‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తన తాజా ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘2020 ఎలా గడిచినా.. కొత్త సంవత్సరంలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్దాం..’ అంటూ చెప్పుకొచ్చింది.
మహేష్ బాబు గారాల పట్టి సితార తన ప్రాణ స్నేహితురాలు ఆద్యతో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
తెలుగు భామ అంజలి ‘2021 కోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ న్యూ ఇయర్ హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.
బాపూ బొమ్మ స్నేహ తన స్నేహితులతో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఈ ఏడాది అందరికీ ఎంతో కఠినంగా గడిచినా.. ఎన్నో విషయాలను నేర్పింది. ప్రియమైన వారితో గడపడం, దయతో మెలగడం, జీవితాన్ని ఆస్వాదించడం.. ఇవన్నీ ఈ ఏడాది నేర్చుకున్న పాఠాలే!’ అంటూ రాసుకొచ్చింది.
అందాల భామ ఆదా శర్మ తన తాజా వీడియోని పోస్ట్ చేస్తూ ‘కౌంట్‌డౌన్ మొదలైంది.. ఈరోజు రాత్రికి మీ ప్లాన్స్ ఏంటి?’ అని అభిమానులను అడుగుతోంది.
బాలీవుడ్ సుందరి నేహా ధూపియా ‘బై’ చెబుతున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతున్నా..’ అంటూ ఓకే బై’, ‘2020’ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
బాలీవుడ్ నటి మలైకా అరోరా తన పెట్‌తో సరదాగా దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
అందాల తార కరీనా కపూర్ తన భర్త, కొడుకుతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
‘మహానటి’ కీర్తి సురేశ్ ‘స్పెయిన్ డైరీస్’ అంటూ గతంలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో తాజాగా సూర్యాస్తమయ సమయంలో దిగిన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఈ సీన్ నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంది..’ అని క్యాప్షన్ రాసుకొచ్చిందీ టాలీవుడ్ బేబ్.
టాలీవుడ్ నటి ఈషా రెబ్బా తన తాజా ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘ఈ సంవత్సరం చివరి రోజు వచ్చేసింది... 2021కోసం ఎదురు చూస్తున్నాను. వచ్చే సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చింది.
అందాల తార ప్రగ్యా జైస్వాల్ ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌లో భాగంగా మూడు మొక్కలను నాటిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
చెన్నై బ్యూటీ రెజీనా తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘2021 ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను మారుస్తుందా?లేక కొనసాగిస్తుందా?’ అని అర్థం వచ్చేలా వ్యాఖ్యని జోడించింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...