అందాల తార అనిత ఇటీవలే పండంటి బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన భర్తతో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘అలా మేము ముగ్గురమయ్యాం.. ఎంతో ఆనందంగా ఉంది.. శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు’ అంటూ ‘న్యూ మమ్మీ డాడీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.
టాలీవుడ్ తార లక్ష్మీ రాయ్ తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మీ ప్రతి ఆలోచన మీ నుంచి వచ్చింది కాదు’ అని చెప్పుకొచ్చింది.
నటి సురభి ‘శశి’ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌కి హాజరైన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ భామ రేణూ దేశాయ్ తన కాశీ యాత్రలో భాగంగా దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
తెలుగు భామ అంజలి ‘శుభ వారాంతం’ అంటూ తన తాజా ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి ‘మాటల్లో ఎప్పటికీ చెప్పలేని భావాలను కళ్లు చెప్పేస్తాయి’ అనే వ్యాఖ్యని జోడించింది.
తెలుగు తార సమీరా రెడ్డి తన అత్తతో గాలెంటైన్స్ డే జరుపుకొంది. ఈ సందర్భంగా ‘గాలెంటైన్స్ డే అంటే ఏంటో తెలుసా? దీనిని వేలంటైన్స్ డేకి ముందు రోజు జరుపుకొంటారు. ఈ రోజుని స్నేహితురాళ్లతో కానీ, నాలాగా అత్తగారితో గానీ జరుపుకొంటారు’ అంటూ ‘గర్ల్ పవర్’ హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.
నటి అనన్యా పాండే ఛార్మీ పెట్‌తో సరదాగా గడిపింది.
టాలీవుడ్ బ్యూటీ రమ్యకృష్ణ తన భర్త, కొడుకుతో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘మా అబ్బాయి రిత్విక్ కృష్ణ 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు.. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా..’ అని రాసుకొచ్చింది.
కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ చిన్నప్పుడు తమ బామ్మతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను పోస్ట్ చేశారు. వాటిని చూసేద్దామా...