టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ప్రేమతో, మంచి ఆలోచనలతో ముందుకు సాగితే ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటారు’ అని చెప్పుకొచ్చింది.
‘మనల్ని మనం నమ్ముకోవడమే విజయానికి తొలి మెట్టు’ అని చెబుతోంది వితిక.
అందాల తార రేణూ దేశాయ్ ‘షూట్ డైరీస్’ అంటూ చిన్న పిల్లలా గిరగిరా తిరుగుతున్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
తెలుగు భామ నందినీ రాయ్ బైక్‌పై కూర్చున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘జీవితమే ఒక ప్రయాణం.. దానిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోండి’ అని చెప్పుకొచ్చింది.
గాయని సునీత తన తల్లితో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. 'నాకు బెనారస్ చీరలతో పాటు, నా పక్కనున్న మా అమ్మ, ఈ ఫొటో తీసిన మా చెల్లి అంటే ఎంతో ఇష్టం' అని క్యాప్షన్ ఇచ్చింది.
కన్నడ భామ నిక్కీ గల్రానీ ఇషా యోగా సెంటర్‌ని సందర్శించింది. ఈ సందర్భంగా సద్గురుతో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మీలోని అద్భుతాన్ని, సంతోషాన్ని హరించేందుకు ఎవ్వరికీ, దేనికీ అవకాశమివ్వకండి' - అంటూ మీరు చెప్పిన ఈ మాటల్ని, ఈ రోజుని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ధన్యవాదాలు సద్గురు’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ బ్యూటీ మల్లికా శెరావత్ కేరళలో దిగిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘నాకు ఇష్టమైన ప్రదేశం’ అనే వ్యాఖ్యని జోడించింది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పెళ్లి సందర్భంగా దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
అందాల భామ జెనీలియా తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘సంతోషకరమైన జీవితం ఎక్కడా దొరకదు.. దానిని సృష్టించుకోవాలి' అని చెప్పుకొచ్చింది.
‘వదిలేయకుండా ఉంటే ఏం జరుగుతుందో చూడాలని ఉంది. 2021 కోసం రడీగా ఉన్నాను’ అంటూ టాలీవుడ్ బ్యూటీ సమంత తన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ స్కూల్ యూనిఫాం ధరించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ సుందరి కరీనా కపూర్, సల్మాన్ ఖాన్‌తో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘పుట్టినరోజు శుభాకాంక్షలు సల్మాన్. నువ్వు తొందర్లోనే పెళ్లి చేసుకుంటావని ఆశిస్తున్నాను’ అని రాసుకొచ్చింది.
తెలుగు భామ తేజస్వీ మదివాడ ‘బ్లాక్ అండ్ వైట్’లో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘బ్లాక్ అండ్ వైట్‌ని ఏదీ అధిగమించలేదు’ అనే వ్యాఖ్యని జత చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...