scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo
Relations Heart

నా శాడిస్ట్ భర్తని మార్చేదెలా?

How to change my sadistic husband?

నమస్తే మేడమ్.. నాకు పెళ్త్లె 3 సంవత్సరాలైంది. ఒక పాప కూడా ఉంది. నా భర్తే నాకు పెద్ద సమస్య. తను బాధ్యత లేని వ్యక్తి. ఉద్యోగం చేయడం అంటే తనకు చాలా చిరాకు.. కష్టపడి పని చేయాలంటే ఏదో బాధగా, భారంగా ఫీలవుతాడు. జాబ్‌కి ఒక రోజు వెళ్లాడంటే 4 రోజులు మానేస్తాడు. ఎంతసేపూ కష్టపడకుండా, సులభంగా డబ్బులు రావాలనుకుంటాడు. తనకు తల్లి మీద కానీ, తండ్రి మీద కానీ గౌరవం లేదు. ఆత్మన్యూనతా భావం చాలా ఎక్కువ. తన కంటే తక్కువ హోదా ఉన్న వాళ్లతోనే మాట్లాడతాడు. మన కంటే మంచి స్థాయిలో, మంచి ప్రవర్తనతో ఉన్నవాళ్లతో స్నేహం చేస్తే వాళ్లు మనకు అవకాశాలు ఇస్తారు కదా అనే ఆలోచన తనకు అస్సలు ఉండదు. భవిష్యత్తులో ముందుకు వెళదాం అన్న ఆలోచన అస్సలుండదు. ఎంతసేపూ కష్టపడకుండా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తాడు. ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధ జీవితం మీద ఉండదు. చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలాడతాడు. తనని నమ్మిన వాళ్లని దారుణంగా మోసం చేస్తాడు. స్వార్థం ఎక్కువ. ఏ భర్త అయినా తన భార్యాపిల్లల్ని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటాడు. కానీ తను మాత్రం నన్ను ఎలా ఏడిపించాలి?, ఎలా హింస పెట్టాలి? అని ఆలోచిస్తాడు. ప్రతి మాటకు తప్పులు తీసి గొడవ పెట్టుకుంటాడు. నన్ను మానసికంగా హింసించి, ఏడిపించి ఆనందం పొందుతాడు. నేను చాలా సెన్సిటివ్. గొడవలంటే నాకు చాలా భయం. నా చదువు పూర్తయ్యేంత వరకు మా తల్లిదండ్రులు ఎప్పుడూ నా ముందు గొడవ పడలేదు. స్కూల్, కాలేజీ, ఇల్లు తప్ప నాకు మరే ధ్యాస ఉండేది కాదు. ఇలాంటి మనస్తత్వం ఉన్న నేను నా భర్త వల్ల మానసికంగా నలిగిపోతున్నాను. ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నాను. బీటెక్ చదివాడు కానీ చదువు విలువ అస్సలు తెలీదు. పెద్దవాళ్లను ఎదిరించి మాట్లాడడమే గొప్ప అనుకుంటాడు.

sadisthusbandgh650-3.jpg
నా మాటంటే లెక్క లేదు!
మీకు ఓ ఉదాహరణ చెప్తాను. తన సొంత అక్కా వాళ్లు టూర్‌కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయి వాళ్ల అక్క చనిపోయింది. ఆమె చిన్న కూతురికి యాక్సిడెంటులో కాలు, చేయి విరిగి ఐసీయూలో ఉంటే ఆ అమ్మాయి దగ్గర రెండు రోజులు ఉండి అక్కడ్నుంచి పారిపోయి ఇంటికొచ్చాడు. ఎందుకొచ్చావని అడిగితే హాస్పిటల్‌లో ఉండలేకపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు అనిపించింది.. సొంత అక్క పిల్లల్నే వదిలేసి వచ్చాడు.. నన్ను, నా బిడ్డని అలానే వదిలేసి పారిపోతాడేమో అని అనుకున్నాను. కరక్ట్‌గా అలానే చేశాడు. నాకు డెలివరీ అయ్యాక 10 రోజులకి గొడవ పెట్టుకొని పారిపోయాడు. ఒకసారి మా అత్తయ్య వాళ్ల ఇంట్లో 10 రోజులు ఉన్నాం. అత్తయ్య, మావయ్య హైదరాబాదు వెళ్లారు. వెళ్లేటప్పుడు మిల్లుకి వెళ్లి వడ్లు పట్టించుకు రమ్మని చెప్పి వెళ్లింది అత్తయ్య. అదే మాట నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినిపించుకోలేదు. తనకి ఇష్టమైన కరివేపాకు అయిపోతే.. అయిపోయిందని చెప్పలేదేంటని గొడవ పెట్టుకునే వాడు. కానీ రైస్ మాత్రం పట్టించుకుని తెచ్చేవాడు కాదు. తన గురించి తప్ప, ఇతరుల గురించి ఏమాత్రం పట్టించుకోని అతని వైఖరి చూస్తే నాది, నా బిడ్డ పరిస్థితి ఏంటని చాలా భయం వేసింది. ఆ పది రోజులు గుడిలో రాముల వారికి తలంబ్రాలు పోసిన పసుపు బియ్యం ఉంటే అవే వండి పెడితే తిన్నాడు.. కానీ వడ్లు మాత్రం పట్టించుకు రాలేదు.

sadisthusbandgh650-4.jpg
క్షణక్షణం నరకమే!
రోజూ అర్ధరాత్రి నేను పడుకున్న గది డోర్ కొడుతుంటాడు.. 'నాకు భయంగా ఉంది డోర్ కొట్టద్దు..' అని చెప్పినా అలానే చేసేవాడు. నేను ఏడుస్తుంటే ఆనందపడి నవ్వుకునేవాడు. ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుని అన్నం, కూర విసిరి కొడతాను అంటాడు. చాలా భయం వేస్తుంది. ఓ రెండు రోజులు బాగానే ఉంటాడు ఆ తరువాత రోజు నుంచి ఎలా ఉంటాడో తనకే తెలియదు. క్షణక్షణం చస్తూ బతకాలి. అలా ఒకసారి గొడవ పెట్టుకుని తను నాకు ఇచ్చిన ఫీచర్ ఫోన్‌ని లాగేసుకున్నాడు. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అవ్వాలని టార్చర్ చేసేవాడు. 'నీకు నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకున్నాను. కానీ సిజేరియన్ అయ్యింది'.. కావాలని ఆపరేషన్ చేయించుకున్నానని ఏడిపించేవాడు. నాకు పాప పుట్టింది. పాపకి నక్షత్ర శాంతి పూజలు చేయించాలి అని చెప్పాను. 'అమ్మాయి పుట్టింది.. పూజలు చేయించను' అని మళ్లీ గొడవ పెట్టుకుని పారిపోయాడు. మా అత్తయ్య, మావయ్య తనకే మద్దతు పలుకుతారు. మా మావయ్య మా నాన్నని ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేస్తారు. 'మీ కొడుకు లాంటోడు.. మీరే బతిమాలి ఇంటికి రమ్మని చెప్పండి' అని చెప్పేవారు. మా నాన్న నా తప్పు లేకపోయినా అతనికి ఫోన్ చేసి వెళ్లి ఇంటికి తీసుకుని వచ్చారు. ఇలా రెండు మూడు సార్లు జరిగింది. నా తప్పు లేకపోయినా నా తండ్రి తనను అలా బతిమిలాడుతుంటే నాపైన నాకే అసహ్యం వేస్తోంది.
వేరు కాపురం అంటున్నాడు.. నావల్ల కాదు!
పెళ్త్లెన దగ్గర్నుంచి ఇప్పటి వరకు నేను మా అమ్మ వాళ్లింట్లోనే ఉన్నాను. వేరు కాపురం పెట్టలేదు. తను ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ పెట్టాలంటున్నాడు. నాకు వేరే ఫ్యామిలీ అంటేనే చాలా భయంగా ఉంది. తనకు భార్య అంటే ఓ యంత్రం లాగా పని చేసే పని మనిషి మాత్రమే. నాకు అలా పని చేసే శక్తి లేదు. తను పెట్టే మెంటల్ టార్చర్ వల్ల ప్రస్తుతం నేను ఒకరు వండిపెడితే తినే పరిస్థితిలో ఉన్నాను. నమ్మకం లేని వ్యక్తితో, అబద్ధాలు చెప్పే వ్యక్తితో, కట్టుకున్న భార్యను కూడా దారుణంగా మోసం చేసే వ్యక్తితో, మానసిక స్థిరత్వం లేని వ్యక్తితో, జీవితంలో ముందుకు వెళ్లాలన్న ఆలోచన లేని వ్యక్తితో, తన పంతం మాత్రమే గెలవాలి అనుకునే మూర్ఖుడితో, నా బాధ అర్థం చేసుకోని వ్యక్తితో, నన్ను మానసికంగా హింసించే వ్యక్తితో ఎలా కలిసుండాలి..? పాప వయసు ఇప్పుడు రెండేళ్లు. పాప పుట్టిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్‌కి వచ్చి పాప ఎదుగుదల ఎలా ఉంది అని ఒక్కసారి కూడా అడగలేదు.
కన్న బిడ్డంటే మమకారం లేదు!
పాప పుట్టిన తర్వాత కొన్ని రోజుల దాకా నా పాలు తాగలేదు.. ఓ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏడుస్తూనే ఉంది. హాస్పిటల్‌కి తీసుకుని వెళ్దాం అని ఫోన్ చేస్తే.. 'హాస్పిటల్‌కి తీసుకెళ్లడం అవసరమా' అని అడిగాడు. వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్‌కి వెళ్దామని ఫోన్ చేస్తే వచ్చేవాడు కాదు. వూరిలోనే ఉంటాడు కానీ పని ఉంది అని చెప్పి రాడు. తన కన్న బిడ్డ మీద తనకు బాధ్యతా లేకపోతే ఎలా? ఎవరు చూస్తారు? 'పాప విషయంలో మీ కొడుకు ఇలా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడ'ని మా మామయ్యతో చెబితే.. 'తల్లివి నువ్వు ఉన్నావు కదా' అంటున్నారు. అన్ని బాధ్యతలు తల్లికేనా? తండ్రికి ఏ బాధ్యత ఉండదా? తండ్రి ఏ బాధ్యతా లేకుండా బలాదూర్ తిరగొచ్చా? ఇక జీతం విషయానికొస్తే.. 'నాకు నెలకు 20,000 చాలు. అంతకన్నా ఎక్కువ కష్టపడను' అంటాడు. ఆ వచ్చే జీతం తనకే సరిపోదు. ఆరోగ్యం కోసం అని చెప్పి మొత్తం తినడానికే ఖర్చు పెడుతున్నాడు. అలా అయితే మిగతా ఖర్చులు ఎలా భరిస్తావు అనడిగితే.. నీకు డబ్బు పిచ్చి అని గొడవ పెట్టుకుని మళ్లీ పారిపోయాడు. నా భర్త ఆర్థికంగా స్థిరపడేదాకా వేరే కాపురం పెట్టడానికి నన్ను, పాపను పంపను అంటున్నారు మా నాన్న. అలా గత సంవత్సరంన్నర నుంచి కనీసం పాపను చూడటానికి కూడా రాలేదు.
నన్నూ అమ్మేస్తాడేమో?!
ఎలాంటి కష్టం లేకుండా ఉన్న ఆస్తులు అమ్ముకొని బతకాలి అని చెప్తాడు. తన లాజిక్ ప్రకారం అన్నీ అమ్ముకొని బతుకుతాడు, ఆస్తులు అన్నీ కరిగిపోయాక నన్ను, పాపని అమ్మడు అని గ్యారంటీ ఏంటి? నాకు చాలా భయంగా ఉంది మేడమ్. మా అత్తయ్య, మామయ్య వాళ్లు కూడా.. నయా పైసా ఖర్చు లేకుండా ఉంటుందని కొడుకుని అత్తగారింట్లో ఉండమని.. వాళ్లే నిన్ను పోషిస్తారని చెప్తారు. అంతేకానీ 'కష్టపడు, జీవితంలో మంచి పేరు తెచ్చుకో, ఎవరి మీదా ఆధారపడకుండా నీ భార్యాపిల్లల్ని చూసుకో' అని ఏనాడూ చెప్పరు. నేను జాబ్ చేసుకుంటూ నా పాపని నేనే చూసుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను పాపను కూడా ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాను. తన మెంటల్ టార్చర్ వల్ల నా ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఇప్పుడు నన్ను, నా పాపని మా తల్లిదండ్రులే చూసుకుంటున్నారు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు మెంటల్ టార్చర్ పెట్టాడు. ఇలానే ఉంటే ఇంకా ఏం చేస్తాడో అని భయంగా ఉంది. నాకేమైనా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటని రోజూ రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు. తనకున్న మెంటల్ కండిషన్‌కి నా ప్రాణాలు ఎప్పుడు తీసేస్తాడో అని చస్తూ బతుకుతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు.
- ఓ సోదరి

: మీ భర్త వ్యక్తిత్వం విషయంలో, అతని ప్రవర్తన విషయంలో మీరు బాగా విసిగిపోయారని, మీ మనసు గాయపడిందని మీ సుదీర్ఘ ఉత్తరం స్పష్టం చేస్తోంది. అసలు సమస్య ఏంటనే స్పష్టత మీలో కనిపిస్తోంది.. కానీ మీ వైపు నుంచి తీసుకునే చర్యలు ఏంటీ? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదనిపిస్తోంది. ప్రత్యేకించి అతని మానసిక స్థితి పట్ల మీకున్న అంచనా, అవగాహన స్పష్టంగానే ఉన్నాయి. సమస్యలనేవి ఒక్కరోజులో సమసిపోయేవి కావు. గత కొన్నేళ్లుగా మీరు ఈ సమస్యలు అనుభవిస్తున్నారని మీ సుదీర్ఘ ఉత్తరం తెలియజేస్తోంది. అయితే మీ విషయంలో, మీ ఆరోగ్యం విషయంలో ముందుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలనేది మీరు గుర్తించాలి. మీ మనసుని, మీ శరీరాన్ని పూర్తిగా మీ నియంత్రణలోకి తెచ్చుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే దిశగా మొట్టమొదటి అడుగులు వేయాలి.

sadisthusbandgh650-1.jpg

ఈ సమస్యలతో మీ ఆరోగ్యం చెడగొట్టుకుంటే.. మీరు కూడా మీ పాపని సరిగా చూసుకోలేని పరిస్థితి రావచ్చు. కాబట్టి ముందుగా మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకునే విషయంపై దృష్టి పెట్టండి. దానికి మీ మనసు కూడా మీకు సహకరించాలి. కాబట్టి శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి, మనసుని దృఢపరచుకోవడానికి ప్రయత్నాలు చేయండి.దీనికోసం మీకు కావాల్సింది ఆత్మస్త్థెర్యం.. ముందుగా మీ ఆత్మస్త్థెర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. మీరు చదువుకున్నారు.. ఉద్యోగం చేసే శక్తి కూడా ఉందని మీ ఉత్తరం సూచిస్తోంది. అలాంటప్పుడు అతనితో జీవితాన్ని కొనసాగించినా.. కొనసాగించకపోయినా పాపకోసం, పాప భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మీరు తగిన చర్యలు తీసుకోవడం అవసరం.

నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి...
ప్రస్తుతానికి మీ తల్లిదండ్రులు మీకు, మీ పాపకు ఆసరాగా నిలబడ్డారు కాబట్టి... దానిని వూతంగా తీసుకుని సానుకూల దృక్పథంతో మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకొనే దిశగా అడుగులు వేయండి. మీ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడ్డాక పై చదువులు చదవాలనుకుంటున్నారో, లేదా ఉద్యోగం చేయాలనుకుంటారో ఆలోచించుకోండి. చదువు అనేక విధాలుగా మనల్ని మనం మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దూరవిద్యా విధానం ద్వారా విద్యార్హతలు మెరుగుపర్చుకునే అవకాశాలూ ఉన్నాయి. అలాగే మీ పరిధిలో మీరున్న పరిస్థితులకనుగుణంగా, మీకు, మీ పాపకు ఇబ్బంది కలగకుండా మీరు చేయగలిగినటువంటి ఉద్యోగాలు ఏంటనేవి ఆలోచించుకోండి. ముఖ్యంగా మీ ఆరోగ్యంపైన భారం పెట్టనుటువంటి ఉద్యోగాలు ఏమున్నాయో ఆలోచించుకోండి. ఒకేసారి పూర్తిస్థాయి ఉద్యోగం చేయడం కష్టమనుకుంటే ముందు పార్ట్‌టైంతో మొదలుపెట్టి క్రమేపీ మీ స్థాయిని విస్తరించుకోండి.. ఈ లోపల మీ నైపుణ్యాలను, అర్హతలను కూడా మెరుగుపర్చుకోండి.

sadisthusbandgh650-2.jpgమీ కాళ్లపైన మీరు నిలబడండి...
ఇవన్నీ చేసిన తర్వాత మీలో ఆత్మవిశ్వాసం, మీరు మీ పాపను బాగా చూసుకోగలను అన్న ధైర్యం నిండినపుడు మీ భర్తతో జీవితాన్ని ముందుకు కొనసాగించాలా? వద్దా? అనే విషయాన్ని ఆలోచించండి. మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం అతడికి అండగా ఉన్నారన్న ధైర్యంతో అతని తల్లిదండ్రులు అతని విషయంలో పట్టించుకోవట్లేదు.. అయితే వారు ఎక్కువ బాధ్యత తీసుకోవడం లేదో.. నిజంగానే తీసుకోలేకపోతున్నారో అన్న విషయం స్పష్టంగా తెలియదు. పెళ్త్లెన దగ్గర నుంచి మీ బాగోగులు తల్లిదండ్రులే పట్టించుకున్నారు కాబట్టి, ఇప్పుడు కూడా వాళ్లే చూసుకోవాలని మీ అత్తమామలు భావిస్తున్నట్లు మీ ఉత్తరం చెబుతోంది. అయితే మీ ఇరువురి విషయంలో కలకాలం ఇద్దరి తల్లిదండ్రులు నిలబడలేరు అనేది వాస్తవం. కాబట్టి మీ ఇద్దరూ జీవితాన్ని కలిసి గడపదలచుకున్నారా? లేదా ఎవరి జీవితం వారు గడపదలచుకున్నారా? అనే విషయంలో స్పష్టత తెచ్చుకోవాలి. అయితే ఆ దిశగా అడుగులు వేసే ముందు మీ ఆర్థిక స్థితిని ఒక స్థాయికి తెచ్చుకోవడం, మీ కాళ్ల మీద మీరు నిలబడడం, మీ పాపకు మీరు అండగా ఉండగలను అనే మనోధైర్యాన్ని, ఆత్మస్త్థెర్యాన్ని మీకు మీరు తెచ్చుకోవడం ముఖ్యం. అతనితో జీవితం గడపడమా? లేదా అన్న విషయం ఆ తర్వాతే ఆలోచించాలి.


సానుకూల సంభాషణతో..
ఈ లోపల అతనితో స్పష్టంగా మీరు చెప్పవలసిన విషయం ఏంటంటే ఇద్దరూ కలిసి పాప బాధ్యత పంచుకోవాలి. ఇటు మీ తల్లిదండ్రులు కానీ, అతని తల్లిదండ్రులు కానీ కలకాలం మీ బాధ్యతలు పంచుకోరు అనే విషయాన్ని స్పష్టం చేయండి. కేవలం ఇరవై వేల వరకే సంపాదించడం కాకుండా పాప భవిష్యత్తు దృష్ట్యా క్రమక్రమంగా అతడు మీ కుటుంబ పరిస్థితిని ఎలా మెరుగుపరచగలడు అన్న విషయాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేయమనండి. అతనితో మీరు సానుకూలంగా మాట్లాడే పరిస్థితి ఇంకా కొనసాగుతూ ఉంటే.. సానుకూలమైనటువంటి సంభాషణలో భాగంగా అతనితో ఒక్కసారిగా జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాల గురించి మాట్లాడకుండా చిన్న లక్ష్యాల గురించి, అతను సాధించగల లక్ష్యాల గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే అతను అలా ఇంట్లో నుంచి పారిపోవడం, బాధ్యత లేకుండా ప్రవర్తించడం వంటి నేపథ్యంలో అతనికి అవసరమైన మానసిక నిపుణుల సహాయం అతని తల్లిదండ్రుల ద్వారా అతనికి ఇప్పించడం అవసరం. ఇలా అనేక కోణాల నుంచి ఆలోచించి మీ జీవితానికి తగ్గ నిర్ణయాన్ని తీసుకోండి. అయితే ముందుగా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం, మీ కాళ్ల మీద నిలబడడం అనేది అతనితో జీవితం కొనసాగించినా, కొనసాగించకపోయినా.. అన్ని విధాలుగా అవసరమే.
œË®ý-éÂx-ªá-«Õªý

'£¾Ç%Ÿ¿-§ŒÕ-ªÃ’¹¢Ñ QJ¥Â¹ ¤Äª¸½-Â¹×©Õ ÅŒ«Õ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ, ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ X¾¢ÍŒÕ-Â¹×¯ä „äC¹. ¨ QJ¥-¹©ð “X¾ÍŒÕ-J¢Íä ¹Ÿ±¿-¯Ã-©-Eo-šËÂÌ ¤Äª¸½-Â¹×©ä ª½ÍŒ-ªá-ÅŒ©Õ. Æ¢Ÿ¿Õ-«©x ¨ ¹Ÿ±¿-¯Ã-©ðxE „î¾h-„éÕ, Æ«®¾h„Ã-©Åî «®¾Õ¢-Ÿµ¿-ª½.-¯çšü „ç¦ü-å®j-šüÂ¹× ‡©Ç¢šË ®¾¢¦¢Ÿµ¿¢ ©äŸ¿Õ. ¨ QJ¥-¹-©ðE ¹Ÿ±¿©Õ, ¹Ÿ±¿-¯Ã-©Åî ‡«-J-éÂj¯Ã ƒ¦s¢C …¯Ão, Ʀµ¼u¢-ÅŒ-ªÃ©Õ …¯Ão ƒÂ¹ˆœ¿ ÂËxÂú Íä®Ï «ÖÂ¹× ÅçL-§ŒÕ-èä-§ŒÕ¢œË. Æ{Õ-«¢šË ¹Ÿ±¿, ¹Ÿ±¿-¯ÃEo „ç¦ü-å®j-šü-©ð¢* Åí©-T¢-ÍŒœ¿¢ «Ö“ÅŒ¢ ¨¯Ãœ¿Õ ¦ÇŸµ¿uÅŒ. ƢŌ-¹×-NÕ¢* ƒÅŒ-ª½“Åà ͌{d-X¾-ª½-„çÕiÊ ÍŒª½u-©Â¹× ¨¯Ãœ¿Õ ¦ÇŸµ¿uÅŒ «£ÏÇ¢-ÍŒŸ¿Õ.

 
   
 
 
 

Share Your Story

 
   
 
(Press ctrl+g to switch(English/Telugu))
 

women icon@teamvasundhara
a-woman-hates-marriage-but-wants-to-be-a-mother

పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !

ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !

Know More

women icon@teamvasundhara
82-years-old-gatekeeper-of-rajasthan-village-connects-with-his-first-love-after-50-years
women icon@teamvasundhara
he-treated-me-as-slave

బానిసగా చూశాడు.. బయటకొచ్చేశా..!

స్త్రీలు మగవారితో సమానంగా అంతరిక్షానికి కూడా చేరుకుంటున్న రోజులివి.. ప్రతి విషయంలోనూ మగవారితో పోటీపడుతూ తమ కెరీర్‌లో మరింత ఉన్నత స్థానాలను అందుకుంటున్నారు నేటి మహిళలు. కానీ ఇప్పటికీ కొంతమంది మగ మహారాజులు స్త్రీలంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితమని.. వారికి ఇంటికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే హక్కు లేదని భావిస్తున్నారు. అయితే ఇలాంటివాళ్లకు భయపడి మన జీవితాన్ని ఇంటికే పరిమితం చేయాల్సిన అవసరం లేదని చెబుతోందో అమ్మాయి.. తన అనుభవాన్ని జోడించి.. మనకు స్వేచ్ఛకు సంబంధించిన పాఠాన్ని చెప్పడానికి మన ముందుకొచ్చింది. తన కథేంటో తన మాటల్లోనే విందాం రండి..

Know More

women icon@teamvasundhara
he-tried-to-blackmail-me-with-morphed-photos-i-teach-him-a-lesson

ఆ ఫొటోలతో బెదిరించాడు.. అలా బుద్ధి చెప్పా!

ఓ అబ్బాయి.. అమ్మాయి.. గాఢంగా ప్రేమించుకున్నారు. విషయం అమ్మాయి ఇంట్లో తెలిసి ముందు చదువుపై దృష్టి పెట్టమన్నారు.. దాంతో ఆ అమ్మాయి భవిష్యత్తుపై దృష్టి పెడుతూనే ప్రియుడితో అప్పుడప్పుడూ మాట్లాడేది. కానీ అతని ప్రవర్తనలో మార్పు వచ్చాక క్రమంగా ప్రియుడి నుంచి దూరం జరగడం మొదలుపెట్టింది. ఇది భరించలేకపోయిన ఆ అబ్బాయి తన వద్ద ఉన్న ఆ అమ్మాయి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది? ఈ సమస్య నుంచి ఎలా బయటపడింది? తన జీవితాన్ని తిరిగి సక్రమంగా ఎలా మలుచుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
woman-shares-how-she-got-pregnant-without-ever-having-sex-due-to-rare-vaginal-condition
women icon@teamvasundhara
born-without-a-womb-malaysian-artist-aims-to-normalise-conversations-on-womens-sexual-health

నాకు గర్భాశయం లేదని అప్పుడే తెలిసింది!

పన్నెండేళ్లు దాటాయంటే అమ్మాయిలకు నెలసరి ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు. నిజానికి ఈ సమయంలో ఎలా స్పందించాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వారికి తెలియదు.. పైగా ఏదో తెలియని బెరుకు వారిని ఆవహిస్తుంటుంది. అయినా తమ తల్లుల సహకారంతో వాటిని దాటుకొని యుక్తవయసులోకి అడుగుపెడతారు అమ్మాయిలు. తన ఫస్ట్‌ పిరియడ్‌ కోసం ఓ అమ్మాయి కూడా ఇలాగే ఎదురుచూసింది. కానీ ఏళ్లు గడుస్తోన్నా నెలసరి మాత్రం తనను పలకరించలేదు. దీనికి కారణం తన శరీరంలో ఓ అరుదైన లోపమే అని తెలుసుకున్న ఆమె ఏళ్ల పాటు చీకట్లోనే మగ్గింది. ‘కానీ ఇలా ఎంతకాలం’ అంటూ ఆ చీకట్లను చీల్చుకొని వెలుగు రేఖలా బయటికొచ్చింది. ఈ క్రమంలో తనలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ ఎందరికో రోల్‌మోడల్‌గా మారిందామె. ఒక సమస్య ఉన్నప్పుడు దానికి ఏదో ఒక పరిష్కారం తప్పకుండా ఉండే ఉంటుందంటోన్న ఆమె తన కథను పంచుకోవడానికి ఇప్పుడిలా మనందరి ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
he-is-dominating-before-marriage-in-telugu
women icon@teamvasundhara
my-brother-in-law-cheated-me-in-the-name-of-love-says-a-girl-in-telugu

బావే నమ్మించి మోసం చేశాడు..!

మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..

Know More

women icon@teamvasundhara
how-can-change-his-behavior-in-telugu

ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఆయన్ని మార్చేదెలా?

అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.

Know More

women icon@teamvasundhara
delhi-woman-shares-about-her-covid-experience

కరోనా మా కుటుంబాన్ని ఇంతలా వేధిస్తుందని కలలో కూడా అనుకోలేదు!

ప్రపంచమంతటా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ వైరస్‌ మాత్రం శాంతించడం లేదు. ‘స్ట్రెయిన్‌’, ‘వేరియంట్‌’, ‘మ్యుటేషన్‌’ అంటూ కొత్త రకం పేర్లతో లక్షలాది మందిని తమ బాధితులుగా మార్చుకుంటోంది. ఇక మన దేశంలోనూ తగ్గినట్లే తగ్గి మళ్లీ పంజా విసురుతోందీ మహమ్మారి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న కరోనా కేసులే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఇదే సమయంలో కొత్త కేసుల కంటే రికవరీలు తగ్గుతుండడం.. కరోనా ఇంకా మన మధ్యనే ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో కొవిడ్‌ లేదనుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న వాళ్లందరినీ అలర్ట్‌ చేయడానికి తన కరోనా కథను పంచుకోవడానికి మన ముందుకొచ్చింది దిల్లీకి చెందిన ఓ మహిళ. వ్యాక్సిన్‌ వచ్చినా అది మన దాకా రావడానికి సమయం పడుతుంది కాబట్టి అప్పటిదాకానైనా కనీస జాగ్రత్తలు పాటించాలంటూ అందరినీ వేడుకుంటూ తన కొవిడ్‌ అనుభవాలను ఇలా నెమరువేసుకుంది.

Know More

women icon@teamvasundhara
woman-reunited-with-childhood-sweetheart-and-shares-about-their-long-distance-love-story

క్యాన్సర్ అని తెలిసినా.. నిన్నే ప్రేమించా.. పెళ్లాడతానన్నాడు!

తెలిసీ తెలియని వయసులో ప్రేమంటే అదంతా వట్టి ఆకర్షణ అని కొట్టిపడేస్తుంటాం. కానీ స్కూలింగ్‌ నుంచే వారిద్దరూ మంచి స్నేహితులు.. ఒక రోజు కనిపించకపోయినా, ఒకరినొకరు చూసుకోకపోయినా వారి మనసులో ఏదో వెలితిగా అనిపించేది. కానీ అదే ప్రేమని, ఆకర్షణను మించిన అందమైన అనురాగ బంధమని విడిపోయాక కానీ తెలుసుకోలేకపోయారు. మరి, చదువు, వృత్తి-ఉద్యోగాల రీత్యా వేర్వేరు చోట్ల స్థిరపడ్డ వారు.. ఆ తర్వాత మళ్లీ కలుసుకున్నారా? తమ మనసులోని మాటలను పంచుకున్నారా? లేక ‘ఎవరికి వారే యమునా తీరే..!’ అంటూ ఎవరి దారి వారు చూసుకున్నారా? విధి ఆడిన వింత నాటకంలో ఇంతకీ వీరి ప్రేమకథ నెగ్గిందా? ఓడిపోయిందా? తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రేమికురాలు చెప్పే ప్రేమకథ వినాల్సిందే!

Know More

women icon@teamvasundhara
a-woman-love-story-she-waiting-for-his-parents-approval
women icon@teamvasundhara
kerala-woman-shares-her-horrifying-acid-attack-experience

పెళ్లికి నిరాకరించానని నా ముఖంపై యాసిడ్‌ పోశాడు!

ఆమెకు చిన్న వయసులోనే పెళ్లైంది.. ఏడాది తిరక్కముందే అమ్మయింది.. భర్త, కొడుకుతో హాయిగా సాగిపోతోన్న ఆమె జీవితాన్ని చూసి విధికి అసూయ కలిగినట్లుంది. అందుకే తన భర్తను తన నుంచి, ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరం చేసింది. ఇక అప్పట్నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.. దీనికి తోడు ప్రేమ పేరుతో మరో వ్యక్తి వేధింపులు, అతనితో పెళ్లికి నిరాకరించడంతో యాసిడ్‌ దాడికి కూడా గురైందామె. సుమారు ఆరేళ్లుగా తన శారీరక, మానసిక బాధను పంటి బిగువన భరిస్తూ ఎన్నో కష్టాలకోర్చిన ఆమె.. తనలాంటి వారిలో చైతన్యం నింపేందుకు ఓ చక్కటి నిర్ణయం తీసుకుంది.. యాసిడ్‌ దాడికి గురైనంత మాత్రాన సమాజం మాలాంటి వారిని వెలివేయాల్సిన అవసరం లేదని, మేం తలచుకుంటే ఏదైనా సాధించగలం, నలుగురికీ ఆదర్శంగా నిలవగలం అంటోన్న ఆమె ఎవరు? ఆమె తన ఆశయం గురించి ఏం చెప్పాలనుకుంటోంది? తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
patna-woman-who-recovered-from-covid-19-has-something-to-say-about-her-covid-experience
women icon@teamvasundhara
i-divorced-my-husband-so-that-he-can-spend-life-with-his-gay-friend-explains-an-woman

నా భర్త హోమోసెక్సువల్... అందుకే అలా చేశా!

'నేను తప్పు చేశానని నాకు తెలుసు.. కానీ ఆ విషయం చెప్పాలంటే నాకు ధైర్యం చాల్లేదు. అందుకే ఇన్నాళ్ల నుంచీ మౌనంగా ఉండిపోయా. నిన్ను ఇబ్బందిపెట్టా.. నన్ను క్షమించు.. కావాలంటే నువ్వు నాకు విడాకులు ఇవ్వొచ్చు..' అంటూ రాహుల్ నన్ను అభ్యర్థిస్తుంటే ఏం చేయాలో అర్థం కాక అలాగే కూలబడిపోయాను. ఆ రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు. ఉదయాన్నే లేచి విడాకులు తీసుకోవాలన్న గట్టి నిర్ణయం తీసుకున్నా.. ఇది తన మీద కోపంతో కాదు.. ప్రేమతో తీసుకున్న నిర్ణయం.. ఇప్పటికైనా తనకు నచ్చిన జీవితాన్ని తను గడిపే అవకాశాన్ని ఇచ్చేందుకు నా వంతుగా నేను చేసే చిన్న ప్రయత్నం ఇది..ఇదంతా చూస్తుంటే.. భర్త సంతోషం కోసం తనకు విడాకులు ఇవ్వడమేంటి? అనిపిస్తోంది కదూ.. అదెందుకో తెలియాలంటే మీకు నా కథ తెలియాల్సిందే..

Know More

women icon@teamvasundhara
preganant-woman-from-kerala-shares-her-horrible-covid-story

డెలివరీకి వారం ముందు కరోనా వచ్చింది..!

‘హమ్మయ్య.. మన జీవితంలోనే అత్యంత గడ్డు ఏడాది ముగింపు దశకు చేరుకుంది.. వైరస్‌ కూడా నెమ్మదిగా కనుమరుగవుతోంది.. కొత్త ఏడాదైనా సంతోషంగా మొదలుపెడదాం..’ ప్రస్తుతం మనలో చాలామంది ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. నూతన సంవత్సరం సంతోషంగా ప్రారంభించాలనుకోవడం మంచిదే కానీ.. వైరస్‌ కనుమరుగవుతుందన్న నిర్లక్ష్యం మాత్రం అస్సలు పనికి రాదంటోంది కేరళకు చెందిన ఓ మహిళ. నిండు గర్భంతో అమ్మయ్యే అపురూప క్షణం కోసం ఆనందంగా ఎదురుచూస్తోన్న ఆమెకు డెలివరీకి వారం రోజులుందనగా వైరస్‌ సోకడంతో తీవ్ర ఇబ్బందులు పడింది. గర్భిణుల్లో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉందనుకోవడానికి లేదని, ఎందుకంటే ఈ మహమ్మారి కారణంగా తను జీవితంలోనే అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతోంది. వైరస్‌కు వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఒక్కరి వల్ల అందరూ నష్టపోవాల్సి వస్తుందని అంటోన్న ఆమె తన కొవిడ్‌ అనుభవాలను ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
my-brother-in-law-cheated-me-in-the-name-of-love-says-a-girl

బావే నమ్మించి మోసం చేశాడు..!

మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..

Know More

women icon@teamvasundhara
kerala-doctor-puts-service-before-self-rejoins-covid-duty-despite-ailments

డాక్టర్‌గా సేవలందించిన చోటే కరోనా రోగిగా చేరాను!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కరోనాతో పోరాడుతూ ఎంతోమందికి ప్రాణం పోస్తున్నారు వైద్యులు. తమ చుట్టూ ప్రమాదం పొంచి ఉన్నా లెక్కచేయకుండా ఊపిరాడనివ్వని పీపీఈ కిట్లను ధరిస్తూనే కరోనా రోగులకు ఊపిరి పోస్తున్నారు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరు వైద్యులు, నర్సులు అదే మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ డాక్టర్‌ కొన్ని రోజుల క్రితం ఇలాగే కరోనా బారిన పడింది. అదే సమయంలో న్యుమోనియా సోకడంతో మరణం అంచుల దాకా వెళ్లింది. అలా సుమారు రెండు వారాల పాటు ఐసీయూలో ఉన్న ఆమె ఇటీవల కొవిడ్‌ నుంచి కోలుకుంది. ఇప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్న ఈ డాక్టరమ్మ కరోనా రోగులను కాపాడేందుకు మళ్లీ ఆస్పత్రిలో అడుగుపెట్టింది.

Know More

women icon@teamvasundhara
story-of-an-aids-patient-who-is-fighting-with-it-and-creating-awareness-in-others

నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!

ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.

Know More

women icon@teamvasundhara
story-of-a-girl-who-got-cheated-in-online
women icon@teamvasundhara
afghan-woman-shares-her-pathetic-story-about-taliban-attack-on-her

ఉద్యోగం చేస్తున్నానని కంటి చూపు కోల్పోయేలా చేశారు!

ఆడపిల్ల పుట్టడమే శాపంగా భావిస్తారక్కడ. అలాంటిది స్కూలుకెళ్తానంటే ఊరుకుంటారా? ‘చదువు, ఉద్యోగం నీకెందుకు? ఆ పనులు చేయాల్సింది మగాళ్లు! నువ్వు గడప దాటి బయటికి రావడానికి వీల్లేదు’ అంటూ పైగా బోలెడన్ని షరతులు! ఇలాంటి వివక్షను చూస్తూనే పెరిగింది అఫ్గానిస్థాన్‌కు చెందిన వహీదా బేగం. అయినా ఇలాంటి బెదిరింపులకు తలొగ్గే నైజం కాదామెది. కారణం.. తన తండ్రి అండ! ఆడపిల్ల అయితే ఏంటి .... మగాళ్లకు తీసిపోని విధంగా తనని తయారుచేయాలనుకున్నాడు వహీదా తండ్రి. అలా నాన్న చొరవతో చక్కగా చదువుకుని ప్రభుత్వ రంగంలో మంచి ఉద్యోగం సంపాదించిందామె. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. వద్దని వారించినా ఉద్యోగం సంపాదించిందన్న నెపంతో అన్యాయంగా ఆమెపై దాడికి తెగబడ్డారు దుండగులు. ఆమెను తీవ్రంగా గాయపరచడమే కాదు.. ఆమె ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం కూడా కోల్పోయేలా చేశారు. అలాగని అదే తలచుకుంటూ కుమిలిపోకుండా, పడిలేచిన కెరటంలా విజృంభించిదామె.. ఓవైపు బాలికల హక్కులు, వారి విద్య కోసం అహర్నిశలూ శ్రమిస్తోంది. అతివలు తలచుకుంటే ఏదైనా సాధించగలరనే పోరాట స్ఫూర్తిని చాటుతూ తన జీవిత కథను పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
a-martyred-army-jawan-wife-shares-about-struggles-in-her-life

ఇదిగో వచ్చేస్తున్నా అన్నాడు.. వెళ్ళిపోయాడు.. ఈ గుండె కోత తీరేదెలా?

‘పుట్టుకతోనే తల్లిని పొట్టన పెట్టుకుంది’ అనే అపవాదును మూటగట్టుకుందామె! తల్లి లేని తన బాగోగులు చూడాల్సిన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో అమ్మమ్మ దగ్గరే పెరిగింది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పీజీ పూర్తి చేసింది. ఇలా అడుగడుగునా కష్టాలే పరిచయమైన ఆమెకు.. మహేష్ ఓ వెలుగు రేఖలా కనిపించాడు. అతడిని వలచింది.. అతనూ ఆమెను ఇష్టపడ్డాడు. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఓ వీర జవాను భార్యగా గర్వపడుతూనే.. విధి నిర్వహణలో తన భర్తకేమీ కాకూడదని వెయ్యి దేవుళ్లకు మొక్కిందామె. అలా మూడేళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వారి జీవితంలో అనుకోని ఉపద్రవం.. తన భర్త వీర మరణం! మరికొన్ని రోజుల్లో వస్తాను.. నిన్ను తీసుకెళ్తాను.. అని బాస చేసిన భర్త దేశం కోసం ప్రాణాలర్పించినందుకు గర్వపడుతున్నా.. అతను లేని నా జీవితం శూన్యమంటూ, ఆ లోటు ఎప్పటికీ పూడ్చలేనిదంటూ కంటికి ధారగా విలపిస్తోంది. ఆ వీర జవాను భార్య కన్నీటి గాథే ఇది!

Know More

women icon@teamvasundhara
a-new-mom-who-is-nurse-shares-her-story-about-to-contribute-to-the-fight-against-covid-19

పచ్చి బాలింతవి.. కరోనా టైంలో డ్యూటీకి వెళ్లొద్దన్నారు!

‘వద్దమ్మా.. వద్దు..! అసలే నువ్వు పచ్చి బాలింతవి.. ఇలాంటి సమయంలో డ్యూటీకి వెళ్తే.. అటు నీకు, ఇటు పాపాయికి ఇద్దరికీ ముప్పే!’ అన్నారు ఆమె కుటుంబ సభ్యులు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. వృత్తే దైవంగా భావించే ఆ నర్సు.. తన కుటుంబ సభ్యులను ఎలాగోలా ఒప్పించి కరోనాతో పోరుకు కదిలింది. కరోనాకు ముందు మెటర్నిటీ సెలవు కోసం తన సొంతూరుకు చేరుకున్న ఆమె.. ప్రసవానంతర సెలవు పూర్తయ్యే సరికి లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల ఇక్కడే ఆగిపోయింది. ఓవైపు డ్యూటీ చేయాలన్న తపన.. మరోవైపు వెళ్లలేని పరిస్థితి! అయినా మనసుంటే మార్గముంటుందన్నట్లు ఇంట్లో వాళ్లను ఎలాగోలా ఒప్పించి రాష్ట్ర సరిహద్దులు దాటింది.. తిరిగి విధుల్లో చేరింది..! అటు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా విధుల్లో పాల్గొంటూనే, ఇటు తన చిన్నారినీ జాగ్రత్తగా చూసుకుంటున్నానంటోంది. మరి, చంటి బిడ్డతో కరోనాతో పోరు చేస్తోన్న ఈ కొవిడ్‌ వారియర్‌ కథేంటో మనమూ విందాం రండి..!

Know More

women icon@teamvasundhara
hyderabad-woman-shares-her-covid-experience-in-telugu

అనుకోని ప్రయాణం కరోనా తిప్పలు తెచ్చిపెట్టింది!

కరోనా దూకుడుకు కళ్లెం వేయాలంటే దాని అంతు చూసే వ్యాక్సిన్‌ రావాలి. మరి, అది ఎప్పుడు వస్తుందో తెలియదు.. అంతదాకా అన్ని పనులూ ఆపుకొని ఇంట్లో కూర్చుందామంటే కుదరదు. అందుకే కరోనాతో సహవాసం చేయడానికే అలవాటు పడిపోయారంతా! అయితే అటు గృహిణులు, ఇటు ఇంటి నుంచి పనిచేసే మహిళలు వైరస్‌ ముప్పు ఉందని తెలిసినా కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి రావచ్చు. అలా అనుకోకుండా తాను చేసిన ప్రయాణం వల్ల కరోనా బారిన పడ్డానంటోంది హైదరాబాద్‌కి చెందిన నీరజ. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముప్పు ఎటు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేమని ఓవైపు అందరినీ అలర్ట్‌ చేస్తూనే.. మరో వైపు వైరస్‌ సోకిందని ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా మలచుకుంటే కరోనా మహమ్మారిని జయించవచ్చనడానికి తననే ఉదాహరణగా చూపుతోందామె. ఈ క్రమంలోనే తాను కరోనాపై గెలిచిన తీరును, తన అనుభవాలను మనందరితో ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
meet-sneha-a-nurse-in-delhi-who-treats-covid-patients-as-her-family

కరోనాతో క్షణాల్లో వారి ఆరోగ్యం క్షీణించడం కళ్లారా చూశాను!

సాధారణంగా ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు రోగికి కచ్చితంగా తోడుగా ఉంటారు. చికిత్స సమయంలో బంధువులు, సన్నిహితులు, స్నేహితులు కూడా హాస్పిటల్‌కు వచ్చి మనో ధైర్యం చెబుతుంటారు. కానీ కరోనా సోకి చికిత్స తీసుకునే రోగులకు ఇలాంటి సదుపాయాలేవీ ఉండవు. సామాజిక దూరం పాటిస్తూ ఆస్పత్రిలో ఉన్నంతసేపూ ఏకాకిగానే గడపాలి. ఫలితంగా వారు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో వైద్యులు, నర్సులే కరోనా బాధితుల కుటుంబ సభ్యులుగా మారిపోతున్నారు. వైరస్ తమకు సోకే ప్రమాదముందని తెలిసినా ప్రాణాలను పణంగా పెట్టి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో దిల్లీలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోన్న స్నేహ ఏడు నెలలుగా కరోనా బాధితులకు సేవలు చేస్తోంది. కరోనా రోగులను తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ వారిని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి పంపిస్తోంది. ఈ నేపథ్యంలో గత నెలలో కరోనాను జయించి తిరిగి విధుల్లో నిమగ్నమైన ఆ నర్సు హృదయరాగమేంటో మనమూ విందాం రండి..!

Know More

women icon@teamvasundhara
navya-shares-her-covid-story-it-started-with-her-son-developing-flu-and-fever

మేమొకటి తలిస్తే.. కరోనా మరొకటి తలచింది!

కరోనా మనుషుల జీవితాలనే కాదు.. ప్రత్యేక సందర్భాల రూపురేఖల్ని కూడా మార్చేసింది..! అంతకుముందు వరకూ ఏ వేడుకైనా అందరితో కలిసి ఎంతో సంబరంగా జరుపుకొనే మనం ఇప్పుడు ఇంటికే పరిమితమై సింపుల్‌గా చేసుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్‌కి చెందిన నవ్య కూడా తన కొడుకు పుట్టినరోజు వేడుకల విషయంలో ఇలాగే ఆలోచించింది. వాడి మొదటి పుట్టినరోజులాగే ఐదో పుట్టినరోజునూ ఘనంగా జరపాలనుకుంది.. అయినా కరోనా వల్ల అది సాధ్యం కాలేదు..! సరికదా.. సింపుల్‌గానైనా చేసుకుందామంటే అందుకూ కరోనా అడ్డుపడి.. మరోసారి తనను, తన కొడుకును నిరాశపరిచిందంటోంది. మరి, ఇంతకీ ఏమైంది? వాళ్ల బాబు పుట్టినరోజు వేడుకలు ఆగడానికి, కరోనాకు సంబంధమేంటి? రండి.. తన మాటల్లోనే తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
a-boyfriend-saves-her-life-with-his-vision-in-telugu
women icon@teamvasundhara
mumbai-girl-meghana-who-came-from-london-shares-her-covid-story-in-telugu

ఎందుకైనా మంచిదని టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది!

కంటికి కనిపించకుండా, లక్షణాలు తెలియనివ్వకుండా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా మహమ్మారి. దీని బారిన పడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించినా కొంతమందిలో ఇది బయటపడుతూ కలవరపెడుతోంది. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందంటోంది ముంబయికి చెందిన మేఘన. ముందు నుంచీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎందుకైనా మంచిదని పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా తేలిందని చెబుతోందామె. అంతేకాదు.. కరోనా నుంచి కోలుకునే క్రమంలో తన జీవనశైలిలో ఎన్నో మార్పులొచ్చాయని.. ఆరోగ్యకరమైన అలవాట్లు, సానుకూల దృక్పథం ఉంటే కరోనాను సులభంగా జయించచ్చంటూ తన కొవిడ్‌ స్టోరీని ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
kolkata-woman-shares-about-her-early-menopause-story-how-to-deal-with-it

30 ఏళ్లకే మెనోపాజ్‌.. అదో భయంకరమైన అనుభవం!

ఆడపిల్లకు అంతంత పెద్ద పెద్ద చదువులెందుకన్నారంతా! అయినా ఆ మాటలు ఆమె చెవికెక్కించుకోలేదు. కారణం ఆమెకు చదువంటే ప్రాణం. వయసొచ్చింది కదా పెళ్లి చేయమని బంధువులు పోరు పెట్టారు.. అయినా తన పూర్తి ధ్యాసను కెరీర్ పైనే ఉంచిందామె. ఇలా ఆమె సంకల్ప బలానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడవడంతో ఉన్నత విద్యనభ్యసించి విదేశాల్లో ఉద్యోగం సంపాదించింది. తాను కోరుకున్న కెరీర్, చక్కటి జీతం.. రెండేళ్లు స్వేచ్ఛగా, సంతోషంగా జీవించింది. అక్కడే తనకు నచ్చిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. జీవితం సుఖంగా సాగుతోంది.. పిల్లలు పుడితే ఆ సంతోషం రెట్టింపవుతుందనుకుందా జంట. కానీ అంతలోనే మెనోపాజ్‌ రూపంలో ఆమెకు అనుకోని ఉపద్రవం ఎదురైంది. అప్పటికి ఆమె వయసు కేవలం ముప్ఫై అంటే ముప్ఫై ఏళ్లే! ‘ఇంత చిన్న వయసులోనే ఏంటి నాకీ కష్టం’ అని పిల్లల కోసం పరితపించిపోయింది. ఓ బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వ మాధురిమలను ఆస్వాదించలేకపోయానే అని బాధపడింది.అన్ని దారులూ మూసుకుపోవడంతో ఇక చేసేది లేక ఓ పిల్లాడిని దత్తత తీసుకుందామె. అకాలంలో వచ్చిన మెనోపాజ్.. తల్లిని కావాలన్న తన కలను ఎలా కల్లలు చేసిందో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
woman-shares-her-pregnancy-struggle-after-failed-several-ivf-attempts

ఐవీఎఫ్‌ ఫెయిలైనా.. ఆరోగ్యకరమైన జీవనశైలితో సహజంగానే తల్లయ్యా!

పెళ్లయిన ప్రతి మహిళా అమ్మతనం కోసం ఆరాటపడుతుంది.. ఎప్పుడెప్పుడు తల్లినవుతానా అని తపిస్తుంది. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌కు చెందిన ఓ మహిళ కూడా అమ్మతనం కోసం ఎంతగానో పరితపించింది.. ఎన్నో ఆస్పత్రులు తిరిగింది.. ఎందరో డాక్టర్లను కలిసింది. అయినా తన కల నెరవేరకపోయేసరికి తల్లడిల్లింది. ఆఖరి ప్రయత్నంగా ఐవీఎఫ్‌ చికిత్స కూడా తీసుకుంది. అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది. ‘ఇక ఈ జీవితంలో నాకు అమ్మయ్యే యోగం లేదేమో’ అనుకుంటోన్న తరుణంలోనే దేవుడు వరమిచ్చినట్లు సహజంగానే గర్భం ధరించిందామె. పండంటి కూతురు పుట్టడంతో పట్టరానంత సంతోషంలో మునిగిపోయింది. ప్రస్తుతం తన కూతురితో, భర్తతో సంతోషంగా జీవిస్తోన్న ఆమె.. తనలాంటి వారి గురించి నాకెందుకులే అనుకోలేదు. అమ్మయ్యే క్రమంలో తనకు ఎదురైన సమస్యలు, సవాళ్లను నలుగురితో పంచుకోవాలనుకుంది.. తద్వారా అమ్మతనం కోసం ఆరాటపడుతోన్న మహిళల్లో స్ఫూర్తి నింపాలనుకుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌ వేదికగా.. మహిళలకు ఉపయోగపడే ఎన్నో చిట్కాలను అందిస్తోన్న ఆమె అమ్మయ్యే క్రమంలో తనకెదురైన అనుభవాలను, సవాళ్లను ఇలా పంచుకుంది.

Know More