బాలీవుడ్ సుందరి అమీషా పటేల్ ‘షూట్ మోడ్’ అంటూ తన ఫొటోని పోస్ట్ చేసింది.
నటి జెనీలియా తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘రెక్కలున్నాయి.. ఇక ఎగరడమే తరువాయి!’ అని రాసుకొచ్చింది.
టాలీవుడ్ భామ రాశీ ఖన్నా ‘నెఫ్యూ లవ్’ అంటూ తన మేనల్లుడిని ఒళ్లో కూర్చొబెట్టుకున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘నా మేనల్లుడిని ప్రేమించినట్టే మిగతా వారిని కూడా ప్రేమిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. హ్యాపీ బర్త్‌డే నీల్! లవ్ యూ సో మచ్!’ అని చెప్పుకొచ్చింది.
నటి తాప్సీ వైవిధ్యమైన హెయిర్‌స్టైల్‌తో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మీరు చివరిసారిగా చేసిన కొత్త పనేంటి?’ అని అభిమానులను అడిగింది.
టాలీవుడ్ బ్యూటీ అనూ ఇమ్మాన్యూయేల్ చీరకట్టులో అందంగా దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
తెలుగు భామ అంజలి ‘పోలో డైరీస్’ అంటూ తన పెట్ని ముద్దాడుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది.
మిల్కీ బ్యూటీ తమన్నా జిమ్‌లో ఉన్న ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మనం ఏదైతే నమ్ముతామో మన శరీరం కూడా అదే చేస్తుంది’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ ‘ష్’ అంటోన్న ఫొటోని పోస్ట్ చేస్తూ ‘రేపు సాయంత్రం 6:30 గంటలకు ఇన్‌స్టా లైవ్ చాట్‌లో మీకో ప్రత్యేకమైన వార్తను చెప్పబోతున్నా.. అందరం అక్కడ కలుసుకుందాం..’ అని రాసుకొచ్చింది.
సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘నేను మాటలతో చెప్పలేకపోయినా.. మీరు కళ్లతో అర్థం చేసుకుంటారనుకుంటున్నా!’ అంటోంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేయండి...