scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఈ కరోనా కాలంలో నేరుగా చేత్తో తాకకుండా...

These Hand-Free Safety Gadgets are very useful in this Covid-19 Pandemic

వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా శ్రావణి తన ఇంట్లో వాష్‌బేసిన్‌ దగ్గర ఓ హ్యాండ్‌వాష్‌ బాటిల్‌ను ఏర్పాటుచేసింది. అయితే ఇంట్లో వాళ్లంతా బయటి నుంచి వచ్చి అవే మురికి చేతులతో ఆ బాటిల్‌ను తాకడం ఆమెకు నచ్చలేదు. ఈ క్రమంలోనే ఆటోమేటిక్‌ హ్యాండ్‌ సోప్‌ డిస్పెన్సర్‌ ఏదైనా ఉందేమోనని ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్స్‌లో వెతకడం మొదలుపెట్టింది.

పావనికి అతిశుభ్రత ఎక్కువ. ఏది ముట్టినా పట్టినా పదే పదే చేతులు కడుగుతుంటుంది. ఇక ఈ కరోనా సమయంలో ఆ అలవాటు మరింత ఎక్కువైంది. ఇంటి డోర్‌ తీసినా, లిఫ్ట్‌ బటన్స్‌ తాకినా, స్విచ్‌లు ఆన్‌-ఆఫ్‌ చేసినా.. ఇలా ప్రతిసారీ చేతులు కడగడం లేదంటే శానిటైజర్‌ రాసుకోవడమే పనిగా పెట్టుకుంది. అబ్బబ్బా ఇలా మాటిమాటికీ చేతులు కడుక్కోవడం కంటే ఈ పనులన్నింటికీ ఏదైనా టూల్‌ ఉంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన ఆమె మనసులో మెదిలింది.
నిజమే.. ఇలా మనం రోజూ చేసే ఎన్నో పనులు మన చేతులతో ముడిపడి ఉంటాయి. ఈ కరోనా సమయంలో మనం తాకే ప్రతిదాన్నీ శుభ్రం చేయాలంటే అసాధ్యమనే చెప్పాలి. అందుకే ఆయా ఉపరితలాలు, పదార్థాలను మనం నేరుగా చేత్తో తాకకుండా ఉండేందుకు వీలుగా విభిన్న రకాల హ్యాండ్‌-ఫ్రీ సేఫ్టీ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లో కొలువుతీరాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం రండి..
ఆటోమేటిక్‌ హ్యాండ్‌ సోప్‌ డిస్పెన్సర్‌
కరోనా రాకతో ప్రతి ఒక్కరిలో వ్యక్తిగత పరిశుభ్రత పెరిగిందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే హ్యాండ్‌వాష్‌, హ్యాండ్‌ శానిటైజర్ల వాడకం పెరిగిపోయింది. అయితే చాలామంది బాటిళ్లలో ఉండే హ్యాండ్‌వాష్‌ను ఉపయోగిస్తుంటారు. అదే బాటిల్‌ను అందరూ ఉపయోగించడం వల్ల వారి చేతులకు ఉండే క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు ఒకరి ద్వారా మరొకరికి సంక్రమించే అవకాశం ఉంటుంది. అలాగని ఇంట్లో ఉండే ఒక్కొక్కరికీ ఒక్కో శానిటైజర్‌ వాడడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు అసలు ఆ బాటిల్‌ను టచ్‌ చేయకుండా ఆటోమేటిక్‌గా శానిటైజర్‌ మన చేతిలో పడితే బాగుంటుంది కదూ! అలాంటిదే ఈ ‘ఆటోమేటిక్‌ హ్యాండ్‌ సోప్‌ డిస్పెన్సర్‌’.

safetygadgetsghg650-1.jpg
ఫొటోలో చూపినట్లుగా హ్యాండ్‌వాష్‌ బాటిల్‌లా ఉండే దీనికి కింది భాగంలో సోప్‌ లిక్విడ్‌ నింపుకునేందుకు వీలుగా ఉంటుంది. పైభాగంలో బ్యాటరీలను అమర్చుకుంటే సెన్సార్‌ సహాయంతో ఇది పనిచేస్తుంది. ఇలా చేత్తో తాకకుండా దీన్ని ఉపయోగించచ్చు. ఈ డిస్పెన్సర్‌ను ఇంట్లో వాష్‌బేసిన్‌, సింక్‌, బాత్రూమ్స్‌లలో అమర్చుకోవచ్చు. దీని ఆకృతి, డిజైన్‌ను బట్టి ధర రూ. 1,250 నుంచి రూ. 3,000 వరకు ఉంది.
మల్టీపర్పస్‌ హ్యాండ్‌-ఫ్రీ సేఫ్టీ గ్యాడ్జెట్‌
ఇతరులు తాకిన లిఫ్ట్‌ బటన్స్‌, డోర్‌ నాబ్స్‌, స్విచ్‌లు.. వంటివన్నీ మనమూ తాకడం వల్ల కరోనా వైరస్‌ సులభంగా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే లిఫ్ట్‌ బటన్స్‌, స్విచ్‌లు ఆన్‌-ఆఫ్‌ చేసుకోవడానికి టూత్‌పిక్స్‌, బైక్‌ కీ చెయిన్స్‌.. వంటివి ఉపయోగిస్తున్నారు చాలామంది. అయితే ఇవి అందరి దగ్గరా అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా ఒక్కో దాని కోసం ఒక్కో వస్తువును ఉపయోగిస్తే కంటే అన్నింటికీ ఒకే గ్యాడ్జెట్‌ను ఉపయోగిస్తే మంచిది కదా! ఆ ఉద్దేశంతోనే ఈ ‘మల్టీపర్పస్‌ హ్యాండ్‌-ఫ్రీ సేఫ్టీ గ్యాడ్జెట్‌’ను తయారు చేశారు డిజైనర్లు.

safetygadgetsghg650-2.jpg
ఫొటోలో చూపించినట్లుగా అచ్చం కీ మాదిరిగా ఉంటుందిది. ఓవైపు చేత్తో పట్టుకునేందుకు రెండు రంధ్రాలుంటాయి. మరోవైపు స్విచ్‌ ఆన్‌-ఆఫ్‌ చేసేందుకు, లిఫ్ట్‌ బటన్‌ నొక్కేందుకు, ఏటీఎంలో బటన్స్‌ని ఆపరేట్‌ చేసేందుకు ప్రెసర్‌లా ఉంటుంది. కిందివైపు డోర్‌ తీసేందుకు కొక్కెంలాంటి అమరిక ఉంటుంది. ఫొటోలో చూపించినట్లుగా ఈ ఒక్క గ్యాడ్జెట్‌తో మీరు ఇలా ఎన్నో పనులు చేయచ్చు. ఈ కొవిడ్‌-19 సమయంలో ఈ గ్యాడ్జెట్‌ ప్రతి ఒక్కరికీ బాగా ఉపయుక్తం కూడా! ఈ పరికరం డిజైన్‌, నాణ్యతను బట్టి ధర రూ. 199 నుంచి రూ. 599 వరకు ఉంటుంది.
ఫింగర్‌ క్యాప్స్‌
మనం ఇంట్లో కూడా నేరుగా చేతులతో తాకుతూ ఎన్నో పనులు చేస్తుంటాం. ముఖ్యంగా కాయగూరలు కట్‌ చేసే క్రమంలో ముందుగా వాటిని కడిగిన తర్వాత తిరిగి మళ్లీ చేతులతో తాకడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటి వారు ‘ఫింగర్‌ క్యాప్స్‌’ ఉపయోగించచ్చు.

safetygadgetsghg650-3.jpg

ఫొటోలో చూపించినట్లుగా చేతి వేళ్లకు వీటిని తొడిగేసుకొని నిరభ్యంతరంగా కాయగూరల్ని కట్‌ చేసుకోవచ్చు. అలాగే ఇవి సిలికాన్‌తో తయారుచేస్తారు కాబట్టి వీటిని వేళ్లకు తొడుక్కొని వేడిగా ఉండే పాత్రల్ని నేరుగా పట్టుకోవచ్చు. అంతేకాదు.. బీట్‌రూట్‌ వంటివి కట్‌ చేసేటప్పుడు వాటి రంగు కూడా వేళ్లకు అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడే ఈ క్యాప్స్‌ మార్కెట్లో విభిన్న ఆకృతుల్లో లభ్యమవుతున్నాయి. వాటి డిజైన్‌, నాణ్యతను బట్టి ధర రూ. 275 నుంచి రూ. 449 వరకు ఉంది.
హుక్‌డ్‌ ఆటోమేటిక్‌ మ్యాజిక్‌ ట్యాప్‌/ డ్రింక్‌ డిస్పెన్సర్‌
అసలే ఎండాకాలం.. మధ్యాహ్నమైందంటే చాలు చల్లచల్లగా ఏదైనా జ్యూస్‌ తాగాలనిపిస్తుంది. అందుకే చాలామంది ఉదయాన్నే పండ్ల రసాలు, షర్బత్‌లు చేసుకొని బాటిల్‌లో నింపుకొని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటారు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది కానీ ఆ బాటిల్‌ను అందరూ ముట్టుకుంటూ గ్లాసుల్లో పోసుకోవడం, కొందరైతే అదే బాటిల్‌తో జ్యూస్‌ తాగేయడం.. ఇలా అపరిశుభ్రంగా వ్యవహరిస్తుంటారు. ఇకపై అలా జరగకూడదంటే మీరు జ్యూస్‌ నింపిన బాటిల్‌కు ‘హుక్‌డ్‌ ఆటోమేటిక్‌ మ్యాజిక్‌ ట్యాప్‌/ డ్రింక్‌ డిస్పెన్సర్‌’ను అమర్చితే సరి.

safetygadgetsghg650-4.jpg
ఫొటోలో చూపించినట్లుగా హ్యాండ్‌వాష్‌కి అమరి ఉండే స్ప్రింగ్‌ పైప్‌లా ఉంటుందిది. దీన్ని బాటిల్‌కి క్యాప్‌లా బిగించేస్తే సరి. అలాగని జ్యూస్‌ కావాలంటే దీన్ని ప్రెస్‌ చేసే పనే లేదు. ఫొటోలో చూపినట్లుగా దీనికి పైభాగంలో ఉండే పొడవాటి ప్రెసర్‌ని గ్లాస్‌తోనే నొక్కుతూ జ్యూస్‌ని గ్లాస్‌లో నింపుకోవచ్చు. ఇలా చేత్తో టచ్‌ చేయకుండానే ఈజీగా, హెల్దీగా జ్యూస్‌ని తాగేయచ్చు. భలే ఉంది కదా ఈ గ్యాడ్జెట్‌. ఈ డిస్పెన్సర్‌ నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 359 నుంచి రూ. 499 వరకు ఉంటుంది.
కార్న్‌ హోల్డర్స్‌
మొక్కజొన్న అంటే ఇష్టపడని వారుండరు. అయితే వీటిని ఉడికించుకున్నా, కాల్చుకున్నా తినేటప్పుడు మాత్రం కాస్త కష్టపడాల్సిందే. ఎందుకంటే అవి వేడిగా ఉన్నప్పుడు నేరుగా చేత్తో పట్టుకోలేం. పైగా మన చేతులకు ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు దానికి అంటుకొని మన కడుపులోకి చేరతాయి. అలా జరగకూడదంటే ‘కార్న్‌ హోల్డర్స్‌’ చక్కటి ఎంపిక.

safetygadgetsghg650-5.jpg
ఫొటోలో చూపించినట్లుగా పట్టుకోవడానికి పిడిలా ఉండి దానికి మరోవైపు మొనదేలిన మందపాటి సూదులుంటాయి. వీటిని మొక్కజొన్నకు మొదట, చివర గుచ్చుకుంటే సరి.. మొక్కజొన్నను నేరుగా చేత్తో తాకకుండానే దాని రుచిని ఆస్వాదించేయచ్చు. ఇలాంటి హోల్డర్స్‌ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో లభ్యమవుతున్నాయి. వాటి ఆకృతి, నాణ్యతను బట్టి ఈ కార్న్‌ హోల్డర్స్‌ ప్యాక్ (4 జతలు) ధర రూ. 188 నుంచి రూ. 586 వరకు ఉంది.
బనానా స్లైసర్‌
ఏ కాలంలోనైనా దొరికే అరటిపండుతో మనం వివిధ రకాల స్వీట్లు, కేక్స్‌.. వంటివి చేసుకుంటుంటాం. అయితే మరి, అరటి పండును ముక్కలుగా కట్‌ చేయాలంటే తొక్క తీసిన పండును ఓవైపు పట్టుకొని మరోవైపు నుంచి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ రావాలి. అలా చేయడం వల్ల మన చేతులకు ఉండే బ్యాక్టీరియా, క్రిములు పండుకు అంటుకుంటాయి. అందుకే ఈసారి అరటిపండును కట్‌ చేసేటప్పుడు ‘బనానా స్లైసర్‌’ని ఉపయోగించండి.

safetygadgetsghg650-6.jpg

ఫొటోలో చూపించినట్లుగా అచ్చం అరటిపండు ఆకృతిలో ఉండి మధ్యమధ్యలో నిర్ణీత వ్యవధుల్లో చాపర్‌ స్టిక్స్‌ ఉంటాయి. ఫొటోలో చూపించినట్లుగా దీన్ని అరటి పండుపై పెట్టి ప్రెస్‌ చేస్తే సరి.. చేత్తో తాకకుండానే క్షణాల్లో పండు ముక్కలవుతుంది. ఇలా చేత్తో తాకకుండా ఇతర పండ్లను కట్‌ చేసే ఫ్రూట్‌ కటర్స్‌, స్లైసర్స్‌ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. బనానా స్లైసర్‌ నాణ్యతను బట్టి ధర రూ. 149 నుంచి అందుబాటులో ఉంది.
ఈ కరోనా కాలంలో దేన్నీ నేరుగా చేత్తో తాకకుండా పరిశుభ్రంగా ఉండాలంటే ఇలా అందుబాటు ధరల్లో లభ్యమవుతోన్న విభిన్న గ్యాడ్జెట్లను ఎంచుకోవడం ఉత్తమం. తద్వారా వైరస్‌ బారి నుంచి మనల్ని మనం కొంతవరకు కాపాడుకోవడంతో పాటు పనిని కూడా సులభతరం చేసుకోవచ్చు.. ఏమంటారు?

Photos: Amazon.in





women icon@teamvasundhara
these-kitchen-gadgets-are-very-easy-to-use-in-telugu

కిచెన్‌లో ఇవి ఉంటే.. ఇక మీ పని ఎంతో ఈజీ!

బియ్యం కడిగిన నీళ్లను వేరుచేసేటప్పుడు ఆ నీటితో పాటే కొన్ని బియ్యం కూడా సింక్‌లో పడిపోయి వృధా అవడం మనకు రోజూ ఎదురయ్యే అనుభవమే. అలాగే పాస్తాను ఉడికించిన తర్వాత ఆ నీటిని వడకట్టే క్రమంలో పాస్తా ఎక్కడ సింక్‌లో పడిపోతుందోనని అనుకునే వారూ మనలో చాలామందే! నూనెలో వేయించిన పదార్థాలు, స్నాక్స్‌ను టిష్యూ పేపర్‌లో వేసి అది ఆ నూనెను పూర్తిగా పీల్చేసుకున్నాక తినడం మనకు అలవాటే. అలా ఆ నూనె వృధా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించేవారూ మనలో లేకపోలేదు. మనం రోజూ కిచెన్‌లో వంట చేసే క్రమంలో ఇలాంటి అనుభవాలు మనకు మామూలే. మరి, ఈ క్రమంలో ఆయా పదార్థాలు వృధా కాకుండా ఉండడంతో పాటు ఈ పనులన్నీ సులువుగా పూర్తవ్వాలంటే.. అందుకోసం వివిధ రకాల కిచెన్ గ్యాడ్జెట్స్ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి. పిండిని సులభంగా జల్లించడం దగ్గర్నుంచి ఒక్క బియ్యపు గింజ కూడా కింద పడకుండా సులువుగా బియ్యం కడిగే దాకా ప్రతి పనినీ ఈజీ చేసేస్తున్నాయీ సరికొత్త కిచెన్ టూల్స్. మరి, వంటింట్లో పనిని మరింత సులభతరం చేస్తోన్న ఆ గ్యాడ్జెట్లేంటి? అవి ఎలా ఉపయోగపడతాయి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
fssai-recommends-four-simple-ways-to-reduce-oil-in-take
women icon@teamvasundhara
tips-to-celebrate-diwali-safely-amid-worries-of-covid-pandemic

కరోనా వేళ జాగ్రత్తగా ఈ దీపావళిని జరుపుకోండి!

దీపావళి... మన జీవితాల్లోని చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండగ. టపాసుల మోతలు, దివ్వెల వెలుగుజిలుగుల మధ్య ప్రతిఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఈ పండగను ఆనందంగా జరుపుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వేడుకల్లో భాగంగా చాలామంది ఒక్కరోజుతో ఆగకుండా రెండు, మూడు రోజుల పాటు టపాసులు కాలుస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మునుపటిలా లేవు. కరోనా కారణంగా పండగల సందడి తీరు మారింది. అసలే చలికాలం, అమాంతంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యం, పైగా కోరలు చాస్తోన్న కరోనా...ఇలాంటి పరిస్థితుల్లో టపాసుల వినియోగానికి సంబంధించి పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ‘పండగలే కాదు...ప్రాణాలూ ముఖ్యమే’ అంటూ సుప్రీంకోర్టు కూడా ఈ ఆంక్షలను సమర్థించింది. మరి కరోనా వేళ ఆనందాన్ని కోల్పోకుండా దీపావళిని సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
ways-to-clean-your-furniture-in-telugu
women icon@teamvasundhara
other-uses-of-sugar-for-home
women icon@teamvasundhara
simple-ways-to-reduce-salt-intake-suggested-by-fssai

ఈ చిట్కాలు పాటిస్తే వంటల్లో ఉప్పు తగ్గించుకోవచ్చు!

ఏ వంటకాల్లోనైనా సరే.. ఉప్పు, కారం సరిగ్గా ఉంటేనే దాని రుచి పెరుగుతుంది.. మన జిహ్వకూ రుచిస్తుంది. అయితే కొంతమంది వీటి డోసు పెంచి వాడుతుంటారు. మరికొంతమందైతే వారు తినే ప్రతి పదార్థంలో ఉప్పును మోతాదుకు మించి వాడుతుంటారు. ఇలా తినడం రుచిగానే ఉంటుంది కానీ ఉప్పు మితిమీరితే మాత్రం బీపీ, హైపర్‌టెన్షన్‌, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు.. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని కొన్ని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. ఇలా అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ముప్పు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఉప్పును తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలను, ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. ఈ క్రమంలోనే ఉప్పు తగ్గించుకునే మార్గాల గురించి తెలియజేస్తూ ట్విట్టర్‌లో వరుస పోస్టులు పెట్టింది.

Know More

women icon@teamvasundhara
stove-cleaning-tips-in-telugu

ఇలా చేస్తే మీ స్టవ్ తళతళలాడాల్సిందే!

మనం వంట చేసేటప్పుడు స్టవ్‌పై నూనె చిట్లడం, ఇతర ఆహార పదార్థాలు పడడం మామూలే. అయితే మరి దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే సరి.. లేదంటే జిడ్డుగా తయారవుతుంది. అలాగని రోజూ స్టవ్ కడగాలన్నా సమయం సరిపోకపోవడంతో చాలామంది మహిళలు వారానికోసారి లేదంటే మూడునాలుగు రోజులకోసారి క్లీన్ చేస్తూ ఉంటారు. దీంతో స్టవ్ జిడ్డుగా మారుతుంది. మరి, ఇలా స్టవ్‌పై పేరుకున్న జిడ్డు, ఇతర పదార్థాల అవశేషాలు సులభంగా పోవాలంటే ఏంచేయాలి.. అని ఆలోచిస్తున్నారా? అందుకు మన ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకొని.. స్టవ్‌ని తళతళలాడించేద్దామా..

Know More

women icon@teamvasundhara
tips-to-clean-the-floor-in-the-rainy-season-in-telugu

వానాకాలంలో ఫ్లోర్ ఇలా శుభ్రం చేయాలి..

ఓ పక్క ఎడతెరిపి లేని వర్షాలు.. మరోపక్క కరోనా భయంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తమవుతున్నారు. ఇక దీనికి తోడు బయటి నుంచి ఇంటికొచ్చే వాళ్ల ద్వారా బురద, క్రిములు.. వంటివన్నీ ఇంట్లోకి చేరతాయి. అందులోనూ గచ్చుపై అంటుకున్న మురికి, మరకలు ఓ పట్టాన వదలవు. అలాగని వాటిని వదిలేసి చేజేతులా అనారోగ్యాలు కొనితెచ్చుకోలేం. కాబట్టి ఈ వర్షాకాలంలో ఇంట్లోని ఫ్లోర్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిందే! తద్వారా ఇంటిని క్రిమి రహితంగా ఉంచుకోవచ్చు.. మరోవైపు కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.. అందుకోసం ఏం చేయాలో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
air-purifier-gadgets-to-refresh-your-home-in-telugu

కరోనా వేళ ఈ ఎయిర్ ప్యూరిఫయర్స్ ఇంట్లో ఉండాల్సిందే!

మొన్నటిదాకానేమో బయటికి వెళ్తే కరోనా సోకే ప్రమాదముంది.. ఇంట్లోనే ఉండమన్నారు.. ఆపై ఈ వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందన్న వార్తలూ వచ్చాయి. ఇక ఇప్పుడేమో ఇంట్లోనూ వైరస్‌ ముప్పు పొంచి ఉండచ్చని చెబుతోంది వ్యాధి నియంత్రణ నివారణ మండలి (సీడీసీ). ఒకరకంగా ఇది అందరికీ మింగుడు పడని విషయమే! ఎందుకంటే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఇల్లే మనకు సురక్షిత ప్రాంతం అనుకున్నాం.. కానీ ఇంట్లో కూడా గాలి పరిశుభ్రంగా లేకపోతే వైరస్‌ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటోంది సీడీసీ. ఇందుకు సరైన వెంటిలేషన్‌ లేకపోవడమే ప్రధాన కారణమట! మరి, మనం బయటికి వెళ్లేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే మన ప్రయత్నమంతా వృథా అయిపోతుంది. కాబట్టి ఇంట్లో గాలిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాల్సిందే! అందుకోసమే విభిన్న రకాల ఎయిర్‌ ప్యూరిఫయింగ్‌ గ్యాడ్జెట్స్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి తెచ్చుకొని ఇంట్లో అమర్చుకుంటే సరి!

Know More

women icon@teamvasundhara
easy-ways-to-reduce-excess-salt-in-curry
women icon@teamvasundhara
tips-to-retain-nutrients-while-cooking-in-telugu

ఇలా వండుకుంటే పోషకాలు తరిగిపోవు!

మనం తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. చక్కటి పోషకాహారం తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఎలాంటి వైరస్‌, బ్యాక్టీరియాకు మన శరీరం లొంగకుండా జాగ్రత్తపడచ్చు. అయితే ఇదంతా ఆహార పదార్థాల్లోని పోషకాలను శరీరం గ్రహించినప్పుడే సాధ్యపడుతుంది. అది జరగాలంటే మనం ఆహారం వండుకునే విధానంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. లేదంటే వాటిలో ఉన్న పోషకాలు నశించిపోయే అవకాశం ఉందంటున్నారు. మరి, ఆయా పదార్థాల్లోని పోషకాలు తగ్గిపోకుండా వండుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
housework-can-be-as-good-for-your-health-as-the-gym

జిమ్ముకే వెళ్ళక్కర్లేదు... ఇంటి పనులతోనూ ఫిట్ గా ఉండచ్చు!

గిరిజ 26ఏళ్ల గృహిణి. పొద్దున్న లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఇంటి పనులతో తెగ సతమతమైపోయేది. ఆ పనుల ఒత్తిడి తట్టుకోలేక పనిమనిషిని పెట్టుకుంది. ఇంటి పట్టునే ఉండే గృహిణి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ఉద్యోగాలకు వెళ్లే మహిళల సంగతి వేరే చెప్పాలా? కానీ.. ఇంటి పనులతో కూడా ఫిట్‌నెస్ సాధ్యమే.. గిన్నెలు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం.. ఇంటిని క్లీన్ చేసుకోవడం.. ఇలా మనం చేసే ప్రతి పనితోనూ ఫిట్‌గా అవడానికి వీలుంటుంది. ఇది కేవలం ఆడవాళ్లకే కాదు... మగాళ్లకూ వర్తిస్తుంది.. ఈ క్రమంలో బద్ధకాన్ని దూరం పెట్టి, పనులన్నీ చకచకా చేసుకుని ఫిట్‌గా తయారు కావడమెలాగో ఓసారి చూద్దాం..

Know More

women icon@teamvasundhara
these-household-items-with-multiple-uses
women icon@teamvasundhara
samantha-shows-how-to-use-expired-milk-on-plants-instead-of-wasting-it

women icon@teamvasundhara
different-holder-hand-sanitizers-for-women-in-telugu
women icon@teamvasundhara
simple-ways-to-disinfect-your-kitchen-during-this-corona-time

కరోనా కాలంలో కిచెన్‌ని ఇలా శుభ్రం చేయాల్సిందే!

కరోనా కారణంగా ముట్టుకున్న ప్రతి వస్తువునూ శుభ్రం చేయడం ఇప్పుడు ఆడవాళ్లకు నిత్యకృత్యమైపోయింది. ఎంత తీరిక లేకపోయినా సరే.. తీరిక చేసుకొని, ఓపిక తెచ్చుకొని మరీ ఇంటిని క్రిమి రహితంగా మార్చేస్తున్నారు. అయితే మనం రోజులో ఎక్కువ సమయం గడిపే కిచెన్‌ సంగతేంటి? కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, స్టౌ, సింక్‌.. ఇలా మనం వంట చేసే క్రమంలో ఎంత తరచుగా వీటిని ఉపయోగిస్తామో.. అంతే శ్రద్ధగా వీటిని శుభ్రం చేయాలంటోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. అలాకాకుండా సమయం లేదని, ఓపిక అంతకన్నా లేదని ఏదో పైపైన శుభ్రం చేస్తే బ్యాక్టీరియా, వైరస్‌ వృద్ధి చెందే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే కిచెన్‌ ఎలా శుభ్రం చేయాలో వివరిస్తూ ముచ్చటగా మూడు చిట్కాలను ట్విట్టర్‌లో పంచుకుందీ సంస్థ. వీటితో పాటు కిచెన్‌ను శుభ్రం చేయడానికి పాటించాల్సిన మరికొన్ని చిట్కాలేంటో చూసేద్దాం!

Know More

women icon@teamvasundhara
follow-these-simple-tips-to-make-soft-modaks-in-telugu

ఇలా చేస్తే కుడుములు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయ్!

వినాయక చవితి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే పిండి వంటకం కుడుములు/మోదక్‌. ఇవంటే ఆ పార్వతీ నందనుడికి ఎంతిష్టమో మాటల్లో చెప్పలేం! అందుకే ఈ పండక్కి ఏది చేసినా చేయకపోయినా వివిధ రకాల మోదకాలు చేసి ఆ గణనాథుడికి నైవేద్యంగా సమర్పిస్తాం. అయితే వీటిని తయారుచేయడానికీ ఓ ప్రత్యేకమైన పద్ధతుంది. పిండి కలపడం దగ్గర్నుంచి స్టఫింగ్‌ కోసం తయారుచేసే పదార్థాల దాకా ప్రతి ఒక్క దశలోనూ పకడ్బందీగా ఉండాలి. ఆయా పదార్థాల మోతాదు, స్టఫింగ్‌ తయారీ, తియ్యదనం.. వంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మనం తయారుచేసే కుడుములు ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయేలా వస్తాయి. అలా ఈ మోదకాలు మృదువుగా, రుచిగా రావాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మరి, అవేంటో చూసేద్దామా?!

Know More

women icon@teamvasundhara
flowers-for-ganesh-puja-in-telugu

విఘ్ననాయకుడికి పుష్పహారతి..!

'వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ.. నిర్విఘ్నం కురుమే దేవ.. సర్వకార్యేషు సర్వదా..' అంటూ చేయబోయే కార్యాలకు విఘ్నాలన్నింటినీ తొలగించమని ఆ బొజ్జగణపయ్యను కోరుకునే రోజు వినాయక చవితి.. ఆరోజు ఉదయాన్నే స్నానాదులు పూర్తిచేసుకొని మండపాన్ని చక్కగా అలంకరించి.. వినాయకుడిని అందులో ప్రతిష్టించి, ఏక వింశతి పత్రాలతో పూజ చేస్తాం.. అయితే ఎంత పత్రాలతో పూజించినా.. మన చిట్టిగణపయ్యను పూలతో అలంకరించకుండా ఊరుకుంటామా? లేదు కదూ.. కేవలం పత్రాల్లోనే కాదు.. గణేషుడికి ఇష్టమైన పూలల్లోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మరి, అలాంటి కొన్ని పూల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
must-have-sanitizer-gadgets-during-the-covid-19-times

ఇవి ఇంట్లో ఉంటే శానిటైజ్‌ చేయడం చాలా ఈజీ!

ఈ కరోనా ఏమో గానీ రోజులో ఎక్కువ సమయం శానిటైజేషన్‌కే సరిపోతోంది మన మహిళలకు. ఇక వృత్తి ఉద్యోగాల రీత్యా బయటికి వెళ్లొచ్చే అతివల సంగతైతే చెప్పక్కర్లేదు. అసలే ఓవైపు ఇంటి పనులతో తీరికే దొరకదంటే.. మరోవైపు తమతో పాటు తీసుకెళ్లిన వస్తువులన్నీ శానిటైజ్‌ చేసేసరికి వారికి తల ప్రాణం తోకకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ఒక్కోసారి విసుగొచ్చి ‘ఇక ఈ శానిటైజేషన్‌ నా వల్ల కాదు.. ఏదైతే అదైంది..’ అనుకొని వాటిని పక్కన పడేసేవారూ లేకపోలేదు. కానీ ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి కాస్త ఓపిక తెచ్చుకొని ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేసుకోవాలి. అయితే అందుకు కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లోని ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయడానికి విభిన్న డిస్-ఇన్ఫెక్టెంట్ గ్యాడ్జెట్స్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరల్లోనే లభించే ఆయా పరికరాల్ని ఒకసారి కొని ఇంటికి తెచ్చుకున్నామంటే ఏ వస్తువునైనా నిమిషాల్లో శుభ్రం చేసేసుకోవచ్చు. మరి, ఇంతకీ ఏంటా గ్యాడ్జెట్స్‌? అవి ఎలా పనిచేస్తాయి? రండి తెలుసుకుందాం...

Know More

women icon@teamvasundhara
juhi-chawla’s-ayurvedic-hack-for-purifying-air-is-very-useful-to-us

ఇంట్లో ఇవి ఉంటే ఎయిర్‌ ప్యూరిఫయర్‌తో పనేముంది!

కరోనా కల్లోలం మొదలైనప్పట్నుంచి పరిశుభ్రత విషయంలో మరింత అడ్వాన్స్‌ అయిపోయారు మహిళలు. ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయడంతో బిజీబిజీగా మారిపోయారు. అయితే వస్తువుల సంగతి సరే కానీ.. ఇంట్లో ఉన్న గాలిని ఎలా శుభ్రం చేయాలి..? అసలే ఈ వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. అందుకేగా మా ఇంట్లో ఎయిర్‌ ప్యూరిఫయర్‌ని ఏర్పాటుచేసుకున్నాం.. అంటారా? అయితే వేలకు వేలు డబ్బులు పోసి దాన్ని కొనే అవసరం లేకుండానే మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే ఇంటి గాలిని శుద్ధి చేసుకోవచ్చని చెబుతోంది బాలీవుడ్‌ అలనాటి అందాల తార జుహీ చావ్లా. ఈ క్రమంలోనే ఇంట్లోని గాలిని శుభ్రం చేయడానికి ఓ అద్భుతమైన ఆయుర్వేద చిట్కాను ఇటీవలే ఇన్‌స్టా వేదికగా పంచుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
kalasam-decoration-on-the-occasion-of-varalakshmi-vratham-in-telugu
women icon@teamvasundhara
high-touch-surfaces-that-you-must-clean-at-home

women icon@teamvasundhara
corona-alert-follow-these-useful-tips-by-fssai-to-keep-packaged-milk-clean

కరోనా అలర్ట్: పాల ప్యాకెట్లను ఎలా శానిటైజ్ చేయాలో తెలుసా?

ఇంటి పనులతో అలసిపోయినా, ఆఫీస్‌ పనులతో బిజీగా ఉన్నా సరే.. ఓపిక తెచ్చుకొని మరీ ఒకటికి రెండుసార్లు శుభ్రం చేస్తున్నాం. ఈ క్రమంలో నెలకు సరిపడా నిత్యావసరాలను మార్కెట్‌ నుంచి తీసుకొచ్చి ఒకేసారి శానిటైజ్‌ చేసి పెట్టుకుంటున్నాం.. అదే కాయగూరలైతే వారానికోసారి తెచ్చుకొని ఉప్పు నీళ్లు, పసుపు నీళ్లతో శుభ్రం చేస్తున్నాం. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. ఏ రోజుకారోజు తెచ్చుకునే పాల ప్యాకెట్స్‌ సంగతేంటి? ‘హా.. వాటిపై ఏముంటుందిలే..’ అంటూ చాలామంది ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. కానీ అలాంటి అలక్ష్యమే వద్దంటోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. ఈ నేపథ్యంలోనే పాల ప్యాకెట్‌ కొనడం దగ్గర్నుంచి ప్యాకెట్‌లోని పాలను మరగబెట్టే దాకా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సూచిస్తూ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో మనమూ తెలుసుకొని పాటించేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
fabrics-caring-tips-in-monsoon-in-telugu

వర్షాకాలంలో దుస్తుల రక్షణ ఇలా..

కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా వర్షాలే. ఆకాశం ఎప్పుడూ మేఘావృతమై ఉండటం వల్ల ఎండ పొడే రావడం లేదు. ఫలితంగా ఉతికిన దుస్తులు కూడా సరిగ్గా ఆరడం లేదు. అయితే కొంతమంది పూర్తిగా ఆరని దుస్తులనే మడతపెట్టి అల్మరాల్లో సర్దేస్తూ ఉంటారు. అలాగే నిత్యం కురిసే వర్షాలకు గోడలు తడిగా మారడం వల్ల ఒక్కోసారి వార్డ్‌రోబ్‌లోని దుస్తులు కూడా చెమ్మగా మారే అవకాశం ఉంటుంది. ఇలా దుస్తుల్లో తడిదనం నిలిచిపోవడం వల్ల దుస్తులు ముక్కవాసన రావడంతో పాటు వాటిలో ఫంగస్ చేరే అవకాశాలెక్కువ. మరి, ఇలాంటి దుస్తులను ధరించడం వల్ల చర్మసంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే వర్షాకాలంలో దుస్తుల్లో ఫంగస్, బ్యాక్టీరియా లాంటివి చేరకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

Know More

women icon@teamvasundhara
how-to-stop-wastage-of-food-in-your-home-in-telugu

వృథాకు చెక్ పెట్టండిలా..!

'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అంటారు పెద్దలు. అంటే మనం తీసుకునే ఆహారపదార్థాలేవైనా.. అవి భగవంతుడితో సమానమన్నమాట. కానీ మనలో చాలామంది వండేటప్పుడు ఇష్టం వచ్చినంత మోతాదులో ఆహారపదార్థాలను వండేయడం.. ఆ తర్వాత వాటిని తినలేక పడేయడం.. వంటివి ఎక్కువగా చేస్తుంటారు. అలాగే కొనుగోలు చేసే సమయంలో కూడా అవసరానికి మించి కొనుగోలు చేసేయడం.. అవి పాడైపోతే వృథాగా పారేయడం..! దీనివల్ల ఇటు విలువైన డబ్బు వృథా అవడమే కాకుండా.. ఆయా ఆహారపదార్థాలు ఎవరికీ పనికిరాకుండా పోతాయి. అందుకే ఇంట్లో ఆహారపదార్థాల వృథాకు కళ్లెం ఎలా వేయాలో తెలుసుకుంటే, వాటిని పాటిస్తూ.. ఇటు మీ బడ్జెట్‌ని, అటు ఆహారాన్ని కూడా కాపాడుకోవచ్చు.

Know More

women icon@teamvasundhara
samantha-ruth-prabhu-shows-us-how-to-make-diy-toxin-free-cleaner-at-home-the-natural-way

ఈ బయోఎంజైమ్ ని ఇంట్లోనే తయారు చేశా!

ఈ కరోనా కాలంలో శుభ్రత విషయంలో ఏమాత్రం రాజీపడట్లేదు అతివలు. సాధారణంగానే ఇంటిని అద్దంలా మెరిపించే మహిళలు.. ఇక ప్రస్తుత ప్రతికూల పరిస్థితులకు చిక్కకుండా ఇంటి పరిశుభ్రత విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నారు. ఈ క్రమంలో హోమ్‌ క్లీనర్స్‌ కోసం బోలెడన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికీ వెనకాడట్లేదు. అయితే ఇలా బయటదొరికే క్లీనర్స్‌లో ఉండే రసాయనాలు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు వాతావరణాన్నీ కలుషితం చేస్తాయంటోంది అందాల నటి సమంత. అందుకే వాటికి బదులుగా ఇంట్లోనే బయోఎంజైమ్స్‌ తయారుచేసుకొని వాడాలని అందరికీ సూచిస్తోంది సామ్‌. కరోనా కారణంగా షూటింగ్స్‌ ఏవీ లేకపోవడంతో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోన్న ఈ బ్యూటీ.. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, గార్డెనింగ్‌.. వంటి ఎన్నో విషయాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా బయోఎంజైమ్స్‌ గురించి వివరిస్తూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టిందీ అక్కినేని వారి కోడలు పిల్ల.

Know More

women icon@teamvasundhara
try-these-diy-veggie-fruit-cleaners-in-this-covid-time

పండ్లు, కాయగూరలను ఇలా శానిటైజ్‌ చేయండి!

ప్రస్తుతం కరోనా విజృంభిస్తోన్నా కొన్ని సార్లు బయటికి వెళ్లక తప్పని పరిస్థితి. వృత్తిఉద్యోగాల రీత్యా మాత్రమే కాదు.. నిత్యావసరాలు, రోజువారీ కాయగూరలు, పండ్ల కోసం ఇంట్లో నుంచి ఎవరో ఒకరు కచ్చితంగా బయటికి వెళ్లాల్సిందే! ఇలా ఇంటికి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే! మరి, ప్యాక్‌ చేసిన వస్తువులు, ఆహార పదార్థాలపైన శానిటైజర్‌ స్ప్రే చేయడం లేదంటే క్లాత్ సహాయంతో వాటిపై అప్లై చేయడం వంటివి చేయచ్చు. మరి, పండ్లు, కాయగూరల సంగతేంటి? అన్నింటిలాగే వాటిపైనా శానిటైజర్‌ స్ప్రే చేస్తే అందులోని ఆల్కహాల్‌ ప్రభావానికి పండ్లు, కాయగూరల్లోని పోషకాలు నశించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఇంట్లో సహజసిద్ధంగా తయారుచేసుకున్న ద్రావణాలతోనే వీటిని కడగాలని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ ఆ న్యాచురల్‌ క్లీనర్స్‌ని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

Know More

women icon@teamvasundhara
how-to-reuse-your-old-socks-in-telugu

సాక్స్‌ని ఇలా కూడా వాడచ్చు..!

'అబ్బబ్బా.. ఈ సాక్సు మళ్లీ కనిపించట్లేదు. ఈ నెలలో ఇది రెండోది. ప్రతిసారీ కొత్తది కొనడం, అసలేమాత్రం పాడవని ఈ సాక్స్‌లను చూస్తూ చూస్తూ పడేయడం.. ఇదో పెద్ద గోలగా మారింది..' అంటోంది ప్రియ.. ఇది కేవలం ప్రియకు మాత్రమే ఉన్న సమస్య కాదు.. మనలో చాలామంది ఎదుర్కొనేదే. సాక్సులు కొన్న తర్వాత కొన్నాళ్లకే అవి బోర్‌కొట్టేయడం.. లేదా ఒకటి బాగుండి.. మరొకటి పాడవడం.. ఒకటి పోవడం వంటివి ఎక్కువగానే జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు వాటిని పారేయడం మినహా మరే మార్గం లేదనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్లే.. ఈ సాక్సులను మరెన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
simple-kitchen-hacks-to-save-your-time-during-work-from-home

ఇలా చేస్తే కిచెన్‌లో పని ఎంతో ఈజీ!

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో చాలామందికి ఈ ఆప్షన్‌ ఎంతో సౌకర్యవంతంగా ఉందని చెప్పచ్చు. అయితే ఇలా ఎన్ని సౌకర్యాలున్నా ఆడవారికి ఇంటి పని నుంచి మాత్రం విముక్తి కలగట్లేదు. ఓవైపు ఇంటి నుంచి చేసే ఆఫీస్‌ పని, మరోవైపు ఇంటి పని చేసుకోవడం, ఇంకోవైపు పిల్లల్ని చూసుకోవడం.. ఇవన్నీ బ్యాలన్స్‌ చేయాలంటే కత్తి మీద సామే! అలాగని మరీ ఒత్తిడిగా ఫీలవ్వాల్సిన పనిలేదు. చిన్నపాటి చిట్కాలు పాటిస్తే.. అటు వంటింట్లో పనిని త్వరగా పూర్తి చేసుకోవచ్చు.. ఇటు ఇంటి నుంచి చేసే పనిని సమర్థంగా నిర్వర్తించవచ్చు.. ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
fssai-has-come-up-with-some-guidelines-on-how-to-clean-fruits-and-vegetables

పండ్లు, కాయగూరలు ఎలా కడగాలో తెలుసా?

అసలే అటు ఇంటి పనులు, ఇటు ఆఫీస్‌ పనులతో క్షణం తీరిక దొరకదు మన మహిళా లోకానికి. అలాంటిది కరోనా మహమ్మారి మన జీవితంలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఇంటి శుభ్రత విషయంలో మనం మరింత బిజీగా మారిపోయాం. బయటి నుంచి ఇంటికి తెచ్చిన ప్రతిదీ శుభ్రం చేస్తే గానీ ఇంట్లోకి తీసుకురావట్లేదు. ఈ క్రమంలో ఫుడ్‌ ప్యాకెట్స్ లేదా ఇతర ప్యాక్‌ చేసిన వస్తువులైతే శానిటైజర్‌తో శుభ్రం చేసినా పర్లేదు. మరి, కాయగూరలు, పండ్లను కూడా ఇలాగే శుభ్రం చేస్తానంటే కుదరదంటున్నారు నిపుణులు. శానిటైజర్‌లో ఉండే ఆల్కహాల్‌ వల్ల కాయగూరలు, పండ్లలోని పోషకాలు నశించే ప్రమాదం ఉండడమే అందుకు ప్రధాన కారణం. అందుకే బయటి నుంచి ఇంటికి తెచ్చిన పండ్లు, కాయగూరల్ని ఎలా శుభ్రం చేయాలో సూచిస్తూ ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)’ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అవేంటో మనమూ తెలుసుకొని ఫాలో అయిపోదామా?

Know More

women icon@teamvasundhara
did-you-wash-your-towels-regularly?

మీ టవల్స్‌ శుభ్రమేనా..?

కరోనా.. కంటికి కనిపించని ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. కేవలం భయపెట్టడమే కాకుండా ప్రజలకు పరిశుభ్రత పట్ల సరికొత్త పాఠాలను, గుణ పాఠాలను నేర్పిస్తోంది. ప్రస్తుతం కరోనాకు భయపడి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు చేతులు కడగడం అలవాటు లేని వారు కూడా ఇప్పుడు చేతుల్ని తెగ శుభ్రం చేసుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. కరోనా వైరస్‌ ఫలానా వస్తువులపై ఇన్ని గంటలు బతికుంటుందనే విషయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతూనే ఉంది. ఈ క్రమంలోనే దుస్తులు, వస్త్రాలపై కరోనా వైరస్‌ కొన్ని గంటల పాటు బతికుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తోన్న వేళ ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్‌ విషయంలో ఎంత వరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Know More

women icon@teamvasundhara
natural-fertilizers-for-plants-in-telugu

women icon@teamvasundhara
keep-wash-your-bed-sheets-in-the-time-of-corona-crisis

కరోనా వేళ.. బెడ్‌షీట్లను శుభ్రం చేస్తున్నారా..?

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి చేతులను శుభ్రంగా కడుక్కుంటున్నాం.. నోరు, ముక్కు కవరయ్యేలా మాస్కులు ధరిస్తున్నాం.. భౌతిక దూరం పాటిస్తున్నాం.. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ.. మరి ఇంట్లో బెడ్‌షీట్ల సంగతేంటి? కరోనాకు, బెడ్‌షీట్లకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? అవును.. కచ్చితంగా సంబంధం ఉంది. ఎందుకంటే చాలా వరకు శ్వాస సంబంధిత వ్యాధులకు శుభ్రంగా లేని బెడ్‌షీట్లే కారణమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే వాటిపై దుమ్ము-ధూళి పేరుకుపోవడంతో పాటు బ్యాక్టీరియా, వైరస్‌లకూ అవి ఆలవాలమవుతాయి. కాబట్టి బెడ్‌షీట్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. మరి, ఇంతకీ బెడ్‌షీట్లను ఎన్ని రోజులకోసారి శుభ్రం చేయాలి? ఎలా శుభ్రం చేయాలి? ఒకవేళ మాసిన బెడ్‌షీట్లనే వాడడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు తలెత్తుతాయి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

Know More

women icon@teamvasundhara
diy-liquid-mobile-stylus-in-telugu

మొబైల్ స్త్టెలస్ తయారుచేసేద్దాం..

టెక్నాలజీ పెరిగిపోవడంతో స్మార్ట్‌ఫోన్లను వినియోగించేవారు చాలా ఎక్కువైపోయారు. కానీ మీకు తెలుసా? మన బాత్రూంలో ఎన్ని రకాల సూక్ష్మక్రిములుంటాయో.. సెల్‌ఫోన్ తెరపైన కూడా దాదాపు అన్నే ఉంటాయట. ఈ తాకే తెరలపై ఉండే క్రిములు, బ్యాక్టీరియా కారణంగా.. మనకు వివిధ రకాల రోగాలు వచ్చే అవకాశముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే టచ్‌స్క్రీన్ ఉపయోగించడానికి చేతివేళ్లకు బదులుగా స్త్టెలస్ ఉపయోగించడం మంచిది. ప్రారంభంలో ఉపయోగించడం కాస్త ఇబ్బందిగా అనిపించినా.. అలవాటైతే అందరిలోనూ మీరే స్త్టెలిష్‌గా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయో.. వాటికోసం ఎంత ఖర్చు చేయాలో అనుకుంటున్నారా? అదేం అవసరం లేదు. తక్కువ ఖర్చుతోనే.. అందమైన లిక్విడ్ స్త్టెలస్‌ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మరి అదెలాగో తెలుసుకొందామా..

Know More

women icon@teamvasundhara
used-ground-coffee-powder-is-a-good-fertilizer-to-plants

కాఫీ పిప్పిని ఇలా కూడా వాడచ్చు..!

ఉదయాన్నే లేచి కాఫీ తాగుతూ బద్ధకాన్ని వదిలించుకొనే అలవాటున్న వారు చాలామందే ఉంటారు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి.. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కూడా కాఫీని ఆశ్రయించేవారు బోలెడంతమందే..! కాఫీ తాగడం వరకు బాగానే ఉంది.. కానీ వాడేసిన కాఫీ పొడిని వృథాగా పడేస్తూ ఉంటారు చాలామంది. అయితే ఈసారి మాత్రం అలా చేయకండి.. ఎందుకంటే కాఫీ వడకట్టగా మిగిలిన పిప్పిని పెరటి మొక్కలకు ఎరువుగా, కీటకనాశనిగా ఉపయోగించుకోవచ్చు. ఇటీవలి కాలంలో టెర్రస్, బాల్కనీలతో పాటు ఇంట్లోనూ మొక్కలను పెంచుతున్నారు. ఇలాంటి మొక్కలకు రసాయనిక ఎరువులు ఉపయోగిస్తే వాటి ప్రభావం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. అందుకే వాటికి సహజసిద్ధమైన ఎరువులు ఉపయోగించడం మంచిది. దీనికోసం ఒకసారి వాడిన కాఫీ పొడి బాగా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
the-proper-way-to-store-food-in-your-fridge-in-telugu
women icon@teamvasundhara
check-out-these-watermelon-gadgets

వాటర్ మెలన్ కోసం వెరైటీ గ్యాడ్జెట్స్..!

రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ ఎండల్లో ఎంత కాదనుకున్నా బయటికి వెళ్లక తప్పదు. పోనీ ఇంటిపట్టునే ఉందామనుకున్నా వాతావరణంలో వేడి వేధించక మానదు. ఒక్క ఏసీ గదుల్లో తప్ప మరెక్కడా ఉండలేమంటారా..? ఉండగలం..! ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా ఎండ ప్రభావం నుంచి శరీరాన్ని రక్షించుకోడానికి అనేక మార్గాలున్నాయి.. వాటిలో నోరూరించే పుచ్చకాయ ఒకటి.. చుట్టూ సూర్య ప్రతాపం చెలరేగినా..ఇది మాత్రం చల్లగా కడుపులో చేరి, ఆ వడదెబ్బ నుంచి కాపాడుతుంది. మరి అలాంటి పుచ్చకాయని క్షణాల్లో తరిగేయడానికి, పిల్లలకు నచ్చేలా రకరకాల ఆకారాల్లో కట్ చేయడానికీ రకరకాల గ్యాడ్జెట్స్ ఒచ్చేశాయి.. అవేంటో చూసేద్దామా మరి..!

Know More

women icon@teamvasundhara
benefits-of-used-lemons
women icon@teamvasundhara
tips-to-select-a-mango

సహజంగానే పండించారా?

వేసవి కాలమంటేనే భరించలేని వేడి. ఇంతటి ఉక్కపోతలోనూ అందరి దృష్టీ మామిడి పండ్లపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఎందుకంటే నోరూరించే తియ్యతియ్యటి మామిడిపండ్లు దొరికే సీజన్ ఇదే కదా..! ఎండాకాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో, రహదారుల పక్కన, సూపర్‌మార్కెట్లలో, పండ్ల దుకాణాల్లో.. ఇలా ఎక్కడ చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తాయి. చక్కటి పసుపు రంగులో మెరిసిపోయే వాటిని చూడగానే.. ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా..! అయితే ఇటీవలి కాలంలో మామిడిపండ్లు మన ఆరోగ్యానికి హానికారకంగా మారుతున్నాయి. దీనికి కారణం వాటిని త్వరగా మగ్గేలా చేయడానికి హానికారకమైన క్యాల్షియం కార్బైడ్(కార్సినోజెన్) వంటి రసాయనాలు ఉపయోగించడమే. ఫలితంగా క్యాన్సర్లకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే సహజసిద్ధమైన పద్ధతిలో పండిన వాటిని మాత్రమే తినాలి. మరి మార్కెట్లో కుప్పలు తెప్పలుగా ఉన్న కాయల్లో ఏది సహజసిద్ధంగా పండిందో.. దేన్ని రసాయనాలు ఉపయోగించి పండించారో తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
disadvantages-of-over-using-of-sanitizers-in-the-time-of-corona-crisis
women icon@teamvasundhara
keep-wash-your-bed-sheets-in-the-time-of-corona-crisis

కరోనా వేళ.. బెడ్‌షీట్లను శుభ్రం చేస్తున్నారా..?

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి చేతులను శుభ్రంగా కడుక్కుంటున్నాం.. నోరు, ముక్కు కవరయ్యేలా మాస్కులు ధరిస్తున్నాం.. భౌతిక దూరం పాటిస్తున్నాం.. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ.. మరి ఇంట్లో బెడ్‌షీట్ల సంగతేంటి? కరోనాకు, బెడ్‌షీట్లకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? అవును.. కచ్చితంగా సంబంధం ఉంది. ఎందుకంటే చాలా వరకు శ్వాస సంబంధిత వ్యాధులకు శుభ్రంగా లేని బెడ్‌షీట్లే కారణమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే వాటిపై దుమ్ము-ధూళి పేరుకుపోవడంతో పాటు బ్యాక్టీరియా, వైరస్‌లకూ అవి ఆలవాలమవుతాయి. కాబట్టి బెడ్‌షీట్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. మరి, ఇంతకీ బెడ్‌షీట్లను ఎన్ని రోజులకోసారి శుభ్రం చేయాలి? ఎలా శుభ్రం చేయాలి? ఒకవేళ మాసిన బెడ్‌షీట్లనే వాడడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు తలెత్తుతాయి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

Know More

women icon@teamvasundhara
how-to-pick-a-good-watermelon

నాణ్యమైన పుచ్చకాయని గుర్తించేదెలా?

నోరూరించే, ఆరోగ్యాన్ని పంచే సమ్మర్ ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో పుచ్చకాయ ఒకటి. దాదాపు 95 శాతం నీటిని నింపుకున్న ఈ పండును వేసవిలో రోజూ తింటుంటాం.. తద్వారా వేసవి వేడిని దూరం చేసుకొని, శరీరానికి చల్లదనాన్ని అందిస్తాం. అంతేకాదు.. శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుకోవడానికీ ఈ పండును మించింది మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ పండును కొనేటప్పుడు ఏది పడితే అది కాకుండా.. కొనేముందు కొన్ని అంశాల్ని దృష్టిలో ఉంచుకుంటే.. పండు రుచిని ఆస్వాదించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
tips-to-make-your-home-more-hygienic