బుల్లితెర తార వర్షిణి ‘ఢీ చాంపియన్స్’ కార్యక్రమానికి సంబంధించిన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్.. కరణ్ జోహర్ రచించిన ‘బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్’ పుస్తకాన్ని చూపుతున్న వీడియోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ తన భర్తతో దుబాయ్‌లో హనీమూన్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ‘హనీమూన్ డైరీస్’ అంటూ కొన్ని రొమాంటిక్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
దక్షిణాది భామ శృతీ హాసన్ తన పెట్‌తో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల భామ తాప్సీ బుల్లెట్ బైక్ నడుపుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు ఫైన్ పడింది’ అని రాసుకొచ్చింది. దీనికి బైక్ లవ్, రష్మీ రాకెట్, షూట్ థ్రిల్స్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
దక్షిణాది భామ నయనతారకి తన ప్రియుడు విఘ్నేష్ శివన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా నయన్ అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.
అలనాటి తార సుహాసిని 40 సంవత్సరాల క్రితం దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి జీప్ ముందుభాగంపై హుందాగా కూర్చున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘షాండ్లియర్లాగా వెలిగే శక్తి ఉన్నప్పుడు కొవ్వొత్తి లాగా ఎందుకు కరిగిపోవాలి’ అనే క్యాప్షన్‌ను జత చేసింది.
టాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియమణి చీరకట్టులో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా తన భర్తతో కలిసి చిరునవ్వులు చిందిస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది.
ప్రముఖ యాంకర్ సుమ కనకాల తన ఫొటోలను పోస్ట్ చేసి వాటికి వన్ సెకన్, అవాక్కయ్యారా, ఓసి దీని వేశాలు.. అంటూ ఫన్నీ క్యాప్షన్లను జోడించింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...