నేటి ఇన్‌స్టాపురం భాయ్ దూజ్ సెలబ్రేషన్స్‌తో నిండిపోయింది. పలువురు అందాల తారలు ‘ఇలాంటి బ్రదర్స్ ఉన్నందుకు మేమెంతో లక్కీ’ అంటూ తమ సోదరులతో దిగిన ఫొటోలను పంచుకుంటూ ‘భాయ్ దూజ్’ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘భాయ్ దూజ్’ని ఉత్తరాదిన ఎక్కువగా జరుపుకొంటారు. దీపావళి మరుసటి రోజు జరుపుకొనే ఈ పండగ నాడు అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. మరి ఈ పండగ సందర్భంగా కొందరు అందాల భామలు పోస్ట్ చేసిన ఫొటోలను ఓసారి చూద్దాం రండి...
సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా తన సోదరులతో ‘భాయ్ దూజ్’ని జరుపుకుంది. ఈ సందర్భంగా తన ఇద్దరు సోదరులు తనకు ఆప్యాయంగా ముద్దు పెడుతున్న ఫొటోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ తన సోదరులతో దిగిన చిన్నప్పటి ఫొటోని అభిమానులతో పంచుకుంది.
అందాల తార సారా అలీ ఖాన్ తన సోదరునితో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘సోదర సోదరీమణులందరికీ భాయ్ దూజ్ శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చింది.
ఇక బాలీవుడ్ తార సన్నీ లియోన్ తన భర్తతో దిగిన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.
గాయని సునీత నవ్వుతోన్న తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది.
‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ మోడ్రన్, నార్మల్ లుక్‌లో దిగిన ఫొటోలను పంచుకుంది. వాటికి క్యాప్షన్లు పెట్టమని అభిమానులను కోరింది.
మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ తన కూతురు ఆరాధ్యతో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ తనకు తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసేద్దాం రండి...