సొట్ట బుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి రాజస్థానీ అమ్మాయిలా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిని చూద్దాం రండి...
జర్మన్ బ్యూటీ ఎవ్లీన్ శర్మ ‘డోంట్ వర్రీ బీ హ్యాపీ’ అని రాసి ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘బాధపడకండి.. సంతోషంగా ఉండండి.. జీవితం మనం అనుకున్నంత సీరియస్‌గా ఉండదు.. ఎప్పుడూ ఒక కొత్త ఉదయం, ప్రారంభం, అవకాశం వస్తుంది. గతాన్ని గుర్తు చేసుకోండి. ఈ రోజు రిలాక్సవండి.. భవిష్యత్తుకు స్వాగతం పలకండి’ అని చెప్పుకొచ్చింది.
సూపర్ స్టార్ మహేష్‌బాబు సోదరి మంజులా ఘట్టమనేని ధ్యానం చేస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ధ్యానం చేయడం వల్ల వివిధ రకాల లాభాలున్నాయి. అవేంటంటే..
* ఏకాగ్రతను పెంపొందిస్తుంది.
* ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తుంది.
* స్వీయ అవగాహనను పెంచుతుంది.
* ఓర్పుగా ఉండేలా చేస్తుంది.
* సృజనాత్మకత, రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదం చేస్తుంది.
మీరూ ఈ రోజు నుంచి ధ్యానం చేయడం ప్రారంభిస్తారని అనుకుంటున్నాను. మీ సమాధానం అవును అయితే కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి’ అని రాసుకొచ్చింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ బీచ్‌లో సరదాగా గడిపిన ఫొటోలను పోస్ట్ చేసింది. అదేవిధంగా మరో తార రేణూ దేశాయ్ గోవాలో సముద్రంలో జలకాలాటలు ఆడుతున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘బిస్కట్ కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే' అంటూ అకీరా ఇచ్చిన క్యాప్షన్‌ని జత చేసింది.
అందాల భామ ఊర్వశీ రౌతెలా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఎలాంటి షరతుల్లేని స్వీయ ప్రేమే నా 2021 లక్ష్యాలలో ఒకటి’ అని చెప్పుకొచ్చింది.
తెలుగు భామ నందినీ రాయ్ ‘నిరాడంబరత నన్ను సంతోషంగా ఉండేలా చేస్తుంది’ అంటూ తన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ తన కుటుంబ సభ్యులతో దిగిన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ముంబైలో తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్లో ఉన్న ఫొటోని షేర్ చేసింది. 'ఇట్స్ టైం ఫర్ ఐస్‌క్రీమ్' అనే వ్యాఖ్యని ఈ ఫొటోకి జత చేసింది.
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ చేతిలో గులాబీ పూలను పట్టుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘అందమైన పూలు + అందమైన దుస్తులు = హ్యాపీ సోనమ్’ అనే వ్యాఖ్యని జత చేసింది.
వీరితో పాటు పలువురు ముద్దుగుమ్మలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...