ఒక్కరే చాలా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
‘మేమిద్దరం మాకిద్దరు..’ అనే రోజులు పోయి.. ‘మేమిద్దరం.. మాకొక్కరు..’ అనే రోజులొచ్చాయి. ఒక్కరే చాలనుకోవడం, ఆర్థిక పరిస్థితులు, కెరీర్‌కి అధిక ప్రాధాన్యమివ్వడం.. ఇలా కారణమేదైనా ఈ తరం తల్లిదండ్రుల్లో చాలామంది ఒక్కరిని కనడానికే ఆసక్తి చూపుతున్నారు. అది ఆడైనా, మగైనా ఒక్కరితో సరిపెట్టుకుంటున్నారు. నిజానికి ఇలా తోబుట్టువు లేని పిల్లలు ఒంటరితనాన్ని అనుభవిస్తారని, వారు నలుగురితో కలవలేరని, ఇంకొకర్ని కనడమే మంచిదంటూ ఇంట్లో ఉండే పెద్ద వాళ్లు పోరు పెడుతుంటారు. అవును.. ఇలా పెద్దవాళ్లు చెప్పే మాట వాస్తవమే అంటోంది ఓ అధ్యయనం. తోబుట్టువులున్న పిల్లల్లో కంటే లేని పిల్లల్లో సోషల్ స్కిల్స్ చాలా తక్కువగా ఉన్నట్లు తేల్చింది. అలాగని మరొకరిని కనడమనేది ఆయా తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని, ఒక్కరున్నప్పటికీ వారు చురుగ్గా, నలుగురితో కలిసేలా వారిని పెంచచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం రండి...