టెన్నిస్ తార సానియా మీర్జా తన బాబు ఇజాన్‌తో కలిసి దిగిన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది.
టాలీవుడ్ నటి రమ్యకృష్ణ తన ముందున్న వంటకాన్ని చూస్తున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘తినాలా? వద్దా?.. ఈ సందిగ్ధం ఎప్పటికీ తేలదు!’ అని రాసుకొచ్చింది.
అందాల తార అమలా పాల్ ‘ఇషా ఫౌండేషన్’ దగ్గర దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
అందాల తార రేణూ దేశాయ్ కాశీ యాత్రలో ఉంది. ఈ సందర్భంగా దిగిన ఫొటో, వీడియోలను పోస్ట్ చేసింది.
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ కఠినమైన వ్యాయామం చేస్తూ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఎంత కష్టపడితే అంత బలంగా మారతాం.. కాబట్టి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి. తప్పులు చేయండి.. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని మిమ్మల్ని మీరు దృఢపరచుకోండి. మీకు మీరే స్ఫూర్తిగా నిలవండి!’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టింది.
అందాల తార మల్లికా శెరావత్ లిప్‌స్టిక్ పెట్టుకుంటోన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ బ్యూటీ తేజస్వీ మదివాడ పెయింటింగ్ వేస్తున్నట్టుగా దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ముందు మీరు ఈ పెయింటింగ్‌కి ఒక చక్కటి క్యాప్షన్ ఇవ్వండి.. దీని గురించి నా మనసులో ఉన్న భావమేంటో ఆ తర్వాత నేను మీకు చెబుతాను!’ అని రాసుకొచ్చింది.
అందాల తార సిమ్రత్ కౌర్ మంచుతో సరదాగా ఆడుకుంటోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
దక్షిణాది తార శృతి హాసన్ పియానో వాయిస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది.
గాయని సునీత ‘కాఫీ టైమ్’ అంటూ కాఫీ తాగుతోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...