ఆ రైలు నడిపింది అంతా ఆడవాళ్లే..!
‘పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో వృద్ధి సాధించడం అంత సులభం కాదు’.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఏ రంగంలోనైనా మహిళలు పురుషులతో సమానంగా పని చేసేందుకు పోటీ పడుతున్నారు. ఎంత కష్టంతో కూడిన రంగమైనా సరే అందులో అడుగుపెట్టేందుకు సిద్ధపడుతున్నారు. వైద్యం, విద్య, రాజకీయాలు, జర్నలిజం, ఇంజినీరింగ్, ఆర్మీ, వ్యాపారం, నేవీ, పరిశోధన.. వంటి రంగాలతో పాటు.. ఫుడ్ డెలివరింగ్, క్యాబ్ డ్రైవింగ్, లోకోపైలట్, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ.. మొదలైన అధిక శారీరక శ్రమతో కూడిన రంగాల్లో సైతం తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ స్త్రీ శక్తిని చాటుతున్నారు ఈతరం అతివలు. ఈ క్రమంలో భారత రైల్వే శాఖలో పని చేస్తోన్న కొందరు మహిళా ఉద్యోగులు ఇటీవల చేసిన ఓ పని మన దేశంలో మహిళా సాధికారతకు అద్దం పడుతోంది. మరి వాళ్లు చేసిన ఆ పనేంటో మీరూ చూడండి.