దక్షిణాది తార శృతి హాసన్ ‘మీలాగా ఇతరులు ఉండాలని ఆశించడం ఆపేయండి’ అని రాసి ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘మీ జీవిత ప్రయాణం ఎంతో అందమైనది. ఎందుకంటే అది మీది కాబట్టి. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీలాగా ఇతరులు ఉండరు. ఎందుకంటే ఆలోచించడం, స్పందించడం, అనుభూతి చెందడం.. వంటి విషయాల్లో వారు మీకంటే భిన్నంగా ఉంటారు. అది మంచిది కూడా! జీవితంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరున్నారంటే దానికో కారణం ఉంటుంది.. అది గుర్తుపెట్టుకోండి!’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టింది.
నటి, నిర్మాత మంచు లక్ష్మి తన తల్లి పుట్టినరోజు వేడుకల్లో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘జీవితంలో ప్రతి నిమిషాన్నీ ఆస్వాదించడం నేర్చుకోండి. సంతోషంగా ఉండండి. కుటుంబంతో కానీ, పనిలో కానీ మీరు వెచ్చించే సమయం ఎంత విలువైనదో ఆలోచించుకోండి. ప్రతి నిమిషాన్నీ ఆస్వాదించాలి.. ఆనందించాలి. నేను అమ్మ బర్త్‌డే పార్టీలో ఈ అవుట్‌ఫిట్‌తో సందడి చేశాను’ అని చెప్పుకొచ్చింది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ఇంట్రో సాంగ్‌కి స్టెప్పులేసిన వీడియోని పోస్ట్ చేసింది.
అలనాటి తార, ఎమ్మెల్యే రోజా తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ తార కాజోల్ తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘నైస్, నాటీ.. వీటిలో నేను ఏ లిస్ట్‌లో ఉన్నాను?’ అంటూ అభిమానులను అడుగుతోంది. అంతేకాదు.. ‘మీరు నైసా? నాటీనా?’ అంటూ ఫ్యాన్స్‌కు కూడా ఇదే ప్రశ్నను సంధించిందీ అందాల తార.
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఫాలోవర్ల సంఖ్య 8 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా ‘ఐ లవ్ యూ’ అని రాసి ఉన్న 8 లాలీపాప్లను పట్టుకొని దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘హుర్రే!!!! 8 మిలియన్ల మంది అభిమానులు.. అందరికీ థ్యాంక్స్. లవ్ లవ్ లవ్’ అనే వ్యాఖ్యని జత చేసింది.
టాలీవుడ్ భామ రాశీ ఖన్నా తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.
అందాల తార లక్ష్మీ రాయ్ ‘జీవితం పాఠాలు నేర్పుతుంది’ అని అర్థం వచ్చేలా తన ఫొటోని పోస్ట్ చేసింది.
టాలీవుడ్ భామ హన్సిక ‘ఫీల్ కరో రీల్ కరో’ అంటూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. దీనికి ‘నా ముందు కూర్చున్న ఈ అద్భుతమైన నటుడి హావభావాలను అస్సలు మిస్సవకండి’ అనే వ్యాఖ్యని జోడించింది.
మరో కేరళ కుట్టి అమలాపాల్ కఠినమైన యోగాసనాలు చేస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
టాలీవుడ్ సుందరి సిమ్రత్ కౌర్ ఒంటెతో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘నాకు ట్రావెల్ చేయాలని ఉంది.. కానీ బ్యాంక్ బ్యాలన్స్ లేదు’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ సుందరి కరిష్మా కపూర్ తన పెట్‌తో దిగిన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
‘మణికర్ణిక’ కంగనా రనౌత్ త్రోబ్యాక్ అంటూ గత నెలలో తన సోదరుడి పెళ్లిలో దిగిన ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేయండి మరి...