టాలీవుడ్ భామ ఛార్మీ కౌర్ రాత్రి వేళలో జిమ్ చేస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘రోజంతా తీరిక లేకుండా గడపడంతో జిమ్ చేయడానికి రాత్రి సమయమే దొరికింది’ అని రాసుకొచ్చింది.
తెలుగు భామ సమీరా రెడ్డి గతంలో తన పాపతో దిగిన ఫొటోని ఇప్పుడు పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘నేను నా 40వ ఏట గర్భం ధరించాను. గర్భిణిగా ఉన్న సమయంలో ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉన్నప్పటికీ ఆ ప్రయాణంలో ఎదురయ్యే మధురానుభూతులు దాదాపు అందరికీ ఒకేలా ఉంటాయి. కాబట్టి ఏ వయసులో ఉన్నా, ఏ దశలో ఉన్నా నిర్ణయాలు తీసుకోవడానికి భయపడకండి’ అని చెప్పుకొచ్చింది.
అందాల తార అంజలి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే ‘2021లో కొత్త ఆలోచనలు’ అంటూ తెల్లటి కాగితాలు పట్టుకున్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘వెనక్కి వెళ్లలేం.. మొదలైన దాన్ని మార్చలేం.. కానీ మీరు మొదలుపెట్టిన పనిని ఎలా ముగించాలన్నది మాత్రం మీ చేతుల్లోనే ఉంది..’ అంటూ కొత్త సంవత్సరం, కొత్త తీర్మానాలు అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ మట్టి పాత్రలు తయారు చేస్తోన్న ఫొటోలు, వీడియోని పోస్ట్ చేసింది.
సూపర్‌స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార పూల మధ్య దిగిన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఈ పూలలాగే మీ రోజు ప్రకాశవంతంగా, రంగులమయంగా గడవాలని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చింది.
‘కంచె’ భామ ప్రగ్యా జైస్వాల్ ‘తీర్మానాలు తీసుకోకండి.. అనుకున్న లక్ష్యం చేరుకోండి!’ అని అంటోంది.
తెలుగు తార నందినీ రాయ్ ‘తెలుగింటి అమ్మాయి’ అంటూ అచ్చ తెలుగు ఆడపిల్లలా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
కొత్త జంట నిహారిక, చైతన్యలు తమ హనీమూన్‌ని మాల్దీవుల్లో గడుపుతున్నారు. ఈ సందర్భంగా సముద్రపు ఒడ్డున దిగిన తమ అందమైన ఫొటోలను నిహారిక తన అభిమానులతో పంచుకుంది. దీనికి ‘పైన ఆకాశం.. కింద ఇసుక.. నడుమ ప్రశాంతత కలగలిసిన అందమైన ప్రదేశం ఇది!’ అని రాసుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...