కన్నడ భామ ప్రణీత గుర్రంతో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి ‘గుర్రాలపై నాకున్న ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది’ అనే వ్యాఖ్యని జత చేసింది.
ముంబయి బ్యూటీ ఛార్మీ కౌర్ జిమ్‌లో తెగ కష్టపడుతోంది. ‘ఫ్లెక్సిబులిటీ, బలం’ అంటూ వ్యాయామం చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నవ్వుతోన్న తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘సరైన సమయంలో చేసే ప్రతి పనీ ఎంతో అద్భుతంగా ఉంటుంది’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్ జోడించింది.
ప్రముఖ యాంకర్ సుమ ‘క్యాష్’ ప్రోగ్రాంకి సంబంధించిన ఓ పాత జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకుంది.
తెలుగు భామ నందినీ రాయ్ తన హాట్ ఫొటోని పోస్ట్ చేస్తూ ‘జీవితంలో ఎప్పుడూ అత్యుత్తమంగా ఉండడానికే ప్రయత్నించాలి..’ అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యని జత చేసింది.
బాపూ బొమ్మ స్నేహ తన ఫిట్నెస్ ట్రైనర్‌తో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ యాక్షన్ సన్నివేశాల కోసం రిహార్సల్స్ చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది.
‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ‘B+ve(సానుకూల దృక్పథంతో ఉండండి)’ అంటూ ‘బి పాజిటివ్’ అని రాసి ఉన్న టీషర్టుతో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి ‘A1ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఆ చిత్ర షూటింగ్‌కి సంబంధించిన ఓ ఫొటోని పోస్ట్ చేస్తూ ‘షూటింగ్స్‌లో భాగంగా మేము చేసే అందమైన పాత్రలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ నేను నటిని కాకపోయి ఉంటే నాలోని ఇలాంటి భిన్నమైన హావభావాలను చూసి ‘మూడ్ స్వింగ్స్’ అనేవారేమో!’ అంటూ చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ బ్యూటీ నివేదా థామస్ మెహెందీ వేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగు భామ అంజలి, బాలీవుడ్ నటి కల్కీ కొచ్లిన్‌తో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
అందాల భామ హంసా నందిని తన అందమైన ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి ‘డిసెంబరులో స్వెట్టర్ అవసరం ఎవరికి ఉంది?’ అంటూ స్మైలీ ఎమోజీని జత చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసేద్దాం రండి...