గాయని సునీత తన పిల్లలతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
నటి మంజిమా మోహన్ నవ్వుతోన్న తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘జీవితమంటే కొన్ని వేల చిన్న చిన్న అద్భుతాల సమూహం.. వాటిపై దృష్టిపెట్టండి’ అని రాసుకొచ్చింది.
సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి ‘మరొకరిలా గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారంటే.. మిమ్మల్ని మీరు కోల్పోవడమే’ అని రాసుకొచ్చింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ జీరో నంబర్ ఉన్న జెర్సీ ధరించిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘జీరో నా హీరో’ అనే వ్యాఖ్యని జత చేసింది.
బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్ తన భర్తతో దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ తన భర్తకి 6వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపింది.
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ‘స్టార్ మహిళ’ కార్యక్రమం చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు కొంతమంది స్టార్ మహిళలు ఓ బహుమతిని ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ ‘నా ప్రియమైన స్టార్ మహిళలు...మీరు నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? అందుకే నా తుది శ్వాస వరకు మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటాను. లవ్ యూ ఆల్’ అని రాసుకొచ్చింది.
అందాల భామ సిమ్రత్ కౌర్ మనాలీలో విహరిస్తోంది. ఆ ట్రిప్‌కి సంబంధించిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఈ అందమైన ప్రదేశాన్ని విడిచి పెట్టాలనిపించడం లేదు’ అని రాసుకొచ్చింది.
బాలీవుడ్ తార మల్లికా శెరావత్ బెడ్‌పై ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘బద్ధకంగా ఉంది.. బెడ్‌పై నుంచి లేవాలనిపించడం లేదు’ అని రాసుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసేద్దామా...