సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార సముద్రపు ఒడ్డున బీచ్జంప్ చేస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఉత్సాహంగా ఉన్నప్పుడు బీచ్జంప్ తప్పనిసరి’ అనే వ్యాఖ్యని జోడించింది.
అందాల తార లక్ష్మీ రాయ్ ‘ప్రతిరోజూ మనకు మరో అవకాశం లాంటిది!’ అని చెప్పుకొచ్చింది.
‘బిగ్‌బాస్’ బ్యూటీ పునర్నవి భూపాలం తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ఇంట్రో సాంగ్‌కి స్టెప్పులేసిన వీడియోని పోస్ట్ చేసింది.
అందాల భామ క్యాథరిన్ ట్రెసా తన స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
నటి, నిర్మాత మంచు లక్ష్మి మాల్దీవుల్లో విహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల భామ భానుశ్రీ తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మొదట మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెడితే మిగతావన్నీ అవే దారిలోకి వస్తాయి’ అని అర్థం వచ్చే వ్యాఖ్యని జోడించింది.
బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే తన స్నేహితులతో దిగిన చిన్నప్పటి, ప్రస్తుత ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
గాయని సునీత.. మరో సింగర్ సిద్ శ్రీరాంతో పాటు తన పిల్లలతో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.
టాలీవుడ్ భామ నందితా శ్వేతా ‘పెట్ లవర్’ అంటూ ఓ తాబేలును నీటిలో వేస్తున్నట్టుగా తీసిన వీడియోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...