scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఆయన్ని మార్చేదెలా?'

'అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.'

Know More

Movie Masala

 
category logo

అందరిళ్లలోనూ ముద్దుల మహాలక్ష్ములే! అదే వీళ్ల స్పెషాలిటీ!

Apart From Virushka These Indian Cricketers Are Also A Proud Father Of A Baby Girl

‘ఆడపిల్ల ఇంటికి దీపం లాంటిది. ఆడపిల్ల లేని ఇల్లు... చందమామ లేని ఆకాశం ఒక్కటే’ అని పెద్దలంటుంటారు. అందుకే ఎంతమంది మగ పిల్లలు పుట్టినా, ఆనందాలు కురిపించే ఒక ఆడపిల్లైనా ఇంట్లో ఉండాలని భార్యాభర్తలు కోరుకుంటారు. ఈ మేరకు ‘మాకు అమ్మాయి పుట్టింది. ఈ విషయం మీతో పంచుకోవడానికి ఎంతో థ్రిల్‌గా, సంతోషంగా ఫీలవుతున్నాం’ అంటూ అమ్మాయి పుట్టగానే సోషల్‌ మీడియా వేదికగా తమ సంతోషాన్ని షేర్‌ చేసుకున్నారు అనుష్కా శర్మ-విరాట్‌కోహ్లీ. అంతకు ముందు ఫాస్ట్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ దంపతులు కూడా ‘ఆడపిల్ల పుట్టింది’ అంటూ సరిగ్గా కొత్త సంవత్సరం రోజున తమ కుమార్తెకు స్వాగతం పలికారు.
వీరిద్దరే కాదు... గత కొన్నేళ్ల నుంచి తండ్రులైన భారత క్రికెటర్లలో ఎక్కువ మందికి ఆడపిల్లలే పుట్టడం విశేషం.. ఈ క్రమంలో వీళ్లందరూ కలిసి భవిష్యత్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టును తయారుచేస్తున్నారంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో సరదాగా పోస్ట్‌లు షేర్‌ చేస్తున్నారు. మరి నెట్‌ ప్రియులు మాట్లాడుకుంటున్న క్రికెటర్లు-వారి ముద్దుల మహాలక్ష్ములెవరో చూద్దాం రండి.

విరాట్‌ కోహ్లీ-అనుష్కా శర్మ


‘త్వరలోనే మేం ముగ్గురం కాబోతున్నాం’ అంటూ గతేడాది ఆగస్టులో తమ అభిమానులకు తీపి కబురు అందించారు విరాట్‌-అనుష్క దంపతులు. ఈ క్రమంలో తొమ్మిది నెలల పాటు తమ చిన్నారి కోసం ఎంతో ఆతృతగా చూసిన విరుష్క జంటకు ఆ ఆనంద క్షణం రానే వచ్చింది. జనవరి 11న మధ్యాహ్నం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది అనుష్క. దీంతో తండ్రిగా ప్రమోషన్‌ పొందిన విరాట్‌ ‘మాకు అమ్మాయి పుట్టిందన్న శుభవార్తను మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. బుజ్జాయి రాకతో మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది’ అంటూ ట్విట్టర్‌ వేదికగా తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నాడు.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)


ఉమేశ్‌ యాదవ్‌-తాన్యా వాద్వా


భారత క్రికెట్‌ జట్టుకు ఫాస్ట్‌ బౌలర్‌గా సేవలందిస్తున్న ఉమేశ్‌ యాదవ్‌ ఇటీవలే తండ్రయ్యాడు. అతని భార్య తాన్యా వాద్వా సరిగ్గా కొత్త ఏడాది రోజున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఏడేళ్ల క్రితం పెళ్లిపీటలెక్కిన ఈ లవ్లీ కపుల్‌కు ఇదే మొదటి సంతానం. ఈ సందర్భంగా తమ చిన్నారి ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఉమేశ్- ‘ఆడపిల్ల పుట్టింది. మా చిన్నారి రాకుమారికి ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా, సంతోషంగా ఉంది’ అని సంతోషంతో పొంగిపోయాడు.

View this post on Instagram

A post shared by Umesh Yaadav (@umeshyaadav)


అజింక్యా రహానే-రాధిక


కెప్టెన్‌ కోహ్లీ స్థానంలో ప్రస్తుతం ఆస్ర్టేలియా పర్యటనలో భారత జట్టును ముందుండి నడిస్తున్నాడు అజింక్యా రహానే. వైస్‌ కెప్టెన్‌గా, ఆటగాడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఈ స్టార్‌ క్రికెటర్‌ 2014లో చిన్ననాటి స్నేహితురాలు రాధికతో కలిసి పెళ్లిపీటలెక్కాడు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్‌లో ‘ఆర్య’ అనే కూతురుకు జన్మనిచ్చింది రాధిక. ఇక ఆర్య అంటే రహానేకు పిచ్చి ప్రేమ. తన ముద్దుల తనయకి దగ్గరుండి పాలు పట్టిస్తాడు. లాలి పాటలు పాడతాడు. కూతురిని ఆడిస్తాడు. రహానే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన కూతురుతో దిగిన ఫొటోలే అధికంగా దర్శనమిస్తాయి.


అంబటి రాయుడు- విద్య

View this post on Instagram

A post shared by Ambatirayudu (@a.t.rayudu)


వీవీఎస్‌ లక్ష్మణ్‌ తర్వాత భారత క్రికెట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మరో తెలుగు ఆటగాడు అంబటి రాయుడు. కొన్ని వ్యక్తిగత కారణాలతో గతేడాది ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన అతడు ఐపీఎల్‌లో మాత్రం అంచనాలకు మించి రాణించాడు. అంతేకాదు.. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని మళ్లీ భారత క్రికెట్‌ జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇక రాయుడు వ్యక్తిగత జీవితానికి వస్తే... 2009లో విద్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది జులైలో వీరిద్దరికీ పండంటి ఆడబిడ్డ జన్మించింది.


పుజారా-పూజ


టెస్ట్‌ క్రికెట్‌లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడుతూ భారత క్రికెట్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఛేతేశ్వర్ పుజారా. క్రికెట్‌లో ద్రవిడ్‌ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్‌ క్రికెటర్‌ 2013లో పూజ అనే అమ్మాయితో ఏడడుగులు నడిచాడు. ఈ క్రమంలో 2018 ఫిబ్రవరిలో ‘అదితి’ అనే అమ్మాయి వీరి జీవితంలోకి అడుగుపెట్టింది. ఇక భార్యతో తన కుమార్తె చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకుని మురిసిపోతుంటాడు పుజారా.


రోహిత్‌-రితిక


ఓపెనర్‌గా భారత క్రికెట్‌ జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్నాడు రోహిత్‌ శర్మ. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ హిట్‌ మ్యాన్‌గా గుర్తింపు పొందిన ఈ స్టార్ క్రికెటర్‌ 2015 డిసెంబర్‌లో రితికా సజ్దాను వివాహం చేసుకున్నాడు. 2018 డిసెంబర్‌లో వీరిద్దరికీ ‘సమైరా’ అనే కూతురు పుట్టింది. క్రికెట్‌ షెడ్యూల్స్‌తో నిత్యం బిజీగా ఉండే రోహిత్‌ ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా సమైరాతో గడపడానికే ప్రాధాన్యమిస్తుంటాడు. ఇక విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు తన కూతురును చాలా మిస్సవుతున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌లు పెడుతుంటాడీ స్టార్‌ క్రికెటర్.


అశ్విన్‌- ప్రీతి

View this post on Instagram

A post shared by Ashwin (@rashwin99)

బంతితో మ్యాజిక్‌ చేయడమే కాదు... అవసరమైతే బ్యాట్‌తోనూ జట్టుకు అండగా నిలుస్తానంటూ ఆస్ట్రేలియాపై అసాధారణ ఇన్నింగ్స్‌తో నిరూపించాడు స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్. చెన్నైకి చెందిన ఈ మణికట్టు మాంత్రికుడు 2011లో ప్రీతి నారాయణన్‌తో కలిసి పెళ్లిపీటలెక్కాడు. తమ అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తుగా ఆద్య, అకీరా అనే ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చారీ లవ్లీ కపుల్‌. ముద్దు ముద్దు మాటలతో సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నారీ అక్కాచెల్లెళ్లు. ఈ క్రమంలో కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని అశ్విన్‌కు వీళ్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలైన సంగతి తెలిసిందే.


రవీంద్ర జడేజా-రీవా సోలంకి

అశ్విన్‌లాగే తన ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు రవీంద్ర జడేజా. ఐదేళ్ల క్రితం రీవా సోలంకితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అతనికి 2017 జూన్‌లో ‘నిద్యానా’ అనే కూతురు పుట్టింది. తను పుట్టినప్పుడు ‘మా ఇంటికి చిన్నారి రాకుమారి వచ్చింది’ అని సంతోషంగా చెప్పుకున్న ఈ ఆల్‌రౌండర్‌ కూతురు పుట్టిన తర్వాతే ఆటలో బాగా రాణిస్తున్నానంటూ పలుమార్లు చెప్పుకొచ్చాడు. ఆమె తన లక్కీ స్టార్‌ అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడీ స్టార్ క్రికెటర్.


సురేశ్‌ రైనా-ప్రియాంకా చౌదరి

View this post on Instagram

A post shared by Suresh Raina (@sureshraina3)

గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సురేశ్‌ రైనాదీ ఇదే కథ. 2015లో ప్రియాంకా చౌదరితో కలిసి పెళ్లిపీటలెక్కిన రైనాకు గ్రేసియా అనే ముద్దుల కూతురుంది. తనంటే రైనాకు ఎంత ప్రేమంటే... తన కూతురు పేరును ఏకంగా చేతిపై పచ్చబొట్టు పొడిపించుకోవడం గమనార్హం. అలాగే గ్రేసియా పేరుతో పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడీ మాజీ స్టార్‌ బ్యాట్స్‌మన్.


హర్భజన్‌ సింగ్‌-గీతా బస్రా

బంతిని గింగిరాలు తిప్పుతూ బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించడంలో స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ది ప్రత్యేకమైన శైలి. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్‌ నటి గీతా బస్రాతో కలిసి 2015లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడీ పంజాబీ క్రికెటర్. 2017 జులైలో హినాయా హీర్‌ సింగ్‌ అనే పండంటి ఆడబిడ్డ వీరి జీవితంలోకి అడుగుపెట్టింది. హినాయా అంటే ‘మెరుపు’ అని అర్థం.


మహేంద్ర సింగ్‌ ధోనీ-సాక్షి

ఇక భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ-సాక్షిల గారాల పట్టి జీవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐదేళ్ల వయసులోనే ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ స్టార్‌ కిడ్‌కి ఇటీవల ఓ ఎండార్స్‌మెంట్‌ కూడా వచ్చేసింది. ఇక తమ కూతురు పేరుతో ప్రత్యేకంగా ఓ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను హ్యాండిల్‌ చేస్తున్న ధోనీ దంపతులు అందులో జీవా ఫొటోలను అందరితో షేర్‌ చేసుకుంటూ మురిసిపోతున్నారు.


గంభీర్‌-నటాషా

2007 టీ20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్‌ గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించాడు గౌతం గంభీర్‌. దిల్లీకి చెందిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ రెండేళ్ల క్రితం ఆటకు వీడ్కోలు చెప్పి రాజకీయాల్లో చేరిన సంగతి తెలిసిందే. ఇక 2011లో నటాషా జైన్‌ను పెళ్లాడిన గంభీర్‌కు ప్రస్తుతం అజీన్‌, అనైజా అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ఓ వైపు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు సేవలందిస్తూనే...తన ఇద్దరు కూతుళ్ల ఆలనాపాలనా చూసుకుంటున్నాడీ మాజీ క్రికెటర్.


* భారత జట్టు దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన సచిన్‌ తెందూల్కర్‌- అంజలి దంపతులకు సారా తెందూల్కర్‌ అనే కూతురుంది. 23 ఏళ్ల సారా ప్రస్తుతం లండన్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌లో మెడిసిన్‌ చదువుతోంది.* ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్‌ గంగూలీ-డోనా దంపతులకు 1997లో సనా గంగూలీ అనే కూతురు జన్మించింది. తల్లి లాగే క్లాసికల్‌ డ్యాన్సర్‌ కావాలనుకుంటున్న 23 ఏళ్ల సనా ఇటీవల ఒడిస్సీ నృత్యంలో శిక్షణ పూర్తి చేసుకుంది.1983 వరల్డ్‌ కప్‌ను భారత్‌ గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన కపిల్‌ దేవ్‌- రోమీ భాటియా దంపతులకు 24 ఏళ్ల అమియా దేవ్‌ అనే కూతురుంది. విదేశాల్లో చదువుకున్న ఆమె తన తండ్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘83’ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా మారింది.

View this post on Instagram

A post shared by Kapil Dev (@therealkapildev)

women icon@teamvasundhara
how-students-and-teachers-can-stay-safe-from-corona-virus-amid-schools-reopening

పిల్లలు మళ్లీ స్కూలుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

కరోనా కారణంగా గత ఏడాది కాలంగా స్కూళ్లు మూతపడడంతో పిల్లలందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వాళ్ల అల్లరికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అయితే గత కొన్ని నెలల నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నప్పటికీ పలు కారణాల రీత్యా అవి అందరికీ చేరువ కాలేదనే చెప్పాలి. ఏదేమైనా తరగతుల వారీగా తిరిగి స్కూళ్లను తెరుస్తున్నాయి పాఠశాల యాజమాన్యాలు. ఈ క్రమంలో పిల్లల ఆరోగ్యం కోసం, వైరస్‌ నుంచి వారికి పూర్తి రక్షణ కల్పించే చర్యలను చేపడుతున్నాయి. అయితే స్కూల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పిల్లల్ని కూడా కొన్ని విషయాల్లో అలర్ట్‌గా ఉంచమని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు నిపుణులు. కొవిడ్‌ బారిన పడకుండా చిన్నారులతో తగిన జాగ్రత్తలు పాటింపజేయాలని చెబుతున్నారు. మరి, పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో వైరస్‌ బారిన పడకుండా పిల్లల్ని సురక్షితంగా ఉంచాలంటే తల్లిదండ్రులు వారితో ఎలాంటి జాగ్రత్తలు పాటింపజేయాలి? ఇంకా ఎలాంటి అంశాలపై శ్రద్ధ పెట్టాలి? తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
common-skin-problems-in-kids-and-how-to-overcome-those?-in-telugu

మీ పిల్లల్లో ఇలాంటి చర్మ సమస్యలొస్తున్నాయా?

చిన్న పిల్లల చర్మం ముట్టుకుంటే కందిపోయేంత మృదువుగా, దూదిపింజ అంత సుతిమెత్తగా ఉంటుంది. అందుకే కాస్త ఎండ తగిలినా కందిపోవడం, చల్లటి వాతావరణంలో పొడిబారిపోవడం.. వంటి సమస్యలు మన పిల్లల్లోనూ మనం చూస్తూనే ఉంటాం. అంతేకాదు.. వారి చర్మం వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు కూడా త్వరగా లోనయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇందుకు వారి చర్మం కింద లిపిడ్లు (చర్మాన్ని సంరక్షించే సహజసిద్ధమైన కొవ్వులు) తక్కువగా, ఆమ్ల స్థాయులు ఎక్కువగా ఉండడమే ముఖ్య కారణమంటున్నారు నిపుణులు. తద్వారా వారి చర్మం మరింతగా డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి చర్మ సమస్యల నుంచి చిన్నారుల్ని ఇట్టే కాపాడుకోవచ్చట! మరి, ఇంతకీ పిల్లల్లో ఎదురయ్యే ఆ సాధారణ చర్మ సమస్యలేంటి? వాటి నుంచి మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
tips-and-precautions-for-massaging-a-baby-in-telugu

చిన్నారులకూ హాయినిచ్చే మసాజ్..!

మసాజ్ చేయించుకోవడమంటే ఎవరికిష్టముండదు చెప్పండి.. ఎందుకంటే దీనివల్ల మనసుకు, శరీరానికి చాలా ప్రశాంతంగా, రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. పిల్లల విషయంలోనూ అంతే.. మసాజ్‌లో ఉండే జెంటిల్, రిథమిక్, సూతింగ్ స్ట్రోక్స్ వల్ల శరీరంలో హార్మోన్లు ఉత్తేజితమవుతాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి మసాజ్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. పాపాయి రిలాక్స్ కావడానికి, తల్లులకు పిల్లలకు మధ్య ఉండే బంధం మరింత బలపడటానికి కూడా ఈ ప్రక్రియ మరింత ఉపయోగపడుతుంది. ఏంటీ.. మసాజ్‌కి ఇంత చరిత్ర ఉందా అనుకుంటున్నారా? అవును మరి.. ఇంతకీ పిల్లలకు అసలు మసాజ్ ఎలా చేయాలి? ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
useful-baby-gadgets-for-new-moms-in-telugu
women icon@teamvasundhara
do-you-know-about-breast-crawling?-what-are-the-benefits-of-it?

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

Know More

women icon@teamvasundhara
learning-new-languages-benefits-child-to-improve-set-of-skills

అందుకే పిల్లలకు ఎక్కువ భాషలు నేర్పించాలట!

అప్పుడప్పుడే మాటలు నేర్చుకొంటున్న చిన్నారులు పాఠశాలకు వెళ్లేంతవరకు కుటుంబ సభ్యుల మధ్యే ఉంటారు. దీంతో తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్లు ఏ భాష మాట్లాడితే దాన్నే అనుసరిస్తుంటారు. పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టిన తర్వాత ఆంగ్లం, హిందీ వంటి భాషలను సైతం తమ సిలబస్‌లో భాగంగా నేర్చుకొంటారు. ఈ క్రమంలో కొందరు తాము నేర్చుకొన్న భాషల్లో రాయడం, చదవడం వరకు మాత్రమే పరిమితమైతే.. మరికొందరు వాటిలో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాన్ని సంపాదించగలుగుతారు. ఇలా ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడగలిగే చిన్నారుల్లో.. మెదడు చాలా చురుగ్గా పనిచేయడంతో పాటు.. ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకొనే సామర్థ్యం పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

Know More

women icon@teamvasundhara
when-what-and-how-to-introduce-solid-foods-to-your-baby?

ఏడాది లోపు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వచ్చు?

పిల్లలు ఆరు నెలల దాకా తల్లి పాల మీదే పూర్తిగా ఆధారపడతారు. ఆరో నెలలో అన్నప్రాసనతో వారికి ఘనాహారం అందించడం మొదలుపెడతారు తల్లులు. అయితే ఈ క్రమంలో చిన్నారులకు ఏది పెట్టాలి? ఏది పెట్టకూడదు? అన్న విషయాల్లో అమ్మల్లో బోలెడన్ని సందేహాలుంటాయి. ఘనాహారం పెడితే మింగడానికి ఇబ్బంది పడతారేమో అని కొందరు, మాంసం-గుడ్లు పెడితే ఏమవుతుందోనని మరికొందరు, ఏ పండ్లు తినిపించచ్చో అని ఇంకొందరు.. ఇలా ఒక్కొక్కరి మనసులో ఒక్కో సందేహం ఉంటుంది. అయితే తేనె వంటి కొన్ని పదార్థాలు మినహాయిస్తే ఏడాదిలోపు పిల్లలకు ఎలాంటి ఘనాహారమైనా తినిపించచ్చని చెబుతోంది సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ). ఎందుకంటే ఈ వయసులో మనం అందించే పోషకాహారం వారి ఎదుగుదలకు చక్కగా దోహదం చేస్తుందని చెబుతోంది. మరి, ఘనాహారం అలవాటు చేసే క్రమంలో ఏడాది లోపు చిన్నారులకు ఎలాంటి ఆహార పదార్థాలు పెట్టాలి? ఈ క్రమంలో తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-handle-hyperactive-kids-in-telugu

అల్లరి గడుగ్గాయిలను అదుపు చేద్దామిలా..!

నాలుగేళ్ల చింటు ఒక్కచోట కూర్చోడు.. కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాడు.. ఆరేళ్ల సుచిర ఎప్పుడు చూసినా వసపిట్టలా వాగుతూనే ఉంటుంది.. ఇక ఎనిమిదేళ్ల వర్షిత చేసే అల్లరికి అడ్డు-అదుపు ఉండదంటే అతిశయోక్తి కాదు.. ఇలాంటి చిచ్చరపిడుగులను ప్రస్తుతం చాలామంది ఇళ్లలో చూస్తూనే ఉంటాం. సాధారణంగా చిన్నారులు ఎదిగే కొద్దీ పెద్దలు చెప్పే మాటలు వింటూ బుద్ధిగా నడుచుకుంటారు. కానీ కొందరు మాత్రం అసలు పెద్దవాళ్లు చెప్పే మాటలేవీ పట్టించుకోరు. ముఖ్యంగా ఇలా అత్యుత్సాహం ప్రదర్శించే పిల్లతైతే మరీనూ! మరి, వారిని అదుపు చేసే మార్గాలేంటి? తిరిగి వారిని దారిలో పెట్టడం ఎలా?? తెలియాలంటే ఇది చదవాల్సిందే..

Know More

women icon@teamvasundhara
5-year-old-indian-origin-girl-makes-hundreds-of-cards-for-nursing-home-residents

కరోనా బాధితుల కోసం ఈ లిటిల్‌ ఏంజెల్‌ ఏం చేసిందో తెలుసా?

సాధారణంగా ఐదేళ్ల వయసున్న పిల్లలు ఎలా ఉంటారు? ఇల్లంతా తిరుగుతూ.. తోటి పిల్లలతో ఆడుకుంటూ.. అల్లరికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటారు. లేకపోతే స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌, టీవీ.. ఇవే వారి ప్రపంచం. అంతేగానీ చుట్టూ ఉన్న మనుషులు, ఆపదల్లో ఉన్న వారికి సాయం చేయడం లాంటి పెద్ద విషయాలు ఆ పిల్లలకు ఏ మాత్రం తెలియవు. కానీ ఓ ఐదేళ్ల చిన్నారి మాత్రం కరోనాతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల సంతోషం కోరుకుంది. అందుకోసం అనుకున్నదే తడవుగా వందలాది గ్రీటింగ్‌ కార్డులను తయారుచేసి నగరంలోని నర్సింగ్‌ హోంలకు పంపించింది. తద్వారా వారిలో ఆత్మస్థైర్యం, సానుకూల దృక్పథం నింపేందుకు ప్రయత్నించింది. న్యూ ఇయర్‌ సందర్భంగా ఇలా తన వయసును మించిన మంచి పని చేసి అందరి చేతా శెభాష్‌ అనిపించుకున్న ఆ చిన్నారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
mira-rajput-shares-how-she-pickup-healthy-food-options-for-her-kids

చలికాలంలో నా పిల్లల్ని అలా హెల్దీగా ఉంచుతున్నా!

తీసుకునే ఆహారం విషయంలో మనమే మన కోరికల్ని కంట్రోల్‌ చేసుకోలేం. అలాంటిది పిల్లలెలా వింటారు. చలికాలమైనా ఐస్‌క్రీమ్‌ కావాలని, అనారోగ్యమని తెలిసినా పిజ్జా, బర్గర్లు తింటామని మారాం చేస్తుంటారు. ఇక ఈ క్రమంలో పిల్లల్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాల్లను పిల్లలకు అలవాటు చేయడం తల్లులకు కత్తి మీద సామే! అయితే చిన్నారులకు ఒక్కో ఆహార పదార్థం అలవాటు చేసే క్రమంలోనే హెల్దీ ఆప్షన్స్‌ ఎంచుకోవాలని, ఈ క్రమంలో మన పూర్వీకులు పాటించిన ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను వారికి అలవర్చాలని చెబుతోంది బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సతీమణి మీరా రాజ్‌పుత్‌. ఇలా పిల్లలకు పసి వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తే.. పెద్దయ్యాక కూడా వారు అవే అలవాట్లను కొనసాగించే అవకాశం ఉందని, తద్వారా తల్లులకు తమ పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి దిగులూ ఉండదని అంటోంది. తానూ తన ఇద్దరు చిన్నారుల విషయంలో ఇవే చిట్కాలు పాటిస్తున్నానంటూ.. పిల్లలకు అందించే ఆహారం గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో బోలెడన్ని విషయాలు పంచుకుందీ లవ్లీ మామ్.

Know More

women icon@teamvasundhara
how-to-educate-your-children-about-rape-culture

#రేప్‌ కల్చర్‌ : అబ్బాయిల్ని ఎలా పెంచుతున్నారు ?

సమాజంలో నిత్యం స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మూల కారణం స్త్రీనే అన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇందులో భాగంగానే చాలామంది తల్లిదండ్రులు కూడా అత్యాచారాల విషయంలో అమ్మాయిలతోనే ఎక్కువగా మాట్లాడుతున్నారట ! కానీ అబ్బాయిలకు అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో తెలపడం లేదట. అందుకే చాలామంది అబ్బాయిలు రేప్‌ కల్చర్‌లో భాగమవుతున్నారు. రేప్‌ కల్చర్‌ అంటే భౌతిక దాడి మాత్రమే కాదు. తమ పరుష పదజాలంతో మహిళల మనోభావాలు దెబ్బతీయడం, డేటింగ్‌లో ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ చేయడం వంటివి కూడా రేప్‌లో భాగమే. అటు విద్యలోనూ ఇటు ఆర్థికంగానూ అగ్రగామి అనిపించుకున్న అమెరికాలో సైతం ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఇలా రేప్‌కు గురవుతున్నారంటే నేటి సమాజంలో ఆడవారి పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక భారత్‌లో అయితే ఏటా పాతిక వేలకు పైగానే రేప్‌ కేసులు నమోదవుతుండగా అనధికారికంగా ఎందరో అమ్మాయిలు అత్యాచారానికి గురవుతున్నారు. మరి ఇటువంటి దారుణ పరిస్థితులకు కారణం ఎక్కడుంది ? అసలు ఈ రేప్‌ కల్చర్‌ని అంతమొందించడం ఎలా ? తెలుసుకుందాం రండి !

Know More

women icon@teamvasundhara
ways-to-stop-scary-dreams-in-children
women icon@teamvasundhara
cooking-46-dishes-in-just-58-minutes-chennai-girl-creates-new-world-record

58 నిమిషాల్లో 46 వంటకాలు... అదే ఈ కుకింగ్‌ క్వీన్‌ రహస్యం!

సాధారణంగా చిన్నారులంటే చదువు, ఆటపాటలతో ఆనందంగా గడుపుతుంటారు. కరోనా కారణంగా గత ఏడెనిమిది నెలలుగా ఇంటికే పరిమితమైన పిల్లలు అమ్మ వండి పెట్టింది తింటూ... ఫోన్‌, టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఇక ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభం కావడంతో కొద్ది సేపు పాఠాలు వింటూ, మరికొద్ది సేపు ఆటలతో కాలం గడిపేస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చెన్నైకి చెందిన ఓ చిన్నారి వంటగదిలో గరిటె తిప్పడం ప్రారంభించింది. అమ్మ సహాయంతో మెరుపు వేగంతో రుచికరమైన వంటకాలు చేయడం నేర్చుకుంది. ఈక్రమంలో ఏకంగా ‘యునికో బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది. మరి తన పాకశాస్ర్త ప్రావీణ్యంతో ప్రపంచ రికార్డులు సృష్టిస్తోన్న ఆ కుకింగ్‌ గర్ల్‌ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
effects-of-uninvolved-parenting-on-your-child

మీ పిల్లల్ని ఇలా చూడద్దు!

ముంబయికి చెందిన ఓ చిన్నారి ఆత్మహత్య చేసుకొంది. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో ఓ లేఖను కూడా రాసిపెట్టింది. అందులో.. అమ్మానాన్నలకు నేనంటే ఇష్టం లేదు అని రాసింది. ఆ అమ్మాయి పేరెంట్స్ తనకన్నా తన తమ్ముడి పట్లే ఎక్కువ శ్రద్ధ చూపించడమే దీనికి కారణమని ఆ తర్వాత తెలిసింది. తల్లిదండ్రులకు తమ పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుందో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే వారికెదురయ్యే పరిస్థితుల కారణంగా కొన్నిసార్లు ఆ ప్రేమాభిమానాలను తమ పిల్లలపై ప్రదర్శించలేకపోవచ్చు. దీనివల్ల చిన్నారులు మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే చిన్నారులకు తల్లిదండ్రుల ప్రేమ చాలా అవసరం. అది సరైన రీతిలో వారికి లభించకపోతే వారు మానసిక ఒత్తిడికి గురవుతారు.. ఒంటరితనంలో కూరుకుపోతారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు చేయిదాటిపోయే అవకాశమూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో చిన్నారుల్లో అలాంటి భావన పెరగడానికి గల కారణాలేంటో తెలుసుకొందాం..

Know More

women icon@teamvasundhara
never-mix-these-fruits-they-may-cause-health-hazards-in-children

చిన్నారులకు ఇవి పెట్టేటప్పుడు జాగ్రత్త..!

తాజా పండ్లు, కూరగాయలతో చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాటి నుంచి మనకు అందే పోషకాలు.. అనారోగ్యాన్ని మన దరి చేరనీయకుండా కాపాడతాయి. అందుకే అందరూ ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. పండ్లు, కూరగాయలే అయినప్పటికీ చిన్నారులకు వాటిని పెట్టే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా కొన్ని పళ్లు, కూరగాయలను కలిపి ఒకేసారి సలాడ్‌గా పిల్లలకు అందించకూడదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అవి విషతుల్యంగా మారి చిన్నారులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందట..! అయితే వేటిని వేటితో కలిపి చిన్నారులకు అందించకూడదో ఓసారి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
table-manners-you-should-teach-your-child

పిల్లలకు ఈ టేబుల్ మ్యానర్స్ నేర్పిద్దాం..!

పన్నెండేళ్ల చిత్రకు డైనింగ్ టేబుల్‌పై పడకుండా భోజనం చేయడం ఇప్పటికీ రాదు. ఏడేళ్ల చైతన్య మొన్నోసారి రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఫోర్క్ ఎలా ఉపయోగించాలో తెలియక ఆహారమంతా డ్రస్‌పై, టేబుల్‌పై పడేసుకొని చిందర వందర చేశాడు. ఇలాంటి సంఘటనలు మన ఇళ్లలో కూడా అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇది గమనించిన తల్లిదండ్రులు.. 'వీడికి తిన్నగా తినడం ఎప్పుడొస్తుందో.. ఏమో..!' అనుకోవడం సహజం. అయితే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పిల్లలు ఆహారం తీసుకునే సమయంలో తల్లిదండ్రులు కాస్త శ్రద్ధ వహిస్తే చాలట! నలుగురితో కలిసి భోజనం చేసేటప్పుడు ఎలా నడుచుకోవాలి? ఆహారం తీసుకునేందుకు ఉపయోగించే వస్తువుల్ని ఎలా వాడాలి..? మొదలైన విషయాలన్నీ చిన్నప్పట్నుంచే వారికి నేర్పించాలంటున్నారు నిపుణులు.

Know More

women icon@teamvasundhara
tips-to-prevent-obesity-in-teenagers-in-telugu

టీనేజ్‌లో స్థూలకాయాన్ని ఆపేదెలా?

మీ పిల్లలు చిన్న వయసు నుంచే క్రమంగా బరువు పెరుగుతున్నారా? అయితే టీనేజ్‌కి వచ్చే సరికి వారు స్థూలకాయులుగా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీనేజ్‌లోకి వచ్చే సరికి వారి శరీరంలో క్యాలరీలు కరగడం చాలా వరకు తగ్గుతుందట. ఈ సమయంలో సరైన వ్యాయామం లేకపోవడం, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం.. వంటివన్నీ ఇందుకు ముఖ్య కారణాలుగా చెబుతున్నారు వారు. కాబట్టి బరువు విషయంలో చిన్నతనం నుంచే జాగ్రత్తగా ఉండడం మంచిది. తద్వారా టీనేజ్‌లో ఎదురయ్యే స్థూలకాయం, ఇతర అనారోగ్యాల బారి నుంచి దూరంగా ఉండచ్చు. ‘ఊబకాయ వ్యతిరేక దినం’ సందర్భంగా టీనేజ్‌లో స్థూలకాయం రాకుండా ఉండాలంటే పిల్లల విషయంలో తల్లులు ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
skills-a-child-must-learn-before-turning-15

పిల్లలకు ఈ పనులు నేర్పుతున్నారా??

చరణ్ వయసు ఏడు సంవత్సరాలు.. కానీ కొత్తవారితో ఎలా మాట్లాడాలో తెలియదు.. పన్నెండేళ్ల రియాకు తన బట్టలు మడతపెట్టుకోవడం కూడా రాదు.. వీళ్లే కాదు.. చాలామంది పిల్లలకు తమకు సంబంధించిన చిన్న చిన్న పనులు కూడా చేసుకోవడం రాదు. ఇందుకు ఆయా పనులపై వారు శ్రద్ధ చూపకపోవడం ఓ కారణమైతే, చిన్నతనం నుంచే వారికి తమ తల్లిదండ్రులు ఈ పనులన్నీ నేర్పించకపోవడం మరో కారణం. అయితే పదిహేనేళ్ల వయసు వచ్చే లోపే తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని పనులు తప్పకుండా నేర్పించాలంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు. ఇంతకీ ఆ పనులు ఏంటో మీరూ తెలుసుకోవాలనుకొంటున్నారా?? అయితే ఇది చదివేయండి మరి..

Know More

women icon@teamvasundhara
physical-changes-in-girls-at-the-time-of-puberty

‘ఆ మార్పుల’ గురించి మీ అమ్మాయికి చెప్పారా?

రుతుక్రమం.. ఆడపిల్లలు బాల్యం నుంచి యుక్తవయసులోకి అడుగిడే దశకు సూచన. సాధారణంగా చాలామంది ఆడపిల్లల్లో 10 నుంచి 13 ఏళ్ల మధ్య రుతుచక్రం ప్రారంభమవుతుంది. అయితే కొంతమందికి ఇంతకంటే ముందుగానే.. అంటే దాదాపు 8 ఏళ్ల వయసులోనే లేదంటే 13 ఏళ్ల తర్వాతనైనా.. నెలసరి కావడం మొదలవ్వచ్చు. ఏదేమైనా పిరియడ్ మొదలయ్యే క్రమంలో ఆడపిల్లల శరీరంలో పలు మార్పులు చోటుచేసుకోవడం సర్వసాధారణం. తల్లులు ఆ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. వాటి గురించి వారికి వివరించడం ఎంతో ముఖ్యం. అంతేకాదు.. ఆయా సమయాల్లో పాటించాల్సిన జాగ్రత్తల గురించి వారికి అన్ని వివరాలు ముందుగానే తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదే.

Know More

women icon@teamvasundhara
home-remedies-for-dry-skin-in-children-in-telugu
women icon@teamvasundhara
tips-to-stop-breast-feeding-for-your-baby

చనుబాలు మాన్పించేదెలా..?

మోహన వాళ్ల పాపకు రెండేళ్లు. అయినా ఇంకా ఆ పాప తల్లిపాలు తాగుతూనే ఉంది. ఎంత మాన్పిద్దామన్నా అది ఆమె వల్ల కావట్లేదు. పైగా పాపకు పాలివ్వకపోతే ఆకలికి తట్టుకోలేక ఏడుపు మొదలెడుతుంది. ఘనాహారం పెట్టినా తినకుండా మొహం తిప్పేస్తుంది. పాలే కావాలంటూ అల్లరి చేస్తుంది. ఇలా కొంతమంది పిల్లలు తల్లిపాలకు అలవాటు పడి వయసు పెరిగినప్పటికీ తల్లిపాలే తాగుతామని మొండికేస్తుంటారు. ఇదిలాగే కొనసాగితే వారికి వూహ తెలిసిన తర్వాత వారితో పాలు మానిపించడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి చిన్నారులకు సంవత్సరం నుంచి ఒకటిన్నర సంవత్సరాల వయసు వరకు మాత్రమే పాలిచ్చి ఆ తర్వాత పూర్తిగా ఘనాహారాన్ని అందించమని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో పిల్లలతో పాలు మాన్పించడానికి తల్లులు ఎలాంటి నియమాలు పాటించాలి..? రండి తెలుసుకుందాం.

Know More

women icon@teamvasundhara
qualities-our-girls-can-learn-from-maa-durga-in-telugu