scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

Movie Masala

 
category logo

ఈ కేక్స్‌తో ‘క్రిస్మస్‌’ ఎంతో స్పెషల్‌ !

5 Delicious Cake Recipes For Christmas

ప్రపంచమంతా సంవత్సరం పొడవునా ఎదురుచూసే క్రిస్మస్‌ పండగ వచ్చేసింది.. మరి ఈ కలర్‌ఫుల్‌ ఫెస్టివల్‌ను జరుపుకోవడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా?? క్రిస్మస్‌ అనగానే గుర్తొచ్చేది అందమైన క్రిస్మస్‌ ట్రీ, క్రిస్మస్‌ గిఫ్ట్స్‌, నోరూరించే స్పెషల్‌ వంటకాలు.. ఇలా ఇంకెన్నో..! వంటకాలంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది క్రిస్మస్‌ కేక్స్‌ గురించి! చిన్నపిల్లల దగ్గరినుంచీ పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తినే కేక్స్‌ను ఎంతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. మరి మీరు ఈసారి ఎలాంటి కేక్స్‌ తయారుచేయబోతున్నారు?? ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునేవి కాకుండా, ఈసారి ఈ కొత్త రకం కేకులు ట్రై చేసి చూడండి.. మరి అవేంటో.. ఎలా తయారుచేయాలో చూసేద్దాం రండి..!

ఇటాలియన్‌ క్రీమ్‌ కేక్‌

deliciiouscakesgh650-1.jpg

కావల్సినవి

మజ్జిగ – కప్పు

బేకింగ్‌ సోడా - టీస్పూన్‌

వెన్న – కప్పు

చక్కెర – రెండు కప్పులు

గుడ్లు - అయిదు

వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - టీస్పూన్‌

కోకొనట్‌ ఫ్లేక్స్‌(సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది) - కప్పు

మైదా - రెండు కప్పులు

బేకింగ్‌ పౌడర్‌ - టీస్పూన్‌

బేకింగ్‌ ప్యాన్లు - మూడు

ఫ్రాస్టింగ్‌ కోసం

క్రీం చీజ్‌ - కప్పు

వెన్న – అర కప్పు

వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - టీస్పూన్‌

విప్డ్‌ క్రీం(సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతాయి) - రెండు టేబుల్‌ స్పూన్లు

చక్కెర పొడి– నాలుగు కప్పులు

తరిగిన వాల్‌నట్స్‌ - అర కప్పు

స్వీటెన్డ్‌ కోకొనట్‌ ఫ్లేక్స్‌(సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతాయి) - కప్పు

తయారీ

ముందుగా ఒవెన్‌ను 350 డిగ్రీల ఫారన్‌హీట్‌కు ప్రీహీట్‌ చేసుకోవాలి. ఒక గిన్నెలో మజ్జిగ, బేకింగ్‌ సోడాని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో వెన్న, చక్కెర వేసి బాగా కలుపుకొని, గుడ్లు ఒకొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, కోకోనట్‌ ఫ్లేక్స్‌, బేకింగ్‌ పౌడర్‌, మైదా, మజ్జిగ వేసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు బేకింగ్‌ ప్యాన్లను కొద్దిగా వెన్నతో గ్రీజ్‌ చేసుకొని, ఈ కేక్‌ మిశ్రమాన్ని మూడిట్లో సమానంగా పోసుకొని, ఒవెన్‌లో 30-35 నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి. టూత్‌పిక్‌తో గుచ్చితే కేక్‌ మిశ్రమం అంటుకోకుండా వస్తే, కేక్‌ తయారైనట్లే. ఇప్పుడు కేక్స్‌ను ఒవెన్‌లోనుంచి బయటకుతీసి చల్లార్చుకోవాలి.

ఈలోపు ఫ్రాస్టింగ్‌ తయారుచేసుకోవాలి. దీనికోసం, క్రీం చీజ్‌, వెన్న, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, విప్డ్‌ క్రీం, పొడిగా చేసిన చక్కెర వేసి బాగా స్మూత్‌గా కలుపుకోవాలి. తరువాత, తరిగిన వాల్‌నట్స్‌, స్వీటెన్డ్‌ కోకొనట్‌ ఫ్లేక్స్‌ వేసి కలుపుకుంటే ఫ్రాస్టింగ్‌ క్రీం సిద్ధం..

ఇప్పుడు ఒక కేక్‌ను ప్లేట్‌లోకి తీసుకొని తయారుచేసుకున్న క్రీంను కేక్‌పై అప్లై చేసుకోవాలి. దీనిపై మరో కేక్‌ను పెట్టుకొని క్రీంను అప్లై చేసుకొని, దీనిపై మూడవ కేక్‌ను పెట్టి క్రీంను కేక్‌ అన్ని వైపులా గార్నిష్‌ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన ఇటాలియన్‌ క్రీమ్‌ కేక్‌ రడీ!

ఫ్లోర్‌లెస్‌ చాక్లెట్‌ కేక్‌

deliciiouscakesgh650-2.jpg

కావల్సినవి

డార్క్‌ చాక్లెట్‌ - 200 గ్రాములు

వెన్న – 200 గ్రాములు

కాఫీ పొడి - టీస్పూన్‌

గుడ్లు - ఆరు

చక్కెర – 250 గ్రాములు

కొకోవా పౌడర్‌ - 100 గ్రాములు

ఉప్పు - చిటికెడు

స్ట్రాబెర్రీలు - 5-10

తయారీ

ముందుగా ఒవెన్‌ను 160డిగ్రీల వద్ద ప్రీహీట్‌ చేసుకోవాలి. ఆపై స్టవ్‌పై ఒక ప్యాన్‌లో డార్క్‌ చాక్లెట్‌, వెన్నను కలిపి కరిగించుకోవాలి. ఇప్పుడు కాఫీ పొడి వేసి బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. గుడ్లని పగలగొట్టి తెల్లసొనని, పచ్చసొనని వేరువేరు గిన్నెల్లో పెట్టుకోవాలి.

ఇప్పుడు గుడ్ల తెల్లసొనని బాగా బీట్‌ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆపై గుడ్ల పచ్చసొనని, చక్కెరను కలిపి 5-10 నిమిషాల పాటు బాగా గిలక్కొట్టాలి. ఇందులో ఉప్పు, ముప్పావు భాగం కొకోవా పౌడర్‌ వేసి కలుపుకోవాలి. దీనిలో ముందుగా కరిగించుకొన్న చాక్లెట్‌, వెన్న మిశ్రమం వేసి 5 నిమిషాల పాటు కలపాలి. చివరిగా, బీట్‌ చేసుకున్న గుడ్ల తెల్లసొనను ఇందులో వేసి బాగా కలుపుకొని, బేకింగ్‌ ట్రేలోకి పోసి 50-60 నిమిషాల వరకు ఒవెన్‌లో బేక్‌ చేసుకోవాలి. ఇప్పుడు కేక్‌ను ఒవెన్‌లోనుంచి బయటకుతీసి చల్లార్చుకొని మిగిలిన కొకోవా పౌడర్‌ను కేక్‌పై చల్లుకొని, స్ట్రాబెర్రీలతో గార్నిష్‌ చేసుకుంటే సరి. యమ్మీ ఫ్లోర్‌లెస్‌ చాక్లెట్‌ కేక్‌ రెడీ..! ఇందులో ఎలాంటి పిండీ కలపకపోవడం దీని ప్రత్యేకత..

వెనీలా బన్ట్‌ కేక్‌

deliciiouscakesgh650-3.jpg

కావల్సినవి

వెన్న – మూడు కప్పులు

చక్కెర – రెండు కప్పులు

గుడ్లు - నాలుగు

వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - టేబుల్‌స్పూన్‌

ఆల్మండ్ ఎక్స్‌ట్రాక్ట్‌ - అర టీస్పూన్‌

మైదా - మూడు కప్పులు

కార్న్‌స్టార్చ్‌ - ఆరు టేబుల్‌ స్పూన్లు

బేకింగ్‌ పౌడర్‌ - రెండు టీస్పూన్లు

ఉప్పు - చిటికెడు

పాలు - కప్పు

బన్ట్‌ ప్యాన్‌ (ఇదొక కేక్‌ ప్యాన్‌, మార్కెట్‌లో దొరుకుతుంది)

కేక్‌పై గ్లేజ్‌ కోసం

చక్కెర పొడి - రెండున్నర కప్పులు

పాలు - 5 టేబుల్‌ స్పూన్లు

వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - అర టీస్పూన్‌

ఉప్పు - చిటికెడు

తయారీ

ముందుగా ఒవెన్‌ను 350 డిగ్రీల ఫారన్‌హీట్‌కు ప్రీహీట్‌ చేసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో మైదా, కార్న్‌స్టార్చ్‌, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు, మరొక గిన్నెలో వెన్న, చక్కెర వేసి బాగా కలుపుకొని, గుడ్లు ఒక్కొక్కటిగా వేసి కలపాలి. ఆపై, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, ఆల్మండ్ ఎక్స్‌ట్రాక్ట్‌, మైదా మిశ్రమం, పాలు వేసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. ఈ కేక్‌ మిశ్రమాన్ని బన్ట్‌ ప్యాన్‌లో వేసుకొని గంట పాటు బేక్‌ చేసుకోవాలి. ఈలోపు కేక్‌పై గ్లేజ్‌ను సిద్ధం చేసుకోవాలి. ఒక గిన్నెలో చక్కెర పొడి, పాలు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, ఉప్పు వేసి బాగా కలుపుకుంటే గ్లేజ్‌ సిద్ధం. ఇప్పుడు తయారు చేసుకున్న కేక్‌ను బయటకు తీసి దానిపై ఈ గ్లేజ్‌ను పోసుకుంటే సరి.. నోరూరించే వెనీలా బన్ట్‌ కేక్‌ సిద్ధం..!

హాట్‌ చాక్లెట్‌ కేక్‌

deliciiouscakesgh650-4.jpg

కావల్సినవి

మైదా - రెండు కప్పులు

కొకోవా పౌడర్‌ - ముప్పావు కప్పు

చక్కెర – ఒకటిన్నర కప్పులు

బేకింగ్‌ పౌడర్‌ - టేబుల్‌ స్పూన్‌

ఉప్పు - చిటికెడు

వెజిటబుల్‌ ఆయిల్‌ - అర కప్పు

గుడ్లు - రెండు

మజ్జిగ – అరకప్పు

వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - టీస్పూన్‌

హాట్‌ కొకోవా - ముప్పావు కప్పు

ఫ్రాస్టింగ్‌ కోసం

మార్ష్‌మెల్లో క్రీం (సూపర్‌మార్కెట్‌లో దొరుకుతుంది) - ముప్పావు కప్పు

వెన్న – ముప్పావు కప్పు

చక్కెర పొడి - ముప్పావు కప్పు

కొకోవా పౌడర్‌ - పావు కప్పు

ఉప్పు - చిటికెడు

పాలు - 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ

ముందుగా ఒవెన్‌ను 350 డిగ్రీల ఫారన్‌హీట్‌కు ప్రీహీట్‌ చేసుకోవాలి. ఒక గిన్నెలో మైదా, కొకోవా పౌడర్‌, చక్కెర, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి కలుపుకోవాలి. మరొక గిన్నెలో వెజిటబుల్‌ ఆయిల్‌, గుడ్లు, మజ్జిగ, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి బాగా కలుపుకొని మైదా మిశ్రమాన్ని వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో హాట్‌ కొకోవా కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కేక్‌ మిశ్రమాన్ని బేకింగ్‌ ప్యాన్‌లోకి పోసుకొని 20-25 నిమిషాల పాటు ఒవెన్‌లో బేక్‌ చేసుకోవాలి. ఈలోపు ఫ్రాస్టింగ్‌ తయారు చేసుకోవాలి. ఇందుకోసం, పైన చెప్పిన ఫ్రాస్టింగ్‌ పదార్థాలు, మార్ష్‌మెల్లో క్రీం, వెన్న, చక్కెర పొడి, కొకోవా పౌడర్‌, ఉప్పు, పాలు ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తయారుచేసుకున్న కేక్‌పై ఈ మార్ష్‌మెల్లో ఫ్రాస్టింగ్‌ను మొత్తం అప్లై చేసుకోవాలి. అంతే..! టేస్టీ హాట్‌ చాక్లెట్‌ కేక్‌ రడీ..!

ఎగ్‌నాగ్‌ కేక్‌

deliciiouscakesgh650-5.jpg

కావల్సినవి

వెన్న - అర కప్పు

చక్కెర – ఒకటింపావు కప్పు

గుడ్లు - మూడు

వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - అర టీస్పూన్‌

రమ్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ - అర టీస్పూన్‌

మైదా - రెండు కప్పులు

ఉప్పు - టీస్పూన్‌

ఎగ్‌నాగ్‌ - కప్పు

ఫ్రాస్టింగ్‌ కోసం

మైదా - పావు కప్పు

ఉప్పు - చిటికెడు

ఎగ్‌నాగ్‌ - ఒకటిన్నర కప్పులు

వెన్న – కప్పు

చక్కెర - ఒకటిన్నర కప్పులు

వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒకటిన్నర టీస్పూన్‌

రెడ్‌ జెల్‌ ఫుడ్‌ కలర్‌ - 3-4 చుక్కలు (ఆప్షనల్‌)

ముందుగా ఎగ్‌నాగ్‌ ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావల్సినవి

గుడ్లు - నాలుగు (తెల్లసొన, పచ్చసొన వేరుచేసి పెట్టుకోవాలి)

చక్కెర - ముప్పావు కప్పు + టేబుల్‌ స్పూన్‌

పాలు - అరలీటర్‌

హెవీ క్రీం - కప్పు

రమ్‌ - 100 ఎంఎల్‌

జాజికాయ పొడి - టీస్పూన్‌

దాల్చిన చెక్క పొడి - కొద్దిగా

తయారీ

ముందుగా పచ్చసొనలను తీసుకొని బీట్ చేసుకొని, అందులో ముప్పావు కప్పు చక్కెర కొద్దికొద్దిగా వేస్తూ కరిగిపోయేవరకూ బీట్ చేసుకోవాలి. అందులో పాలు, క్రీం, రమ్, జాజికాయ పొడి, దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌లో ఎగ్ వైట్స్ తీసుకొని బీట్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ చక్కెర వేసి అది కరిగి తెల్లని పొగలాంటి మిశ్రమంగా మారేవరకూ దీన్ని బీట్ చేసుకోవాలి. ఇందాక తయారుచేసుకున్న మిశ్రమంలో ఈ ఎగ్‌వైట్స్‌ని కూడా కలుపుకొని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అంతే.. ఎగ్‌నాగ్‌ రడీ..

ఎగ్‌నాగ్‌ కేక్‌ తయారీ

ముందుగా ఒక గిన్నెలో మైదా, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరొక వెడల్పాటి గిన్నెలో వెన్న, చక్కెరను వేసి కలుపుకోవాలి. గుడ్లను ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా బీట్‌ చేసుకొని, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, రమ్‌ ఎక్స్‌ట్రాక్ట్‌లను వేసి కలుపుకోవాలి. దీనిలో మైదా మిశ్రమం, ఎగ్‌నాగ్‌ కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కేక్‌ మిశ్రమాన్ని బేకింగ్‌ ప్యాన్‌లో వేసి ఒవెన్‌లో 350 డిగ్రీల ఫారన్‌హీట్‌ వద్ద 25-30 నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి. కేక్‌ను టూత్‌పిక్‌తో చెక్‌ చేశాక బయటకు తీసి చల్లారనివ్వాలి.

ఇప్పుడు ఫ్రాస్టింగ్‌ కోసం, ఒక ప్యాన్‌లో మైదా, ఉప్పు, ఎగ్‌నాగ్‌ వేసి సన్నని మంట మీద కలుపుకోవాలి. ఇది కాస్త ఉడికి చిక్కబడ్డాక స్టవ్‌ ఆఫ్‌ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో వెన్న, చక్కెరను బాగా కలుపుకొని వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, చల్లబడ్డ ఎగ్‌నాగ్‌ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా ఫుడ్‌ కలర్‌ వేసి కలుపుకుంటే ఫ్రాస్టింగ్‌ రడీ.. ఈ ఫ్రాస్టింగ్‌ను బేక్‌ చేసుకున్న కేక్‌ పైభాగం మొత్తం అప్లై చేసుకుంటే సరి.. క్రిస్మస్‌ స్పెషల్‌ ఎగ్‌నాగ్‌ కేక్‌ సిద్ధం..!

చూశారుగా.. ఎంతో రుచికరమైన ఈ కేక్స్‌ని మీరు కూడా ట్రై చేసి, ఈ క్రిస్మస్‌ పండగను మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోండి..

హ్యాపీ క్రిస్మస్‌..!

women icon@teamvasundhara
try-these-special-sweets-to-impress-your-brother-on-rakhi

ముద్దుల సోదరుడికి నోరూరించే మిఠాయి..!

హాయ్.. నా పేరు శ్రావ్య. ఈ కాలం అమ్మాయినే అయినా నేను సంప్రదాయాలంటే ఆసక్తి చూపిస్తా. అందుకే ఈ రాఖీ పౌర్ణమికి మా అన్నయ్య కోసం ఓ ప్రత్యేకమైన రాఖీ తయారుచేయించా. మా ఇద్దరి ఫొటోతో రూపొందించిన పర్సనలైజ్‌డ్ రాఖీ అది. కేవలం ట్రెండీ టచ్ మాత్రమే కాదు.. ఇటు సంప్రదాయబద్ధంగానూ ఉండేలా ప్లాన్ చేశా. అంతేకాదు.. ఈ రక్షాబంధన్‌కి మా అన్నయ్య నోరు తీపి చేయడానికి నేనే ప్రత్యేకంగా మిఠాయిలు తయారుచేసి తనపై నాకున్న ప్రేమను చాటాలనుకుంటున్నా. మరి, ఇంతా అంతా కాదు.. నాకున్న ప్రేమనంతా చాటాలంటే ఒక్క మిఠాయి సరిపోతుందా? అందుకే ఒకటి, రెండు కాదు.. చాలా రకాల స్వీట్లను స్వయంగా తయారుచేయాలనుకుంటున్నా. అవేంటో మీరూ తెలుసుకుందురు గానీ రండి..

Know More

women icon@teamvasundhara
shilpa-shetty-cooks-healthy-upma-with-oats-and-sattu

శిల్ప చెప్పిన ఈ ఓట్స్ ఉప్మా మీరూ ట్రై చేస్తారా?

బాలీవుడ్‌కు సంబంధించి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే నటీమణుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది శిల్పాశెట్టి. వ్యాయామాలు, యోగాసనాలు, ఆరోగ్యకరమైన రెసిపీలు... తదితర విషయాల్లో ఆమెకు మంచి అవగాహన కూడా ఉంది. అందుకే ఈ విషయాలకు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుంటుందీ అమ్మడు. ఈక్రమంలో ఇటీవలే మాంసాహారానికి స్వస్తి చెప్పి పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయిన శిల్ప సోషల్‌ మీడియా వేదికగా ఓ టేస్టీ అండ్‌ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను అందరికీ పరిచయం చేసింది. ఇంతకీ ఏంటా బ్రేక్‌ఫాస్ట్‌?దాన్నెలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి...!

Know More

women icon@teamvasundhara
how-to-make-yogurt-sweet-potato-for-easy-breakfast
women icon@teamvasundhara
eat-this-tasty-sugar-free-ice-cream-in-this-summer

టేస్టీ టేస్టీ షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్..!

ఈ వేసవి కాలంలో చల్లచల్లని నోరూరించే ఐస్‌క్రీమ్ తినాలని ఎవరికి అనిపించదు చెప్పండి..! అయితే సాధారణంగా బయట తయారు చేసే ఐస్‌క్రీమ్స్‌లో చక్కెర అధిక మొత్తంలో ఉంటుంది. తక్కువ కార్బోహైడ్రేట్లుండే ఆహారం తీసుకుంటూ బరువును అదుపులో ఉంచుకునే వారు బయట తయారుచేసే ఫుల్లీ షుగర్ లోడెడ్ ఐస్‌క్రీమ్స్‌ని తినడం వల్ల మొదటికే మోసం వస్తుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే ఐస్‌క్రీమ్ మానేయాలా.. అంటారా? ఏం అక్కర్లేదు. చక్కెర వాడకుండా ఇంట్లోనే తయారుచేసే షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్‌ను తీసుకుంటే అటు ఐస్‌క్రీమ్ తినాలన్న కోరికా తీరుతుంది.. ఇటు బరువు పెరుగుతామన్న భయమూ ఉండదు.. అలాంటి ఓ షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్ రెసిపీనే ఇది..!

Know More

women icon@teamvasundhara
cook-up-new-dishes-out-of-vegetable-and-fruit-scraps
women icon@teamvasundhara
tasty-recipes-for-mothers-day-2020

అమ్మ కోసం కమ్మని కేక్స్‌ చేసేద్దాం..!

ప్రేమ, అనురాగం, ఆప్యాయత, త్యాగం.. ఇలా ఎన్నో సద్గుణాల కలబోత అమ్మ. అలాంటి అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమన్నది అక్షర సత్యం. అయితే ఏటా మే రెండో ఆదివారాన్ని ‘మాతృ దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. బోలెడన్ని కానుకలిస్తూ, ప్రేమ పంచుతూ అమ్మకు మనసారా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. అలాంటి సందర్భం ఈ ఏడాది కూడా రానే వచ్చింది. ఈ క్రమంలో ఈ ప్రత్యేకమైన రోజున కమ్మని వంటకాలతో అమ్మ నోరు తీపి చేయడం పరిపాటే. అయితే కరోనా కాచుక్కూర్చున్న ఈ ప్రతికూల పరిస్థితుల్లో బయటికెళ్లలేం. మరి, అమ్మతో కేక్‌ కట్‌ చేయించడమెలా అని ఆలోచిస్తున్నారా? ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎంతో ఈజీగా కేక్‌ తయారుచేస్తే సరి.. అలాంటి కొన్ని రెసిపీలు ఈ ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మీకోసం..

Know More

women icon@teamvasundhara
rakul-bakes-banana-chocolate-cookies-and-shares-the-recipe

భ్రమరాంబ ‘బనానా కుకీస్‌’ చేసింది..!

ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే నటీమణుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది స్మైలింగ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. వ్యాయామాలు, యోగాసనాలు, ఆరోగ్యకరమైన రెసిపీలు.. తదితర విషయాల్లో రకుల్‌కు మంచి అవగాహన కూడా ఉంది. అందుకే ఈ విషయాలకు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా పంచుకొంటుంటుందీ అమ్మడు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా గత కొన్ని రోజులుగా రకుల్‌ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తన ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెట్టడం, కుటుంబ సభ్యులతో గడపడంతో పాటు.. పలు ఆరోగ్యకరమైన రెసిపీలను కూడా తయారుచేస్తూ సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకుంటుంది. ఈ క్రమంలో రకుల్‌ ఇటీవలే షేర్‌ చేసిన రెసిపీ ఏంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
senior-actress-neena-gupta-introduces-new-breakfast-recipe

బ్రేక్‌ఫాస్ట్‌కి ఈ ‘ఆలూ బ్రెడ్‌ రోల్స్‌’ ట్రై చేద్దామా?

లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువ శాతం మంది ఇళ్లకే పరిమితమయ్యారు. సాధారణ రోజుల్లో హోటళ్లు, రెస్టరంట్‌ల చుట్టూ తిరుగుతూ నచ్చినవి తినేవారు ఇప్పుడు ఇంటి భోజనాన్నే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ దగ్గర్నుంచి రాత్రి డిన్నర్‌ వరకు ప్రతి ఒక్కటి తమకు నచ్చినవి.. అందులోనూ వెరైటీ వంటకాల్ని ప్రయత్నిస్తూ విభిన్న రుచుల్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది తారలు సైతం వంటింట్లో వెరైటీ వంటకాలు చేస్తూ ఆ రెసిపీస్‌ని అందరితో పంచుకుంటున్నారు తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి నీనా గుప్తా కూడా సోషల్‌ మీడియా వేదికగా ఓ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్‌ను మనందరికీ పరిచయం చేసింది. ఇంతకీ ఏంటా బ్రేక్‌ఫాస్ట్‌? దాన్నెలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
celebrities-tasty-quarantine-cook-ups

ఈ తారల వంటకాలు.. మనమూ ట్రై చేద్దామా?

షూటింగ్స్‌, పార్టీలు, అవార్డ్‌ ఫంక్షన్లు.. ఇలా వివిధ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడిపే మన సినీ తారలు.. ఈ క్వారంటైన్‌ సమయాన్ని అనుకోకుండా దొరికిన వరంలా భావిస్తున్నారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులతో గడపడంతో పాటు తమకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకునే అద్భుత అవకాశంలా ఈ టైమ్‌ని అందిపుచ్చుకుంటున్నారు. అందుకే ఈ లాక్‌డౌన్‌ రోజుల్లో వారికి నచ్చిన పనులు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ పాకశాస్త్ర నైపుణ్యానికి మెరుగులు దిద్దుతూ అభిమానులకు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్నారు కొంతమంది తారలు. రుచితోపాటు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తోన్న ఆ రెసిపీలేంటో తెలుసుకొని మనమూ ట్రై చేద్దామా మరి!

Know More

women icon@teamvasundhara
royal-chefs-prepares-choclate-cup-cake-on-elizabeths-birthday-shares-recipe

రాణీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో...!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారితో పోరాడే క్రమంలో ప్రజలు సామాజిక దూరం, స్వీయ నిర్బంధం పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ సమయంలో జరుపుకోవాల్సిన వివాహాలు, పెళ్లిరోజులు, శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకలు, ప్రత్యేక సందర్భాలు.. మొదలైన కార్యక్రమాలను అయితే తూతూ మంత్రంగా జరుపుకోవడం లేదా వాయిదా వేయడం చేస్తున్నారు. సామాన్యులకు మాత్రమే కాదు ప్రముఖులకూ ఈ ఇబ్బందులు తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్‌-2 తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో రాణీ వారికి సంబంధించిన అధికారిక వ్యవహారాలు చూసుకునే ‘ది రాయల్‌ ఫ్యామిలీ’ బృందం ఆమె కోసం ఓ రుచికరమైన రెసిపీని తయారు చేసింది. అంతేకాదు, ఈ స్పెషల్‌ రాయల్‌ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో రాయల్‌ ఫ్యామిలీ బృందం సోషల్‌ మీడియా ద్వారా వివరంగా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
the-quarantine-cooking-skills-of-celebrities

women icon@teamvasundhara
health-benefits-of-sri-rama-navami-naivedyams

నవమి నైవేద్యంతో మేలైన ఆరోగ్యం!

'శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం.. సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం.. ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం.. రామం.. నిశాచర వినాశకరం నమామి..' కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముడి పుట్టినరోజునే మనం 'శ్రీరామనవమి'గా జరుపుకొంటాం. ఈ రోజున ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం, వడపప్పు, చలిమిడి.. నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ పదార్థాల్ని అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. ఈ క్రమంలో వీటి తయారీ విధానం, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
alia-prepares-sabji-recipe-for-the-first-time
women icon@teamvasundhara
5-traditional-yet-delicious-sankranthi-recipes-that-one-shouldnt-miss

నోరూరించే ఈ సంక్రాంతి వంటకాలు రుచి చూసేద్దామా..!

‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా.. సరదాలు తెచ్చిందే తుమ్మెదా..’ అంటూ తెలుగు ప్రజలంతా సరదాగా ఆడుతూ పాడుతూ చేసుకునే అతి ముఖ్యమైన పండగే మకర సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండగలో భాగంగా రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడిపందాలు.. వంటి ఎన్నో ప్రత్యేకతలుంటాయి. అంతేనా.. పండగొచ్చిందంటే చాలు.. ప్రత్యేకమైన పిండి వంటలతో తెలుగు లోగిళ్లన్నీ ఘుమఘుమలాడతాయి. కొత్త పంట చేతికొచ్చే ఈ ఆనందంలో వివిధ రకాల ప్రత్యేక వంటకాల్ని చేసుకొని ఇంటిల్లిపాదీ ఆస్వాదిస్తుంటారు. మరి, ఈ సంక్రాంతి సందర్భంగా పండగ ఆనందాన్ని రెట్టించే, అతిథులకు నోరూరించే అలాంటి కొన్ని స్పెషల్‌ రెసిపీస్‌ మీకోసం..

Know More

women icon@teamvasundhara
try-these-hot-soups-in-winter

చలికాలంలో ఈ సూప్స్‌తో వెచ్చవెచ్చగా!

ఏ కాలంలోనైనా అది తినాలి ఇది కావాలి అనిపిస్తుంది కానీ చలికాలంలో మాత్రం ఏం తిన్నా వేడివేడిగా తినాలనిపిస్తుంది. ఈ క్రమంలో రెండు ముద్దలు ఎక్కువే తినేస్తుంటారు చాలామంది. మరి ఓ వైపు చలి చంపేస్తుంటే ఇక వ్యాయామం సంగతి పట్టించుకునే వారు ఎంతమంది ఉంటారు చెప్పండి. దాని సంగతి దేవుడెరుగు అనుకునేవారు ఎంతమందో! ఇలా రెండుమూడు ముద్దలు ఎక్కువ తినడం, అటు వ్యాయామమూ చేయకపోవడం వల్ల చలికాలం పూర్తయ్యేసరికి బరువు పెరిగేస్తుంటారు చాలామంది. అందుకే అటు వేడివేడిగా కడుపు నిండుగా, ఇటు మీ ఫిట్‌నెస్‌ని కూడా కోల్పోకుండా ఉండాలంటే ఈ చలికాలంలో సూప్స్‌ ట్రై చేయడం బెటర్‌. మరి అలా నోరూరిస్తూ చలిని దూరం చేసే ఈ సూప్స్‌ని ఒకసారి మీరూ ట్రై చేసి రుచి చూడండి!

Know More

women icon@teamvasundhara
tasty-turkish-soup-recipe-in-telugu
women icon@teamvasundhara
vegan-day-special-recipes-to-prepare-at-home-in-telugu
women icon@teamvasundhara
enjoy-your-weekend-with-these-georgian-kharcho-soup-in-telugu
women icon@teamvasundhara
dasara-naivedyalu-and-their-health-benefits
women icon@teamvasundhara
independence-day-special-recipes
women icon@teamvasundhara
tasty-chips-recipes-in-telugu

¨ *XýqE ¹ª½-¹-ª½-©Ç-œË¢-Íä-§ŒÕ¢œË..!

„ïÃ-Âé¢.. ²Ä§ŒÕ¢-“ÅÃ©Õ Æ©Ç „ÃÊ X¾œ¿Õ-Ōբ˜ä Âê½¢-ÂÃ-ª½¢’à \Ÿçj¯Ã A¯Ã-©-E-XÏ¢-ÍŒœ¿¢ ®¾£¾Ç•¢. Âí¢ÅŒ-«Õ¢C ƒ¢šðx¯ä X¾Âî-œÎ©ð, ®¾„çÖ-²Ä©ð Í䮾Õ-¹ע˜ä.. «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ “X¾A-²ÄK \¢ Íä²Äh¢©ä Æ¢{Ö ¦§ŒÕ{ ÊÕ¢* *Xýq ÅçÍŒÕa-¹ע-{Õ¢-šÇª½Õ. Æ¢Ÿ¿Õ-©ðÊÖ ƒ©Ç¢šË *Xýq Æ¢˜ä XÏ©x-©Â¹× ÍÃ©Ç ƒ†¾d¢ ¹؜ÄÊÖ..! «ÕJ ‡X¾Ûpœ¿Ö ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢-X¾-Åî¯ä ÂùעœÄ.. NNŸµ¿ ª½ÂÃ-©Õ’Ã.. Âî¾h ‚ªî-’¹u-¹-ª½¢’à *Xýq ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-«-œ¿-„çÕ-©Ç’î Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..„ïÃ-Âé¢.. ²Ä§ŒÕ¢-“ÅÃ©Õ Æ©Ç „ÃÊ X¾œ¿Õ-Ōբ˜ä Âê½¢-ÂÃ-ª½¢’à \Ÿçj¯Ã A¯Ã-©-E-XÏ¢-ÍŒœ¿¢ ®¾£¾Ç•¢. Âí¢ÅŒ-«Õ¢C ƒ¢šðx¯ä X¾Âî-œÎ©ð, ®¾„çÖ-²Ä©ð Í䮾Õ-¹ע˜ä.. «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ “X¾A-²ÄK \¢ Íä²Äh¢©ä Æ¢{Ö ¦§ŒÕ{ ÊÕ¢* *Xýq ÅçÍŒÕa-¹ע-{Õ¢-šÇª½Õ. Æ¢Ÿ¿Õ-©ðÊÖ ƒ©Ç¢šË *Xýq Æ¢˜ä XÏ©x-©Â¹× ÍÃ©Ç ƒ†¾d¢ ¹؜ÄÊÖ..! «ÕJ ‡X¾Ûpœ¿Ö ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢-X¾-Åî¯ä ÂùעœÄ.. NNŸµ¿ ª½ÂÃ-©Õ’Ã.. Âî¾h ‚ªî-’¹u-¹-ª½¢’à *Xýq ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-«-œ¿-„çÕ-©Ç’î Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
this-new-technique-of-garlic-peeling-is-the-viral-video-now!
women icon@teamvasundhara
all-you-need-to-know-about-a-special-dish-of-the-rashtrapati-bhavan-dal-raisina
women icon@teamvasundhara
tasty-fruit-pops-for-hot-summer
women icon@teamvasundhara
tasty-summer-special-recipes-with-chia-seeds-in-telugu
women icon@teamvasundhara
make-your-day-with-chicken-tomato-stew
women icon@teamvasundhara
instant-cake-mix-for-easy-baking-
women icon@teamvasundhara
no-bake-cheesecake-making
women icon@teamvasundhara
make-vegan-cheese-at-home
women icon@teamvasundhara
iced-teas-to-beat-the-summer-heat
women icon@teamvasundhara
make-chocolate-dry-fruits-for-this-chocolate-day
women icon@teamvasundhara
white-sauce-pasta
women icon@teamvasundhara
eat-tasty-and-loose-weight-with-overnight-oats
women icon@teamvasundhara
gluten-free-chocolate-chip-cookies-in-telugu