scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo
Relations Heart

ఆ సంఘటన.. ఓ జీవిత పాఠాన్నే నేర్పింది..!

Sad Love story in telugu

ఈ ప్రపంచంలో అందరు మనుషులు ఒకేలా ఉండరు. కొందరు పైకి మంచిగా కనిపించినా.. స్వభావం మాత్రం మేక వన్నె పులిని పోలి ఉండచ్చు. ఆత్మీయులుగా మెలిగినా... హృదయాంతరాళపు పొరలు మాత్రం మకిలిగానే ఉండచ్చు... కొందరు నీచులు పైకి మంచి మనసున్న వారిలా కనిపించినా, వారి మనసులో దాగున్న కుతంత్రాలు ఏదో ఒక రోజు బయటపడతాయి. అలాంటి ఓ నీచుడి బారిన పడిన ఓ అమ్మాయి వూహించని ప్రమాదం నుంచి ఎలా బయటపడిందో తెలుసుకోవాలంటే.. ఇది చదవాల్సిందే..
నా పేరు శ్రుతి. మాది విజయవాడ. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మే కష్టపడి నన్నూ, చెల్లెల్ని పెంచింది. నేను బీఫార్మసీ చదివాను. కాలేజీలో నేనే టాపర్‌ని. అయితే.. ఇక్కడ చదువులో నా విజయానికి కారణమైన వ్యక్తి గురించి చెప్పుకోవాలి. ఆయన పేరు సిద్ధార్ధ్. నేను చదువుకున్న కాలేజీలోనే లెక్చరర్‌గా పనిచేసేవారు. తెలుగువ్యక్తి కాకపోయినా బాగానే మాట్లాడేవారు. లెక్చరర్ అయినా ఒక స్టూడెంట్‌లా మా అందరితో చక్కగా కలిసేపోయేవారు. ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు, సెమినార్స్ అటెండ్ అవుతున్నప్పుడు నాకెంతో ప్రోత్సాహం అందించేవారు. అందుకే ఆయనంటే నాలో ఓ ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. కెరీర్ గురించి, భవిష్యత్తు గురించి ఆయన చెప్పే స్ఫూర్తిదాయకమైన మాటలు నాలో ప్రేరణను నింపేవి. అప్పుడప్పుడు ఆయన తన వ్యక్తిగత విషయాలు కూడా పంచుకొనేవారు. తను ఆ కాలేజీలో కొన్నాళ్లు మాత్రమే పనిచేస్తానని, మంచి ఎంట్రప్రెన్యూర్ అవడమే తన లక్ష్యమని చెప్పేవారు.

lecturerharrasmentghg650-1.jpg

కాలేజీ నుంచి బయటకు వచ్చేశాక, ఆయన సంగతి పూర్తిగా మర్చిపోయాను. ఉద్యోగవేటలో పడడంతో ఆ విషయాలను నెమరువేసుకొనే తీరికే ఉండేది కాదు. అలాంటప్పుడు వచ్చిన ఓ ఫోన్‌కాల్ నా జీవితాన్నే మార్చేసింది.. కాదు.. జీవితంలో ఎన్నో మర్చిపోలేని పాఠాలు నేర్పింది. ఆ కాల్ వచ్చింది సిద్ధార్థ్ సర్ నుంచి. ఆయన బెంగళూరులో ఒక చిన్న ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రారంభించానని చెప్పారు. ఎంట్రప్రెన్యూర్‌గా తన కల నెరవేరిందని ఆనందంగా మాట్లాడారు. నేను కూడా సంతోషించాను. అప్పుడు ఆయన నన్ను కూడా వచ్చి తనకు సహాయంగా ఆ సంస్థలోనే పనిచేయమని కోరారు. మొదట తటపటాయించినా.. ఇంకా మంచి ఆఫర్స్ వచ్చినా.. తక్కువ జీతమైనా ఆయన మీదున్న గౌరవంతో ఆ సంస్థలో చేరాను. సంస్థలో చేరాక ప్రొఫెషనల్ లైఫ్ బాగానే కొనసాగింది. నాకే లోటుపాట్లు లేకుండా చూసుకొనేవారు. సిద్ధార్థ్ కొన్నాళ్ల తర్వాత తన భార్యని, కుటుంబ సభ్యుల్ని పరిచయం చేశారు.

ఆయన భార్య పెద్దగా చదువుకోలేదు. అయినప్పటికీ మంచి సంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలాగానే కనిపించేది. నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడేది. మేమిద్దరం తొందర్లోనే మంచి స్నేహితులమయ్యాం. నేను కూడా తరచూ వాళ్లింటికి వెళ్లేదాన్ని. ఇలా సాగిపోతున్న మా ప్రయాణంలో అనుకోకుండా కొన్ని విపత్కర సంఘటనలు సంభవించాయి. గత కొన్ని నెలలుగా సిద్ధార్థ్ కుటుంబం నాతో అంత కలివిడిగా ఉండడం లేదు. ఏదో సమస్య ఉందని అనిపించింది. సిద్ధార్థ్ కూడా ఆఫీసుకు రావడం తగ్గించారు. పనంతా నా మీద, సూపర్‌వైజర్ల మీదా పడింది. ఒకసారి సిద్ధార్థ్ ఫోన్ చేసి నన్ను అర్జంట్‌గా ఇంటికి రమ్మన్నారు. అలాగే వెళ్లాను. ఆయనతో పాటు ఆయన అమ్మా, నాన్న కూడా అక్కడే ఉన్నారు. వారు చెప్పిన విషయం విని నిర్ఘాంతపోవడం నా వంతైంది. సిద్ధార్థ్‌కు పిల్లలు పుట్టే అవకాశం లేదని, ఆయన భార్యకు గర్భసంచిలో ఏదో సమస్య ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వారు వివరించారు. అందుకే వారు తనకు మళ్లీ వివాహం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఈ విషయం నాకెందుకు చెబుతున్నారో అర్థం కాలేదు. అప్పుడు చెప్పారు సిద్ధార్థ్‌కు నేనంటే ఇష్టమని.. నన్నే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడని. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. వారి సమస్య వారికుండచ్చు.. అయితే నాకు ఆయనపై అలాంటి ఉద్దేశమేమీ లేదు. అదే విషయం వారితో చెప్పాను. కానీ.. సిద్ధార్థ్ నన్ను బతిమిలాడడం ప్రారంభించాడు. అప్పుడు అతన్ని చూస్తే అసహ్యం వేసింది.. పిల్లలు కలగకపోతే దానికి ఇంకా అనేక దారులు ఉన్నాయి.. అవి ప్రయత్నించవచ్చు లేదా ఏ అనాథనైనా పెంచుకోవచ్చు. అయితే.. అలా కాకుండా కట్టుకున్న భార్యకి ద్రోహం చేయడం, వారసుడి కోసం పెళ్లి చేసుకోమని నన్ను ఒత్తిడి చేయడం నాకెంతమాత్రం నచ్చలేదు. అదే విషయం వాళ్లతో ఖరాఖండీగా చెప్పాను.

lecturerharrasmentghg650-2.jpg

మరుసటి రోజు ఆఫీసులో పనిచేసుకుంటున్న నా దగ్గరకు, సిద్ధార్ధ్ వచ్చి జరిగిన సంఘటనకు చింతిస్తున్నానని, తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఇంకెప్పుడూ అలా చేయనని, పెళ్లి ప్రస్తావన తీసుకురానని మాటిచ్చాడు. అయినా నాకు ఇక అక్కడ పనిచేయాలనిపించలేదు. అదే విషయం అతనితో చెప్పేశాను. అయితే మేం చేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ ఉండమని సిద్ధార్థ్ బతిమాలాడు. నేను కూడా అది అయిపోయాక వెళ్లిపోదామనుకున్నా. ఇది జరిగిన ఓ వారానికి ఓ ముఖ్యమైన పనుందని చెప్పి సిద్ధార్థ్ నన్ను ఒక చోటుకి తీసుకెళ్లాడు. చాలా పెద్ద ఇల్లు అది. ఇది పాత ఆఫీసని, త్వరలో ఇక్కడ కూడా ఓ బ్రాంచ్ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. నేను కూడా తలూపాను. ఆ తర్వాత కొన్ని ఫైల్స్ నాచేతికిచ్చి, వాటిని చూస్తుండమని ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అయితే.. అలా వెళ్లిన వ్యక్తి ఇక తిరిగి రాలేదు. చాలా సేపు వెయిట్ చేశాను.. ఎంతకీ తిరిగి రాలేదు.. బయటి గదిలోకి వచ్చి చూస్తే.. ఇంటి బయట తాళం వేసినట్లు అర్థమైంది. ఫోన్ చేద్దామని చూస్తే నా బ్యాగ్ కూడా లేదని గ్రహించాను. నాకు చాలా భయం వేసింది. తలుపులు బాదాను.. అరిచాను.. కానీ నా బాధ వినిపించుకొనే నాథుడే లేడు. తెలియని ప్రాంతంలో.. తెలియని ఇంట్లో నన్ను పథకం ప్రకారమే ట్రాప్ చేసి ఇరికించారని అర్థమైంది.. అయినా ఏం చేయగలను.. నిస్సహాయురాలిని. కేవలం పెళ్లికి వద్దన్నానని ఇంత నీచానికి ఒడికట్టాడు ఆ దుర్మార్గుడు. నిర్మానుష్యమైన ప్రాంతంలోని ఓ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఆ రోజంతా గడపాల్సి వచ్చింది. ఆకలేసినా.. దాహమేసినా ఓర్చుకోవాల్సి వచ్చింది. ఇలా తెలియని ప్రాంతానికి ఒక నీచుని మీద నమ్మకంతో వచ్చినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. ఆ రాత్రంతా ఏడుస్తూ... భయపడుతూ అక్కడే గడపాల్సి వచ్చింది. మర్నాడు సాయంత్రం వరకు నాది అదే పరిస్థితి. సాయంత్రం దాటాక సిద్ధార్థ్ కొందరు వ్యక్తులతో కలిసి వచ్చి నన్ను కార్లో ఎక్కించుకొని తీసుళ్లాడు. పూర్తిగా ఓపిక పోవడంతో వారినెదిరించే సత్తువ కూడా నాకు లేకుండా పోయింది. నాకు ఏ మాత్రం పరిచయం లేని ప్రాంతానికి వారు నన్ను తీసుకెళ్లారు. అక్కడ వారి కుటుంబసభ్యులంతా కలిసి బలవంతంగా అతనితో నా పెళ్లి చేయడానికి ప్లాన్ చేశారని అర్థమైంది. ఆ సమయంలో ఏంచేయాలో అర్థంకాలేదు. ఎంత ప్రతిఘటించినా ఆ నీచుడు నా మెళ్లో తాళి కట్టేశాడు. నా ప్రమేయం లేకుండానే నా పెళ్లి జరిగిపోయింది.

lecturerharrasmentghg650-3.jpg

ఆ తర్వాత సిద్ధార్థ్ తన మనుషులతో నన్ను తన ఇంటికి తీసుకొచ్చాడు. కానీ.. ఇక్కడ నాకు మరో వూహించని పరిణామం ఎదురైంది. అక్కడ పోలీసులు ఉన్నారు. వారు నా గురించి ప్రశ్నించినా, ఏదో బుకాయించబోయారు సిద్ధార్థ్..తన కుటుంబసభ్యులు. కానీ.. ఇద్దరు పోలీసులు నా దగ్గరకు వచ్చి ఏం భయం లేదని.. వాళ్ళు సిద్ధార్థ్‌ను అరెస్టు చేయడం కోసమే వచ్చామని చెప్పారు. సిద్ధార్థ్ భార్యకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించి నేను ఓ ఎన్జీఓకి మెయిల్ రాశాను. సిద్ధార్థ్ నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నప్పుడే, వేధింపులకు గురయ్యే మహిళల రక్షణ కోసం పోరాడే ఓ ఎన్జీఓకు నా సమస్యకు సంబంధించి పూర్తి వివరాలతో మెయిల్ పెట్టాను. వారు నా గురించి వాకబు చేసి, తర్వాత సిద్ధార్థ్ భార్యను కూడా కలిశారట. తన మీద నిఘా కూడా పెట్టారు. సిద్ధార్థ్ నన్ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసి పోలీసులకు సమాచారమందించారు. ఇప్పుడు అతడు నాతో సహా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

నేను ఆ నీచుడు కట్టిన తాళిని వాడి మొహాన్నే తీసి కొట్టాను. సిద్ధార్ధ్ మీద పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే.. నాకు అతని భార్యను చూస్తేనే జాలనిపించింది. కానీ ఆమె నాకంటే ధైర్యంగా నిలబడింది. నా ఆచూకీ కనిపెట్టడంలో ఆమె పోలీసులకు ఎంతగానో సహకరించిందని విన్నాను. ఆమె రక్షణకు నన్ను కాపాడిన ఎన్జీఓ అన్ని ఏర్పాట్లు చేసింది.

ఏదేమైనా నా జీవితంలో జరిగిన ఈ అనూహ్యమైన సంఘటన నాకు అనేక పాఠాలు నేర్పింది. ప్రమాదం ఎల్లప్పుడూ మన వెన్నంటే ఉంటుందని చెప్పకనే చెప్పింది. పై పై మాటలు, ప్రవర్తన ఆధారంగా మనుషుల మనస్తత్వాలను అంచనా వేయలేమని.. మేకవన్నె పులులు మనచుట్టూనే ఉంటాయని తెలుసుకున్నాను.. నాకెదురైన అనుభవం మరెంతోమందికి హెచ్చరికగా నిలవాలనే ఉద్దేశంతో ఇలా మీ ముందుకొచ్చాను.




œË®ý-éÂx-ªá-«Õªý

'£¾Ç%Ÿ¿-§ŒÕ-ªÃ’¹¢Ñ QJ¥Â¹ ¤Äª¸½-Â¹×©Õ ÅŒ«Õ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ, ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ X¾¢ÍŒÕ-Â¹×¯ä „äC¹. ¨ QJ¥-¹©ð “X¾ÍŒÕ-J¢Íä ¹Ÿ±¿-¯Ã-©-Eo-šËÂÌ ¤Äª¸½-Â¹×©ä ª½ÍŒ-ªá-ÅŒ©Õ. Æ¢Ÿ¿Õ-«©x ¨ ¹Ÿ±¿-¯Ã-©ðxE „î¾h-„éÕ, Æ«®¾h„Ã-©Åî «®¾Õ¢-Ÿµ¿-ª½.-¯çšü „ç¦ü-å®j-šüÂ¹× ‡©Ç¢šË ®¾¢¦¢Ÿµ¿¢ ©äŸ¿Õ. ¨ QJ¥-¹-©ðE ¹Ÿ±¿©Õ, ¹Ÿ±¿-¯Ã-©Åî ‡«-J-éÂj¯Ã ƒ¦s¢C …¯Ão, Ʀµ¼u¢-ÅŒ-ªÃ©Õ …¯Ão ƒÂ¹ˆœ¿ ÂËxÂú Íä®Ï «ÖÂ¹× ÅçL-§ŒÕ-èä-§ŒÕ¢œË. Æ{Õ-«¢šË ¹Ÿ±¿, ¹Ÿ±¿-¯ÃEo „ç¦ü-å®j-šü-©ð¢* Åí©-T¢-ÍŒœ¿¢ «Ö“ÅŒ¢ ¨¯Ãœ¿Õ ¦ÇŸµ¿uÅŒ. ƢŌ-¹×-NÕ¢* ƒÅŒ-ª½“Åà ͌{d-X¾-ª½-„çÕiÊ ÍŒª½u-©Â¹× ¨¯Ãœ¿Õ ¦ÇŸµ¿uÅŒ «£ÏÇ¢-ÍŒŸ¿Õ.

 
   
 
 
 

Share Your Story

 
   
 
(Press ctrl+g to switch(English/Telugu))
 

women icon@teamvasundhara
a-woman-hates-marriage-but-wants-to-be-a-mother

పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !

ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !

Know More

women icon@teamvasundhara
82-years-old-gatekeeper-of-rajasthan-village-connects-with-his-first-love-after-50-years
women icon@teamvasundhara
he-treated-me-as-slave

బానిసగా చూశాడు.. బయటకొచ్చేశా..!

స్త్రీలు మగవారితో సమానంగా అంతరిక్షానికి కూడా చేరుకుంటున్న రోజులివి.. ప్రతి విషయంలోనూ మగవారితో పోటీపడుతూ తమ కెరీర్‌లో మరింత ఉన్నత స్థానాలను అందుకుంటున్నారు నేటి మహిళలు. కానీ ఇప్పటికీ కొంతమంది మగ మహారాజులు స్త్రీలంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితమని.. వారికి ఇంటికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే హక్కు లేదని భావిస్తున్నారు. అయితే ఇలాంటివాళ్లకు భయపడి మన జీవితాన్ని ఇంటికే పరిమితం చేయాల్సిన అవసరం లేదని చెబుతోందో అమ్మాయి.. తన అనుభవాన్ని జోడించి.. మనకు స్వేచ్ఛకు సంబంధించిన పాఠాన్ని చెప్పడానికి మన ముందుకొచ్చింది. తన కథేంటో తన మాటల్లోనే విందాం రండి..

Know More

women icon@teamvasundhara
he-tried-to-blackmail-me-with-morphed-photos-i-teach-him-a-lesson

ఆ ఫొటోలతో బెదిరించాడు.. అలా బుద్ధి చెప్పా!

ఓ అబ్బాయి.. అమ్మాయి.. గాఢంగా ప్రేమించుకున్నారు. విషయం అమ్మాయి ఇంట్లో తెలిసి ముందు చదువుపై దృష్టి పెట్టమన్నారు.. దాంతో ఆ అమ్మాయి భవిష్యత్తుపై దృష్టి పెడుతూనే ప్రియుడితో అప్పుడప్పుడూ మాట్లాడేది. కానీ అతని ప్రవర్తనలో మార్పు వచ్చాక క్రమంగా ప్రియుడి నుంచి దూరం జరగడం మొదలుపెట్టింది. ఇది భరించలేకపోయిన ఆ అబ్బాయి తన వద్ద ఉన్న ఆ అమ్మాయి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది? ఈ సమస్య నుంచి ఎలా బయటపడింది? తన జీవితాన్ని తిరిగి సక్రమంగా ఎలా మలుచుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
woman-shares-how-she-got-pregnant-without-ever-having-sex-due-to-rare-vaginal-condition
women icon@teamvasundhara
born-without-a-womb-malaysian-artist-aims-to-normalise-conversations-on-womens-sexual-health

నాకు గర్భాశయం లేదని అప్పుడే తెలిసింది!

పన్నెండేళ్లు దాటాయంటే అమ్మాయిలకు నెలసరి ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు. నిజానికి ఈ సమయంలో ఎలా స్పందించాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వారికి తెలియదు.. పైగా ఏదో తెలియని బెరుకు వారిని ఆవహిస్తుంటుంది. అయినా తమ తల్లుల సహకారంతో వాటిని దాటుకొని యుక్తవయసులోకి అడుగుపెడతారు అమ్మాయిలు. తన ఫస్ట్‌ పిరియడ్‌ కోసం ఓ అమ్మాయి కూడా ఇలాగే ఎదురుచూసింది. కానీ ఏళ్లు గడుస్తోన్నా నెలసరి మాత్రం తనను పలకరించలేదు. దీనికి కారణం తన శరీరంలో ఓ అరుదైన లోపమే అని తెలుసుకున్న ఆమె ఏళ్ల పాటు చీకట్లోనే మగ్గింది. ‘కానీ ఇలా ఎంతకాలం’ అంటూ ఆ చీకట్లను చీల్చుకొని వెలుగు రేఖలా బయటికొచ్చింది. ఈ క్రమంలో తనలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ ఎందరికో రోల్‌మోడల్‌గా మారిందామె. ఒక సమస్య ఉన్నప్పుడు దానికి ఏదో ఒక పరిష్కారం తప్పకుండా ఉండే ఉంటుందంటోన్న ఆమె తన కథను పంచుకోవడానికి ఇప్పుడిలా మనందరి ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
he-is-dominating-before-marriage-in-telugu
women icon@teamvasundhara
my-brother-in-law-cheated-me-in-the-name-of-love-says-a-girl-in-telugu

బావే నమ్మించి మోసం చేశాడు..!

మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..

Know More

women icon@teamvasundhara
how-can-change-his-behavior-in-telugu

ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఆయన్ని మార్చేదెలా?

అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.

Know More

women icon@teamvasundhara
delhi-woman-shares-about-her-covid-experience

కరోనా మా కుటుంబాన్ని ఇంతలా వేధిస్తుందని కలలో కూడా అనుకోలేదు!

ప్రపంచమంతటా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ వైరస్‌ మాత్రం శాంతించడం లేదు. ‘స్ట్రెయిన్‌’, ‘వేరియంట్‌’, ‘మ్యుటేషన్‌’ అంటూ కొత్త రకం పేర్లతో లక్షలాది మందిని తమ బాధితులుగా మార్చుకుంటోంది. ఇక మన దేశంలోనూ తగ్గినట్లే తగ్గి మళ్లీ పంజా విసురుతోందీ మహమ్మారి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న కరోనా కేసులే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఇదే సమయంలో కొత్త కేసుల కంటే రికవరీలు తగ్గుతుండడం.. కరోనా ఇంకా మన మధ్యనే ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో కొవిడ్‌ లేదనుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న వాళ్లందరినీ అలర్ట్‌ చేయడానికి తన కరోనా కథను పంచుకోవడానికి మన ముందుకొచ్చింది దిల్లీకి చెందిన ఓ మహిళ. వ్యాక్సిన్‌ వచ్చినా అది మన దాకా రావడానికి సమయం పడుతుంది కాబట్టి అప్పటిదాకానైనా కనీస జాగ్రత్తలు పాటించాలంటూ అందరినీ వేడుకుంటూ తన కొవిడ్‌ అనుభవాలను ఇలా నెమరువేసుకుంది.

Know More

women icon@teamvasundhara
woman-reunited-with-childhood-sweetheart-and-shares-about-their-long-distance-love-story

క్యాన్సర్ అని తెలిసినా.. నిన్నే ప్రేమించా.. పెళ్లాడతానన్నాడు!

తెలిసీ తెలియని వయసులో ప్రేమంటే అదంతా వట్టి ఆకర్షణ అని కొట్టిపడేస్తుంటాం. కానీ స్కూలింగ్‌ నుంచే వారిద్దరూ మంచి స్నేహితులు.. ఒక రోజు కనిపించకపోయినా, ఒకరినొకరు చూసుకోకపోయినా వారి మనసులో ఏదో వెలితిగా అనిపించేది. కానీ అదే ప్రేమని, ఆకర్షణను మించిన అందమైన అనురాగ బంధమని విడిపోయాక కానీ తెలుసుకోలేకపోయారు. మరి, చదువు, వృత్తి-ఉద్యోగాల రీత్యా వేర్వేరు చోట్ల స్థిరపడ్డ వారు.. ఆ తర్వాత మళ్లీ కలుసుకున్నారా? తమ మనసులోని మాటలను పంచుకున్నారా? లేక ‘ఎవరికి వారే యమునా తీరే..!’ అంటూ ఎవరి దారి వారు చూసుకున్నారా? విధి ఆడిన వింత నాటకంలో ఇంతకీ వీరి ప్రేమకథ నెగ్గిందా? ఓడిపోయిందా? తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రేమికురాలు చెప్పే ప్రేమకథ వినాల్సిందే!

Know More

women icon@teamvasundhara
a-woman-love-story-she-waiting-for-his-parents-approval
women icon@teamvasundhara
kerala-woman-shares-her-horrifying-acid-attack-experience

పెళ్లికి నిరాకరించానని నా ముఖంపై యాసిడ్‌ పోశాడు!

ఆమెకు చిన్న వయసులోనే పెళ్లైంది.. ఏడాది తిరక్కముందే అమ్మయింది.. భర్త, కొడుకుతో హాయిగా సాగిపోతోన్న ఆమె జీవితాన్ని చూసి విధికి అసూయ కలిగినట్లుంది. అందుకే తన భర్తను తన నుంచి, ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరం చేసింది. ఇక అప్పట్నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.. దీనికి తోడు ప్రేమ పేరుతో మరో వ్యక్తి వేధింపులు, అతనితో పెళ్లికి నిరాకరించడంతో యాసిడ్‌ దాడికి కూడా గురైందామె. సుమారు ఆరేళ్లుగా తన శారీరక, మానసిక బాధను పంటి బిగువన భరిస్తూ ఎన్నో కష్టాలకోర్చిన ఆమె.. తనలాంటి వారిలో చైతన్యం నింపేందుకు ఓ చక్కటి నిర్ణయం తీసుకుంది.. యాసిడ్‌ దాడికి గురైనంత మాత్రాన సమాజం మాలాంటి వారిని వెలివేయాల్సిన అవసరం లేదని, మేం తలచుకుంటే ఏదైనా సాధించగలం, నలుగురికీ ఆదర్శంగా నిలవగలం అంటోన్న ఆమె ఎవరు? ఆమె తన ఆశయం గురించి ఏం చెప్పాలనుకుంటోంది? తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
i-would-have-told-about-my-sexual-harassment-to-parents-in-telugu
women icon@teamvasundhara
i-divorced-my-husband-so-that-he-can-spend-life-with-his-gay-friend-explains-an-woman

నా భర్త హోమోసెక్సువల్... అందుకే అలా చేశా!

'నేను తప్పు చేశానని నాకు తెలుసు.. కానీ ఆ విషయం చెప్పాలంటే నాకు ధైర్యం చాల్లేదు. అందుకే ఇన్నాళ్ల నుంచీ మౌనంగా ఉండిపోయా. నిన్ను ఇబ్బందిపెట్టా.. నన్ను క్షమించు.. కావాలంటే నువ్వు నాకు విడాకులు ఇవ్వొచ్చు..' అంటూ రాహుల్ నన్ను అభ్యర్థిస్తుంటే ఏం చేయాలో అర్థం కాక అలాగే కూలబడిపోయాను. ఆ రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు. ఉదయాన్నే లేచి విడాకులు తీసుకోవాలన్న గట్టి నిర్ణయం తీసుకున్నా.. ఇది తన మీద కోపంతో కాదు.. ప్రేమతో తీసుకున్న నిర్ణయం.. ఇప్పటికైనా తనకు నచ్చిన జీవితాన్ని తను గడిపే అవకాశాన్ని ఇచ్చేందుకు నా వంతుగా నేను చేసే చిన్న ప్రయత్నం ఇది..ఇదంతా చూస్తుంటే.. భర్త సంతోషం కోసం తనకు విడాకులు ఇవ్వడమేంటి? అనిపిస్తోంది కదూ.. అదెందుకో తెలియాలంటే మీకు నా కథ తెలియాల్సిందే..

Know More

women icon@teamvasundhara
preganant-woman-from-kerala-shares-her-horrible-covid-story

డెలివరీకి వారం ముందు కరోనా వచ్చింది..!

‘హమ్మయ్య.. మన జీవితంలోనే అత్యంత గడ్డు ఏడాది ముగింపు దశకు చేరుకుంది.. వైరస్‌ కూడా నెమ్మదిగా కనుమరుగవుతోంది.. కొత్త ఏడాదైనా సంతోషంగా మొదలుపెడదాం..’ ప్రస్తుతం మనలో చాలామంది ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. నూతన సంవత్సరం సంతోషంగా ప్రారంభించాలనుకోవడం మంచిదే కానీ.. వైరస్‌ కనుమరుగవుతుందన్న నిర్లక్ష్యం మాత్రం అస్సలు పనికి రాదంటోంది కేరళకు చెందిన ఓ మహిళ. నిండు గర్భంతో అమ్మయ్యే అపురూప క్షణం కోసం ఆనందంగా ఎదురుచూస్తోన్న ఆమెకు డెలివరీకి వారం రోజులుందనగా వైరస్‌ సోకడంతో తీవ్ర ఇబ్బందులు పడింది. గర్భిణుల్లో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉందనుకోవడానికి లేదని, ఎందుకంటే ఈ మహమ్మారి కారణంగా తను జీవితంలోనే అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతోంది. వైరస్‌కు వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఒక్కరి వల్ల అందరూ నష్టపోవాల్సి వస్తుందని అంటోన్న ఆమె తన కొవిడ్‌ అనుభవాలను ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
my-brother-in-law-cheated-me-in-the-name-of-love-says-a-girl

బావే నమ్మించి మోసం చేశాడు..!

మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..

Know More

women icon@teamvasundhara
how-to-change-my-sadistic-husband?
women icon@teamvasundhara
kerala-doctor-puts-service-before-self-rejoins-covid-duty-despite-ailments

డాక్టర్‌గా సేవలందించిన చోటే కరోనా రోగిగా చేరాను!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కరోనాతో పోరాడుతూ ఎంతోమందికి ప్రాణం పోస్తున్నారు వైద్యులు. తమ చుట్టూ ప్రమాదం పొంచి ఉన్నా లెక్కచేయకుండా ఊపిరాడనివ్వని పీపీఈ కిట్లను ధరిస్తూనే కరోనా రోగులకు ఊపిరి పోస్తున్నారు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరు వైద్యులు, నర్సులు అదే మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ డాక్టర్‌ కొన్ని రోజుల క్రితం ఇలాగే కరోనా బారిన పడింది. అదే సమయంలో న్యుమోనియా సోకడంతో మరణం అంచుల దాకా వెళ్లింది. అలా సుమారు రెండు వారాల పాటు ఐసీయూలో ఉన్న ఆమె ఇటీవల కొవిడ్‌ నుంచి కోలుకుంది. ఇప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్న ఈ డాక్టరమ్మ కరోనా రోగులను కాపాడేందుకు మళ్లీ ఆస్పత్రిలో అడుగుపెట్టింది.

Know More

women icon@teamvasundhara
story-of-an-aids-patient-who-is-fighting-with-it-and-creating-awareness-in-others

నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!

ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.

Know More

women icon@teamvasundhara
story-of-a-girl-who-got-cheated-in-online
women icon@teamvasundhara
afghan-woman-shares-her-pathetic-story-about-taliban-attack-on-her

ఉద్యోగం చేస్తున్నానని కంటి చూపు కోల్పోయేలా చేశారు!

ఆడపిల్ల పుట్టడమే శాపంగా భావిస్తారక్కడ. అలాంటిది స్కూలుకెళ్తానంటే ఊరుకుంటారా? ‘చదువు, ఉద్యోగం నీకెందుకు? ఆ పనులు చేయాల్సింది మగాళ్లు! నువ్వు గడప దాటి బయటికి రావడానికి వీల్లేదు’ అంటూ పైగా బోలెడన్ని షరతులు! ఇలాంటి వివక్షను చూస్తూనే పెరిగింది అఫ్గానిస్థాన్‌కు చెందిన వహీదా బేగం. అయినా ఇలాంటి బెదిరింపులకు తలొగ్గే నైజం కాదామెది. కారణం.. తన తండ్రి అండ! ఆడపిల్ల అయితే ఏంటి .... మగాళ్లకు తీసిపోని విధంగా తనని తయారుచేయాలనుకున్నాడు వహీదా తండ్రి. అలా నాన్న చొరవతో చక్కగా చదువుకుని ప్రభుత్వ రంగంలో మంచి ఉద్యోగం సంపాదించిందామె. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. వద్దని వారించినా ఉద్యోగం సంపాదించిందన్న నెపంతో అన్యాయంగా ఆమెపై దాడికి తెగబడ్డారు దుండగులు. ఆమెను తీవ్రంగా గాయపరచడమే కాదు.. ఆమె ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం కూడా కోల్పోయేలా చేశారు. అలాగని అదే తలచుకుంటూ కుమిలిపోకుండా, పడిలేచిన కెరటంలా విజృంభించిదామె.. ఓవైపు బాలికల హక్కులు, వారి విద్య కోసం అహర్నిశలూ శ్రమిస్తోంది. అతివలు తలచుకుంటే ఏదైనా సాధించగలరనే పోరాట స్ఫూర్తిని చాటుతూ తన జీవిత కథను పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
a-martyred-army-jawan-wife-shares-about-struggles-in-her-life

ఇదిగో వచ్చేస్తున్నా అన్నాడు.. వెళ్ళిపోయాడు.. ఈ గుండె కోత తీరేదెలా?

‘పుట్టుకతోనే తల్లిని పొట్టన పెట్టుకుంది’ అనే అపవాదును మూటగట్టుకుందామె! తల్లి లేని తన బాగోగులు చూడాల్సిన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో అమ్మమ్మ దగ్గరే పెరిగింది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పీజీ పూర్తి చేసింది. ఇలా అడుగడుగునా కష్టాలే పరిచయమైన ఆమెకు.. మహేష్ ఓ వెలుగు రేఖలా కనిపించాడు. అతడిని వలచింది.. అతనూ ఆమెను ఇష్టపడ్డాడు. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఓ వీర జవాను భార్యగా గర్వపడుతూనే.. విధి నిర్వహణలో తన భర్తకేమీ కాకూడదని వెయ్యి దేవుళ్లకు మొక్కిందామె. అలా మూడేళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వారి జీవితంలో అనుకోని ఉపద్రవం.. తన భర్త వీర మరణం! మరికొన్ని రోజుల్లో వస్తాను.. నిన్ను తీసుకెళ్తాను.. అని బాస చేసిన భర్త దేశం కోసం ప్రాణాలర్పించినందుకు గర్వపడుతున్నా.. అతను లేని నా జీవితం శూన్యమంటూ, ఆ లోటు ఎప్పటికీ పూడ్చలేనిదంటూ కంటికి ధారగా విలపిస్తోంది. ఆ వీర జవాను భార్య కన్నీటి గాథే ఇది!

Know More

women icon@teamvasundhara
a-new-mom-who-is-nurse-shares-her-story-about-to-contribute-to-the-fight-against-covid-19

పచ్చి బాలింతవి.. కరోనా టైంలో డ్యూటీకి వెళ్లొద్దన్నారు!

‘వద్దమ్మా.. వద్దు..! అసలే నువ్వు పచ్చి బాలింతవి.. ఇలాంటి సమయంలో డ్యూటీకి వెళ్తే.. అటు నీకు, ఇటు పాపాయికి ఇద్దరికీ ముప్పే!’ అన్నారు ఆమె కుటుంబ సభ్యులు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. వృత్తే దైవంగా భావించే ఆ నర్సు.. తన కుటుంబ సభ్యులను ఎలాగోలా ఒప్పించి కరోనాతో పోరుకు కదిలింది. కరోనాకు ముందు మెటర్నిటీ సెలవు కోసం తన సొంతూరుకు చేరుకున్న ఆమె.. ప్రసవానంతర సెలవు పూర్తయ్యే సరికి లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల ఇక్కడే ఆగిపోయింది. ఓవైపు డ్యూటీ చేయాలన్న తపన.. మరోవైపు వెళ్లలేని పరిస్థితి! అయినా మనసుంటే మార్గముంటుందన్నట్లు ఇంట్లో వాళ్లను ఎలాగోలా ఒప్పించి రాష్ట్ర సరిహద్దులు దాటింది.. తిరిగి విధుల్లో చేరింది..! అటు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా విధుల్లో పాల్గొంటూనే, ఇటు తన చిన్నారినీ జాగ్రత్తగా చూసుకుంటున్నానంటోంది. మరి, చంటి బిడ్డతో కరోనాతో పోరు చేస్తోన్న ఈ కొవిడ్‌ వారియర్‌ కథేంటో మనమూ విందాం రండి..!

Know More

women icon@teamvasundhara
hyderabad-woman-shares-her-covid-experience-in-telugu

అనుకోని ప్రయాణం కరోనా తిప్పలు తెచ్చిపెట్టింది!

కరోనా దూకుడుకు కళ్లెం వేయాలంటే దాని అంతు చూసే వ్యాక్సిన్‌ రావాలి. మరి, అది ఎప్పుడు వస్తుందో తెలియదు.. అంతదాకా అన్ని పనులూ ఆపుకొని ఇంట్లో కూర్చుందామంటే కుదరదు. అందుకే కరోనాతో సహవాసం చేయడానికే అలవాటు పడిపోయారంతా! అయితే అటు గృహిణులు, ఇటు ఇంటి నుంచి పనిచేసే మహిళలు వైరస్‌ ముప్పు ఉందని తెలిసినా కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి రావచ్చు. అలా అనుకోకుండా తాను చేసిన ప్రయాణం వల్ల కరోనా బారిన పడ్డానంటోంది హైదరాబాద్‌కి చెందిన నీరజ. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముప్పు ఎటు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేమని ఓవైపు అందరినీ అలర్ట్‌ చేస్తూనే.. మరో వైపు వైరస్‌ సోకిందని ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా మలచుకుంటే కరోనా మహమ్మారిని జయించవచ్చనడానికి తననే ఉదాహరణగా చూపుతోందామె. ఈ క్రమంలోనే తాను కరోనాపై గెలిచిన తీరును, తన అనుభవాలను మనందరితో ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
meet-sneha-a-nurse-in-delhi-who-treats-covid-patients-as-her-family

కరోనాతో క్షణాల్లో వారి ఆరోగ్యం క్షీణించడం కళ్లారా చూశాను!

సాధారణంగా ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు రోగికి కచ్చితంగా తోడుగా ఉంటారు. చికిత్స సమయంలో బంధువులు, సన్నిహితులు, స్నేహితులు కూడా హాస్పిటల్‌కు వచ్చి మనో ధైర్యం చెబుతుంటారు. కానీ కరోనా సోకి చికిత్స తీసుకునే రోగులకు ఇలాంటి సదుపాయాలేవీ ఉండవు. సామాజిక దూరం పాటిస్తూ ఆస్పత్రిలో ఉన్నంతసేపూ ఏకాకిగానే గడపాలి. ఫలితంగా వారు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో వైద్యులు, నర్సులే కరోనా బాధితుల కుటుంబ సభ్యులుగా మారిపోతున్నారు. వైరస్ తమకు సోకే ప్రమాదముందని తెలిసినా ప్రాణాలను పణంగా పెట్టి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో దిల్లీలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోన్న స్నేహ ఏడు నెలలుగా కరోనా బాధితులకు సేవలు చేస్తోంది. కరోనా రోగులను తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ వారిని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి పంపిస్తోంది. ఈ నేపథ్యంలో గత నెలలో కరోనాను జయించి తిరిగి విధుల్లో నిమగ్నమైన ఆ నర్సు హృదయరాగమేంటో మనమూ విందాం రండి..!

Know More

women icon@teamvasundhara
navya-shares-her-covid-story-it-started-with-her-son-developing-flu-and-fever

మేమొకటి తలిస్తే.. కరోనా మరొకటి తలచింది!

కరోనా మనుషుల జీవితాలనే కాదు.. ప్రత్యేక సందర్భాల రూపురేఖల్ని కూడా మార్చేసింది..! అంతకుముందు వరకూ ఏ వేడుకైనా అందరితో కలిసి ఎంతో సంబరంగా జరుపుకొనే మనం ఇప్పుడు ఇంటికే పరిమితమై సింపుల్‌గా చేసుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్‌కి చెందిన నవ్య కూడా తన కొడుకు పుట్టినరోజు వేడుకల విషయంలో ఇలాగే ఆలోచించింది. వాడి మొదటి పుట్టినరోజులాగే ఐదో పుట్టినరోజునూ ఘనంగా జరపాలనుకుంది.. అయినా కరోనా వల్ల అది సాధ్యం కాలేదు..! సరికదా.. సింపుల్‌గానైనా చేసుకుందామంటే అందుకూ కరోనా అడ్డుపడి.. మరోసారి తనను, తన కొడుకును నిరాశపరిచిందంటోంది. మరి, ఇంతకీ ఏమైంది? వాళ్ల బాబు పుట్టినరోజు వేడుకలు ఆగడానికి, కరోనాకు సంబంధమేంటి? రండి.. తన మాటల్లోనే తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
a-boyfriend-saves-her-life-with-his-vision-in-telugu
women icon@teamvasundhara
mumbai-girl-meghana-who-came-from-london-shares-her-covid-story-in-telugu

ఎందుకైనా మంచిదని టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది!

కంటికి కనిపించకుండా, లక్షణాలు తెలియనివ్వకుండా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా మహమ్మారి. దీని బారిన పడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించినా కొంతమందిలో ఇది బయటపడుతూ కలవరపెడుతోంది. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందంటోంది ముంబయికి చెందిన మేఘన. ముందు నుంచీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎందుకైనా మంచిదని పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా తేలిందని చెబుతోందామె. అంతేకాదు.. కరోనా నుంచి కోలుకునే క్రమంలో తన జీవనశైలిలో ఎన్నో మార్పులొచ్చాయని.. ఆరోగ్యకరమైన అలవాట్లు, సానుకూల దృక్పథం ఉంటే కరోనాను సులభంగా జయించచ్చంటూ తన కొవిడ్‌ స్టోరీని ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
kolkata-woman-shares-about-her-early-menopause-story-how-to-deal-with-it

30 ఏళ్లకే మెనోపాజ్‌.. అదో భయంకరమైన అనుభవం!

ఆడపిల్లకు అంతంత పెద్ద పెద్ద చదువులెందుకన్నారంతా! అయినా ఆ మాటలు ఆమె చెవికెక్కించుకోలేదు. కారణం ఆమెకు చదువంటే ప్రాణం. వయసొచ్చింది కదా పెళ్లి చేయమని బంధువులు పోరు పెట్టారు.. అయినా తన పూర్తి ధ్యాసను కెరీర్ పైనే ఉంచిందామె. ఇలా ఆమె సంకల్ప బలానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడవడంతో ఉన్నత విద్యనభ్యసించి విదేశాల్లో ఉద్యోగం సంపాదించింది. తాను కోరుకున్న కెరీర్, చక్కటి జీతం.. రెండేళ్లు స్వేచ్ఛగా, సంతోషంగా జీవించింది. అక్కడే తనకు నచ్చిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. జీవితం సుఖంగా సాగుతోంది.. పిల్లలు పుడితే ఆ సంతోషం రెట్టింపవుతుందనుకుందా జంట. కానీ అంతలోనే మెనోపాజ్‌ రూపంలో ఆమెకు అనుకోని ఉపద్రవం ఎదురైంది. అప్పటికి ఆమె వయసు కేవలం ముప్ఫై అంటే ముప్ఫై ఏళ్లే! ‘ఇంత చిన్న వయసులోనే ఏంటి నాకీ కష్టం’ అని పిల్లల కోసం పరితపించిపోయింది. ఓ బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వ మాధురిమలను ఆస్వాదించలేకపోయానే అని బాధపడింది.అన్ని దారులూ మూసుకుపోవడంతో ఇక చేసేది లేక ఓ పిల్లాడిని దత్తత తీసుకుందామె. అకాలంలో వచ్చిన మెనోపాజ్.. తల్లిని కావాలన్న తన కలను ఎలా కల్లలు చేసిందో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
woman-shares-her-pregnancy-struggle-after-failed-several-ivf-attempts

ఐవీఎఫ్‌ ఫెయిలైనా.. ఆరోగ్యకరమైన జీవనశైలితో సహజంగానే తల్లయ్యా!

పెళ్లయిన ప్రతి మహిళా అమ్మతనం కోసం ఆరాటపడుతుంది.. ఎప్పుడెప్పుడు తల్లినవుతానా అని తపిస్తుంది. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌కు చెందిన ఓ మహిళ కూడా అమ్మతనం కోసం ఎంతగానో పరితపించింది.. ఎన్నో ఆస్పత్రులు తిరిగింది.. ఎందరో డాక్టర్లను కలిసింది. అయినా తన కల నెరవేరకపోయేసరికి తల్లడిల్లింది. ఆఖరి ప్రయత్నంగా ఐవీఎఫ్‌ చికిత్స కూడా తీసుకుంది. అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది. ‘ఇక ఈ జీవితంలో నాకు అమ్మయ్యే యోగం లేదేమో’ అనుకుంటోన్న తరుణంలోనే దేవుడు వరమిచ్చినట్లు సహజంగానే గర్భం ధరించిందామె. పండంటి కూతురు పుట్టడంతో పట్టరానంత సంతోషంలో మునిగిపోయింది. ప్రస్తుతం తన కూతురితో, భర్తతో సంతోషంగా జీవిస్తోన్న ఆమె.. తనలాంటి వారి గురించి నాకెందుకులే అనుకోలేదు. అమ్మయ్యే క్రమంలో తనకు ఎదురైన సమస్యలు, సవాళ్లను నలుగురితో పంచుకోవాలనుకుంది.. తద్వారా అమ్మతనం కోసం ఆరాటపడుతోన్న మహిళల్లో స్ఫూర్తి నింపాలనుకుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌ వేదికగా.. మహిళలకు ఉపయోగపడే ఎన్నో చిట్కాలను అందిస్తోన్న ఆమె అమ్మయ్యే క్రమంలో తనకెదురైన అనుభవాలను, సవాళ్లను ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
woman-shares-her-experience-on-sexual-harassment-in-the-age-of-zoom-calls-and-covid-19

‘నాతో ఒక్క రోజు గడుపు.. నిన్నొదిలేస్తా’ అన్నాడు!

అసలే ఆర్థికంగా కష్టాల్లో ఉందామె.. దానికి తోడు కరోనా ప్రతికూల పరిస్థితులు ఆమెకున్న ఉద్యోగాన్ని లాగేసుకొని ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. అయినా ఉద్యోగ ప్రయత్నాలు మానుకోలేదామె. తన పనితనం, ప్రతిభకు మెచ్చి ఓ కంపెనీ ఆమెకు ఉద్యోగమిచ్చింది.. అందులోనూ కరోనా కారణంగా ఇంటి నుంచే పని చేయమనే ఆఫర్‌ కూడా ఇచ్చింది. ‘నా అదృష్టమో, దేవుడి దయో గానీ.. ఉద్యోగమైతే వచ్చింది’ అని సంబరపడిపోయిందామె. ఇక తన కష్టాలు తీరిపోయినట్లే అనుకుంది.. కానీ అప్పట్నుంచి ఆ కష్టాలకు మించిన నరకం అనుభవిస్తానని ఊహించలేదామె. మరి, ఉద్యోగం చేద్దామంటే రోజూ వేధింపులే, మానేద్దామంటే మానేయలేని పరిస్థితి.. అంటూ తనకెదురైన చేదు అనుభవాలను మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
a-story-of-a-woman-who-lost-her-husband-due-to-honor-killed-in-telugu

ప్రేమా.. ప్రేమా.. ప్రేమించడం నేరమా..?!

ప్రేమ.. రెండు మనసుల్ని ఒక్కటి చేసే ఈ మధురమైన భావనకు కులమతాల తారతమ్యం లేదంటారు.. రూపు-రేఖలు ఎలా ఉన్నా పట్టించుకోదంటారు.. వయసుతో అసలు పనే లేదంటారు. ఇలా అన్నింటా ప్రేమదే అంతిమ విజయం. కానీ పరువు దగ్గరికొచ్చే సరికి మాత్రం దీనికి ఎప్పుడూ ఓటమే ఎదురవుతుంది. ప్రేమతో ఒక్కటై ‘ఇక నిండు నూరేళ్లు నీతోనే నా బతుకు!’ అని బాస చేసుకున్న జంటల ఆనందాన్ని ఆవిరి చేస్తోందీ ఎందుకూ కొరగాని ఈ పరువు. అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం అదృష్టమంటారు. అలాంటి వ్యక్తిని ప్రేమిస్తే తప్పా? అతనితో జీవితాన్ని పంచుకోవడం నేరమా? పెద్దల దృష్టిలో వారికి నచ్చని వారిని ప్రేమిస్తే పరువు పోతుంది కానీ వారు ఆ ప్రేమను చంపేసి నలుగురిలో హంతుకులుగా మారితే అది పరువు తక్కువ కాదా? ఇలా పరువు-ప్రతిష్టల పేరుతో ప్రేమను చంపేసి ఏం సాధిస్తారు? అంతులేని దుఃఖం తప్ప! అంటూ తన మనసులోని ఆవేదనను పంచుకుంటోంది ఎంతగానో ప్రేమించిన తన భర్తను పోగొట్టుకున్న ఓ అభాగ్యురాలు. మరి, ఆమె హృదయరాగమేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
a-rape-survivor-shares-her-story-and-alerting-other-women-in-telugu

అన్నయ్య అని నమ్మితే కోరిక తీర్చమన్నాడు!

వారిద్దరూ ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. ఉండే ప్రదేశాలు, ఆఫీస్‌ సమయాలు కూడా ఒకటే కావడంతో రోజూ కారులో కలిసే ఆఫీస్‌కి వచ్చి వెళ్తుంటారు. కరోనా కారణంగా బయట తగిన రవాణా సౌకర్యాలు కూడా లేకపోవడంతో ‘హమ్మయ్య.. నాకు నా కొలీగ్‌ కారైనా ఉంది.. ఈ సౌకర్యం కూడా లేక తిప్పలు పడే వారు ఎందరో!’ అంటూ సంతోషించిందా అమ్మాయి. కానీ ఆ సంతోషం అంతలోనే ఆవిరవుతుందని, తాను సౌకర్యం అనుకున్న ఆ కారే తన పాలిట కామ పాశమవుతుందని ఊహించలేదా యువతి. ఒక తోబుట్టువుగా తాను నమ్మిన వ్యక్తే తన కోరిక తీర్చమంటూ అడిగే సరికి జీర్ణించుకోలేకపోయిందామె. ఇక ఈ ఘోరాన్ని ఆపే ప్రయత్నంలో తీవ్ర గాయాలై ఆస్పత్రి పాలైంది మరో మహిళ. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో తనకు జరిగిన అన్యాయానికి కుంగిపోవాలో, తన వల్ల సాటి మహిళ కోరి కష్టాలు కొని తెచ్చుకుందని బాధపడాలో తెలియని అయోమయంలో ఆ చేదు జ్ఞాపకాన్ని పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
a-medico-shares-her-tougher-experiences-about-covid-19-and-give-some-basic-precautions-to-all-of-us

అలా బయటికొచ్చేముందు ఒక్కసారి మీ వాళ్లను గుర్తు తెచ్చుకోండి..!

‘ఏంటో ఈ మాయదారి కరోనా మహమ్మారి రోజురోజుకీ విరుచుకుపడుతోందే తప్ప ఏమాత్రం శాంతించట్లేదు.. దీనికి టీకా ఎప్పుడొస్తుందో? ఈ గండం నుంచి ఎప్పుడు గట్టెక్కుతామో?’.. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటున్నారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోన్న మనమేమో వైరస్‌ ముప్పు ఎటు నుంచి ముంచుకొస్తుందోనని భయపడుతుంటే.. కొందరేమో అసలు వైరసే లేనట్లు ప్రవర్తిస్తున్నారు. బయటికి వచ్చే ముందు కనీసం మాస్కైనా పెట్టుకోని వారు కొందరైతే.. సామాజిక దూరాన్ని పూర్తిగా గాలికొదిలేశారు మరికొందరు. నెలలు గడుస్తోన్నా, వైరస్‌ గురించి అందరిలో అవగాహన వచ్చినా.. ఇలాంటి వారి వల్లే దేశంలో కరోనా విలయతాండవం చేస్తోందని అంటోంది ఓ మెడికో. తద్వారా వారి చుట్టూ ఉన్న వారే కాదు.. వైద్యులపై కూడా మోయలేనంత భారం పడుతోందని, అది వారిని అటు శారీరకంగా, ఇటు మానసికంగా కుంగదీస్తోందని చెబుతూ తమ వెతల్ని ఇలా మనందరితో పంచుకుంది.

Know More