బాలీవుడ్ ముద్దుగుమ్మ షమితా శెట్టి పువ్వులపై సీతాకోకచిలుకలు ఉన్న డిజైన్ దగ్గర దిగిన పోస్ట్ చేసింది. దీనికి ‘ప్రేమ సీతాకోకచిలుక లాంటిది.. అది ఇష్టపడే చోటుకు వెళుతుంది.. ఎక్కడికి వెళ్లినా ఆహ్లాదం కలిగిస్తుంది.. అని రాసుకొచ్చింది. దీనికి సీతాకోకచిలుకలాంటి అమ్మాయి, ప్రేమ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
టాలీవుడ్ నటి రాశీఖన్నా పచ్చని ప్రకృతిలో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఇదే అందమైన జీవితం’ అని చెప్పుకొచ్చింది.
‘కొత్తబంగారు లోకం’ నటి శ్వేతాబసు ప్రసాద్ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
తెలుగు తార అంజలి ‘త్రోబ్యాక్’ అంటూ వెగాస్‌లో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
టాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో బీచ్ దగ్గర నవ్వుతున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘నవ్వడమే నా రోజువారీ థెరపీ’ అని చెప్పుకొచ్చింది.
అందాల తార పాయల్ ఘోష్ తన ఫొటోని అభిమానులతో పంచుకుంటూ ‘ఒక్కసారి మీరు భయాన్ని పారదోలితే.. మీ జీవితం పరిమితులు లేకుండా సాగుతుంది’ అని రాసుకొచ్చింది.
బాలీవుడ్ నటి అమైరా దస్తూర్ పచ్చని గార్డెన్ లో కూర్చున్న తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘స్వచ్ఛమైన గాలి, సూర్యరశ్మి వంటి వాటికి ఎప్పటికీ ప్రత్యామ్నాయం లేదు' అని చెప్పుకొచ్చింది.
అందాల తార శిల్పా శెట్టి ‘త్రో బ్యాక్’ అంటూ బీచ్ దగ్గర దిగిన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘బాధలు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు.. కానీ అవి నన్ను నేను మరింత దృఢంగా మార్చుకోవడానికి ఒక ఇంధనంగా ఉపయోగపడ్డాయి’ అని రాసుకొచ్చింది.
బాలీవుడ్ తార సన్నీ లియోని భూతల స్వర్గమైన కేరళలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...