నటి హిమజ పోలీసు గెటప్‌లో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఇది నా డ్రీమ్’ అని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ భామ ఛార్మీ కౌర్ ‘లైగర్’ చిత్రానికి సంబంధించిన పోస్టర్ని అభిమానులతో పంచుకుంది. అంతేకాదు.. ఈ చిత్రం సెప్టెంబరు 9న విడుదల కానుందని తెలిపింది. ఛార్మీ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ఇంట్రో సాంగ్‌కి స్టెప్పులేసిన వీడియోని పోస్ట్ చేసింది.
తెలుగు భామ అంజలి ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటూ జాగింగ్ చేస్తోన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి సిమ్రత్ కౌర్ తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్జి రోజా తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి సాయేషా సైగల్ తన భర్తతో సరదాగా దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఈ జీవితమంతా ఇలా నీతో నవ్వుతూ గడపాలనుకుంటున్నాను’ అనే వ్యాఖ్యని జోడించింది.
తెలుగు భామ సమీరా రెడ్డి ‘త్రోబ్యాక్’ అంటూ గతంలో తాను నటించిన చిత్రంలోని ఫొటోని పోస్ట్ చేసింది.
గాయని మంగ్లీ మాస్ పాటలతో పాటు సంప్రదాయ పాటలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ‘స్నేహితుడా.. స్నేహితుడా..’ పాటను పాడుతూ.. ఈ పాటంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసేద్దామా...!