‘చిన్నారి పెళ్లికూతురు’ అవికా గోర్ తన పెట్‌తో సరదాగా దిగిన ఓ వీడియోని పోస్ట్ చేస్తూ దానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
బాలీవుడ్ సుందరి కరిష్మా కపూర్ ‘క్రిస్మస్ ఛీర్’ అంటూ సోదరుడు రణ్‌బీర్‌తో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ భామ స్నేహా ఉల్లాల్ తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘కొవిడ్ లేని సమయంలో డిసెంబర్ మాసమంతా సినిమాలు, పాప్‌కార్న్, ప్రయాణాలు.. ఇంకా మరెన్నో సంతోషాలతో నిండిపోయేది. ఇది నాకెంతో ఇష్టమైన మాసం. కానీ 2020లో ఈ సంతోషాలన్నిటినీ మిస్సయ్యాను. బహుశా జీవితంలో ఉన్న సౌందర్యం ఇదేనేమో’ అని రాసుకొచ్చింది.
అందాల భామ పార్వతీ నాయర్ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల తార లక్ష్మీ రాయ్ ‘మెర్రీ క్రిస్మస్’ అంటూ క్రిస్మస్ టోపీ పెట్టుకున్న అందమైన ఫొటోని పోస్ట్ చేసింది.
టాలీవుడ్ భామ సిమ్రత్ కౌర్ మంచుతో ఆడుకుంటున్న అందమైన ఫొటోని పోస్ట్ చేసింది.
అందాల భామ రోజా తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ భామ అమీషా పటేల్ ‘జై జవాన్.. జైహింద్’ అంటూ కశ్మీర్‌లోని జవాన్లతో దిగిన ఓ అందమైన ఫొటోని పోస్ట్ చేసింది.
నటి హిమజ తన తాజా అందమైన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మనకు ఉన్నది ఒక్కటే జీవితం.. కాబట్టి మంచి జ్ఞాపకాలను సృష్టించుకుందాం!’ అని రాసుకొచ్చింది.
జర్మన్ మోడల్ ఎవ్లీన్ శర్మ తన పెట్‌తో పార్క్‌లో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘పార్క్‌లో ఒక రోజు గడిపితే ఆ రోజుని బాగా గడిపినట్లే’ అంటూ చెప్పుకొచ్చింది.
‘2020లో ఇదే నా చివరి విమాన ప్రయాణం’ అంటోంది కన్నడ బ్యూటీ ప్రణీత.
వీరితో పాటు పలువురు తారలు తమ క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.. వాటిపై ఓ లుక్కేయండి మరి...