scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Video Gallery

Movie Masala

 
category logo

మాది ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్.. ఇలా సరదాగా గడిపేస్తాం!

Anushka Sharma takes a fun quiz with husband Virat Kohli in Telugu

అసలు సిసలైన దాంపత్య బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంటారు లవ్లీ కపుల్‌ విరాట్‌ కోహ్లీ - అనుష్కా శర్మ. కెరీర్‌ పరంగా ఇద్దరి దారులు వేరైనా.. ఒకరి వృత్తిని మరొకరు గౌరవించుకుంటూ ఇద్దరూ అన్యోన్యత అనే దారిలోనే ముందుకు సాగుతున్నారు.. కాబట్టే తమ అనుబంధంలోని మధురిమల్ని నిత్యనూతనం చేసుకుంటూ ఫ్యాన్స్‌కు దాంపత్య బంధంలోని పాఠాలు నేర్పుతున్నారు. దంపతులిద్దరూ ఎంత ఫ్రెండ్లీగా ఉంటే వారి మధ్య అనుబంధం అంత దృఢమవుతుందని ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపించిన ఈ ముద్దుల జంట.. తాజాగా మరోసారి అలాంటి సందేశాన్నే ఓ వీడియో ద్వారా చెప్పకనే చెప్పింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగానూ ఒకరి గురించి ఒకరికి ఎంత అవగాహన ఉందన్న విషయంపై వీరిద్దరూ కలిసి చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. మరి, ఈ ఫన్‌ క్విజ్‌లో ఎవరు గెలిచారో? రండి.. చూద్దాం..!

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


భార్య-భర్త.. ఇది సీరియస్‌ రిలేషన్‌షిప్‌ కాదు.. ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్‌ అంటోంది విరుష్క జంట. అలాగే దంపతులిద్దరికీ ఒకరి ఇష్టాయిష్టాల గురించి మరొకరికి, వ్యక్తిగత-వృత్తిపరమైన విషయాల గురించి కూడా అవగాహన ఉండాలంటోందీ ముద్దుల జంట. ఈ క్రమంలోనే తామిద్దరికీ ఒకరి గురించి ఒకరికి ఎంత అవగాహన ఉందో, ఒకరి వృత్తి గురించి మరొకరికి తెలిసిన విషయాలేంటో ఓ చిన్న పాటి క్విజ్‌ ద్వారా తమ ఫ్యాన్స్‌కు తెలియజేశారు విరాట్‌-అనుష్క. ఈ క్రమంలోనే వృత్తి, వ్యక్తిగతం, ఇతర విషయాలు.. అంటూ మూడు సెట్స్‌గా ప్రశ్నలు తయారుచేసి ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. అంతేకాదు.. ప్రశ్నలు సంధించే, సమాధానం చెప్పే క్రమంలోనూ వీరిద్దరూ ఎంతో ఫన్నీగా సమాధానాలు చెప్పడం, ఎంజాయ్‌ చేయడం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ‘టేక్‌ ఏ బ్రేక్‌’ పేరుతో రూపొందించిన ఈ వీడియోను విరుష్క తమ తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో పంచుకున్నారు.

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


రౌండ్‌-1 (వృత్తిపరమైన ప్రశ్నలు)
1. అనుష్క : హిందీలో రూపొందించిన మొట్టమొదటి చిత్రం పేరేంటి?
ఈ ప్రశ్నకు విరాట్‌ సమాధానం చెప్పకపోయేసరికి ‘రాజా హరిశ్చంద్ర’ అంటూ అనుష్కే సమాధానం చెప్పింది.
2. అనుష్క : క్రికెట్‌ నేపథ్యంలో రూపొందించిన రెండు సినిమాల పేర్లేంటి?
విరాట్‌ : పటియాలా హౌస్‌, లగాన్
ఇప్పుడు నా వంతు అంటూ విరాట్‌ తన మొదటి ప్రశ్నను సంధించాడు.
1. విరాట్‌ : క్రికెట్‌లో ఉన్న మూడు ప్రాథమిక సూత్రాలేంటి?
అనుష్క : మొదటి రూల్‌ - పవర్‌ ప్లేలో కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే సర్కిల్‌ బయట ఉండేందుకు అనుమతిస్తారు.
రెండోది - క్రీజ్‌ వెలుపల బౌలింగ్‌ చేయకూడదు.
మూడోది - బంతి నేరుగా బౌండరీ లైన్‌ అవతల పడితే సిక్సర్‌, ఒకవేళ గ్రౌండ్‌ను తాకుతూ వెళ్తే దాన్ని ఫోర్‌గా పరిగణిస్తారు.
2. విరాట్‌ : అత్యధిక వికెట్లు పడగొట్టిన మహిళా క్రికెటర్‌ ఎవరు?
అనుష్క : జులన్‌ గోస్వామి
3. విరాట్‌ : క్రికెట్‌ పుట్టినిల్లుగా ఏ మైదానాన్ని పిలుస్తారు?
అనుష్క : లార్డ్స్

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli) on


రౌండ్‌ - 2 (నా గురించి నీకెంత తెలుసు?)
ఇది ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌.. ఇందులో ఒకరి గురించి మరొకరికి ఎంత తెలుసన్న దానిపై ప్రశ్నించుకున్నారు.
విరాట్‌ టు అనుష్క
1. విరాట్‌ : నాకు పర్వతాలంటే ఇష్టమా? బీచ్‌లంటే ఇష్టమా?
అనుష్క : పర్వతాలు
వెంటనే విరాట్‌ అందుకొని నీక్కూడా పర్వతాలంటేనే ఇష్టం కదా అనడంతో ఇద్దరూ నవ్వుల పువ్వులు పూయించారు.
2. విరాట్‌ : ఆగస్ట్‌ 2019లో నేను ఎక్కడున్నాను?
అనుష్క : నాకు తెలిసి ఇండియా టూర్‌లో..?
వెంటనే విరాట్‌ అందుకొని.. ‘కాదు.. అప్పుడు వెస్టిండీస్‌ టూర్‌లో ఉన్నా.. ఆ సమయంలో నువ్వు కూడా నాతో పాటే ఉన్నావ్‌.. అప్పుడే మర్చిపోయావా!’ అంటూ సరైన సమాధానం చెప్పాడీ డ్యాషింగ్‌ క్రికెటర్.
3. విరాట్‌ : నాకు నచ్చిన వ్యాయామం?
అనుష్క : స్నాచ్
విరాట్‌ స్పందిస్తూ.. ‘నీకు ‘డెడ్‌ లిఫ్ట్స్‌ (బరువులెత్తడం)’ అంటే ఇష్టం కదా!’ అంటూ తన భార్యకిష్టమైన వర్కవుట్‌ గురించి బయటపెట్టాడీ హ్యాండ్‌సమ్.

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


అనుష్క టు విరాట్
1. అనుష్క : నాకు సంతోషాన్నిచ్చే ఒక విషయమేంటి?
విరాట్‌ : పెట్స్‌తో గడపడం
వెంటనే అనుష్క అందుకొని అది కరక్టే కానీ.. నీ కోణం నుంచి సమాధానం చెప్పాలి.. అంటే నువ్వే కదా అని అనడంతో ఇద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు.
2. అనుష్క : నేను ఉదయం లేవగానే చేసే మొట్టమొదటి పనేంటి?
విరాట్‌ : కిటికీలు తెరవడం
వెంటనే అనుష్క ‘నేను అలా చేయను.. బహుశా నువ్వు చేస్తావేమో’ అంటూ ఫన్నీగా సమాధానం చెప్పింది.

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


రౌండ్‌ - 3 (నువ్వా-నేనా)
1. అనుష్క : మనిద్దరిలో భయంకరమైన ఫొటోగ్రాఫర్‌ అయ్యే అవకాశం ఎవరికి ఉంది?
విరాట్‌ : నాకే
అనేసరికి ‘అవును’ అంటూ ఇద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు.
ఆపై విరాట్‌ స్పందిస్తూ ‘ఆ విషయంలో నేను కనీసం నీతో ఛాలెంజ్‌ కూడా చేయలేను..’ అంటూ తన భార్యలో ఉన్న ఫొటోగ్రఫీ నైపుణ్యాన్ని బయటపెట్టాడు విరాట్.
2. అనుష్క : మనిద్దరిలో వచ్చే 24 గంటల్లో పిజ్జా తినడానికి ఎవరు మొగ్గు చూపుతారు?
విరాట్‌ : నువ్వే
3. అనుష్క : ఇద్దరిలో స్పేస్‌ మిషన్‌లో వెళ్లడానికి ఎవరు ఇష్టపడతారు?
విరాట్‌ : నేనే
4. అనుష్క : ఇద్దరిలో ఎవరు ఎక్కువ సమయం ఊపిరి బిగబట్టి ఉండగలుగుతారు?
విరాట్‌ : ఇది మనిద్దరం ప్రయత్నించాం.. కానీ నీకంటే నేనే ఎక్కువ సమయం ఈ పోజ్‌లో ఉండగలిగాను.
ఈ విషయం గురించి నేనంటే నేనంటూ కాసేపు ఫన్నీగా మాటల యుద్ధం చేస్తూ.. ఆఖరికి దాంపత్య బంధంలో భార్యాభర్తలిద్దరూ సర్దుకోవడం చాలా ముఖ్యమనే సందేశాన్ని తమ ఫ్యాన్స్‌కి అందించిందీ ముద్దుల జంట.

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


5. అనుష్క : మనిద్దరిలో మొక్కలతో మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడే వారు ఎవరు?
విరాట్‌ : నువ్వే
6. అనుష్క : ఇద్దరిలో సినిమా చూసేటప్పుడు నిద్ర పోయేవారు ఎవరు?
విరాట్‌ : ఇంకెవరు.. నేనే!
ఆపై అనుష్క స్పందిస్తూ.. నేను సినిమా చూసేటప్పుడు ‘విరాట్‌ ఇంకా నిద్రపోలేదా’ అని తనవైపు చూసేసరికి తనెప్పుడో నిద్రలోకి జారుకుంటాడు..’ అంటూ తన భర్త గురించి ఫన్నీగా చెప్పుకొచ్చిందీ లవ్లీ వైఫ్‌. ఆపై విరాట్‌ ‘నిజానికి సినిమా చూడడమంటేనే నాకు నిద్ర ముంచుకొస్తుంది..’ అనడంతో ఇద్దరూ నవ్వుకున్నారు.
7. అనుష్క : ఇద్దరిలో సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఎవరికి ఎక్కువ?
విరాట్‌ : నీకే
8. అనుష్క : ఇద్దరిలో ప్రపంచాన్ని మార్చే సత్తా ఎవరికి ఎక్కువ?
విరాట్‌ : నీకే.. ఎందుకంటే నువ్వు ఏ విషయంలోనైనా స్పష్టంగా ఉంటావు. ఒకటి అనుకుంటే అది చేసి తీరతావు.
వెంటనే అనుష్క స్పందిస్తూ.. ‘నాకు తెలిసి ఇద్దరం’ అంటూ భర్తకు సపోర్ట్‌ అందించింది.

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


9. అనుష్క : గొడవ తర్వాత ఎవరు ముందుగా సారీ చెప్తారు?
విరాట్‌ : నువ్వే (వెంటనే అనుష్క అందుకొని ‘అవును.. నేను వెంటనే సారీ చెప్పేస్తా!’ అంటూ తమ ఫైట్‌ సీక్రెట్‌ని బయటపెట్టింది)
10. అనుష్క : చెస్‌ ఆటలో ఇద్దరిలో ఎవరు ఎక్కువగా గెలుస్తుంటారు?
విరాట్‌ : నువ్వా/నేనా.. ఏమో ఈ విషయం గురించి ఇద్దరికీ అంతగా అవగాహన లేదు.
11. అనుష్క : ఏదైనా ఆటలో ఓడిపోతే ఎవరు ఎక్కువగా అరుస్తారు/కోపగించుకుంటారు?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే అవకాశం విరాట్‌కు ఇవ్వకుండా తనే ‘విరాట్‌’ అంటూ చెప్పేసింది అనుష్క.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli) on


అదే మా రిలేషన్‌షిప్‌ సీక్రెట్!
‘సో.. మీరంతా మా ఫన్నీ క్విజ్‌ను బాగా ఎంజాయ్‌ చేశారనుకుంటున్నాం. నిజానికి ఇద్దరిలో ఎవరు గెలిచామో ఐడియా లేదు.. కానీ భార్యాభర్తలిద్దరి మధ్య గెలుపోటములకు తావు లేదు.. ఒకవేళ ఎవరు గెలిచినా వెనక్కి తగ్గి ఇద్దరూ ఆ ఆటను ‘డ్రా’గా ముగించేస్తే ఏ గొడవా ఉండదు.. ‘దంపతులంటే ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు.. ఇద్దరూ సమానమే’ అని చెప్పడానికే ఈ ఫన్నీ క్విజ్ ఆడాం. మీరూ మాతో ఎంజాయ్‌ చేశారనుకుంటున్నాం.. మీరు కూడా మీ భార్య/భర్తతో ఇలాంటి గేమ్స్‌ ఆడండి.. ఇద్దరూ కలిసి కావాల్సినంత సమయం గడపండి.. అనుబంధాన్ని దృఢం చేసుకోండి.. ఇంట్లోనే ఉండండి.. కరోనాకు దూరంగా ఉండండి!’ అంటూ వీడియో ఆఖర్లో భార్యాభర్తలకు అద్భుతమైన రిలేషన్‌షిప్‌ పాఠం చెప్పింది విరుష్క జంట.

ఇలా విరుష్క ఆడిన ఈ ఫన్నీ ఆటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. మరి, ఇదంతా చదువుతుంటే మీరూ మీ వారితో/మీ భార్యతో ఆడిన ఆటలు, గడిపిన మధురమైన సమయాలు గుర్తొస్తున్నాయా? అయితే ఆలస్యం చేయకుండా ఆ మధురానుభూతుల్ని ‘వసుంధర.నెట్‌’ వేదికగా అందరితో పంచుకోండి.. నలుగురికీ రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పండి!





gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
my-parents-always-give-more-importance-to-my-siblings-than-me-what-should-i-do?

అలా చేస్తున్న నా తల్లిదండ్రుల్ని మార్చేదెలా?

మేడమ్‌.. నా వయసు 24. మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం.. మా తల్లిదండ్రులకు నేను రెండో సంతానం. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నాను. మా తల్లిదండ్రులు నాతో తప్ప మిగతా ఇద్దరితో బాగానే ఉంటారు. ఇంటి పనులు నాతోనే ఎక్కువగా చేయిస్తుంటారు. నా పట్ల వాళ్లు అలా ప్రవర్తిస్తుంటే రెండో అమ్మాయిగా పుట్టడమే నేను చేసిన తప్పేమో అనిపిస్తుంది. ‘అవసరానికి నేను.. ప్రేమను పంచడానికి మాత్రం వాళ్లు కావాలా?’ అనిపిస్తుంది. ఒక్కోసారైతే ఇవన్నీ భరించలేక చనిపోవాలనిపిస్తుంది. ఏమైనా అంటే ‘నీకు వాళ్లిద్దరి మీద అసూయ’ అని తిడతారు. అసలు నేనంటే అంత ఇష్టం లేనప్పుడు ఇంకా నేను ఎందుకు బతికున్నానా అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో అర్థం కావట్లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
kalki-koechlin-shares-her-love-story-with-israeli-boyfriend-guy-hershberg-through-beautiful-note-on-instagram

మా ప్రేమకథలోనూ మరపు రాని తీపి గుర్తులెన్నో!

ప్రేమలో ఉన్నా, రిలేషన్‌షిప్‌లో ఉన్నా, పెళ్లి చేసుకున్నా.. చాలా జంటలు ఒకరి కోసం మరొకరు తమ అభిరుచుల్ని మార్చుకుంటాయి.. అలా చేస్తేనే ఒకరిపై ఒకరికి ప్రేముందని నమ్మే జంటలూ లేకపోలేదు. అయితే ప్రేమంటే అటవాట్లను, సంప్రదాయాలను మార్చుకోవడం కాదని, ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించడమే అసలైన అనురాగం అంటోంది బాలీవుడ్‌ డింపుల్‌ బ్యూటీ కల్కి కొచ్లిన్‌. ఇజ్రాయెల్‌కు చెందిన మ్యుజీషియన్‌ గై హెర్ష్‌బెర్గ్‌తో గత మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సాఫో అనే ముద్దుల పాపకు జన్మనిచ్చింది. అప్పట్నుంచి అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోన్న ఈ చక్కనమ్మ.. సందర్భం వచ్చినప్పుడల్లా తన వ్యక్తిగత విషయాలను సైతం సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తన బాయ్‌ఫ్రెండ్‌ గైతో ఏర్పడిన తొలి పరిచయం దగ్గర్నుంచి.. ఈ మూడేళ్ల అనుబంధంలోని కొన్ని తీపి గుర్తుల్ని నెమరువేసుకుంటూ ఇన్‌స్టా వేదికగా సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
wrestlers-sangeeta-phogat-bajrang-punia-tie-knot

మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది!

కెరీర్‌ పరంగా వారిద్దరి దారులు ఒకటే. అందుకే ఆటతో పాటు అభిరుచులు కూడా తొందరగానే కలిశాయి. స్నేహంతో మొదలైన వారి పరిచయం ప్రేమగా చిగురు తొడిగింది. ఆ మరుక్షణం నుంచే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పరస్పరం సహాయ సహకారాలు అందించుకున్నారు. సంతోష క్షణాలను కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నట్లే కన్నీళ్లొచ్చినప్పుడు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఈ క్రమంలో తమ ప్రేమ బంధాన్ని శాశ్వతమైన వివాహ బంధంగా మార్చుకోవాలనుకున్నారు. అందుకు పెద్దల ఆశీర్వాదం కూడా తోడయింది. దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా పెళ్లిపీటలెక్కారు. వారే స్టార్‌ రెజ్లర్లు సంగీతా ఫోగట్‌- బజరంగ్‌ పునియా. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

Know More

women icon@teamvasundhara
benefits-of-having-a-partner-who-is-foodie

భాగస్వామి భోజనప్రియులైతే ఆనందమే!

అబ్బబ్బా.. మీతో వేగలేక ఛస్తున్నా.. ఎంత భోజనప్రియులైతే మాత్రం రోజుకో స్పెషల్ వంటకం అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? వంట చేసేది మీరైనా, నేనైనా దానికి సరుకులు మాత్రం కావాల్సిందేగా.. అంటోంది మీరా తన భర్తతో.. కొంతమంది తమ భాగస్వామి భోజనప్రియులైతే దానిని సమస్యగా భావిస్తారు. అయితే ఇలాంటివారితో ఉండడం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు.. ఆహార పదార్థాలను అమితంగా ఇష్టపడేవారిలో ఎన్నో మంచి లక్షణాలుంటాయట. దాంతో వారి జీవితం సాఫీగా సాగిపోయే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. మరి, భోజన ప్రియుల్లో ఉండే అలాంటి కొన్ని మంచి లక్షణాలేంటో తెలుసుకుందామా?

Know More

women icon@teamvasundhara
feelings-when-your-best-friend-gets-married

నెచ్చెలి వివాహంలో మదిపొంగే భావాలెన్నో..!

దేవుడు తల్లిదండ్రులను, తోబుట్టువులను మనకిచ్చి కేవలం స్నేహితులను మాత్రమే ఎంచుకునే అవకాశాన్ని మనకు అందించాడు. అలాంటి స్నేహితుల్లో కొంతమంది మనకు ప్రాణంగా, ఇంట్లోవాళ్లతో సమానంగా లేదా కొన్నిసార్లు వారి కంటే ఎక్కువే అన్నట్లుగా మనసుకు దగ్గరవుతారు. అలాంటి ప్రాణస్నేహితురాలికి పెళ్లి కుదిరిందంటే.. ఎంత ఆనందమో కదా..! తన పెళ్లిలో హడావిడి చేస్తూ, ఇల్లంతా హంగామా సృష్టిస్తూ, కలియదిరుగుతూ ఆనందాన్ని అందరితోనూ పంచుకుంటారు. అయితే స్నేహితురాలి పెళ్లంటే కేవలం ఆనందం మాత్రమే కాదు.. మరెన్నో భావోద్వేగాలు మది నిండా ఉప్పొంగుతుంటాయి. మరి, తన నెచ్చెలి వివాహ సమయంలో ఓ అమ్మాయి ఏమనుకుంటుందో.. ఎలా ఫీలవుతుందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
i-was-not-going-to-marry-until-he-went-down-his-knees-says-kajal

నా కోసం మా ఆయన దానిపై ప్రేమను వదులుకోవాల్సిందే!

ప్రేమికులు తమ ప్రేమను ఒకరికొకరు తెలియజేసుకునే సందర్భం వాళ్ల జీవితాల్లో ఎంతో అపురూపమైనది. ఆ అద్భుత క్షణాలను మధుర జ్ఞాపకాలుగా మార్చుకోవాలని అందరూ అనుకోవడం సహజం. ఈ క్రమంలో - నవలలు, సినిమాల్లో మాదిరిగా - తన కలల రాకుమారుడు మోకాళ్ల పైన నిల్చొని, గులాబీ పువ్వు అందించి మరీ తనకు లవ్ ప్రపోజ్ చేయాలని అందరూ అనుకోకపోయినా కొంతమంది అనుకునే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో తనకు కాబోయే వాడు కూడా అలాగే ప్రేమను వ్యక్త పరచాలని కోరుకున్నానంటోంది కాజల్‌ అగర్వాల్‌. గత నెల చివరిలో తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడిచిందామె. ప్రస్తుతం మాల్దీవుల్లో తమ హనీమూన్‌ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోందీ లవ్లీ జంట. ఈ సందర్భంగా తమ రిలేషన్‌షిప్‌, వివాహం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారీ క్యూట్‌ కపుల్.

Know More

women icon@teamvasundhara
things-happen-when-ended-toxic-relations

అలాంటి బంధాలకు దూరమైతేనే మంచిది!

'బ్రేకప్..', 'విడాకులు..' పదం ఏదైనా సరే.. ఒక బంధం నుంచి తప్పుకున్నట్లు ప్రకటించే పదాలివి! జీవితంలో అమితమైన సంతోషాన్ని కలిగించాల్సిన బంధాలు ఒక్కోసారి ఎనలేని బాధకూ కారణమవుతాయి. మానసికంగా, శారీరకంగా అంతులేని వేదనను మిగులుస్తాయి. అన్నివిధాలా కుంగదీసి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. అలాంటి సందర్భాలలో ఒక్కోసారి ఆ బంధం నుంచి శాశ్వతంగా తప్పుకోవాల్సి వస్తుంది.అది ఎంత బాధాకరమైనా ఇలాంటి పరిస్థితులలో అలాంటి విషపూరిత బంధం నుంచి తప్పుకోవడమే మంచిదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయని వారు సూచిస్తున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
things-you-should-never-say-over-text-message

వీటి గురించి మెసేజ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

'నువ్వున్న కిటికీ ఏవైపో వెతికీ వాట్సాప్ చేస్తావా?? మబ్బుల్ని కదిపి.. మొహమాట పెట్టి చంద్రున్ని తెస్తాగా..' అంటూ తన ప్రియురాలిపై ఉన్న ప్రేమని పాటరూపంలో వ్యక్తం చేశాడు ఓ సినీకవి. ఆయనే కాదు.. ఈరోజుల్లో సందేశం ఏదైనా సరే.. చాలావరకు ఫోన్ ద్వారానే ఒకరి నుంచి మరొకరికి చేరడం కామనైపోయింది. అందుకే సెల్ మోగిన ప్రతిసారీ గుండెలో గంటలు కొట్టుకుంటూ ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి తిరిగి రాత్రి నిద్రపోయేంత వరకు చాలామందికి చాలా రకాల సందేశాలు పంపిస్తూ ఉంటాం. అయితే అన్ని విషయాలనూ ఇలా టెక్ట్స్ రూపంలో పంపించడం అంత మంచిది కాదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ముఖ్యంగా కొన్ని విషయాలకు సంబంధించినంత వరకు అసలు మెసేజ్ చేయకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు. అలా అనడానికి కారణం ఏంటి? ఇంతకీ ఆ విషయాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

Know More

women icon@teamvasundhara
ideas-to-celebrate-your-wedding-anniversary-in-telugu

'పెళ్లిరోజు' జీవితాంతం గుర్తుండిపోయేలా..!

'ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ.. నాతిచరామి..' అంటూ వధూవరుల్ని ఒక్కటి చేసే అత్యద్భుతమైన ఘట్టమే వివాహం. ఇలా అందరి ముందు చేసిన బాసలు కలకాలం నిలుపుకోవాలంటే దంపతుల మధ్య అన్ని అంశాల్లోనూ సమన్వయం చాలా ముఖ్యం. ఇందుకోసం మామూలు రోజుల్లో ఒకరితో ఒకరు ప్రేమగా మసలుకోవడమే కాదు.. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ మీ ప్రేమకు కాస్త కొత్తదనం జోడించి సరికొత్తగా సెలబ్రేట్ చేసుకుంటే అవి మీ ఇద్దరికీ మరపురాని మధురానుభూతులుగా మిగిలిపోతాయి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం కూడా మరింత బలపడే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి మీ పెళ్లిరోజు కోసం మీరూ ఇలా ప్లాన్ చేసి చూడండి...

Know More

women icon@teamvasundhara
sushmita-sen-opens-up-about-finding-love-in-15-years-younger-rohman-shawl

నన్ను అర్థం చేసుకున్న వాడు దొరకడం నా అదృష్టం!

‘ప్రేమకు వయసు, అందచందాలు, అంతస్తులతో సంబంధం లేదు... అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరి మీద పుడుతుందో ఎవరూ చెప్పలేరు’.. సినిమాల్లో ఎక్కువగా వినిపించే ఈ డైలాగ్‌ నిజ జీవితంలోనూ చాలామంది విషయంలో నిరూపితమైంది. అలాంటి వారిలో బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ సుస్మితా సేన్‌-రోమన్‌ షాల్‌ జంట కూడా ఒకటి. గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ ప్రేమ పక్షుల వయసుల మధ్య సుమారు 15 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయితే ఇటీవల 45వ వసంతంలోకి అడుగుపెట్టింది సుస్మిత. ఈ సందర్భంగా తన ప్రియుడితో తనకున్న ప్రేమబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
how-to-change-my-husband-attitude-in-telugu

women icon@teamvasundhara
how-to-bond-with-each-other-in-courtship-days

నిశ్చితార్థం తర్వాత బంధం మరింత బలపడేలా..!

నిశ్చితార్థం.. అతి త్వరలో జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది... మీ కలల రాకుమారుడితో కలిసి నడవబోయే సమయం ఆసన్నమైందని చెప్పే వేడుక. ఈ కార్యక్రమం తర్వాత ప్రతి ఒక్కరికీ పెళ్లి గురించిన ఆలోచనలతో నిద్ర కరవవుతుందంటే అతిశయోక్తి కాదు. నిశ్చితార్థం జరుపుకొన్న జంట మూడుముళ్లు పడే ఆ అపురూపమైన క్షణం కోసం ఎదురుచూస్తుంటారు. అంతవరకు ఇద్దరూ ఫోన్‌లోనే ఎన్నెన్నో కబుర్లు చెప్పుకొంటూ సమయం గడుపుతుంటారు. తమ భవిష్యత్తుకి సంబంధించిన విషయాల గురించి చర్చించుకుంటుంటారు. అప్పుడప్పుడూ అలా సరదాగా షికార్లకు కూడా వెళుతుంటారు. ఇదిగో ఇలా పెళ్లికి ముందు సరదాగా గడిపే ఈ కాస్త సమయమే ఆ తర్వాతి జీవితానికి పునాదిగా మారుతుందంటే మీరు నమ్ముతారా? పెళ్లికి ముందు గడిపే సమయం చాలా అమూల్యమైనది. ఆ సమయంలో చెప్పుకొన్న వూసులు, తిరిగిన ప్రదేశాలు ఆ తర్వాత గుర్తు చేసుకొని మురిసిపోయే జంటలెన్నో..! అయితే ఈ సమయాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా గడపడంతో పాటు మీ బంధం మరింత దృఢమయ్యేలా ఏం చేయాలో తెలుసుకొందామా...

Know More

women icon@teamvasundhara
germany-couple-behind-corona-vaccine-in-telugu

ఆ కరోనా వ్యాక్సిన్‌ వెనక ఉన్న దంపతులు వీరే!

కంటికి కనిపించకుండానే మానవాళి మనుగడకు సవాల్‌ విసురుతోంది కరోనా. మధ్యలో కొంచెం కనికరించినా మళ్లీ సెకండ్‌ వేవ్‌ అంటూ పలు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ సమయంలో ఈ వైరస్‌ నుంచి మానవ జాతిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు నిరంతరంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీ కోసం కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్నారు. ఇప్పటికే చాలా వ్యాక్సిన్‌లు ప్రయోగాల్లో ఉండగా ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఆ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. దీంతో అందరిలో ఆశలు రేకెత్తిస్తోందీ వ్యాక్సిన్. అయితే ఈ టీకా తయారీ వెనక ఓ జంట అలుపెరగని కృషి ఉంది.

Know More

women icon@teamvasundhara
i-am-afraid-to-go-for-second-marriage-too-because-of-my-nature

దానివల్ల రెండో పెళ్లంటే భయమేస్తోంది.. ఏంచేయను?

మేడం.. నా వయసు 30సం||. నాది చాలా మెతక స్వభావం. నలుగురితోనూ కలవాలంటే చాలా సిగ్గు, భయం. అమ్మానాన్న నాకు చాలా సంబంధాలు చూశారు. కానీ నా స్వభావం కారణంగా నన్ను చేసుకోవడానికి మంచి సంబంధాల వాళ్లు ఎవరూ తొందరగా ముందుకు రాలేదు. ఆ తర్వాత 2015లో నాకు ఒక సంబంధం కుదిరింది. వాళ్లు నన్ను చేసుకుంటానని వెంట పడడంతో మంచి సంబంధమని చేసుకున్నాం. కానీ పెళ్లయ్యాక కూడా నా మెతక స్వభావం కారణంగా అత్తారింట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. మా అత్తగారు చాలా డామినేటింగ్‌గా ఉండేవారు. ఆయన, అత్తయ్య.. ఏం చెబితే అది చేసేదాన్ని. భయం కారణంగా ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. కనీసం నా భర్తకు దగ్గరయ్యేందుకు కూడా సిగ్గు, భయం ఉండేవి. ఈ పద్ధతి మా అత్తగారు వాళ్లకి నచ్చలేదు. నన్ను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నారు.

Know More

women icon@teamvasundhara
couple-photoshoot-ideas-in-telugu

పెళ్లిలో ఫొటోషూట్ అందంగా ఇలా..!

'మేడమ్, కొంచెం నవ్వండి ప్లీజ్..' 'మీరిద్దరూ ఇంకాస్త దగ్గరగా జరగండి.. సర్.. మీరు మేడమ్ భుజాలపై చేతులు తీయకండి..' 'మీరు కదలకండి మేడమ్.. ఫొటో సరిగ్గా రావట్లేదు..' అబ్బబ్బా.. ఈ గోలంతా ఏంటని అనుకుంటున్నారు కదూ.. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది కదా.. పెళ్లి చేసుకోబోయే కొత్త జంటలు ఫొటోల మీద ఫొటోలు దిగడానికి సిద్ధమైపోతుంటారు. ఎందుకంటే పెళ్లిలో వాళ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా!! పెళ్లి తంతును కవర్ చేయడం.. వధూవరులిద్దరినీ వేర్వేరు యాంగిల్స్‌లో ఫొటోల్లో బంధించడం.. ఇవన్నీ ఇప్పుడు ఫొటోషూట్ ప్యాకేజీలో భాగమే. ఈ క్రమంలో పెళ్లిలో వధూవరుల ఫొటోలు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా?

Know More

women icon@teamvasundhara
neha-kakkar-rohanpreet-opened-about-their-cutest-love-story-in-telugu

చూడగానే అతను నాకోసమే పుట్టాడేమో అనిపించింది!

కొంతమందిని చూడగానే ‘ఈ అబ్బాయి భలే హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడే’ అనిపిస్తుంది. అదే మన మనసుకు నచ్చిన వాడు కనిపిస్తే ‘ఈ అబ్బాయి నాకోసమే పుట్టాడేమో’ అని మన మనసు చక్కిలిగింతలు పెడుతుంది. రోహన్‌ప్రీత్‌ను చూడగానే తన మనసూ అలాగే పులకరించిపోయిందంటోంది కొత్త పెళ్లి కూతురు, బాలీవుడ్‌ సింగర్‌ నేహా కక్కర్‌. తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిన ఈ అందాల జంట.. మొదట మనసుల్ని ఇచ్చిపుచ్చుకున్నారు.. ఆపై ఒకరు లేని మరొకరు శూన్యమనుకున్నారు.. అందుకే ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టి తమ ప్రేమను శాశ్వతం చేసుకున్నారు. అయితే అందరికీ వీరిది ప్రేమ వివాహమే అని తెలిసినా.. అసలు అది ఎక్కడ మొదలైంది? ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్‌ చేశారు? అన్న సందేహాలు చాలామందిలో ఉండే ఉంటాయి. అందుకే ఈ అందాల జంట పంచుకున్న తమ అందమైన ప్రేమకథను ప్రముఖ ఫ్యాషనర్‌ అనితా డోంగ్రే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వీరిద్దరి లవ్‌స్టోరీ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

Know More

women icon@teamvasundhara
why-too-much-attachment-is-bad-for-love-life

అది హద్దుల్లో ఉంటేనే ముద్దు..!

ప్రేమ.. ఇద్దరు వ్యక్తుల మనసులను ముడిపెట్టే ఈ సాధనం.. మితిమీరితే అవే మనసుల మధ్య మంటలు కూడా పుట్టించగలదు. అందుకే దేనికైనా హద్దులుండాలంటారు పెద్దలు. కానీ కొంతమంది తమ భాగస్వామిని అపరిమితంగా ప్రేమిస్తూ వారిపై అంతులేని ప్రేమ కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అపారమైన ప్రేమ మంచిదే అయినప్పటికీ ఒక్కోసారి దానివల్ల వైవాహిక బంధంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. దంపతుల మధ్య మితిమీరిన ప్రేమ వల్ల తలెత్తే ఆ ఇబ్బందులేంటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? మొదలైన విషయాలు మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
friends-for-7-years-dated-for-3-the-kajal-aggarwal-and-gautam-kitchlu-love-story

మూడేళ్ల ప్రేమ.. ఏడేళ్ల స్నేహం.. నూరేళ్ల బంధం!

కెరీర్‌ పరంగా వారిద్దరి దారులు పూర్తిగా భిన్నం.. అయినా మనసులు కలిశాయి.. ఏళ్ల పాటు స్నేహం చేశారు.. ప్రేమించుకున్నారు.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. మనసులోని ప్రేమను తెలుపుకోవడానికి ప్రత్యేకించి ప్రపోజల్‌ అవసరం లేదని, ఒకరి మనసులో ఒకరున్నారని తెలుసుకుంటే చాలనుకున్నారు. పందిరికి అల్లుకున్న మల్లెతీగలా కలిసిపోయిన వారు ఇటీవలే తమ ప్రేమ బంధాన్ని శాశ్వతమైన వివాహ బంధంగా మార్చుకున్నారు. ఆ క్యూట్‌ కపుల్‌ మరెవరో కాదు.. అందాల భామ కాజల్‌ అగర్వాల్‌ - వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లు. ‘చందమామ’ పెళ్లనగానే కుర్రకారు హృదయాలు ద్రవించిపోయాయి.. ‘అసలు తనది ప్రేమ పెళ్లా.. పెద్దలు కుదిర్చిన వివాహమా..?’ అంటూ చాలామంది మనసుల్లో ఎన్నో ప్రశ్నలు రేకెత్తాయి. ఒక్క ఇంటర్వ్యూతో వాటన్నింటికీ ఈ కొత్త పెళ్లికూతురు చెక్‌ పెట్టేసింది. ఇటీవలే ఓ మ్యాగజీన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ-పెళ్లి గురించి బోలెడన్ని కబుర్లు పంచుకుందీ ‘డార్లింగ్‌’ బేబ్‌. మరి, ఈ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ ప్రేమకథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
is-it-the-main-reason-for-me-to-not-getting-married??

నా పెళ్లి కుదరకపోవడానికి అదే కారణమా??

మేడమ్.. నా వయసు 32సం||. నేను నలుగురిలో కలిసిపోయి మాట్లాడలేను. చాలా మెతక స్వభావం. అలాగే తెలివితేటలు కూడా తక్కువని అనిపిస్తుంది. నా సమస్య ఏంటంటే.. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మా ఇంట్లో పెద్దవాళ్లు నాకు సంబంధాలు చూస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఒక సంబంధం వచ్చింది. అన్నీ కుదిరాయి అనుకుంటున్న సమయంలో అతడికి ఏదో వ్యాధి ఉందని తెలియడంతో ఆ సంబంధం వదులుకున్నాం. ఆ తర్వాత మరొక సంబంధం కుదుర్చుకున్నాం. ఆ పెళ్లికొడుకు నాతో వారం రోజులు మాట్లాడిన తర్వాత వాళ్ల ఇంట్లో సమస్యల గురించి చెప్పాడు. అవి నచ్చక ఆ సంబంధం కూడా వదులుకున్నాం. ఆ తర్వాత నుంచి పెద్దలు సంబంధాలు చూడడం, కుదిరింది అనుకున్న తర్వాత వాళ్లు నాతో ఫోన్‌లో మాట్లాడడం.. నాకు నచ్చనివి ఏవో ఒకటి చెప్పడంతో నాకు నేనుగా చాలా సంబంధాలు వదులుకున్నా. పోనీ అసలు ఫోన్ మాట్లాడడం ఆపేద్దామని అనుకుంటే అవతలివాళ్లు ఎలాంటి వారో అని భయంగా ఉంది. ఏ సంబంధం చూసినా నాకు అనుకూలంగా లేదనే అనిపిస్తోంది. వచ్చే వ్యక్తితో సంతోషంగా ఉండలేను అనే అనిపిస్తోంది. అలాని నాకు పెళ్లంటే ఇష్టం లేదని కాదు. కానీ ఇలా ఎందుకు జరుగుతోందో నాకు కూడా అర్థం కావడం లేదు. మా ఇంట్లో పెద్దవాళ్లు కూడా నువ్వు అసలు పెళ్లి చేసుకుంటావా? ఆ ఉద్దేశం ఉందా? లేదా? అని తరచూ అడుగుతున్నారు. నా సమస్యకి పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
actress-kajal-weds-gautham-kitchlu-in-telugu

కాజల్‌-గౌతమ్‌.. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌!

మిస్‌ కాజల్‌ అగర్వాల్‌ మిసెస్‌గా ప్రమోషన్‌ పొందింది. తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లుతో కలిసి ఏడడుగులు నడిచింది. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు. మరి మూడుముళ్ల బంధంతో తన సరికొత్త ప్రయాణానికి నాంది పలికిన మన ‘చందమామ’ పెళ్లి విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
please-tell-me-how-to-convince-my-boyfriend-to-marry-me

అతడిని పెళ్లికి ఎలా ఒప్పించాలి?

మేడం.. నేను ఒకబ్బాయిని ప్రేమించా. కానీ ఇప్పుడు పెళ్లి వరకు వచ్చేసరికి అతను నన్ను కాదంటున్నాడు. కారణం అడిగితే- 'మా ఇంట్లో చూసిన అమ్మాయినే చేసుకుంటాను.. వేరే కులానికి చెందిన అమ్మాయితో పెళ్లికి మావాళ్లు ఒప్పుకోరు..' అంటున్నాడు. నేను మా ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పా. అమ్మానాన్న కూడా మా పెళ్లికి అంగీకరించారు. కానీ అతడు పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరం విడిపోయాం. ఇది జరిగి దాదాపు 8 నెలలు అవుతోంది. ఇప్పటికీ నేను తనని మరచిపోలేకపోతున్నాను. 24గం|| అతని ఆలోచనలే! ఎవరు ఎంత చెప్పినా.. వేరొకరిని నా జీవిత భాగస్వామిగా చేసుకునేందుకు నా మనసు అంగీకరించట్లేదు. గత 8 నెలలుగా రోజూ ఏడుస్తూనే ఉన్నా. ఈ ఆలోచనల కారణంగా తలనొప్పి రావడమే కాదు.. డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోయా. నాకు చనిపోవాలని ఉంది. మావాళ్లు అతన్ని మరిచిపోయి వాళ్లు చూసిన సంబంధం చేసుకోమంటున్నారు. నాకు మాత్రం నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడాలని ఉంది. అతన్ని ఎలా మార్చుకోవాలో చెప్పగలరు. అలాగే ప్రస్తుతం నేనున్న పరిస్థితి నుంచి బయటపడడానికి మార్గం కూడా సూచించగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
old-couple-meet-after-215-days-due-to-corona-pandemic
women icon@teamvasundhara
how-shilpa-shetty-reacted-when-raj-kundra-proposed-to-her-with-a-5-carat-diamond-ring
women icon@teamvasundhara
couple-do-some-these-things-for-their-friendship-alive

ఆలుమగల స్నేహం ఆజన్మాంతం నిలవాలంటే..!

'ఎన్నెన్నో జన్మల బంధం నీదీ-నాదీ..' అన్నట్లుగా.. భార్యాభర్తల బంధం అంటేనే జన్మజన్మల అనుబంధం. మరి అది ఎప్పటికీ నిత్యనూతనంగా ఉండాలంటే.. ఇద్దరి మధ్య మమతానురాగాలు, ప్రేమ, ఆప్యాయతలు.. వంటివి ఎంత ముఖ్యమో.. ఇద్దరి మధ్య స్నేహబంధం బలంగా ఉండడం కూడా అంతే కీలకం. ఆలుమగల మధ్య ఉండే ఏ చిన్న దూరాన్నైనా దగ్గరచేసి వారి ప్రేమను శాశ్వతం చేసే శక్తి స్నేహానికి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. దంపతుల్ని ఒక్కటి చేసే ఈ స్నేహబంధం వారి మధ్య కలకాలం నిలిచిపోవాలంటే వారిరువురూ కలిసి చేయాల్సిన పనులు కొన్నున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
actress-anita-confirms-pregnancy-with-hilarious-video

అవును... మేం తల్లిదండ్రులం కాబోతున్నాం!

త్వరలో తమకు పుట్టబోయే బుజ్జి పాపాయిని వూహించుకోవడం, ఎప్పుడెప్పుడు తమ ముద్దుల చిన్నారిని చేతుల్లోకి తీసుకుందామా అని ఆత్రంగా ఎదురుచూడడం... ఇలా ప్రతిక్షణం పుట్టబోయే బిడ్డ ఆలోచనల్లోనే గడపడం తల్లయ్యే ప్రతి మహిళకు సహజమే. ప్రస్తుతం అలాంటి మధురానుభూతినే ఆస్వాదిస్తోంది అనిత హస్సానందాని. ‘నువ్వు-నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల తార 2013లో రోహిత్‌ రెడ్డితో కలిసి ఏడడుగులు నడిచింది. ఈ క్రమంలో పెళ్లయిన తర్వాత సుమారు ఏడేళ్ల తర్వాత అమ్మగా ప్రమోషన్‌ పొందనున్న ఆమె, సోషల్‌ మీడియా వేదికగా అందరితో ఈ శుభవార్తను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
how-to-help-a-partner-with-anxiety-in-telugu
women icon@teamvasundhara
meghana-raj-shares-pics-from-her-baby-shower-late-husband-chiranjeevi-is-also-part-of-it

చిరూ... ఇదే కదా నువ్వు కోరుకున్నది!

అతనితో ఆమెది పదేళ్ల ప్రేమ బంధం. రెండేళ్ల దాంపత్య బంధం. ఆ ప్రేమ బంధానికి ప్రతి రూపంగా ఒక పండంటి బిడ్డను కూడా తమ లైఫ్‌లోకి ఆహ్వానించాలనుకుంది. ఇక తన జీవితంలో అంతా ఆనందమయమే అనుకుంది. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే అది జీవితమెందుకు అవుతుంది? భర్తతో కలిసి నిండు నూరేళ్లు జీవించాలనుకున్న ఆమె కలలు భర్త హఠాన్మరణంతో కల్లలయ్యాయి. కొన్ని నెలల క్రితం గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా సతీమణి మేఘనా రాజ్‌ విషాదాంత ప్రేమకథ ఇది. భర్త మరణించే నాటికి మూడు నెలల గర్భంతో ఉన్న మేఘన సీమంతం వేడుక తాజాగా జరిగింది. అయితే ఈ వేడుకల్లో చిరంజీవి కూడా పాలుపంచుకున్నారు.. ఎలాగంటారా? అయితే ఇది చదవండి..

Know More

women icon@teamvasundhara
neena-gupta-reveals-why-she-decided-to-get-married-at-50-and-daughter-masaba-reaction-to-it

అందుకే నేను రెండోసారి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది!

మన కాళ్ళ పైన మనం నిలబడినా, ఎంత అభివృద్ధి సాధించామనుకుంటున్నా- ఇప్పటికీ భర్తకు దూరంగా ఉన్న మహిళలు, వితంతువులు, ఒంటరి తల్లులను సమాజం కొంత చులకన భావనతోనే చూస్తుంది. ఎన్నో అవమానాలకు గురి చేస్తుంది. అందుకే నలుగురిలో తలెత్తుకుని నడవాలంటే ఇప్పటికీ మహిళలకు ఓ తోడు తప్పనిసరే అవుతోంది. ఈ నేపథ్యంలో తాను కూడా సమాజంలో గౌరవంగా బతికేందుకే రెండో వివాహం చేసుకున్నాను అంటున్నారు నీనా గుప్తా. వైవిధ్యమైన నటనతో నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ అలనాటి అందాల తార వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు. ఎలాంటి భేషజాలు, సంకోచం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె... తాజాగా తన రెండో వివాహం, కూతురు మసాబా గురించి పలు ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకున్నారు.

Know More