడు ‘మనలోనూ ఓ వండర్‌ ఉమన్‌ తప్పకుండా ఉంటుంది..’ అంటూ సమాధానమిచ్చింది..’ అంటూ తన అత్తయ్య మాటల్ని క్యాప్షన్‌గా జోడించింది అంకిత. ఇలా మహిళ అంటేనే ఓ అద్భుతమంటూ తన మాటలతో మరోసారి మనందరిలో స్ఫూర్తి నింపిందీ ఫిట్టెస్ట్‌ గ్రానీ.


16 ఏళ్ల నుంచే..!
81 ఏళ్ల వయసులోనూ చురుగ్గా వ్యాయామాలు చేస్తూ అదరగొడుతోన్న ఉషా సోమన్‌ ఫిట్‌నెస్‌ జర్నీ 16 ఏళ్లకే మొదలైందని చెప్పచ్చు. ఆ వయసు నుంచే ట్రెక్కింగ్‌ చేయడం ప్రారంభించిన ఆమె.. ఎవరెస్ట్‌, కిలిమంజారో పర్వత శిఖరాల బేస్‌ క్యాంప్‌ వరకు వెళ్లొచ్చారు. బయోకెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత ఇక తన పూర్తి సమయాన్ని ఫిట్‌నెస్‌కే కేటాయించారామె. ఈ క్రమంలో 60 ఏళ్ల తర్వాత నడకను అతి ముఖ్యమైన వ్యాయామంగా మలచుకున్న ఆమె.. నడకతోనే తనకు ఆనందం, ఆరోగ్యం సొంతమవుతాయని చెబుతున్నారు.

‘మొదట్లో నాకు ఫిట్‌నెస్‌ అంటే ఎలాంటి ఐడియా లేదు. నా దృష్టిలో శారీరకంగా చురుగ్గా ఉండడమే సంపూర్ణ ఫిట్‌నెస్‌. ఈ క్రమంలో నేను ప్రొఫెసర్‌గా పదవీ విరమణ పొందిన తర్వాత నడకను నా రోజువారీ ప్రణాళికలో భాగం చేసుకున్నా. రోజుకు ఐదు కిలోమీటర్లు నడవడం అలవాటు చేసుకున్నా. మా కాలంలో ఎక్కడికైనా వెళ్లాలంటే ఇప్పటిలా క్యాబ్‌లు, ఇంత టెక్నాలజీ అందుబాటులో లేవు. అలా నడక అలవాటైంది. ఇప్పుడు నేనింత ఉత్సాహంగా, హ్యాపీగా ఉన్నానంటే నడక వల్లే!’ అంటూ తన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని బయటపెట్టారు ఉష.


నాకు తెలిసినవి ఆ మూడే!
ఫిట్‌గా ఉండడానికి ఇప్పుడు చాలామంది విభిన్న రకాల డైట్స్‌ని ఫాలో అవుతున్నారు. కానీ తను మాత్రం ఎలాంటి డైట్‌ ట్రెండ్‌ పాటించకుండానే ఇంత యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉంటున్నానని చెబుతున్నారు ఉష.
‘నానాటికీ కొత్త కొత్త డైట్‌ ట్రెండ్స్‌ పుట్టుకొస్తున్నాయి. నిజానికి అలాంటి వాటి మీద నాకు అంత నమ్మకం లేదు. మనం ఫిట్‌గా ఉండాలంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇవన్నీ మన శరీరానికి అందాలి. ఇవన్నీ మన సంప్రదాయ వంటకాల్లో లభిస్తాయి. కాబట్టి వీటిని బ్యాలన్స్‌ చేసినప్పుడే ఆరోగ్యంగా, దృఢంగా ఉండగలుగుతామన్నది నా అభిప్రాయం. అందుకే నేను ఫలానా ఆహారమే తీసుకోవాలన్న నియమమేమీ పెట్టుకోను. ఏదైనా సరే ఆరోగ్యకరంగా తీసుకోవడానికే మొగ్గు చూపుతా. ఇక ఫిట్‌నెస్‌ పేరుతో మన నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మనం చేసే వ్యాయామం కోసం మన శరీరాన్నే కాదు.. మనసునూ సిద్ధం చేసుకోవాలి.. అప్పుడే సంపూర్ణ ఫలితాన్ని పొందచ్చు.. ఇక ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు రోజూ నడక, పాజిటివ్‌గా ఆలోచించడం.. ఫిట్‌నెస్‌ అంటే నాకు తెలిసినవి ఈ మూడే!’ అంటారు ఉష.


ఫిట్‌నెస్‌తోనే సెలబ్రేషన్!
వయసుతో పాటే ఫిట్‌నెస్‌పై మక్కువను పెంచుకుంటోన్న ఉష.. తన ప్రతి సందర్భాన్నీ ఫిట్‌నెస్‌తోనే సెలబ్రేట్‌ చేసుకుంటుంటారు.
* ఈ క్రమంలో ఇటీవలే 81 వ పుట్టినరోజును జరుపుకొన్న ఆమె.. చీరకట్టులో పుషప్స్‌ చేసి తనకు తానే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ క్రమంలో తన తల్లి పుషప్స్‌ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న మిలింద్‌.. ‘15 పుషప్స్‌, అంకిత చేసిన బెల్లం-వెనీలా ఆల్మండ్‌ కేక్‌తో పుట్టినరోజు పార్టీ జరుపుకుంటోన్న మా ఫిట్టెస్ట్‌ మామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలమ్మా!’ అంటూ క్యాప్షన్‌ పెట్టాడు.
* ఇక లాక్‌డౌన్‌ తర్వాత ‘డార్జిలింగ్‌ పోలీస్‌ మారథాన్‌’లో తన కొడుకు, కోడలితో కలిసి పాల్గొన్నారు ఉష. పింక్‌ కుర్తీ, వైట్‌ సల్వార్‌, స్పోర్ట్స్‌ షూ ధరించి 10 కిలోమీటర్లు పరుగుపెట్టారామె. ఇందులో పతకం కూడా గెలుచుకున్నారీ ఫిట్టెస్ట్‌ గ్రాండ్‌ మా.
* కొన్నేళ్ల క్రితం ‘ముంబయి ఆక్స్‌ఫామ్‌ ట్రయల్ వాకర్‌’లో పాల్గొని 48 గంటల్లో వంద కిలోమీటర్లు నడక సాగించారు ఉష.


*ఇక తన కొడుకు మిలింద్‌తో కలిసి అహ్మదాబాద్-ముంబయి మధ్య రెండు వారాల పాటు నిర్వహించిన సుదీర్ఘ మారథాన్‌లోనూ భాగమయ్యారీ సూపర్‌ ఉమన్.
ఇవే కాదు.. ఉష తన కొడుకు, కోడలితో కలిసి.. లేదంటే ఒంటరిగా చీరకట్టులో చేసిన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ని సృష్టిస్తూనే ఉన్నాయి.. అందరిలోనూ ఫిట్‌నెస్‌ దిశగా స్ఫూర్తి రగిలిస్తూనే ఉన్నాయి.


అమ్మ వల్లే ఇలా!
‘వయసనేది పేరుకే.. మనలో చేయాలన్న తపన ఉంటే అది ఎప్పుడూ అడ్డంకిగా మారదు..’ అంటూ మనందరిలో స్ఫూర్తి రగిలిస్తోన్న ఉష.. తననూ ఎంతగానో ప్రేరేపించిందంటున్నాడు మిలింద్‌. ఫిట్‌నెస్‌కే బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచే తనను ఈ దిశగా నడిపించింది అమ్మేనంటూ.. ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలు, తన తల్లి తనను నడిపించిన తీరును వర్ణిస్తూ ‘మేడ్‌ ఇన్‌ ఇండియా : ఎ మెమాయిర్‌’ అనే పుస్తకంలో పొందుపరిచాడీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్.

‘అమ్మ ఏదైనా అనుకుందంటే అది సాధించి తీరుతుంది. అస్సలు వెనక్కి తగ్గదు. ఒకసారి ట్రెక్కింగ్‌కి వెళ్లాం. నిజానికి మా కంటే అమ్మే ఎంతో త్వరగా ఈ ఫీట్‌ని పూర్తి చేసింది. అయితే ఒకవేళ ఈ క్రమంలో ఏదైనా సమస్య ఎదురైనా వెనక్కి తగ్గకపోయేది.. బహుశా.. ఈ గుణం నాకు అమ్మ నుంచే వచ్చిందేమో! ఇక తను మానసికంగా చాలా దృఢంగా ఉంటుంది. తక్కువగా మాట్లాడుతుంది. ఎవరినీ నొప్పించదు.. తను బాధపడదు.. తన పనేదో తాను చేసుకుపోతుంది. ఆమెలోని ఆ స్వతంత్రతే నాకు బాగా నచ్చిన అంశం. ఇక ఫిట్‌నెస్ పరంగా ఇంత శ్రద్ధ పెడుతున్నానంటే అది అమ్మ స్ఫూర్తితోనే!’ అంటాడీ ఫిట్‌నెస్‌ గురూ!!
80 దాటినా 20 ఏళ్ల అమ్మాయిలా ఉత్సాహంగా వ్యాయామాలు చేయడమంటే అది ఉషా సోమన్‌కే సాధ్యమేమో అనిపించకమానదు. అందుకే ఆమె వీడియోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాదు.. ‘81 ఏళ్ల వయసులో వ్యాయామంటే మాటలు కాదు.. అమేజింగ్‌!’, ‘మీ వ్యాయామాలతో మా అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ ఫిట్టెస్ట్‌ గ్రానీ వర్కవుట్‌ వీడియోలు, ఫొటోలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..!







women icon@teamvasundhara
geeta-phogat-is-back-to-wrestling-after-maternity-break-and-shares-her-post-pregnancy-challenges

అమ్మయ్యాక రెట్టింపు ఉత్సాహంతో వచ్చేస్తున్నా!

అమ్మతనం అనేది ప్రతి మహిళ జీవితంలో ఓ మహర్దశ లాంటిది.. అందుకే తమ చిన్నారి ఆలనాపాలనలో మునిగితేలుతూ ఎన్నెన్నో మధురానుభూతుల్ని మూటగట్టుకుంటుంటారు కొత్తగా తల్లైన మహిళలు. అక్కడితో ఆగిపోకుండా అంతకుమించిన ఉత్సాహంతో కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించడానికీ ఉవ్విళ్లూరుతుంటారు. ప్రస్తుతం తాను కూడా అందుకు సిద్ధంగా ఉన్నానంటోంది రెజ్లింగ్‌ క్వీన్‌ గీతా ఫోగట్‌. రెండేళ్ల క్రితం ముద్దుల బాబుకు జన్మనిచ్చిన ఆమె.. తిరిగి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి మళ్లీ రెజ్లింగ్‌ మ్యాట్‌పై అడుగుపెట్టింది. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయింది గీత.

Know More

women icon@teamvasundhara
kerala-woman-who-worked-as-part-time-sweeper-at-panchayat-office-is-now-its-president
women icon@teamvasundhara
apollo-hospitals-vice-chairperson-shobana-kamineni-cycled-600-km-her-birthday-day

అందుకే ఈ వయసులో 600 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర చేశా!

వ్యాయామం చేయడం, ఫిట్‌నెస్‌ సాధించడం.. ఇవి ఫలానా వయసుకే పరిమితమా? అంటే కాదని నిరూపిస్తున్నారు ఎందరో మహిళలు. వయసు పెరుగుతున్నా విభిన్న వ్యాయామాలు చేస్తూ, మారథాన్‌లలో పాల్గొంటూ అదరగొడుతున్నారు. అలాంటి వారిలో అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ శోభనా కామినేని ఒకరు. ఇటీవలే హైదరాబాద్‌ నుంచి చెన్నైకి 600 కిలోమీటర్ల సైకిల్‌ రైడ్‌ పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారామె. అది కూడా తన 60వ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ ఫీట్‌ పూర్తి చేయడం విశేషం. మరి, ఈ వయసులో ఇంత సాహసం చేయడం వెనుక ఏదైనా ముఖ్య కారణముందా? అని అడిగితే.. మహిళలు తలచుకుంటే సాధించలేనిదేదీ లేదని నిరూపించడానికే ఇలా చేశానంటున్నారామె. ఈ నేపథ్యంలో ఈ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ సైకిల్‌ యాత్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
story-of-karuna-singh-wife-of-lt-cdr-d-s-chauhan-soon-to-join-indian-army

పెళ్లైన 40 రోజులకే లోకం విడిచి వెళ్లారు.. అయినా నాతోనే ఉంటారు!

అందరమ్మాయిల్లాగే భవిష్యత్తు పైన ఎన్నో కలలు, ఆశయాలతో చదువు పూర్తి చేసిందామె. అదే సమయంలో కన్న తండ్రి కాలం చేయడంతో తీవ్ర నిరాశలోకి కూరుకుపోయింది. అయినా ఆ బాధలోంచి తేరుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుంది. ఆపై సద్గుణవంతుడైన భాగస్వామిని భర్తగా పొందింది. వీరిద్దరి అన్యోన్యతను చూసి విధికి కన్ను కుట్టినట్లుంది. దురదృష్టవశాత్తూ పెళ్లైన 40 రోజులకే తన ఐదో తనాన్ని దూరం చేసింది. ఆ సమయంలో ‘నాకు సమస్యల మీద సమస్యలొస్తున్నాయంటే ఆ దేవుడు నన్ను ఓ గొప్ప కార్యంలో భాగం చేయాలనుకుంటున్నాడేమో!’ అనుకుందే తప్ప అధైర్యపడలేదామె. అందుకే దేశ రక్షణలో అమరుడైన తన భర్త ఆశయాన్ని భుజాలపైకెత్తుకుంది. పరీక్షలో పాసై త్వరలోనే సైన్యంలో శిక్షణ పొందేందుకు సన్నద్ధమవుతోంది. ఆమే.. ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య యుద్ధ నౌక ప్రమాదంలో అసువులు బాసిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ ధర్మేంద్ర సింగ్ చౌహాన్ సతీమణి కరుణా సింగ్‌. తన కలను పక్కన పెట్టి కట్టుకున్న భర్త ఆశయం కోసం కదిలిన ఈ వీర వనిత ధీర గాథ ఆమె మాటల్లోనే..!

Know More

women icon@teamvasundhara
68-years-old-lady-earning-millions-by-making-island-in-waterlogged-fields

women icon@teamvasundhara
meet-pooja-devi-the-first-woman-bus-driver-from-jammu-and-kashmir

‘ఆడవాళ్లు బస్సు నడపడమేమిటీ' అన్నారు!

‘ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం’ అంటూ ఇప్పుడు ఏ రంగంలోనైనా స్త్రీలు పురుషులతో సమానంగా పని చేసేందుకు పోటీ పడుతున్నారు. ఎంత కష్టమైనా సరే... సవాలుగా తీసుకుని మరీ ఆ రంగంలో తమ సామర్థ్యాన్ని చాటుకుంటున్నారు. శారీరక శ్రమతో కూడిన బాధ్యతలను సైతం చక్కగా నిర్వర్తిస్తున్నారీ తరం మహిళలు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే స్త్రీలపై ఎక్కువ ఆంక్షలుండే జమ్మూ కశ్మీర్‌లో తొలిసారిగా ఓ మహిళ బస్సు స్టీరింగ్ పట్టుకుంది. కుటుంబ అవసరాల కోసం తన కుమారుడిని వెంట పెట్టుకుని మరీ బస్సు నడిపింది. మరి ఇంతకీ ఎవరా మహిళ? ఎందుకు బస్సు డ్రైవర్‌గా మారిందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
a-woman-farmer-on-why-she-is-protesting-at-delhi-border

women icon@teamvasundhara
meet-the-woman-behind-ipo-star-mrs-bectors-food-specialities

ఈ బిస్కట్ల రారాణి విజయగాథ విన్నారా?

‘ఆడపిల్లలకు చదువెందుకు.. ఉద్యోగమెందుకు..? హాయిగా పెళ్లి చేసుకొని భర్తను, పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకోక!’ అనే రోజులవి! అలాంటి ఆలోచనలతోనే ఆమెను 17 ఏళ్ల వయసులోనే ఓ అయ్య చేతిలో పెట్టారు ఆమె తల్లిదండ్రులు! కానీ ఆమెకేమో బాగా చదువుకోవాలి, ఏదైనా కొత్తగా చేయాలన్న తపన ఉండేది. ఇందుకు అత్తింటి వాళ్లు అడ్డు చెప్పినా.. భర్త మాత్రం తన పూర్తి సహకారం అందించారు. అలా నాడు బేకింగ్‌లో ప్రయోగాలు చేస్తూ తన పెరట్లోనే చిన్న బేకరీ షాపుగా ప్రారంభమైన ఆమె వ్యాపారం.. నేడు ఉత్తర భారతదేశంలోనే దిగ్గజ సంస్థగా ఎదిగింది. దేశంలో ఓ ట్రేడ్‌మార్క్గా ఎదగడమే కాదు.. మేటి అంతర్జాతీయ బ్రాండ్లకు ముడిసరుకుల్ని పంపిణీ చేసే స్థాయికి చేరుకుంది. ఇదంతా ఆమె కృషి, పట్టుదల వల్లే సాధ్యమైంది. కాబట్టే నేడు ఈ కంపెనీ షేర్లు స్టాక్‌మార్కెట్లో లిస్ట్‌ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూ నుంచి వందల కోట్లు సేకరించడమే కాదు.. ఈ ఏడాది అత్యధికంగా సబ్‌స్క్రైబ్‌ అయిన ఐపీవోల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది కూడా! ఆ దిగ్గజ సంస్థే ‘మిసెస్‌ బెక్టార్‌ - క్రీమికా’. విదేశీ బ్రాండ్ల పోటీని తట్టుకొని దేశీయ మార్కెట్లో ఈ సంస్థను అగ్రగామిగా నిలిపిన ఘనత ఈ సంస్థ అధినేత్రి రజనీ బెక్టార్‌దే!

Know More

women icon@teamvasundhara
ankita-gaur-five-month-pregnant-mom-to-be-finishes-tcs-work-10k-bengaluru

ఐదు నెలల గర్భంతో పది కిలోమీటర్లు పరిగెత్తా!

నెలలు నిండుతున్న కొద్దీ అతి సుకుమారంగా తయారవుతుంటారు గర్భిణులు. కడుపులోని బిడ్డకు అసౌకర్యంగా ఉంటుందేమోనన్న ఉద్దేశంతో కొన్ని కఠినతరమైన పనులు చేయడానికి సంకోచిస్తుంటారు. ఇక ఈ సమయంలో వ్యాయామం మంచిదని చెప్పినా దాని జోలికి వెళ్లని వారూ లేకపోలేదు. ఇంట్లో ఉండే కొందరు పెద్ద వాళ్లు కూడా గర్భిణులు ఏది చేస్తామన్నా ససేమిరా అంటుంటారు. కానీ వీటన్నింటినీ అధిగమించి వ్యాయామాలు చేస్తూ, మారథాన్‌లలో పాల్గొంటూ నలుగురిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరం మహిళలు. అలాంటి వారిలో ఒకరే బెంగళూరుకు చెందిన అంకితా గౌర్‌. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అయిన ఆమె తాజాగా టీసీఎస్‌ వరల్డ్‌ 10కె రన్‌లో పాల్గొంది. గంటలోనే పది కిలోమీటర్లు పరుగెత్తి.. గర్భంతో ఉన్న వారికి పరుగు మంచి వ్యాయామమని చాటుతోంది. తొమ్మిదేళ్లుగా పరుగునే ఊపిరిగా మార్చుకున్నానని, ఆ ఉత్సాహమే గర్భంతోనూ తనను పరిగెత్తేలా చేసిందని చెబుతోన్న ఈ న్యూ మామ్‌ తన గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
baloch-activist-gender-inequality-critic-karima-baloch-found-dead-in-canada

అందుకే కరీమా ఎప్పటికీ ఓ హీరోనే!

పరువు పేరుతో హత్యలు చేయడం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, లింగ వివక్ష, ప్రసూతి మరణాలు, అత్యాచారాలు, యాసిడ్‌ దాడులు.. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల్ని ఓ గడ్డి పరకలా భావిస్తుంటారక్కడ! ఒకవేళ వీటిని ఎదిరిస్తే వారికి మరణ శాసనం తప్పదు. మహిళల పట్ల ఇంతటి క్రూరమైన వివక్ష ఉంది కాబట్టే పాక్‌ ఆక్రమిత బలోచిస్థాన్‌ స్త్రీలకు అసురక్షితమైన ప్రదేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇలాంటి చోటే పుట్టి పెరిగింది కరీమా బలోచ్‌. అయితే అందరు మహిళల్లా అణిగిమణిగి ఉండాలనుకోలేదామె. మహిళా హక్కులపై ఉద్యమించింది.. అక్కడి మహిళలు ఎదుర్కొంటోన్న దుస్థితిని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టింది. అలాంటి ఉద్యమకారిణి గొంతు నేడు మూగబోయింది. 2016 నుంచి కెనడాలో శరణార్థిగా ఉంటోన్న కరీమా రెండు రోజుల క్రితం హత్యకు గురైంది. అయితే దీని వెనుక పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా మహిళలకు న్యాయం జరగాలని ముక్తకంఠంతో నినదించిన ఈ ఉద్యమకారిణి తన కొన ఊపిరిదాకా అదే పట్టుదలను కొనసాగించడం ఆమె ధైర్యానికి ప్రతీక!

Know More

women icon@teamvasundhara
martyred-pilot-samir-abrol’s-wife-garima-is-now-a-flying-officer-with-indian-air-force
women icon@teamvasundhara
meet-the-chief-justice-of-telangana-high-court-here-is-hima-kohli-story

మనకే కాదు.. ప్రకృతికీ న్యాయం జరగాలంటారామె!

మనదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల గురించి అడిగితే పురుషుల పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. సంచలనమైన తీర్పులు ఇచ్చిన సందర్భంలో మినహా.. మహిళా న్యాయమూర్తుల గురించి పెద్దగా బయటికి తెలియదు. అయినప్పటికీ తమ అచంచల ప్రతిభాపాటవాలతో.. ఈ రంగంలో కొందరు ఉన్నత స్థానాలకు చేరుకొంటున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో జడ్జిలుగా కొనసాగుతున్నారు. హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదుగుతున్నారు. ఆ కోవకే చెందుతారు తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితురాలైన జస్టిస్‌ హిమా కోహ్లీ. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న తొలి మహిళ ఆమెనే కావడం విశేషం. ఈ సందర్భంగా ఈ సీనియర్‌ మహిళా జడ్జి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
anju-bobby-george-reveals-having-single-kidney
women icon@teamvasundhara
ips-ankita-sharma-teaches-students-studying-upsc-so-that-their-dreams-are-not-left-incomplete-due-to-poverty

ఈ లేడీ సింగం.. అమ్మాయిల సివిల్స్ కలను నెరవేర్చే టీచరమ్మ కూడా!

ఐఏఎస్‌, ఐపీఎస్‌.. వంటి దేశ అత్యున్నత ప్రభుత్వోద్యోగాల్లో చేరాలన్న కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొంటూ, ఓటమిని జయిస్తూ ముందుకు సాగితేనే ఈ కొలువులు మన సొంతమవుతాయి. అయితే వీటిలో విజయం సాధించిన కొంతమంది ‘హమ్మయ్య.. నా కల నెరవేరింది’ అని సంతృప్తి పడిపోతే.. ఇంకొందరేమో తనలా మరికొందరు కూడా తమ కలల్ని నెరవేర్చుకోవాలని ఆకాంక్షిస్తుంటారు. ఈ క్రమంలో తమలో ఉన్న విజ్ఞానాన్ని నలుగురికీ పంచుతుంటారు. ఇందుకు అసలు సిసలైన ఉదాహరణే ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌కు చెందిన పోలీసాఫీసర్‌ అంకితా శర్మ. సివిల్స్‌ ప్రిపరేషన్‌ కోసం వేలకు వేలు డబ్బులు పోసే స్థోమత లేని అమ్మాయిల్ని చేరదీసి తానే ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నారామె. అది కూడా ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్లో కూడా! ఓవైపు వృత్తిపరంగా నేరస్థుల గుండెల్లో గుబులు రేపుతోన్న ఈ సూపర్‌ కాప్‌.. ఇటు టీచర్‌గా మారి ఎందరో విద్యార్థుల కలల్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. తాను చదువుకునే రోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లే తనను ఈ దిశగా నడిపించాయంటోన్న ఈ మహిళా పోలీసాఫీసర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
hcl-tech-chief-roshini-nadar-malhotra-india’s-wealthiest-woman-here-is-the-full-list

దేశంలో అత్యంత సంపన్న మహిళలు వీరే!

రంగమేదైనా మహిళలు తమ పూర్తి స్థాయి ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ అందులో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ప్రత్యేకించి వ్యాపార రంగంలో తమదైన మెలకులను ప్రదర్శిస్తున్నారు కొందరు అతివలు. ప్రతికూల పరిస్థితులు, సవాళ్లను ఎదుర్కొని గ్రేట్‌ బిజినెస్‌ వుమన్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఎక్కువ మొత్తంలో ఆదాయం ఆర్జిస్తూ అత్యంత సంపన్నమైన మహిళలుగా సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో దేశంలో అత్యంత సంపన్న మహిళలందరినీ ఒక చోట చేర్చుతూ కోటక్‌ వెల్త్‌-హురన్ ఇండియా సంయుక్తంగా ఓ జాబితా రూపొందించింది. ‘కోటక్‌ వెల్త్‌ హురున్‌-లీడింగ్‌ వెల్దీ వుమెన్‌ 2020’ పేరుతో మొత్తం 100 మంది భారతీయ సంపన్న మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో హెచ్‌సీఎల్‌ ఛైర్‌పర్సన్‌ రోష్నీ నాడార్‌ అగ్రస్థానంలో నిలిచారు.

Know More

women icon@teamvasundhara
para-badminton-player-manasi-joshi-recalls-the-day-she-lost-her-leg-reflects-on-how-her-life-has-changed

అవకాశమొస్తే ఆ జీవితాన్నే ఎంచుకుంటా!

భవిష్యత్తుపై బోలెడు ఆశలు పెట్టుకున్న ఆమెను 22 ఏళ్లకే విధి వెక్కిరించింది. ఒంటికాలితో జీవితాన్ని అంధకారం చేయాలనుకుంది. అయితే కష్టాలు, కన్నీళ్లు ఆమెను మరింత కఠినంగా మార్చాయి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని అందించాయి. అందుకే కృత్రిమ కాలితోనే బ్యాడ్మింటన్‌ రాకెట్‌ పట్టుకుని బరిలోకి దిగింది. మొండి పట్టుదలతో పతకాల జోరు కొనసాగించింది. ఆమే పారా అథ్లెట్‌ మానసి జోషి. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అన్న మాటలకు కచ్చితమైన ఉదాహరణగా నిలిచే మానసి.. సరిగ్గా నిల్చోవడానికి కాలు లేకపోయినా పారా బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. దేశానికి పతకాల పంట పండిస్తోంది. తన పోరాట స్ఫూర్తితో ఎంతోమంది అమ్మాయిలు, తనలాంటి దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపుతోంది.

Know More

women icon@teamvasundhara
sania-mirza-writes-emotional-ode-to-all-mothers-in-viral-post

ఇజాన్ పుట్టాకే అవన్నీ నాకు అర్థమయ్యాయి!

అమ్మతనం.. ఈ లోకంలో అన్నింటికంటే అమూల్యమైనది. స్వయంగా అనుభవిస్తే తప్ప అందులో ఉన్న కమ్మదనాన్ని మనం ఆస్వాదించలేం. అంతేకాదు.. బాధ్యత, ఓపిక, మనల్ని మనం ప్రేమించుకోవడం, నిస్వార్థమైన ప్రేమను పంచడం.. ఇలా ఎన్నో విషయాలు నేర్పుతుందీ అద్భుతమైన భావన. ఇలాగే అమ్మతనం తననీ ఓ మంచి మనిషిని చేసిందంటోంది హైదరాబాదీ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా. రెండేళ్ల క్రితం ఇజాన్‌కు జన్మనిచ్చిన ఈ సూపర్‌ మామ్‌.. ఆ తర్వాత ఎంతో కష్టపడి ఫిట్‌గా మారి ఈ ఏడాది కోర్టులోకి అడుగుపెట్టింది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తల్లయ్యాకా మహిళలు తమ కెరీర్‌లో దూసుకుపోగల సమర్థులు అని నిరూపించింది. ఇలా తన పోస్ట్‌ ప్రెగ్నెన్సీ జర్నీకి అమెరికన్‌ టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ స్ఫూర్తి అంటూ తాజాగా ఓ సుదీర్ఘ లేఖ రాసింది సానియా. అమ్మతనం తనకు అందించిన అనుభవాలు, ప్రసవానంతరం బరువు తగ్గడం, సెరెనా తనలో ప్రేరణ నింపిన విధానం, వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌.. ఇలా ఎన్నెన్నో విషయాలు రంగరించి రాసిన ఆ లేఖ సోషల్‌ మీడియాలో వైరలవడమే కాదు.. ఎంతోమంది తల్లుల్లో స్ఫూర్తి నింపుతోంది.

Know More

women icon@teamvasundhara
things-to-know-about-anupa-das-third-woman-to-become-a-crorepati-in-kbc-season-12

ఈ కోటి రూపాయలతో మా అమ్మను క్యాన్సర్‌ నుంచి కాపాడుకుంటా!

కౌన్ బనేగా కరోడ్పతి... 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ షోకు నేటికీ ఏ మాత్రం క్రేజ్‌ తగ్గలేదు. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ బుల్లితెర కార్యక్రమంలో పాల్గొనాలని, హాట్ సీట్ వరకు చేరుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తారు. ఈ షో ద్వారా వచ్చిన పేరు, ప్రైజ్‌ మనీతో తమ కలలను సాకారం చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఆ అదృష్టం కొందరికే దక్కుతుంది. అలాంటి వారిలో ఒకరు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అనూపాదాస్. వృత్తిరీత్యా టీచర్‌ అయిన ఆమె ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి అంటే గత 20 ఏళ్లుగా దీనిలో పాల్గొనాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన కలను సాకారం చేసుకోవడమే కాకుండా ఏకంగా కోటి రూపాయలు గెలుచుకుంది.

Know More

women icon@teamvasundhara
farah-khan-writes-open-letter-on-choosing-to-become-mom-at-43-via-ivf

ఆ విషయంలో నా మనసు చెప్పిందే విన్నా.. దాన్నే లాక్ చేశా!

‘లోకులు కాకులు.. అవసరం ఉన్నా లేకపోయినా ఇతరుల విషయాల్లో తలదూర్చుతుంటారు. పెళ్లి, పిల్లలు, కెరీర్‌.. ఇలా అన్ని విషయాల్లో నిర్ణయాధికారం వారిదే అన్నట్లుగా మాట్లాడతారు.. అయితే ఇలా ఎవరెన్ని చెప్పినా మీరు మాత్రం మీ మనసు చెప్పిందే వినండి..!’ అంటున్నారు ప్రముఖ దర్శకనిర్మాత ఫరా ఖాన్‌. 43 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌ ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఈ సెలబ్రిటీ మామ్‌.. వయసుకు, పిల్లల్ని కనడానికి సంబంధం లేదంటున్నారు. సైన్స్‌ అభివృద్ధి చెందుతోన్న ఈ కాలంలో తమకు నచ్చినప్పుడు, అందుకు మానసికంగా సిద్ధమైనప్పుడు పిల్లల్ని కనొచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఐవీఎఫ్‌ స్టోరీని, ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలను గుదిగుచ్చి ఓ సుదీర్ఘ లేఖ రాశారామె. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ గురించి మహిళలందరికీ దిశానిర్దేశం చేసేలా ఉన్న ఈ లేఖ సారాంశమేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
four-indian-women-featured-in-bbc-100-women-list-of-2020

ప్రపంచ గతిని మార్చారు.. నలుగురికీ ‘స్ఫూర్తి’గా నిలిచారు!

ప్రపంచాభివృద్ధిలో పలువురు మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అపురూప విజయాలు సాధిస్తూ...తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ మార్గంలో మరింతమంది అడుగులు వేసేలా స్ఫూర్తినిస్తున్నారు. ఈక్రమంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేస్తోన్న మహిళల్లో వందమందిని ఎంపిక చేసి ఏటా ఓ జాబితాను విడుదల చేస్తోంది బీబీసీ. అలా ఈ ఏడాది కూడా వివిధ రంగాల్లో తమదైన రీతిలో దూసుకుపోతోన్న 100 మంది అత్యంత స్ఫూర్తిదాయకమైన, ప్రభావశీలురైన మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో నలుగురు భారతీయ నారీమణులు చోటు దక్కించుకోవడం విశేషం.

Know More

women icon@teamvasundhara
film-maker-nidhi-parmar-dontes-above-40-liters-breast-milk-amid-corona-pandemic

చనుబాలు దానం చేస్తూ పసిపిల్లల ఆకలి తీరుస్తోంది!

అమ్మ పాలు అమృతంతో సమానం. తల్లి పాలల్లో ఉండే ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు... ఇతరత్రా పోషకాలు పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. వారిని బాలారిష్టాల నుంచి రక్షిస్తాయి. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలల దాకా తల్లి పాలే పట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతమున్న యాంత్రిక జీవనంలో అమ్మపాలకు చాలా కొరతొచ్చి పడింది. అందుకు కారణాలు అనేకం. ఈ క్రమంలో ముంబయికి చెందిన ఓ ఫిల్మ్‌ మేకర్‌ తన బిడ్డకు అమృతమంటి పాలను అందిస్తూనే, అదనంగా ఉత్పత్తైన పాలను దానం చేసి ఆదర్శంగా నిలుస్తోంది.

Know More

women icon@teamvasundhara
major’s-wife-completes-training-set-to-join-army-two-years-after-his-death

అమరవీరుడైన భర్త ఆశయాన్ని ఇలా నెరవేరుస్తోంది!

ఉన్నతోద్యోగంలో కొనసాగుతోన్న ఆమెను అడుగడుగునా ప్రోత్సహించే భర్త.. దేశ రక్షణే ధ్యేయంగా భావించే అతడికి ఏ అపాయమూ రాకూడదని అనుక్షణం ఆ దేవుడిని ప్రార్థించే భార్య.. ఇలా ఆ ఆలుమగల అన్యోన్యతను చూసి విధికి కన్ను కుట్టినట్లుంది. శత్రు సైన్యం చేసిన దాడి ఆ జంటను శాశ్వతంగా విడదీసింది. ఆమె నుదుటి కుంకుమను తుడిచేసింది. ఆ బాధను దిగమింగుతూ.. దేశ రక్షణే ఆరోప్రాణంగా భావించే తన భర్త కోసం తన ఆశలు, ఆశయాలనే వదులుకుందామె.. తన ఊపిరి ఉన్నంత వరకు అతని అడుగుజాడల్లోనే నడుస్తానని నిర్ణయించుకుంది. భర్త కలల్ని నిజం చేస్తానని కంకణం కట్టుకుంది. అనుకున్నట్లుగానే రెండేళ్ల కఠోర శిక్షణను తాజాగా పూర్తిచేసుకొని త్వరలోనే భారత సైన్యంలో చేరేందుకు సన్నద్ధమవుతోంది.. గుండె ధైర్యంతో, నిండైన ఆత్మవిశ్వాసంతో ఇండియన్‌ ఆర్మీ యూనిఫాం ధరించేందుకు ఉవ్విళ్లూరుతోన్న ఆమే.. అమర వీరుడైన ఆర్మీ మేజర్‌ కౌస్తుభ్‌ రాణే సతీమణి కనిక. తన కొన ఊపిరి దాకా భర్త కల కోసమే పని చేస్తానంటోన్న ఈ వీర నారి తన ఆశయం గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

Know More