scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

 
category logo

చనుబాలు మాన్పించేదెలా..?

Tips to stop breast feeding for your baby

మోహన వాళ్ల పాపకు రెండేళ్లు. అయినా ఇంకా ఆ పాప తల్లిపాలు తాగుతూనే ఉంది. ఎంత మాన్పిద్దామన్నా అది ఆమె వల్ల కావట్లేదు. పైగా పాపకు పాలివ్వకపోతే ఆకలికి తట్టుకోలేక ఏడుపు మొదలెడుతుంది. ఘనాహారం పెట్టినా తినకుండా మొహం తిప్పేస్తుంది. పాలే కావాలంటూ అల్లరి చేస్తుంది. ఇలా కొంతమంది పిల్లలు తల్లిపాలకు అలవాటు పడి వయసు పెరిగినప్పటికీ తల్లిపాలే తాగుతామని మొండికేస్తుంటారు. ఇదిలాగే కొనసాగితే వారికి వూహ తెలిసిన తర్వాత వారితో పాలు మానిపించడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి చిన్నారులకు సంవత్సరం నుంచి ఒకటిన్నర సంవత్సరాల వయసు వరకు మాత్రమే పాలిచ్చి ఆ తర్వాత పూర్తిగా ఘనాహారాన్ని అందించమని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో పిల్లలతో పాలు మాన్పించడానికి తల్లులు ఎలాంటి నియమాలు పాటించాలి..? రండి తెలుసుకుందాం..
తల్లిపాలు పిల్లల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖ్యంగా వారిలో రోగనిరోధక శక్తి పెరగడానికి తల్లిపాలను మించిన ఆహారం లేదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. కాబట్టి పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తప్పనిసరిగా వారికి తల్లిపాలు పట్టడం అత్యవసరం. అది పిల్లల ఆరోగ్యానికే కాదు.. తల్లుల ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. అయితే పిల్లల ఆరోగ్యానికి చనుబాలు మంచివి కదా అని వారికి వూహ తెలిసే వరకు పాలివ్వడం కొనసాగిస్తే.. వారు ఘనాహారం తినడానికి నిరాకరిస్తుంటారు. పాల ద్వారా వారికి సరిపడా పోషకాలు అందక పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడవచ్చు. ఇక ఏడాదిన్నర దాటితే పిల్లలతో పాలు మాన్పించడం చాలా కష్టమవుతుంది. కాబట్టి పిల్లలకు సంవత్సరం తర్వాత నుంచే నెమ్మదిగా పాలు మాన్పించే ప్రయత్నం చేయాలి.

నెమ్మదిగా తగ్గించాలి.. 

పుట్టినప్పటి నుంచి పాలు తాగుతూ పెరిగిన పిల్లలతో ఒక్కసారిగా పాలు మాన్పించడం అస్సలు కుదరదు. కాబట్టి వారితో నెమ్మదిగా తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం వారికి ఎప్పటిలాగే తరచుగా పాలివ్వడం కాకుండా నెమ్మదిగా పాలిచ్చే వ్యవధిని పెంచుతూ పోవాలి. కొన్నిరోజులయ్యాక సగానికి సగం సార్లు పాలివ్వడం ఆపేయాలి. అంటే.. రోజుకు ఓ ఐదారు సార్లు పాలిస్తున్నారనుకోండి.. ఆ సంఖ్యను తగ్గించి.. రెండుసార్లకు మించకుండా చూసుకోవాలి. ఆ మధ్యలో పిల్లలకు ఆకలైనప్పుడు వారి నోటికి రుచిగా అనిపించేలా ఏదో ఒక ఘనాహారం అందించాలి. ఇలా క్రమంగా పాలు మాన్పించాల్సి ఉంటుంది.

రుచిగా అందించండి..

ఆరు నెలల వయసు దాటిన పిల్లలకు తల్లిపాలతో పాటు ఘనాహారం కూడా పెడుతుంటారు. ఇలా పెట్టడం వల్ల సంవత్సరం దాటేసరికి వారికి ఘనాహారం అలవాటైపోతుంది. కాబట్టి వారి నోటికి రుచించేలా ఉండే పులిహోర, చారు కలిపిన అన్నం, ఇడ్లీ, దోశ.. వంటి ఆహార పదార్థాల్ని తినిపించాలి. దీంతో కడుపు నిండడమే కాదు.. పోషకాలూ అందుతాయి. అలాగే ప్రస్తుతం పిల్లల కోసం మార్కెట్లో లభించే విటమిన్లు, ఖనిజాలు నిండిన పోషకాలందించే పొడుల్ని పాలలో కలిపి తాగించడం కూడా చేయచ్చు. ఇలా వారి నోటికి రుచించే ఘనాహారం, ద్రవాహారం అందించడం వల్ల వారి మనసు తల్లిపాల నుంచి ఇతర ఆహార పదార్థాల మీదకు మళ్లే అవకాశం ఉంటుంది. ఇలా క్రమంగా చేస్తే వారితో పాలు మాన్పించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయితే చిన్నారులకు పోషకాల పొడులను అందించే ముందు ఓసారి పీడియాట్రిషియన్ సలహా తీసుకోవడం మంచిది.

ఆ భావన కలగకుండా..

పిల్లల్ని తల్లిపాలకు దూరం చేసిన కొద్దీ వారు అభద్రతా భావానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిలో ఇలాంటి భావన రాకుండా ఉండాలంటే.. వారిని ఒక్కసారిగా పాలకు దూరం చేయకూడదు. దాంతోపాటు వారితో ఎక్కువ సయమం గడపాలి. ఆటపాటలు, నడక, మాటలు నేర్పడం.. వంటి వారికి కొత్తగా అనిపించే విషయాలతో వారిని ఎప్పుడూ బిజీగా ఉంచాలి. తద్వారా తల్లికి దూరమవుతున్నామనే భావన వారికి రాకుండా ఉంటుంది. ఇలా వారిలో కలిగే అభద్రతా భావాన్ని దూరం చేసినట్లయితే వారితో చనుబాలు సులువుగా మాన్పించచ్చు.

పొజిషన్ ఛేంజ్..

మంచంపై పడుకొని సౌకర్యవంతంగా పాలిస్తుంటే ఇక పిల్లలు పాలెలా మానతారు. కాబట్టి వారితో పాలు మాన్పించాలంటే వారికి సౌకర్యవంతంగా పాలివ్వడాన్ని తగ్గించాలి. ఇందుకోసం నిల్చుని లేదంటే కాళ్లపై పడుకోబెట్టుకొని కాసేపు పాలు పట్టడం.. మరికాసేపు ఎత్తుకొని అటూ ఇటూ తిరగడం.. వంటివి చేయాలి. ఇలా వారు తరచూ పాలు తాగే ప్రదేశం నుంచి వారిని దూరం చేయడం వల్ల కూడా వారు పాలు మానే అవకాశాలు కొంతవరకు ఉంటాయని చెప్పుకోవచ్చు.

సహజసిద్ధంగా..

పిల్లలతో పాలు మాన్పించడానికి సహజసిద్ధ పద్ధతుల్ని కూడా ప్రయత్నించచ్చు. అందుకోసం..
* కాకరకాయ లేదా వేపాకుల నుంచి తీసిన రసాన్ని కాసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఈ రసాన్ని పిల్లలకు పాలిచ్చే ముందు రొమ్ములకు పూసుకోవాలి. ఇందులోని చేదు వల్ల పిల్లలు పాలు తాగడానికి అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. అలాగే ఒకసారి చేసి వదిలేయడం కాకుండా తరచూ ఈ పద్ధతిని పాటించడం వల్ల కొన్ని రోజుల్లోనే పిల్లలతో పాలు తాగే అలవాటును మాన్పించచ్చు.

* వయసు పెరిగే పిల్లలతో పాలు మాన్పించడానికి శొంఠి పొడి కూడా ఉపయోగపడుతుంది. పైగా ఇది అమ్మమ్మల కాలం నుంచి ఆచరిస్తోన్న చిట్కా కూడా! శొంఠి పొడిలో కొన్ని నీళ్లు కలిపి పేస్ట్‌లాగా చేసుకోవాలి. దీన్ని పాలిచ్చే ముందు రొమ్ములకు రాసుకొని ఆ తర్వాత వారికి పాలు పట్టాలి. దీని ఘాటు వల్ల పిల్లలు మరోసారి పాలు తాగడానికి అయిష్టత చూపే అవకాశం ఉంది. ఈ పద్ధతిని తరచూ పాలిచ్చే ముందు పాటించడం వల్ల పిల్లలు త్వరలోనే పాలు మానే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పదార్థాలతో పాటు నిమ్మరసాన్ని కూడా ఉపయోగించచ్చు.

ఓ వయసొచ్చాక పిల్లలతో పాలు మాన్పించడమెలాగో తెలుసుకున్నారు కదా! మరి, మీరూ మీ పిల్లల విషయంలో ఇవన్నీ పాటించి చూడండి. ఒకవేళ ఫలితం లేకపోతే సంబంధిత పోషకాహార నిపుణుల వద్దకు తీసుకెళ్తే వారేమైనా సలహాలు సూచించే అవకాశం ఉంటుంది.





women icon@teamvasundhara
breastfeeding-tips-for-new-mothers-in-telugu

పాలిచ్చే తల్లులూ.. ఈ విషయాల్లో జాగ్రత్త!

పసి పిల్లలకు తల్లిపాలే ప్రాణాధారం అన్న విషయం తెలిసిందే. అందుకే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర్నుంచి వారికి సంవత్సరం లేదా సంవత్సరంన్నర వయసొచ్చేదాకా తల్లులు పాలిస్తూనే ఉంటారు. ఇది కేవలం బిడ్డకే కాదు.. తల్లి ఆరోగ్యానికీ ఎంతో మంచిది. అయితే ఈ సమయంలో తల్లి చేసే కొన్ని పనులు బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు.. చిన్న చిన్న అనారోగ్యాలకే మాత్రలు మింగడం, చక్కెరలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం.. వంటి వాటివల్ల చిన్నారులకూ పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే పాలిచ్చే తల్లులు కొన్ని అంశాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం ఇటు తల్లికీ, అటు పాపాయికీ.. ఇద్దరికీ మంచిది. మరి, బ్రెస్ట్‌ఫీడింగ్ మదర్స్ ఏయే విషయాల్లో జాగ్రత్త వహించాలో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
corona-virus-covid-19-hygiene-rules-for-babies-every-mom-should-follow

కరోనా నుంచి చంటి పిల్లలను కంటికి రెప్పలా కాచుకోండి!

కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వారే ఈ వైరస్ బారిన పడి డీలా పడిపోతున్నారంటే.. ఇక రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల పరిస్థితి చెప్పనక్కరలేదు. అయితే రోజుల, నెలల పిల్లలు కూడా ఈ మహమ్మారి చేతికి చిక్కుతున్నారని వింటున్నాం. అందుకే పసి పిల్లల విషయంలో తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లల వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి కనికరం లేకుండా అందరినీ కబళిస్తోన్న ఈ కరోనా వైరస్ నుంచి చంటి పిల్లలను కాపాడుకునేందుకు తల్ల్లులు ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
five-year-old-girl-sets-world-record-by-reading-36-books-in-just-two-hours

రెండు గంటల్లోపే 36 పుస్తకాలను చదివేసింది!

ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఆన్‌లైన్‌లోనే గడిపేస్తున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కంప్యూటర్లు, సెల్‌ఫోన్స్‌కే అతుక్కుపోతున్నారు. ఇక చిన్నపిల్లల సంగతైతే చెప్పక్కర్లేదు. వీడియో గేమ్స్‌ అంటూ నిత్యం సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పట్టుకుని వేలాడుతుంటారు. దీనికి తోడు కరోనా తెచ్చిన ఆన్‌లైన్ క్లాసులతో పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు పిల్లలు. ఇటువంటి పరిస్థితుల్లో అబుదాబికి చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి పుస్తకాల పురుగుగా మారిపోయింది. కేవలం రెండు గంటల్లోపే 36 పుస్తకాలను చదివేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో అతిపిన్న వయసులో వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

Know More

women icon@teamvasundhara
are-supplements-and-immunity-boosters-safe-for-kids?-here-what-experts-says?

పిల్లలకు ఇమ్యూనిటీని పెంచే సప్లిమెంట్స్‌ ఇవ్వచ్చా?

కరోనా మహమ్మారి బారిన పడకూడదంటే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అత్యవసరం అన్న విషయం తెలిసిందే! అయితే ఇందుకోసం కొంతమంది ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్‌ వాడుతున్నారు. అయితే మనలాంటి పెద్ద వాళ్ల పరిస్థితి సరే.. మరి, చిన్న పిల్లల సంగతేంటి? వారికి ఇన్‌స్టంట్‌గా ఇమ్యూనిటీని పెంచే ఈ సప్లిమెంట్స్‌ ఇవ్వచ్చా? అనడిగితే.. ఐదేళ్ల లోపు పిల్లలకైతే వద్దే వద్దంటున్నారు పిడియాట్రీషియన్స్. ఎందుకంటే దీనివల్ల అవసరానికి మించి ఇమ్యూనిటీ స్థాయులు పెరిగినా అదీ వారి ఆరోగ్యానికి ముప్పేనంటున్నారు. కాబట్టి పోషకాహారంతోనే వారి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. మరి, ఈ సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ చిన్నారులపై తీవ్ర ఇన్ఫెక్షన్లకు కారణమవుతోందని నిపుణులు హెచ్చరించిన వేళ.. పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tisca-chopra-on-her-new-book-for-young-girls-‘what’s-up-with-me?’

ఈ గుసగుసలు ఇంకెన్నాళ్లు?!

అమ్మాయి పెద్దమనిషైతే నిరాడంబరంగా వేడుక చేస్తాం.. నెలనెలా నెలసరి పలకరించినప్పుడల్లా మూగసైగలతో వారి నోరు నొక్కేస్తాం.. ఈ క్రమంలో వారి శరీరంలో జరిగే మార్పులు, ఇతర సమస్యల గురించి అడిగితే.. వారి చెవిలో గుసగుసలాడుతుంటాం.. ఇలా నెలసరిపై నెలకొన్న అపోహలు, గుసగుసలు ఇంకెన్నాళ్లు అని అడుగుతోంది బాలీవుడ్‌ అందాల తార టిస్కా చోప్రా. నెలసరి అనేది కళంకం కాదని, అది ఆడవారికి దేవుడు ప్రసాదించిన వరమని చెబుతోంది. ఇదే విషయాన్ని తల్లులు తమ టీనేజ్‌ కూతుళ్లకు వివరించాలని, అవసరమైతే తమ తండ్రులూ నిర్మొహమాటంగా ఇందులో పాలుపంచుకోవాలని.. తద్వారా ఈ సమాజంలో నెలసరిపై ఉన్న మూసధోరణుల్ని బద్దలు కొట్టే రోజు రావాలని కోరుతూ.. ‘వాట్స్‌ అప్‌ విత్‌ మీ?’ అనే పుస్తకం రాసిందామె. యుక్త వయసులోకి ప్రవేశించే అమ్మాయిలకు ప్యూబర్టీ, పిరియడ్స్‌, ఈ క్రమంలో తలెత్తే సమస్యలు-సందేహాలు.. తదితర విషయాలకు సంబంధించిన బోలెడంత సమాచారాన్ని పొందుపరిచిన తన పుస్తకం గురించి ఇటీవలే ఓ సందర్భంలో భాగంగా పంచుకుంది టిస్కా.

Know More

women icon@teamvasundhara
negative-effects-of-junk-food-on-kids-in-telugu

జాగ్రత్త... ఈ చిరుతిళ్లతో చిన్నారులకు తిప్పలే!

పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్.. వీటి పేరు చెబుతుంటూనే నోరూరుతోంది కదూ! ఇవి చూడడానికి యమ్మీగానే కాదు.. తినడానికి రుచిగా కూడా ఉంటాయి. పైగా పిల్లల మనసును ఇట్టే దోచేస్తుంటాయి కూడా! అందుకే వారు తల్లిదండ్రులతో బయటికి వెళ్తే చాలు.. ఇలాంటి ఆహార పదార్థాలు కొనివ్వమని మారాం చేస్తుంటారు. ఇక పేరెంట్సేమో.. పిల్లలు అడిగారు కదా అనో, నలుగురిలో ఇబ్బంది ఎందుకనో అడిగినప్పుడల్లా కొనిస్తుంటారు. ఇంకొంతమంది తల్లిదండ్రులైతే తమ పిల్లలకు ఇష్టమని ఇంటికొచ్చేటప్పుడు కొనుక్కురావడం, అప్పుడప్పుడు వీటిని పిల్లలకు చిరుతిళ్లుగా అందించడం.. వంటివి చేస్తుంటారు కూడా! కానీ పిల్లలు ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తినడం వారి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పిల్లలకు చిన్నతనంలోనే స్థూలకాయంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు రావడానికి ఇలాంటి పదార్థాలే కారణమంటున్నారు నిపుణులు. కాబట్టి వీటికి మీ పిల్లల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఇంతకీ ఈ చిరుతిళ్లు పిల్లల ఆరోగ్యానికి ఎలా హాని చేస్తాయో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-get-rid-of-baby-hiccups-in-telugu

పసిపిల్లలకు ఎక్కిళ్లు వస్తుంటే...

పసి పిల్లలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా, వారు ఏ విషయంలో ఇబ్బంది పడినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఆ సమయంలో అసలు వారికి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి కొత్తగా తల్త్లెన మహిళలది! అందుకే బుజ్జాయిల్ని అనుక్షణం ఎంతో జాగ్రత్తగా, కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లులు. ఈ క్రమంలో కొంతమంది అమ్మలు వారి చిన్నారులకు ఎక్కిళ్లు వచ్చినా తట్టుకోలేరు. ఇంత చిన్న పాపాయికి కూడా ఎక్కిళ్లు వస్తాయా? అంటూ సందేహిస్తారు. అయితే పుట్టినప్పటి నుంచి ఏడాది వయసొచ్చే వరకు చిన్నపిల్లల్లో ఎక్కిళ్లు రావడం సర్వసాధారణమని, దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు పిల్లల వైద్య నిపుణులు. ఇంతకీ బుజ్జాయిల్లో ఎక్కిళ్లు రావడానికి కారణమేంటి? వాటిని ఎలా అదుపు చేయాలి? వంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
how-to-give-tasty-milk-to-your-child-in-telugu

పాలు.. రుచిగా.. అందించేద్దామిలా!

పిల్లలకు పాలు బలవర్థకమైన ఆహారం అన్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే పుట్టగానే వారికి మొట్టమొదట అందే ఆహారం కూడా అదే. అయితే పిల్లలు పసితనంలో తాగే తల్లిపాల ద్వారా వారి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ అందడంతో పాటు అవి వారికి ఎంతో రుచిగానూ ఉంటాయి. కానీ పెరిగే క్రమంలో ఇచ్చే సాధారణ పాలు అంతగా రుచించక చాలామంది పిల్లలు పాలు తాగడానికి వెనుకాడుతూ.. తల్లిని పదే పదే సతాయిస్తుంటారు. ఫలితంగా పాల ద్వారా వారి శరీర ఎదుగుదలకు అందాల్సిన పోషకాలు అందకుండాపోతాయి. అలాగని వారిని పట్టించుకోకుండా వదిలేయలేం. కాబట్టి రోజూ పిల్లలు తాగే పాలు మరింత రుచికరంగా తయారు చేయాలి. అప్పుడే వారు మరింత ఇష్టంతో పాలు తాగుతారు. మరి పిల్లలకు రుచికరమైన పాలు అందించడమెలాగో తెలుసుకుందాం.. రండి.

Know More

women icon@teamvasundhara
ways-to-take-care-of-newborn-baby-in-telugu
women icon@teamvasundhara
parenting-tips-for-raising-a-single-child-in-telugu

ఒక్కరే చాలా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!

‘మేమిద్దరం మాకిద్దరు..’ అనే రోజులు పోయి.. ‘మేమిద్దరం.. మాకొక్కరు..’ అనే రోజులొచ్చాయి. ఒక్కరే చాలనుకోవడం, ఆర్థిక పరిస్థితులు, కెరీర్‌కి అధిక ప్రాధాన్యమివ్వడం.. ఇలా కారణమేదైనా ఈ తరం తల్లిదండ్రుల్లో చాలామంది ఒక్కరిని కనడానికే ఆసక్తి చూపుతున్నారు. అది ఆడైనా, మగైనా ఒక్కరితో సరిపెట్టుకుంటున్నారు. నిజానికి ఇలా తోబుట్టువు లేని పిల్లలు ఒంటరితనాన్ని అనుభవిస్తారని, వారు నలుగురితో కలవలేరని, ఇంకొకర్ని కనడమే మంచిదంటూ ఇంట్లో ఉండే పెద్ద వాళ్లు పోరు పెడుతుంటారు. అవును.. ఇలా పెద్దవాళ్లు చెప్పే మాట వాస్తవమే అంటోంది ఓ అధ్యయనం. తోబుట్టువులున్న పిల్లల్లో కంటే లేని పిల్లల్లో సోషల్‌ స్కిల్స్‌ చాలా తక్కువగా ఉన్నట్లు తేల్చింది. అలాగని మరొకరిని కనడమనేది ఆయా తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని, ఒక్కరున్నప్పటికీ వారు చురుగ్గా, నలుగురితో కలిసేలా వారిని పెంచచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
diet-tips-for-underweight-children-in-telugu

మీ పిల్లలు తక్కువ బరువున్నారా?

అధిక బరువు వల్ల ఎలాగైతే పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయో.. అలాగే బరువు తక్కువగా ఉండడం వల్ల కూడా వెంటాడే ఆరోగ్య సమస్యలు బోలెడుంటాయి. ఇది కేవలం పెద్దవాళ్లకే కాదు.. పిల్లలకీ వర్తిస్తుంది. చాలామంది తల్లిదండ్రులు వారి బుజ్జాయిల బరువు గురించి బాధపడుతూ ఉంటారు. 'మా పాప చాలా సన్నగా, బరువు తక్కువగా ఉందండీ.. దీంతో ఐదేళ్లొచ్చినా రెండేళ్లమ్మాయిలా కనిపిస్తుంది. తన బరువు పెంచాలంటే ఏం చేయాలో తోచట్లేదు.. మీకేమైనా అవగాహన ఉంటే కాస్త చెప్పండీ..' అంటూ ఇరుగుపొరుగు వారిని సలహాలు అడుగుతుంటారు. అయితే అనారోగ్యకర సలహాల వల్ల పిల్లలు బరువు పెరగకపోవడమే కాకుండా, వారి ఆరోగ్యానికీ మంచిది కాదు. కాబ