బుల్లితెర నటి సుజితా ధనుష్ చీరకట్టులో దిగిన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో విహరిస్తోంది. ఈ సందర్భంగా తమ ట్రిప్‌కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ ‘చాలా రోజుల నుంచి ఈ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాను. చివరికి మంచి లొకేషన్‌కి చేరుకున్నాం. మాల్దీవుల్లోని అందమైన ప్రదేశాలు, సాగర సోయగాలను చూడకుండా ఉండలేకపోతున్నాను’ అని రాసుకొచ్చింది.
అందాల భామ రేణూ దేశాయ్ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘నిజంగా మిమ్మల్ని సంతోషంగా ఉంచేవి ఏమిటంటే నా సమాధానం- మంచి భోజనం, ప్రియమైన వారి ప్రేమాభిమానాలు. డబ్బు, కెరీర్లో విజయం సాధించడం కూడా ముఖ్యమే.. కానీ ఎప్పటికీ చిన్న చిన్న ఆనందాలే మన మనసును సంతోషంగా ఉంచుతాయి’ అని రాసుకొచ్చింది.
జనవరి 22 నటి నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లింది. ఈ క్రమంలో జర్నీలో భాగంగా హైదరాబాద్ నుంచి దుబాయ్ వరకు వెళ్లిన కొన్ని ఫొటోలను నమ్రత కూతురు సితార ‘అమ్మ బర్త్‌డే డైరీస్’ అంటూ అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోలను ఓసారి చూసేద్దామా...
తెలుగు భామ సమీరా రెడ్డి 7వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తమ పెళ్లి సమయంలో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి సమంత అక్కినేని తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఓపికగా ఎదురుచూసే వారికి మంచి రోజులు తప్పకుండా వస్తాయి’ అని చెప్పుకొచ్చింది.
జర్మన్ బ్యూటీ ఎవ్లీన్ శర్మ ‘సాహో’ షూటింగ్ సందర్భంగా దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘‘సాహో’తో సాగిన నా ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. ఆ షూటింగ్ రోజులను ఎంతో మిస్సవుతున్నాను’ అని రాసుకొచ్చింది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ఇంట్రో సాంగ్‌కి స్టెప్పులేసిన వీడియోని పోస్ట్ చేసింది.
టాలీవుడ్ భామ అవికా గోర్ ‘షూటింగ్ ప్రారంభమైంది’ అంటూ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...