అందాల భామ హంసానందిని కేరళ అందాలను తన ఫోన్లో బంధించింది. ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘ఇందుకే నేను విహారయాత్రలకు వెళ్తుంటాను’ అనే వ్యాఖ్యను జత చేసింది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ భామ బిపాసా బసు తన భర్తతో దిగిన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తన తాజా ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘మన జీవితాల్లో వెలుగులు నింపుకునే సమయమిది. ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలను వీడండి.. గొడవలు మానుకోండి..! అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఇకముందు అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చింది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ఇంట్రో సాంగ్‌కి స్టెప్పులేసిన వీడియోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా ‘త్రోబ్యాక్’ అంటూ ‘ఫోర్స్-2’ షూటింగ్లో భాగంగా దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
ఈ రోజు ‘ఇంటర్నేషనల్ మెన్స్ డే’ సందర్భంగా బాలీవుడ్ నటి కాజోల్ తన భర్త, కొడుకు, మరో ఇద్దరు యువకులు కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మీరు నా జీవితంలో ఉన్నందుకు గర్వంగా ఉంది’ అని రాసుకొచ్చింది.
టాలీవుడ్ భామ క్యాథరీన్ ట్రెసా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా మూడు మొక్కలను నాటింది.
టాలీవుడ్ భామ ఛార్మీ కౌర్ జిమ్‌లో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఫిట్‌గా ఉండండి’ అనే వ్యాఖ్యని జత చేసింది.
అక్కినేని వారి కోడలు, నటి సమంత జిమ్‌లో బరువులెత్తుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది.
అలనాటి తార భాగ్యశ్రీ సూర్యరశ్మి తనపై పడేట్టుగా కూర్చున్న ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘సూర్యకాంతిలో తడిసి ముద్దవుతున్నా.. కొన్నిసార్లు మనల్ని మనం మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది’ అని రాసుకొచ్చింది.
దక్షిణాది తార శృతీ హాసన్ తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘నా సూపర్ పవర్స్‌తో గాలి ద్వారా వచ్చే వైరస్‌లను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నా.. ఇది నిజం అయితే బాగుండు..! అప్పటివరకు కోవిడియట్స్కు దూరంగా ఉండండి’ అని రాసుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను పోస్ట్ చేశారు. వాటినీ ఓసారి చూసేద్దామా..?!