అందాల తార మీనా ‘నో మేకప్ (కలర్ లిప్‌బామ్‌ని మేకప్ అనుకోకండి).. నో ఫిల్టర్’ అంటూ తను తాజాగా దిగిన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది.
సింగర్ సునీత తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి అనూ ఇమ్మాన్యూయేల్ ‘స్టోనర్’ అనే పుస్తకాన్ని చదువుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఇది నాకిష్టమైన పుస్తకాల్లో ఒకటవుతుందని నేను ఊహించలేదు. ఇది చాలా భిన్నమైన పుస్తకం.. దీనిని ఎంతో చక్కగా రాశారు’ అని చెప్పుకొచ్చింది. అలాగే ‘ప్రతి మనిషి జీవితంలో యుద్ధాలు జరుగుతాయి. వాటిలో విజయాలతో పాటు ఓటములు కూడా ఎదురవుతాయి. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..!’ అంటూ తన క్యాప్షన్‌ను ముగించింది.
‘మహానటి’ కీర్తి సురేశ్ తన పెట్ని హగ్ చేసుకుంటోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘గుడ్ బై చెప్పడం ఎంతో కష్టంగా ఉంటుంది.. ఇక నా పెట్‌కి చెప్పాల్సి వస్తే ఇంకా కష్టంగా ఉంటుంది. పనిలో భాగంగా ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా ఇలాగే బాధపడుతున్నా. మళ్లీ తిరిగొచ్చిన తర్వాత హగ్ చేసుకుంటాను. మిస్ యూ బేబీ. నీతో గడిపే ప్రతిరోజూ నాకు హగ్ డేనే!’ అంటూ తన పెట్‌పై ఉన్న ప్రేమను చాటుకుంది కీర్తి.
బాలీవుడ్ నటి షమితా శెట్టి తన స్నేహితులతో కలిసి పచ్చని ప్రకృతి మధ్యలో చెట్టు కింద కూర్చున్న ఫొటోని పోస్ట్ చేసింది.
‘జబర్దస్త్’ జడ్జి, ఎమ్మెల్యే రోజా తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
యాంకర్ సుమ కనకాల ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ‘ఫ్లోర్‌ని శుభ్రం చేసేవాళ్లు ఉన్నా.. తొందరగా శుభ్రం చేయడానికి ఓ వినూత్న పద్ధతిని కనుగొన్నా’ అంటూ చెప్పుకొచ్చింది. మరి ఆమె ఫ్లోర్‌ని ఎలా శుభ్రం చేస్తోందో మీరే చూడండి...
బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ ‘త్రోబ్యాక్’ అంటూ గార్డెన్లో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ప్రకృతితో మమేకమైనప్పుడు మనం కోరిన దానికంటే ఎక్కువే పొందగలుగుతాం’ అని జాన్ మ్యూయిర్ అనే ప్రముఖ మౌంటెనీర్ చెప్పిన కొటేషన్‌ని రాసుకొచ్చింది.
గాయని కౌసల్య తన తల్లిదండ్రుల పాత ఫొటోని అభిమానులతో పంచుకుంది.
మిల్కీ బ్యూటీ తమన్నా జిమ్‌లో వ్యాయామం చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది.
నటి హిమజ ఓ వీడియోని పోస్ట్ చేస్తూ ‘నచ్చిన వృత్తిని ఎంచుకుంటే.. జీవితంలో ఒక్క రోజు కూడా పని చేశామన్న ఫీలింగ్ రాదు!’ అని రాసుకొచ్చింది.
అందాల భామ ఊర్వశీ రౌతెలా వయ్యారంగా నడుస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని ఓసారి చూద్దాం రండి...