బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్కా శర్మ ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. తాజాగా తన భర్త, పాపతో కలిసి దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
అందాల భామ సన్నీ లియోని సినిమా సెట్లో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
టెన్నిస్ తార సానియా మీర్జా తన భర్తతో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
అలనాటి తార సుహాసిని ఓ ‘ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’లో విద్యార్థులకు సినిమా పాఠాలు నేర్పుతోంది. ఈ సందర్భంగా తన విద్యార్థులతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
దక్షిణాది తార అమలా పాల్ విమానంలో కూర్చున్న ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ప్రేమంటే మనల్ని ఎక్కువగా బాధించే, అసలు బాధించని వ్యక్తులను వెతకడమేమో’ అనే కొటేషన్ని అభిమానులతో పంచుకుంది.
సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి ‘చావు కబురు చల్లగా..!’ సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా సినిమా రిలీజ్ పోస్టర్ని అభిమానులతో పంచుకుంది.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ‘సెల్ఫీ దిగి చాలా రోజులవుతోంది’ అంటూ ఓ సెల్ఫీని పోస్ట్ చేసింది.
అందాల తార నిక్కీ గల్రానీ సినీ పరిశ్రమకి పరిచయమై ఏడేళ్లవుతోంది. ఈ సందర్భంగా తనను ఆదరిస్తోన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ తాను నటించిన సినిమాల్లోని వివిధ పాత్రల ఫొటోలను కొలేజ్ చేసి పోస్ట్ చేసింది.
‘చందమామ’ కాజల్ అగర్వాల్ తన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఐ కాంటాక్ట్ ప్రమాదకరమైనది.. కానీ చాలా అందమైనది’ అనే వ్యాఖ్యని జోడించింది.
మెగా డాటర్ నిహారిక స్కూబా డ్రైవింగ్ చేసిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఈ నిశ్శబ్ద ప్రపంచం.. మనసుని ఉల్లాసపరుస్తుంది’ అనే వ్యాఖ్యని జోడించింది.
యాంకర్, నటి ఝాన్సీ ‘పెళ్లి సందడి 2’ సెట్లో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...