అందాల భామ జెనీలియా అందమైన దుస్తుల్లో నవ్వుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మీరు ఏ రోజున నవ్వకుండా ఉంటారో.. ఆ రోజుని వృథా చేసినట్లే’ అంటూ చార్లీ చాప్లిన్ రాసిన ఓ కొటేషన్‌ను రాసుకొచ్చింది.
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ తన తండ్రి అనిల్ కపూర్‌తో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. మీరు ఎన్నో ఉన్నత విలువలు కలిగిన వారు. మీరు వాటిని మాకు నేర్పడం మా అదృష్టం. మిమ్మల్ని ఎంతో మిస్సవుతున్నాను.. మిమ్మల్ని చూడడానికి కొత్త సంవత్సరం వరకు వేచి ఉండలేకపోతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ నటి హిమజ మరో నటి అనుపమా పరమేశ్వరన్తో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ఇంట్రో సాంగ్‌కి స్టెప్పులేసిన వీడియోని పోస్ట్ చేసింది.
ప్రముఖ యాంకర్ సుమ గోరు వెచ్చని నీళ్లలో యాపిల్ సిడార్ వెనిగర్ కలిపిన డ్రింక్‌ని తీసుకుంటోన్న వీడియోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘నా రోజువారీ దినచర్యలో ఇదీ ఒకటి. షూటింగ్స్ సమయంలో చాలా డస్ట్ ఉంటుంది. దీనికోసం నా గొంతుని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం కోసం గోరువెచ్చని నీళ్లు, యాపిల్ సిడార్ వెనిగర్‌ని తీసుకుంటాను. దీనిని తయారు చేయడం సులభం. అంతేకాదు అద్భుతంగా పనిచేస్తుంది కూడా’ అని రాసుకొచ్చింది.
అందాల తార రేణూ దేశాయ్ తన సహ నటీమణులు భాగ్యశ్రీ, మధుబాల, సుమన్ రంగనాథన్‌లతో రామోజీ ఫిల్మ్ సిటీలో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
ఇక పలువురు తారల క్రిస్మస్ సంబరాలు ముందే మొదలయ్యాయి. ఆ పోస్టులపై ఓ లుక్కేద్దాం రండి...
జర్మన్ మోడల్ ఎవ్లీన్ శర్మ క్రిస్మస్ చెట్టు, శాంటాక్లాజ్, చర్చిల బొమ్మలను తనే సొంతంగా తయారు చేసి, ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్ క్రిస్మస్ చెట్టు ముందు టీ కప్ పట్టుకుని దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
మహేష్ బాబు గారాల పట్టి సీతా పాప క్రిస్మస్ చెట్టు ముందు నిలుచున్న ఓ అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
‘అందరికీ ముందుగానే క్రిస్మస్ శుభాకాంక్షలు’ అంటూ బాలీవుడ్ తార మల్లికా శెరావత్ క్రిస్మస్ చెట్టు పక్కన నిలుచున్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ క్రిస్మస్ చెట్టుని అలంకరిస్తోన్న ఫొటోని అర్హ తల్లి స్నేహారెడ్డి అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా అప్డేట్లను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసేద్దామా...