అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్నెస్ ఫ్రీక్.
అందాల భామ భానుశ్రీ చీరకట్టులో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ బిపాసా బసు ప్రకృతి అందాల నడుమ పరవశించిపోతోంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్ సిగ్గుపడుతున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ ఛాయ్ తాగుతోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.
‘ఆర్ఎక్స్ 100’ భామ పాయల్ రాజ్‌పుత్ షూటింగ్లో భాగంగా దిగిన తన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల భామ నివేథా పేతురాజ్ ఐ మేకప్ వేయించుకుంటోన్న జిఫ్ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘మొదట నన్ను ఓ కునుకు తీయనివ్వండి’ అనే సరదా క్యాప్షన్‌ని జోడించింది.
తెలుగు భామ తేజస్వీ మదివాడ తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘దేన్నైనా సంపూర్ణం చేయడానికి భయపడద్దు.. ఒకవేళ అలా భయపడితే మీరు ఎప్పటికీ దాన్ని పూర్తిచేయలేరు..’ అనే క్యాప్షన్‌ని జతచేసింది.
బాలీవుడ్ భామ సోహా అలీ ఖాన్ ‘అంచనా, వాస్తవానికి మధ్య ఉన్న తేడా’ అంటూ రూబిక్ క్యూబ్‌ని పూర్తి చేయకముందు, చేసిన తర్వాత ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
కన్నడ భామ సంయుక్తా హెగ్డే మసాఖలి సాంగ్‌కి స్టెప్పులేసిన వీడియోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...