మిల్కీ బ్యూటీ తమన్నా తాను తాజాగా దిగిన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బాపూ బొమ్మ స్నేహ తన పాపతో సముద్రపు ఒడ్డున సరదాగా గడిపిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
‘ఎక్స్ట్రా జబర్దస్త్’ యాంకర్ రష్మీ గౌతమ్ బెడ్‌పై పడుకున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కొన్ని రోజులు కఠినంగా ఉంటాయి. కానీ అలాంటి సమయంలోనే మనలోని శక్తినంతా కూడదీసుకుని ముందుకు సాగాలి.. మూడ్ స్వింగ్స్ అనేవి మనలో సర్వసాధారణం. ఆ సమయంలోనూ మనం మన మనసు మాట వినాలి..’ అంటోంది రష్మి.
‘బిగ్‌బాస్’ బ్యూటీ హిమజ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ తన వదులైన తన కర్లీ హెయిర్‌ని చూపుతూ దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
ప్రముఖ నటి ఊర్వశి రౌతెల తన తాజా ఫొటోలను పోస్ట్ చేస్తూ ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ని జోడించింది. ‘మీరు ఏ పనైనా కాస్త క్రియేటివ్‌గా, కళాత్మకంగా చేస్తే అది మీకు మాత్రమే సొంతం.. అది మీ మనసులోని భావ వ్యక్తీకరణకు ప్రతిరూపం. కాబట్టి దానిని ఎవరూ అనుకరించలేరు. అంతేకాదు.. ఆ పనిని మీకంటే గొప్పగా మరెవరూ చేయలేరు కూడా!’ అని చెప్పుకొచ్చింది.
అందాల భామ అదా శర్మ ఓ తెలుగు పాటకి స్టెప్పులేసిన వీడియోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఇది నా తర్వాతి తెలుగు చిత్రంలోని పాట.. కరోనా సమయంలో మొదలు పెట్టి.. పూర్తి చేసుకున్న తొలి సినిమా మాదే. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది!’ అని రాసుకొచ్చింది.
‘మహానటి’ కీర్తి సురేశ్ ఛాయ్ తాగుతున్న ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కాఫీ తాగడానికి షాపుకి వెళ్తాం.. అదే ఛాయ్ తాగడానికి కొట్టుకు వెళ్తాం.. ఇందులో మొదటిది ఫీలింగ్ అయితే, రెండోది నా ఎమోషన్!’ అని రాసుకొచ్చింది.
అందాల భామ పాయల్ ఘోష్ తన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కొన్ని సందర్భాల్లో ఏంజెల్లా.. మరికొన్ని సందర్భాల్లో కఠినంగా ఉంటాను.. కానీ నేను ఎప్పటికీ దృఢమైన మహిళనే!’ అని రాసుకొచ్చింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి కొండపై యోగా చేస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ‘నేను వయసును నమ్మను.. శక్తిని నమ్ముతాను’ అని రాసి ఉంది.
గాయని సునీత తన తల్లితో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని ఓసారి చూసేద్దాం రండి..